EPAPER

KCR Silent: నోరు మెదపని కేసీఆర్.. బయటపడ్డ అసలు కుట్ర!

KCR Silent: నోరు మెదపని కేసీఆర్.. బయటపడ్డ అసలు కుట్ర!

ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య వివాదం కాస్తా.. ప్రాంతీయ విద్వేషాల దాకా వెళ్లింది. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చురాజేసేంత వరకు దారి తీసింది. నిజానికి సవాళ్లు చేసుకునే పరిస్థితి దాటి ఈ ఇష్యూలో కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తెచ్చారు. గాంధీ లోకల్ నాన్ లోకల్ అంటూ వివాదానికి తెరలేపారు. అక్కడితో ఆగకుండా ఆంధ్రావాళ్లు దాడి చేస్తే తెలంగాణ బిడ్డలు ఊరుకుంటామా అన్నారు. అరికెపూడి గాంధీ బతకడానికి తెలంగాణకు వచ్చాడంటూ కామెంట్స్ చేశారు. తెలంగాణ పవర్ ఏంటో చూపిస్తానంటూ తొడ గొట్టారు. దీంతో అరికెపూడి కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ప్రశాంతంగా ఉన్న జనం మధ్య చిచ్చు పెడుతున్నావంటూ ఫైర్ అయ్యారు. శేరిలింగంపల్లిలో మూడుసార్లు గెలిచిన తననే బతకడానికి వచ్చావా అంటావా అంటూ మండిపడ్డారు. హుజురాబాద్ నుంచి హైదరాబాద్ కు ఎందుకొచ్చావని గాంధీ కౌంటర్ ఇచ్చారు.

ప్రస్తుతం హైదరాబాద్ లో పరిస్థితి శాంతియుతంగా ఉంది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో ఉంది. పెట్టుబడులు వస్తున్నాయి. వినాయక ఉత్సవాల దగ్గర్నుంచి అన్ని మతాల ఊరేగింపులు శాంతియుతంగా జరుగుతున్నాయి. ఇలాంటి టైంలో పొలిటికల్ వయొలెన్స్ ను తెరపైకి తెస్తే ఊరుకునేది లేదని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయామనే అక్కసుతో కొందరు శాంతి భద్రతలకు విఘాతం కల్పించే ప్రయత్నం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా రకరకాల కుట్రలకు తెరలేపుతున్నారన్నారన్నారు. శాంతి భద్రతలు కాపాడే విషయంలో సీరియస్ గా వ్యవహరించాలని డీజీపీకి సూచించారు సీఎం. తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా ఎవరు ప్రవర్తించినా చర్యలు తప్పనవి వార్నింగ్ కూడా ఇచ్చారు.


Also Read: ఎమ్మెల్యే అరికపూడి గాంధీ.. న్యూ ట్విస్ట్, హత్యాయత్నం కేసు

కాబట్టి రాజకీయాల కోసం ఏదైనా చేస్తామంటే కుదరదని ప్రభుత్వం క్లియర్ కట్ మెసేజ్ ఇస్తోంది. పీఏసీ పదవి చుట్టూనే వివాదమైతే… గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేత శ్రీధర్ బాబుకు ఇవ్వాల్సిన ఛైర్మన్ పదవిని అక్బరుద్దీన్ కు ఎందుకు కట్టబెట్టారన్న ప్రశ్నలకు గులాబీ నేతల నుంచి జవాబు లేకుండా పోయింది. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదంటున్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఆంధ్ర వాళ్లు వ్యాపారాలు చేస్తే ట్యాక్సుల రూపంలో డబ్బులు కావాలి, వాళ్ళ ఓట్లు కావాలి, కానీ రాజకీయాల్లో మాత్రం ఆంధ్రా, తెలంగాణ అని రెచ్చగొట్టడమేంటన్నారు. ఆంధ్రా, తెలంగాణ అని కౌశిక్ చెప్పిన మాటలా? లేక బీఆర్ఎస్ పార్టీ మాటలా అని ప్రశ్నించారు.

లోకల్ నాన్ లోకల్ అంటున్న బీఆర్ఎస్ నేతలు.. ఇన్నేళ్లు అరెకపూడి గాంధీని తమ పార్టీలో ఎందుకు జాయిన్ చేసుకున్నారని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. నిజానికి ఇతర ప్రాంతం వాళ్ల కాళ్లకు ముళ్లుగుచ్చుకున్నా తీస్తానని గతంలో కేసీఆర్ అన్న మాటలను గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు అవే ప్రశ్నలకు వారి దగ్గర సమాధానాలు ఉండడం లేదు. అదే విచిత్రం.

మ్యాటర్ అక్కడితో ఆగలేదు. చీర గాజులు చూపిస్తూ మాట్లాడిన కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే పదవి నుంచి డిస్ క్వాలిఫై చేయాలంటూ మహిళా కాంగ్రెస్ నేతలు స్పీకర్ ను కలిశారు. అందరినీ సమానంగా చూస్తామని ప్రమాణం చేసిన ఎమ్మెల్యే మహిళలతో ఏమీ కాదు అన్నట్లుగా ఎలా మాట్లాడుతారని ప్రశ్నిస్తున్నారు.

కాబట్టి ఏ రకంగా చూసినా ఈ ఇష్యూను డైవర్ట్ చేసే ప్రయత్నాల్లో గులాబీ నేతలు ఉన్నట్లుగా కనిపిస్తోందంటున్నారు హస్తం నేతలు. పార్టీని పైకి లేపాలనుకునే ప్రయత్నాలు చేసుకుంటే పర్వాలేదని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే మాత్రం ఊరుకునేది లేదని ప్రభుత్వం అంటోంది. ఒకవైపు ఇంత జరుగుతున్నా, తమ పార్టీ నేతలు లోకల్ నాన్ లోకల్ అంటూ కామెంట్లు చేస్తున్నా.. కేసీఆర్ మాట మాట్లాడడం లేదు. కనీసం ప్రెస్ నోట్ అయినా రిలీజ్ చేయడం లేదు. అటు కేటీఆర్ అయితే అమెరికా నుంచి రావడం లేదు. ఇటీవలే వరదలతో జనం కష్టాలు పడ్డారు. ప్రతిపక్ష పార్టీ హోదాలో కనీసం పరామర్శించేందుకు కేసీఆర్ ఫాంహౌజ్ నుంచి బయటకు రాలేదు. కేటీఆర్ అమెరికా నుంచి తిరుగు ప్రయాణం కాలేదన్న విషయాలను కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు.

Related News

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Jammu Kashmir Elections: కశ్మీర్ ఎన్నికలు.. కమలానికి అగ్నిపరీక్షే..

Why Atishi as Delhi CM: సీఎంగా అతిశీనే ఎందుకు? కేజ్రీవాల్ ప్లాన్ ఏంటి?

Amaravati: అమరావతి సేఫ్.. ఇక దూసుకుపోవడమే

Arvind Kejriwal Resignation: కేజ్రీ కొత్త వ్యూహం ఫలిస్తుందా?

Arvind Kejriwal: అరవింద్ ‘క్రేజీ’వాల్.. బీజేపీకి చుక్కల్!

Big Stories

×