EPAPER

YCP Leaders Secret Bonds: వైసీపీ రహస్య బంధాలు.. తర్వాత ఎవరో?

YCP Leaders Secret Bonds: వైసీపీ రహస్య బంధాలు.. తర్వాత ఎవరో?

YCP Leaders secret Bonds: జగన్ పరిస్థితి విచిత్రంగా తయారైంది. వైసీపీ నేతల భాగోతాలు ఒకొక్కటిగా వెలుగు చూస్తూ మాజీ సీఎంను కనీసం మాట్లాడనీయకుడా చేస్తున్నాయి. మొన్నటికి మొన్న విజయసాయిరెడ్డి, శాంతిల ఎపిసోడ్ నడిచింది. ఇక ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్, మాధురిల సీరియల్ స్టార్ట్ అయింది. అధికారంలోకి రాక ముందు నుంచి పవన్‌కళ్యాణ్ వైవాహిక జీవితంపై అర్ధం లేని విమర్శలు గుప్పిస్తూ.. వివాహ వ్యవస్థ, నైతికతల గురించి మాట్లాడిన జగన్  తన పార్టీ వారి భాగోతాలతో పార్టీకి ఉన్న కాస్త పరువు బజారున పడుతుంటే సైలెంట్‌గా ఉండిపోవడం చర్చనీయాంశంగా మారింది.


ఏపీలో వైసీపీ నేతల వ్యక్తిగత వ్యవహారాలు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. కొద్ది రోజుల కిందట ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం దుమారం రేపింది. తాజాగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి గుట్టు రచ్చకెక్కింది. వైసీపీలో ప్రముఖ నేతల భాగోతాలు ఇలా హైలెట్ అవుతూండటం ఆ పార్టీ ప్రతిష్టను మరింత డ్యామేజ్ చేస్తోంది. గతంతో పవన్ కళ్యాణ్ చట్టబద్దంగా చేసుకున్న వివాహాలపై జగన్ సాగతీస్తూ మరీ సన్నాయి నొక్కులు నొక్కారు.

ఇప్పుడు విజయసాయి , శాంతి .. దువ్వాడ శ్రీను, మాధురిల రహస్యబంధాలపై రచ్చ జరుగుతున్నా జగన్ నోరు తెరవడంలేదు. నిజానికి అవేమీ పెద్ద విషయాలు కాదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అసలు వారి గురించి తెలిసే జగన్ ప్రోత్సహించారని అందుకే ఇప్పుడు బయట పడుతున్నా ఆయన పట్టించుకోవడం లేదన్న టాక్ వినిపిస్తుంది.


జగన్‌కు అత్యంత సన్నిహితుడు, పర్సనల్ ఆడిటర్.. జగన్ ఏ-1గా ఉన్న అక్రమాస్తుల కేసుల్లో ఏ-2 నిందితుడిగా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ఇలీవల పెద్ద రచ్చకు దారితీసింది. దేవాదాయ శాఖ ఉద్యోగిని శాంతి భర్తే ఆయనపై స్వయంగా ఆరోపణలు చేశారు. తన భార్యకు పుట్టిన బిడ్డకు కారణం ఆయనేనని.. డీఎన్‌ఏ టెస్టులు చేయించుకోవాలని సవాల్ చేశారు. దానిపై వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విజయసాయితో అంటకాగిన శాంతి పెట్టిన మీడియా సమావేశం కూడా వైరల్ అయింది.

విజయసాయి వ్యవహారంలో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. అన్నింటికీ డీఎన్‌ఏ టెస్టుతో ఫైనల్ క్లారిటీ వస్తుందని అనుకున్నారు. కానీ విజయసాయిరెడ్డి అందుకు అంగీకరించలేదు. అయితే శాంతి భర్త మాత్రం అదే డిమాండ్ చేస్తూ వచ్చారు. చివరికి విజయసాయిరెడ్డి సుద్దపూసలా సోషల్ మీడియాలో వివరణ ఇచ్చారు. శాంతి చేసిన అన్ని రకాల సాయాలు కూతురిగానే భావించి చేశానని తాను వారింటికి వెళ్లి బిడ్డను ఆశీర్వదించానని.. తన ఇంటికి వస్తే బట్టలు పెట్టానని .. అంతే తప్ప మరేమీ లేదని తండ్రికూతుళ్ల బంధం కలిపేశారు. డీఎన్ఏ టెస్ట్ చేయించుకోవడానికి అంగీకరించకుండా  ఆ 67 ఏళ్ల రాజ్యసభ సభ్యుడు లేనిపోని బంధాలు కలుపుతూ వివరణ ఇచ్చి.. సోషల్ మీడియాలో ఇప్పటికీ ట్రోల్ అవుతూనే ఉన్నారు.

