EPAPER

Ganesh Nimajjanam: సాగర్‌లో గణనాథుని నిమజ్జనం.. ప్రతీసారి ఎందుకీ పంచాయితీ ?

Ganesh Nimajjanam: సాగర్‌లో గణనాథుని నిమజ్జనం.. ప్రతీసారి ఎందుకీ పంచాయితీ ?

Dilemma on Ganesh Nimajjanam : వినాయకచవితి వేడుకల్లో అత్యంత కీలకమైన ఘట్టం వినాయన నిమజ్జనం. నవరాత్రుల పాటు పూజలందుకున్న గణనాథుడిని గంగమ్మ ఒడికి చేర్చడం ఓ వేడుకే అని చెప్పాలి. అయితే ప్రతి ఏటా వినాయక నిమజ్జనం అనగానే ఓ డైలమా.. ఓ పంచాయితీ. ఇప్పుడు కూడా అదే పంచాయితీ. అదే గందరగోళం సాగర్‌లో నిమజ్జనం ఉందా? లేదా? అని. ఇంతకీ సాగర్‌లో నిమజ్జనం విషయంలో ప్రతిసారీ ఈ పంచాయితీ ఎందుకు? హైకోర్టు డైరెక్షన్స్‌ ఏంటి? ప్రభుత్వ నిర్ణయం ఏంటి? ఈ సమస్యకు శాశ్వత పరిష్కారమేంటి?


వినాయక చవితి వచ్చిందంటే చాలా విషయాలు రొటీన్‌గా జరుగుతాయి. ప్రతి ఇంటిలో, గల్లీలో ఆ గణనాథుడిని కోలువుదీర్చుకోవడం. భక్తి, శ్రద్ధలతో పూజలు చేయడం.. వైభవంగా వేడుకలను నిర్వహించుకోవడం. ఇవి ఎంత రొటీన్‌గా జరుగుతాయో.. అంతే రోటిన్‌గా హైకోర్టులో విచారణ జరుగుతుంది. హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహాలను చేయాలా ? వద్దా? అని. మీరు గత ఐదారేళ్లుగా అబ్జర్వ్‌ చేయండి.. ప్రతిసారి ఇదే జరుగుతుంది. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది.. క్రేన్లు సిద్ధం చేస్తుంది. సిబ్బందిని మోహరిస్తుంది. తీరా హైకోర్టులో ఎవరో ఒకరు పిటిషన్ వేస్తారు. దీంతో డైలమా మొదలవుతుంది.. హైకోర్టు అక్షింతలు వేస్తుంది. మట్టి వినాయకులనే నిమజ్జనం చేయాలంటోంది.
మళ్లీ ఒకసారి వెసులుబాటు ఇస్తుంది.. ఈసారి కూడా అదే జరిగింది.

నిమజ్జనానికి కావాల్సిన ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. మళ్లీ పటిషన్‌ పడింది హైకోర్టులో.. అయితే దాన్ని కోర్టు తిరస్కరించి గత ఆదేశాలనే అమలు చేయాలంది. మరి హుస్సేన్‌ సాగర్‌లో ఇంతకీ నిమజ్జనం ఉందా? ఉంటే ఏ విగ్రహాలకు మాత్రమే ఉంది? హైదరాబాద్‌లో పర్మిషన్‌ లేకుండా ఎవరూ గణేష్‌ మండపాలను ఏర్పాటు చేయకూడదు. ఇప్పటికే అన్ని పర్మిషన్స్‌ తీసుకొని వేలాది మండపాలను ఏర్పాటు చేశారు. అయితే ఇందులో మట్టి విగ్రహాలు కొన్నే.. POP విగ్రహాలే చాలా ఎక్కువగా ఉన్నాయి. భారీ విగ్రహాలు అయితే ఇంకా అనేకం ఉన్నాయి. ఇప్పుడివన్నీ నిమజ్జనానికి తరలాలి. మరి ఈ విగ్రహాలన్ని ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలి అనేది అసలు ప్రశ్న.


Also Read: హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమజ్జనాలు చేయొచ్చా?.. హైకోర్టు కీలక తీర్పు

ఎందుకంటే హైకోర్టు ఆదేశాల ప్రకారం కేవలం మట్టి విగ్రహాలను మాత్రమే హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయాలి. POPతో చేసిన విగ్రహాలను నిమజ్జనం చేస్తే కోర్టు ధిక్కరణే అవుతుంది. దీంతో ఇప్పుడు అధికారులు డైలమాలో పడ్డారు. ఏం చేయాలి.. ఏం చేయకూడదన్న సందేహంలో ఉన్నారు.

ఇక్కడ అధికారులు ఎంత డైలమాలో ఉన్నారనడానికి ఓ ఉదాహరణ చెప్పుకోవాలి. నిజానికి సాగర్ పరిసరాల్లో నిమజ్జనానికి ఏర్పాట్లు మొదలుపెట్టారు. ఇంతలో హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. వెంటనే సాగర్‌ పరిసరాల్లో నిమజ్జనాలు చేయకూడదని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు అనుమతి లేదంటూ బ్యానర్లు కట్టారు. హైకోర్టు పిటిషన్‌ కొట్టేయగానే బ్యానర్లను తొలగించారు. కాబట్టి.. అధికార యంత్రాంగానికి ఇక్కడో క్లారిటీ లేనట్టు కనిపిస్తోంది.

