EPAPER

India : చైనాను భయపెడుతున్న భారత్.. కారణాలు ఇవేనా?

India : చైనాను భయపెడుతున్న భారత్.. కారణాలు ఇవేనా?

India : చైనా… ఈ పేరు వింటేనే శత్రుదేశాలకు దడ. ప్రపంచాన్ని శాసిస్తున్న దేశాలలో చైనా ఒకటి. కానీ ఇప్పుడీ డ్రాగన్ కంట్రీ ఇండియా పేరు వింటేనే భయపడుతుంది. ప్రపంచంలోని సూపర్ పవర్స్‌లో ఒకటి, ఇప్పుడు మన దేశాన్ని చూస్తేనే వణుకుతుంది. ప్రపంచాన్ని గడగడలాడించిన డ్రాగన్ నేషన్,వేగంగా మారుతున్న జియో – పొలిటికల్ పరిస్థితులతో ఆత్మరక్షణలో పడింది. ఎప్పుడు కవ్వించే చైనా ఎందుకు ఆత్మరక్షణలో పడింది? అసలు ఇండియాని చూస్తే ఎందుకు భయపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇండియాకి పెరుగుతున్న ఆదరణే దీనికి కారణమా ?


1949 లో చైనా స్వాతంత్య్ర దేశంగా ఆవిర్భవించింది .కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా, అధికార పార్టీ కుమింగ్‌టంగ్‌కి మధ్య జరిగిన భీకర పోరు లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా పైచేయి సాధించింది. మావో జెడాంగ్ , ఈ సివిల్ వార్ లో కీలకమైన పాత్ర పోషించాడు. మావో జెడాంగ్ ఫ్యూడల్ వ్యవస్థ పై పోరాడి కమ్యూనిస్ట్ దేశాన్ని స్థాపించాడు.అలాంటి కమ్యూనిస్ట్ కంట్రీ, బూర్జువా ప్రభుత్వాలకు ధీటుగా ఎదుగుతూ వచ్చింది. ఇండియాకి స్వాతంత్య్రం వచ్చిన రెండేళ్ల తర్వాత చైనా స్వాతంత్య్ర దేశంగా ఆవిర్భవించింది. కానీ చైనా అభివృద్ధి ఇండియాకి పూర్తి విరుద్దంగా ఉంటుంది. వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మొదలైన చైనా ప్రయాణం 1978లో తీసుకున్న ఆర్ధిక సంస్కరణల వలన అగ్రరాజ్యాలతో సమానంగా ఎదిగింది. 1978 లో ఆర్ధిక సంస్కరణల కారణంగా క్లోజ్డ్ మార్కెట్ ఎకానమీ నుండి ఓపెన్ మార్కెట్ ఎకానమీకి మార్పు చేసింది.ఈ ఒక్క నిర్ణయం చైనా తలరాతను మార్చింది . ఇండియాకి అందనంత ఎత్తుకు ఎదిగిపోయింది. చైనా ఎదుగుదల, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెను సంచలనం . ఇంతటి ఘనత ఉన్న చైనా,ఇండియా ని చూసి ఆత్మరక్షణలో పడింది. ఇండియా ఎదుగుదల చైనా కి చెక్ పెడుతుందా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. ప్రస్తుతం అన్ని రంగాలలో చైనా అభివృద్ధి లో దూసుకుపోతుంది అయినా ఇండియా అంటే ఎందుకు భయపడుతోంది అనే ప్రశ్న అందరిలో మొదలైంది. ఒకసారి ఇండియా, చైనాని అన్ని అంశాలలో పోల్చిచూద్దాం.

worlddata.info వెబ్‌సైట్ గణాంకాలని పరిశీలిస్తే ..


ప్రస్తుత చైనా జనాభా 142,56,71,000, ఇండియా జనాభా 142,57,76,000.ఇండియా 2023లో చైనా జనాభాని అధిగమించింది.చైనా విస్తీర్ణం 9.6 మిలియన్ చదరపు కి.మీ, ఇండియా విస్తీర్ణం 3.3 మిలియన్ చదరపు కి.మీ. ఇండియా విస్తీర్ణం కంటే చైనా మూడు రెట్లు ఎక్కువ.చైనా పురుషుల ఆయుర్దాయం 75 ఏళ్ళు ; భారతీయ పురుషుల ఆయుర్దాయం 66 ఏళ్ళు. చైనా మహిళల ఆయుర్దాయం 81 ఏళ్ళు ,ఇండియా మహిళల ఆయుర్దాయం 69 ఏళ్ళు. ఈ గణాంకాలని చూస్తే చైనాలో ఆయుర్దాయం ఎక్కువ అని అర్ధం చేసుకోవొచ్చు. చైనాలో సగటు వయస్సు 38.4 ఏళ్ళు,ఇండియాలో సగటు వయస్సు 28.7 ఏళ్ళు. ఇప్పుడు భారతదేశ జనాభాలో అత్యధిక శాతంలో యువకులు ఉన్నారు. అంటే డెమోగ్రాఫిక్ డివిడెండ్ అనేది ఇండియాలో ఎక్కువ. యువత ఎక్కువగా ఉంటే ఉత్పాదకత ఎక్కువగా ఉంటుంది.