Also Read: టీ టీడీపీ అధ్యక్ష ఎన్నికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఇక ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ సీరియల్ స్టార్ట్ అయింది. ఒక్క సారి జడ్పీటీసీగా గెలవడం మినహా ఇంకెప్పుడు ఎన్నికల్లో గెలవని దువ్వాడకు జగన్ ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారంటే.. వారిద్దరి సాన్నిహిత్యం అర్ధమవుతుంది. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, అచ్చెన్నాయుడులను టార్గెట్ చేయడంలో దువ్వాడ శ్రీనివాస్‌ ముందుంటారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడేసే దువ్వాడ తీరే జగన్‌ని మెప్పించిందని చెబుతారు. అందుకే టెక్కలిలో అచ్చెన్నాయుడుపై పోటీకి వైసీపీ నుంచి ముగ్గురు నేతలు పోటీ పడినా జగన్ ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ వైపే మొగ్గుచూపారంటారు.

అయితే టికెట్ ప్రకటన సమయానికే దువ్వాడ మరో మహిళతో వివాహేతర బంధం పెట్టుకోవడం  వారి కుటుంబంలో చిచ్చుకు కారణమైంది. ఆ విషయాన్ని ఆయన భార్య వాణీ స్వయంగా వెళ్లి జగన్ దగ్గర పంచాయతీ పెట్టారు. దాంతో శ్రీనివాస్‌ని కాదని.. దువ్వాడ వాణిని టెక్కలి ఇన్చార్జ్‌గా ప్రకటించారు … కానీ జగన్ చివరికి దువ్వాడ శ్రీనివాస్‌కే టిక్కెట్ ప్రకటించారు. ఇండిపెండెంట్‌గా పోటీకి సిద్దమైన దువ్వాడ వాణిని బుజ్జగించారు. అంటే దువ్వాడ ఫ్యామిలీ సర్కస్ గురించి తెలిసి కూడా జగన్ ప్రోత్సహించారన్నమాట.

దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఇప్పుడు మరింత ముదిరింది. దువ్వాడ శ్రీనివాస్‌కు పెళ్లయి ఇద్దరు కుమార్తెలున్నారు. ఒక కూతురి పెళ్లి కూడా అయింది. ఆయన వయసు కూడా అరవై ఏళ్లకు దగ్గర పడింది. ఇలాంటి సమయంలో ఆయన మరో మహిళతో సహజీవనం చేస్తున్నానని చెప్పకనే చెప్తున్నారు. పైగా అది తప్పని భావించడం లేదంట.. తప్పుగా ఎవరైనా భావిస్తే క్షమించమని చేతులు జోడిస్తున్నారు.

ఇప్పటికే దువ్వాడ కుటుంబ కథాచిత్రమ్ రచ్చకెక్కి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. దువ్వాడ ఇంటి ముందు ఆయన కుమార్తెల నిరసనతో మొదలైన వివాదం ఇప్పుడు మరింత ముదిరింది. దాడులు, ప్రత్యారోపణలు వరకు వెళ్లింది. దువ్వాడ ఇంటి రచ్చ కంటిన్యూ అవుతూనే ఉంది. రెండ్రోజుల క్రితం దువ్వాడ ఇంటి ముందు ఆయన కుమార్తెలు ఆందోళన చేయగా.. ఇప్పుడు ఆయన భార్య వాణి వంతు. అర్థరాత్రి దువ్వాడ ఇంటికి పెద్దకుమార్తె హైందవితో కలిసి వాణి వెళ్లారు. ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడున్న వారు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దువ్వాడ బయటకు రావాలంటూ రాత్రంతా వాణి అక్కడే బైఠాయించి నిరసన చేపట్టారు. వేరే మహిళతో ఉంటూ తమ గౌరవాన్ని, రాజకీయ జీవితాన్ని మంటగలిపారని మండిపడ్డారు.