నిజానికి అధికారుల తీరు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు ఉంది. అసలు POPతో తయారయ్యే విగ్రహాలకు ఆదిలోనే అడ్డుకట్ట వేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. కానీ ఇన్నేళ్లుగా కోర్టు కచేరీలు చేస్తున్నా కానీ.. ఈ వైపుగా ఒక్క అడుగు కూడా వేయలేదు అధికారులు. తీరా విగ్రహాలను కొని తెచ్చుకొని.. పూజలు చేసుకున్న తర్వాత నిమజ్జనానికి అనుమతి లేదంటే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఎందుకు ఉంటాయి? మీకు నిజంగా సమస్యను పరిష్కరించాలని ఉంటే.. ముందు నుంచే దీనిపై ఓ క్లారిటీతో ఉండాలి. దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలి. ఇలా ఆఖరి నిమిషంలో భక్తులను ఇబ్బంది పెట్టకూడదు.

Also Read: 500 కేజీల భారీ లడ్డూపై వినాయకుడు.. ఎక్కడ తయారు చేశారంటే..

ఇక్కడ మరో విషయం కూడా ఉంది. అసలు సాగర్‌లో నిమజ్జనం చేస్తే వచ్చిన సమస్య ఏంటన్నది హిందూ సంస్థల వాదన. హుస్సేన్‌ సాగర్‌ మంచినీటి చెరువా? అంటే కాదు. పోనీ అదేమన్న కాలుష్య రహితంగా ఉందా? అంటే అదీ లేదు. ఇప్పటికే కాలుష్యానికి మారుపేరులా ఉంది సాగర్. అంతేకాదు హుస్సేన్ సాగర్ అయితే నగరం మధ్యలో ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో ప్రజలు ఒక్కచోటికి వచ్చినట్టు ఉంటుంది. అందుకే తాము హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయాలని కోరుతున్నామంటున్నారు. వీటన్నింటితో పాటు ఖైరతాబాద్ బడా గణేష్‌ నిమజ్జనానికి హుస్సేన్‌ సాగర్‌ తప్ప మరో ఆప్షన్‌ లేదనే చెప్పాలి. అంత పెద్ద విగ్రహాన్ని మరో ప్రాంతానికి తరలించాలన్నా అది చాలా పెద్ద టాస్క్.
ఇన్ని అంశాలు ఉన్నాయి కాబట్టే ఇక్కడే నిమజ్జనానికి అనుకూలం అంటూ వాదిస్తున్నారు.

భాగ్యనగర్‌ పరిధిలో సాగర్‌ ఒక్కటే ఉందా? ఇంకా చెరువులు లేవా ? అని మీకు అనుమానం రావొచ్చు. అలా ప్రశ్నించడంలో తప్పు లేదు. మీకొచ్చిన అనుమానాలు, ప్రశ్నలు నిజమే. గ్రేటర్ పరిధిలో గణేష్ నిమజ్జానికి 66 చెరువులు, కుంటలు ఉన్నాయి. వాటన్నింటి వద్ద మీరు ఏర్పాట్లు చేస్తున్నారని కూడా తెలుసు. కానీ ట్యాంక్‌బండ్‌ వద్దకు ఎలాంటి విగ్రహాలు వస్తాయి? ఎన్ని విగ్రహాలు వస్తాయి? అనేది ఒక్కసారి గుర్తు చేసుకోండి. రెండు రోజులకు మించి జరుగుతుంది ట్యాంక్ బండ్‌ వద్ద వినాయక నిమజ్జనం. ఇప్పుడు చివర్లో అలాంటి అవకాశం లేదంటే ఎలా? ఇక్కడ హైకోర్టును అనడానికి ఏం లేదు. ఎందుకంటే హైకోర్టు గతంలోనే క్లియర్‌కట్‌గా చెప్పింది. మట్టి వినాయకులను తప్ప మరే విగ్రహాన్ని నిమజ్జనం చేయవద్దని.. మరి ఈసారి ఏం చేస్తారు? ఎలా నిమజ్జనం చేస్తారు? అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. మొత్తానికి విఘ్నాలు తీర్చే ఆ గణనాథుడి నిమజ్జనానికి మాత్రం అనేక విఘ్నాలు కనిపిస్తున్నాయి.

Related News

Arvind Kejriwal Resignation: కేజ్రీ కొత్త వ్యూహం ఫలిస్తుందా?

Arvind Kejriwal: అరవింద్ ‘క్రేజీ’వాల్.. బీజేపీకి చుక్కల్!

Russia vs Ukraine War: మోసపోయి..రష్యా ఆర్మీలో చేరి.. యుద్ధం చేసి తిరిగివచ్చిన భారతీయ యువకుల కథ

Steel Plant Politics: స్టీల్‌ప్లాంట్ పంచాయతీ.. మీ స్టాండ్ ఏంటి?

Donald Trump Shooting: గురి తప్పింది.. టార్గెట్ ట్రంప్.. వెనక ఉన్నది ఎవరు?

Jani Master Case : వాష్ రూమ్, డ్రెస్ ఛేంజ్.. జానీ కహానీ

Kejriwal Resign: కేజ్రీవాల్ క్రేజీ ప్లాన్స్.. రాజీనామా ప్రకటన వెనుక అసలు సంగతి ఇదా ?

Big Stories

×