చైనా జీడీపీ 2022 గణాంకాల ప్రకారం 18 ట్రిలియన్ డాలర్లు, అదే ఇండియా జీడీపీ కేవలం 3 ట్రిలియన్ డాలర్లు .
ఇక్కడ మనం రెండు దేశాల జీడీపీ చరిత్రలోకి ఒకసారి వెళితే 1950లో చైనా జీడీపీ 100 బిలియన్ డాలర్లు , ఇండియా జీడీపీ 50 బిలియన్ డాలర్లు అంటే ఇండియా జీడీపీకి చైనా జీడీపీ రెండు రెట్లు ఎక్కువ.1990లో చైనా జీడీపీ 360 బిలియన్ డాలర్లు, ఇండియా జీడీపీ 326 బిలియన్ డాలర్లు .ఇక్కడ ఇండియా జీడీపీకి చైనా జీడీపీకి పెద్ద తేడాలేదు. కానీ 2022లో చైనా జీడీపీ ఇండియా కంటే ఆరు రెట్లు ఎక్కువ. ఈ తీవ్రమైన తేడాలకి కారణాలు ఏంటి… చైనా ప్రపంచ వాణిజ్య సంస్థ 1991లో చేరితే .. ఇండియా మాత్రం 1995లో చేరింది అయ్యింది. ఈ కాల వ్యవధి తేడాల వలన జీడీపీలో భారీ తేడా ఏర్పడింది.

చైనా ఎగుమతులు 2.61 ట్రిలియన్ డాలర్లు, ఇండియా ఎగుమతులు 0.54 ట్రిలియన్ డాలర్లు. చైనా తయారీ రంగం ఇండియా తయారీ రంగంపై ఆధిపత్యం చెలాయిస్తుంది కానీ ఇండియా ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్(ESC), ఇండియా ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్‌వేర్ అతిపెద్ద ఎగుమతిదారు అని తెలిపింది. జీవన వ్యయం (USA=100% అయితే) చైనా 57.58%, ఇండియా 26.92%. ఇందులోనూ చైనా,ఇండియాని ఆధిపత్యం చెలాయిస్తుంది. నిరుద్యోగ రేటు చైనాలో 4.9% , ఇండియా నిరుద్యోగ రేటు 7.3% . నిరుద్యోగ రేటు ఇండియాని వెనక్కి నెట్టేస్తుంది. అక్షరాస్యత శాతం చైనా 99%, ఇండియా అక్షరాస్యత శాతం 75%.అక్షరాస్యతలో చైనా ముందుంది. చైనా లో పారిశ్రామిక వర్గం అభివృద్ధి అవ్వడానికి ఇది దోహదపడింది.

ఇక రవాణా విషయానికొస్తే, చైనాలో మొత్తం రహదారి పొడవు 52,00,000 km, అదే ఇండియాలో రహదారి పొడవు 67,00,000 km. చైనాతో పోల్చినప్పుడు, ఇండియాలో రహదారి నెట్వర్క్ సాంద్రత ఎక్కువ . చైనాలో మొత్తం రైల్వే నెట్‌వర్క్ 1,50,000 km, అదే ఇండియా రైల్వే నెట్‌వర్క్ 68,988 km. చైనా రైల్వే నెట్‌వర్క్ దాదాపు మూడు సార్లు ఇండియా. దేశ వాణిజ్యం అనేది రైల్వేలు, రోడ్డు మార్గాలు మీద ఆధారపడి ఉంటాయి. చైనాలోని మొత్తం విమానాశ్రయాలు 214, ఇండియాలో మొత్తం విమానాశ్రయాలు 82. చైనాలోని జలమార్గాల పొడవు 27,700 km అదే ఇండియాలో 20,275 km. చైనా మౌలిక సదుపాయాలకు ఇండియా ఎప్పటికి అందనంత దూరంలో ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రంగాలలో చైనా ఆధిపత్యం ప్రదర్శిస్తుంది. కానీ.. కోవిడ్ అనంతరం జరుగుతున్న పరిణామాలు కీలకంగా మారుతున్నాయి.