ఆ టైంలో దువ్వాడ వస్తూనే భార్య వాణిపై పరుష పదజాలంతో పేట్రేగిపోయారు. తిట్ల దండకంతో, బూతుపురాణంతో రెచ్చిపోయారు. గ్రానైట్‌ రాడ్‌తో భార్య, కూతురిపై దాడికి యత్నించారు. ఇరువర్గాల మోహరింపుతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కాగా..ఇంట్లోకి బలవంతంగా వచ్చే ప్రయత్నం చేశారంటూ వాణి, కుమార్తెలపై దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు తనపై దాడి చేశారంటూ వాణి కూడా కంప్లైంట్ చేశారు.

ఈ ఎపిసోడ్ కొనసాగుతున్న సమయంలోనే.. మాధురి ఎంట్రీ ఇచ్చారు. దువ్వాడ శ్రీనివాస్‌కు, తనకు మధ్య ఉన్నది స్నేహ బంధమే తప్ప మరేమీ కాదని స్పష్టం చేశారు … వాణి తనపై లేనిపోని నిందలు వేసి రోడ్డుమీదకు లాగడం సరికాదన్నారు. శ్రీనివాస్‌తో తాను ఫ్రెండ్లీ రిలేషన్ షిప్‌లో ఉన్నానని… తాను ఒంటరిగా ఉన్నప్పుడు శ్రీనుకి దగ్గరయ్యాయని తమ బంధం మున్ముందు ఎటు దారి తీస్తుందో చూడాలని పద్దతి చెప్పుకొస్తున్నారు.

తమ మధ్య రిలేషన్‌పై దువ్వాడ శ్రీను, మాధురిలు తమ స్టైల్లో క్లారిటీలు ఇచ్చేశారు. మొత్తానికి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను భాగోతం పెద్ద రచ్చకే దారితీస్తోంది. భార్యబిడ్డలపై రాడ్డుతో దాడి చేయాలని చూసిన ఆయన.. రెండేళ్లుగా వాణి తన భాగోగులు పట్టించుకోలేదని మీడియా ముందు తెగ బాధపడిపోతున్నారు. ఆస్తులన్నీ వాణి, పిల్లలకు రాసిచ్చేసానని ఇప్పుడు మాధురితో ఉన్న ఇంటిని కూడా ఇచ్చేస్తే తన పరిస్థితి ఏంటని విచిత్రంగా సభ్యసమాజాన్ని ప్రశ్నించారు.

Also Read: “దమ్ముంటే డీఎన్ఏ టెస్ట్ చేయించు”.. దువ్వాడ వాణికి మాధురి సవాల్

దువ్వాడ వ్యవహారం మొదటి నుంచి తేడాగా ఉండటంతో మీడియా, సోషల్ మీడియాలో అందరూ హైలెట్ చేశారు. ఆయన కుటంబం కూడా మీడియా ముందుకు వచ్చి నిర్వాకాల గురించి బయట పెట్టింది. దువ్వాడ, మాధురి కలిసి దిగిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఫలితంగా ఇప్పుడు వైసీపీ పరువు మరింత దిగజారి పోతోంది. వైసీపీ అధినేత జగన్ ప్రత్యర్ధుల పర్సనల్ లైఫ్‌పై విమర్శలే కాని.. తన పార్టీ నేతల వ్యక్తిగత ప్రవర్తనను అసలు పరిగణనలోకి తీసుకోకపోవడం వల్లే పార్టీకి ప్రస్తుత దుస్థితి పట్టిందంటున్నారు.

అంబటి రాంబాబు ఆడియో టేపులు బయటపడి పెద్ద దుమారం రేగింది. దాని తర్వాత కూడా ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. దువ్వాడ శ్రీనివాస్ గురించి మొత్తం తెలిసిన తర్వాత కూడా ప్రోత్సహించారు. వైసీపీలో ఇలాంటి ఘన కార్యాలు చేసిన వాళ్లు చాలా మంది ఉన్నారని.. వారి వ్యవహారాలు వరుసగా బయటకు వస్తాయన్న ప్రచారం జరుగుతోంది… అధికారంలో ఉన్నప్పుడే అంబటి రాంబాబు ఆడియో టేపులు బయటకు వచ్చాయి. ఇప్పుడు అందరి వీడియో టేపులు బయటపడ్డా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు.

 

Related News

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Big Stories

×