భయంకరమైన కరోనా వైరస్, వుహాన్ నగరం నుండి బయటపడగా ప్రపంచం లో జీవన విధానం అస్తవ్యస్తం గా మారింది. మానవ జీవితాలను చెల్లాచెదురు చేసింది. కళ్ళముందే తమ వాళ్ళు ప్రాణాలు పోతుంటే ఏమి చెయ్యలేని దుర్భర జీవితాన్ని గడిపారు. కోవిడ్ తాలూకా జ్ఞాపకాలు ఎన్నో జీవితాలలో ఇంకా చెరగని మచ్చ లాగా మిగిలిపోయాయి. ఒకానొక సమయం లో చైనా నే కావాలని జీవ యుద్ధం సృష్టించిందని ప్రపంచ దేశాలు ఆరోపించాయి. దానిలో వాస్తవమెంతో తెలీదు కానీ సాఫీగా సాగుతున్న జీవితాలను ఒక్కసారిగా కుదిపేసింది. ప్రపంచ దేశాలన్నీ ఆర్ధికంగా చాల నష్టపోయాయి. తినటానికి తిండి లేని పరిస్థితి . ఇలాంటి సమయం లో భారతదేశం ప్రపంచానికి ‘వాక్సిన్ మైత్రి’ పేరిట ప్రపంచ దేశాలకు కరోనా వ్యాక్సిన్ల సరఫరా చేసింది. ఇండియా ప్రపంచ దేశాలకు నేనున్నా అనే భరోసాని ఇచ్చింది. చైనా నష్టం చేస్తే ఇండియా ఆ నష్టాన్ని కొద్ది మేరకు పూడ్చింది.

ఇక భౌగోళిక రాజకీయాల విషయానికొస్తే… 20వ శతాబ్దం భౌగోళిక రాజకీయాలు అట్లాంటిక్ మహాసముద్రాన్ని ఆధారపడి జరిగితే , 21వ శతాబ్దంలో అది హిందూ మహాసముద్రానికి మార్పు జరిగింది. ఇక్కడే ఇండియా వ్యూహాత్మకంగా ప్రపంచ దేశాలకు చాల ముఖ్యం. ఇండియా ఇండో-పసిఫిక్ వ్యూహంతో, డ్రాగన్ కంట్రీకి వణుకుపుట్టేలా చేస్తుంది. గత ఆక్ట్ ఈస్ట్ పాలసీ కానీ ప్రస్తుత లుక్ ఈస్ట్ పాలసీ కానీ.. గ్లోబల్ సౌత్‌‌లో ఇండియా, చైనాని కౌంటర్ చెయ్యడానికి హిందూ మహాసముద్రాన్ని కేంద్రంగా చేసుకుంది. ఆగ్నేయ ఆసియాకి సంబంధించి ASEAN గ్రూప్ లో ఇండియా కీలకంగా మారింది. పసిఫిక్‌లో చైనా కి చెక్ పెట్టేందుకు ఇండియా; జపాన్, ఆస్ట్రేలియా, అమెరికాతో QUAD గా ఏర్పడి అంతర్జాతీయ సంఘటనల్లో కీలకమైన పాత్ర పోషిస్తుంది.

నాన్-అలైన్డ్ ఉద్యమం,కోల్డ్ వార్ పీరియడ్ , ఇప్పటి రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఇండియా స్టాండ్. ఇలా ఏ విషయం తీసుకున్నా, ఇండియా ఖ్యాతిని పెంచేలా చేస్తుంది. మధ్య ఆసియాతో ఇండియా వాణిజ్య సంబంధం, ఆ ప్రాంతంలో పెరుగుతున్న చైనా ప్రభావంకి చెక్ పెడుతుంది. ఇండో-ఆఫ్రికన్ సంబంధాలు గతంతో పోలిస్తే చాలా వ్యూహాత్మకంగా ఉన్నాయి. ఇక ఇటీవల ఇండియా లో జరిగిన G-20 సమావేశం, చైనా కి నిద్రలేని రాత్రులు గడిపేలా చేస్తుంది. G-20 సమావేశం జరుగుతున్న సమయంలోనే ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ నుండి ఉపసంహరించుకుంటున్నట్లు చైనా ప్రధాన మంత్రి లీ కియాంగ్‌కి తెలిపాడు. ఇది చైనా కి పెద్ద ఎదురుదెబ్బ. చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్ యూరోప్‌కి చేరాలంటే ఇటలీ ముఖద్వారంగా ఉంటుంది.

చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌‌కి ధీటుగా ఇండియా IMEC కారిడార్ ప్రకటన చెయ్యడంతో డ్రాగన్ కంట్రీ లో బెరుకు మొదలయ్యింది. ఇండియా- మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ యూరోప్ కారిడార్ ప్రపంచ వాణిజ్య పరిస్థితులను పునర్నిర్మించడానికి సిద్ధంగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మూడేళ్ళ క్రితం జరిగిన గాల్వాన్ సంఘటనలో ఇండియన్ సైనికుల సత్తా ఏంటో డ్రాగన్ కంట్రీకి చాలా స్పష్టత వచ్చింది.దాని తర్వాతే, చైనా బోర్డర్ వెంట కవ్వించే చర్యలను తక్కువ చేసింది. లైన్ ఆఫ్ ఆక్టువల్ కంట్రోల్ వద్ద రక్షణాత్మక వ్యూహాన్ని అమలుపరుస్తుంది.

భారతదేశ ఆర్ధిక స్థితిగతులు చూస్కుంటే 2022లో , ఇండియా జీడీపీ, బ్రిటన్‌ను అధిగమించి ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 2025లో జర్మనీని , 2027లో జపాన్‌‌ని అధిగమిస్తుందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంచనా వేసింది. ఇలా జరిగితే ఇండియా.. అమెరికా, చైనా తర్వాత మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. అధునాతన ఆర్థిక వ్యవస్థలు అన్నీ ఆర్థిక మందగమనం, దీర్ఘకాలిక కొరత, అధిక ద్రవ్యోల్బణం వంటి సమస్యలను ఎదుర్కొంటుంటే భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది.

ఇక చైనా విదేశీ పెట్టుబడి చూస్తే…కోవిడ్ అనంతరం విదేశీ కంపెనీలు చైనా నుంచి వైదొలగడం ప్రారంభించాయి. నిష్క్రమించిన కంపెనీలు భారతదేశం వైపు మొగ్గు చూపడం ప్రారంభించాయి. కొన్ని కంపెనీలు చైనా ఉంటూనే విస్తరణ ప్రారంభించాయి.ఇందులో భాగంగా ప్రముఖ తైవాన్ ఆధారిత ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ ఫాక్స్‌కాన్ ఇండియాలో 600 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడానికి MoU చేసుకుంది . ఆపిల్, సామ్‌సంగ్, గూగుల్ వంటి కంపెనీలు ఇండియాలో పెట్టుబడి పెట్టేందుకు దృఢమైన అడుగులు వేస్తున్నాయి. రోడియం గ్రూప్ నివేదిక ప్రకారం భారతదేశంలో అమెరికా, యూరోప్ గ్రీన్‌ఫీల్డ్ ఇన్వెస్ట్‌మెంట్, 2021-2022లో 65 బిలియన్ డాలర్లు పెరిగింది. అంటే ఇది 400% పెరిగింది.ఇదే సమయంలో చైనాలోని ఇన్వెస్ట్‌మెంట్ 20 బిలియన్ డాలర్లకి పడిపోయింది. 2018లో చైనాలో ఇన్వెస్ట్‌మెంట్ 120 బిలియన్ డాలర్లు. ఈ నివేదిక ప్రకారం చైనా ఏ పరిస్థితులలో ఉందో అర్థంచేసుకోవచ్చు. చైనా అమలుచేస్తున్న నిరంకుశ విధానాలు ఆ దేశానికీ పెద్ద ఎదురుదెబ్బ . అందుకే వరల్డ్ ఇప్పుడు అతిపెద్ద ప్రజాస్వామ్యం వైపు అడుగులు వేస్తున్నాయి.ఎప్పుడైనా ప్రజాస్వామ్యం నిరంకుశత్వం కంటే చాలా గొప్పది.

2023 కచ్చితంగా ఇండియాదే అని చెప్పొచ్చు. అది చంద్రయాన్ మిషన్ లేదా G-20 సమ్మిట్ ప్రెసిడెన్సీ లేదా గ్లోబల్ ఆర్డర్ కోసం భారతదేశం చేస్తున్న ప్రయత్నాలు కానీ, ఇండియా ఇతర దేశాలకు అందనంత ఎత్తుగా ఎదిగిపోతుంది అని చెప్పడానికి ఇవి చిన్న ఉదాహరణలు. ఈ విజయం డ్రాగన్ కంట్రీని ఆత్మరక్షణలోకి నెట్టేసింది. విస్తృత విధానాలు కాకుండా రక్షణాత్మకమైన విధానాలతో ఆచితూచి అడుగులు వేస్తుంది.

ఏదేమైనా21వ శతాబ్దాన్ని శాసించేది ఇండియానే అని కుండబద్దలుకొట్టి చెప్పొచ్చు.

Related News

Tirumala Laddu Politics: లడ్డూ కాంట్రవర్సీ.. దేవదేవుడి ప్రసాదంపైనే ఇన్ని రాజకీయాలా ?

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Big Stories

×