EPAPER

ISRAEL-PALESTINE : ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధంలో నెగ్గబోయేది ఎవరు?

ISRAEL-PALESTINE : ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధంలో నెగ్గబోయేది ఎవరు?

ISRAEL-PALESTINE : ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మొదలయ్యి మూడు వారాలు దాటిపోయింది. ఇప్పట్లో ముగిసేలా కనిపించట్లేదు. ఇంకా వేరే దేశాలు కూడా ఈ యుద్ధంలో భాగమవుతున్నాయి. లెబనాన్, జోర్డాన్, ఈజిప్ట్, సిరియా, ఇరాన్, సౌదీ అరేబియా, యుఎస్‌ఏ, యుకే, కెనడా .. ఈ దేశాలన్నీ ఇప్పటికే యుద్ధంలో భాగస్వామ్యమయ్యాయి. చైనా ఇప్పటికే ఆరు యుద్ధనౌకలను ఒమాన్ ద్వారా మిడిల్ ఈస్ట్ లో మోహరించింది.


ఈ పరిస్థితులు చూసాక అందరిలో ఒక ప్రశ్న తలెత్తుతుంది.. ఈ యుద్ధంలో ఎవరు గెలవబోతున్నారు? ఇజ్రాయెలా?.. పాలస్తీనాన?.. ఈ రెండు దేశాల మధ్య యుద్ధంలో ఎవరు గెలుస్తారో తెలిస్తే షాక్ అవుతారు. అవును ఈ యుద్ధంలో గెలిచేది ఖతార్.. మీరు చదివింది నిజమే !! ఈ యుద్ధంలో గెలిచేది ఖతార్! ఈ చిన్న మధ్య తూర్పు దేశం, ఈ యుద్ధంలో ఎలా భాగస్వామ్యమయ్యింది? 27 లక్షల జనాభా కలిగిన ఈ చిన్న దేశం ఎలా ప్రయోజనం పొందుతుంది?

ఇది తెలియాలంటే ముందుగా.. హమాస్ హిపోక్రిసీ గురించి తెలుసుకోవాల్సిందే.. ఖతార్ డబుల్ గేమ్ ఆడుతుంది. ఒకవైపు హమాస్‌కి సహకరిస్తుంది, మరోవైపు వారితోనే చర్చలు జరుపుతుంది. ఇది అర్ధంచేసుకోవాలంటే మనం ఈ చిన్న విషయాన్నీ అర్ధంచేసుకోవాల్సిందే..
గాజా.. ఇరవై లక్షల జనాభా నివసించే ప్రాంతం.. దీనికి ప్రపంచంలోనే అతిపెద్ద ఓపెన్ ఎయిర్ జైలు అని మరో పేరు. ఎందుకంటే ఒకవైపు ఇజ్రాయెల్.. మరో వైపు ఈజిప్ట్.. గాజా స్ట్రిప్‌తో సరిహద్దు పంచుకుంటుంది. ఇంకోవైపు మధ్యధరా సముద్రం.. గాజా నుంచి బయటకు రావాలంటే ఇజ్రాయెల్ నుంచైనా రావాలి లేదా ఈజిప్ట్ నుంచైనా రావాలి.


2007 నుండి గాజా స్ట్రిప్‌‌.. హమాస్ అనే ఉగ్రవాద సంస్థ ఆధీనంలో ఉంది. పాలస్తీనా సమస్యకు జిహాద్ తప్ప వేరే పరిష్కారం లేదని.. 1998లో హమాస్ చార్టర్‌లో రాసుకుంది. వారికి మొత్తం ఇజ్రాయెల్ దేశం కావాలి, అందులో ఉన్న యూదులను చంపేయ్యాలి.. ఇదే వారి టార్గెట్. హమాస్ దృష్టిలో అంతర్జాతీయ శాంతి ప్రతిపాదనలు, సమావేశాలు… కాలయాపనే! అందుకే ఉగ్రదాడులు చేస్తూ వస్తున్నారు.


ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఖతార్ 2007లో హమాస్‌ను సపోర్ట్ చేసింది.ఇజ్రాయెల్‌లో హమాస్ దాడులు జరగక ముందు గాజా స్ట్రిప్ మౌలిక సదుపాయాల అభివృద్ధి గురించి ఒక వీడియో వైరల్ అయ్యింది. రోడ్లు, వీధుల అభివృద్ధి చూసి ఇండియాతో పోల్చడం మొదలుపెట్టారు. గాజాలో మౌలిక సదుపాయాలు అంతలా అభివృద్ధి అయినప్పుడు, ఇండియాలో ఎందుకు అవ్వదు అనే ప్రశ్న లేవనెత్తారు. ప్రశ్న లేవనెత్తడం సరైనదే కానీ ఆ సందర్భాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. గాజా స్వతహాగా ఎప్పుడు డబ్బు సంపాదించలేదు. విరాళాల ద్వారా మాత్రమే డబ్బును ఏర్పాటు చేసుకుంటారు.

ఇక్కడ కూడా అంతే.. 2012లో ఖతార్ అధినేత హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ మొదటిసారిగా గాజాలో పర్యటించారు. ఆ సమయంలో గాజా పునర్నిర్మాణం కోసం 400 మిలియన్ డాలర్లు డొనేట్ చేస్తాను అని హామీ ఇచ్చారు. అన్నట్టుగానే ఖతార్ అధినేత ఆ మొత్తాన్ని డొనేట్ చేసారు. ఇది ఇక్కడితో ఆగలేదు…ఖతార్ ప్రతి నెల 30 మిలియన్ డాలర్లు గాజాకు పంపిస్తుంది. గాజలోని ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి ఈ మొత్తాన్ని వాడుతారు.

ప్రపంచంలో చాల మంది హమాస్ గ్రూప్‌ను ఒక స్వాతంత్య్ర సమరయోధుల సమూహంతో పోల్చుతారు.. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న పాలస్తీనాకు సపోర్ట్ చేస్తుంది అని వారి నమ్మకం. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే .. హమాస్ గ్రూప్‌కు చెందిన చాల మంది పెద్దలు గాజాలో ఉండరు. వేరే దేశాలలో ఉంటూ గాజా ని నియంత్రిస్తుంటారు. హమాస్ లీడర్స్ 2012 వరకు సిరియాలో ఉండేవారు. 2012లో సిరియాలో సివిల్ వార్ మొదలయ్యింది. ఈ సమయంలో హమాస్, సిరియా గవర్నమెంట్‌కు సపోర్ట్ చెయ్యలేదు. బదులుగా హమాస్ అతివాదులకు అండగా నిల్చింది.

ఇక హమాస్ పొలిటికల్ బ్యూరో హెడ్ ఇస్మాయిల్ హానియే.. 2019లో చిన్న విదేశీ పర్యటన అని వెళ్లి ఇప్పటివరకు గాజాకి తిరిగిరాలేదు. ఇస్మాయిల్, ఖతార్‌లో ఉంటున్నట్లు రిపోర్ట్స్ వెల్లడించాయి. ఇస్మాయిల్ దోహాలో ఉంటూ హమాస్ గ్రూప్ ని ఆపరేట్ చేస్తున్నాడు. ఇంకా కొన్ని రిపోర్ట్స్ అయితే హమాస్ లీడర్స్ ఖతార్‌లో ఉండటమే కాకుండా ఈవెంట్స్ ని కూడా ఆర్గనైజ్ చేస్తున్నారని తెలిపాయి. అది కూడా బిల్‌గేట్స్‌కు చెందిన ఖతార్ ప్రసిద్ధ ఫోర్ సీజన్స్ హోటల్ .. ఇలా గమనించుకుంటూ పోతే ఖతార్ అన్ని విధాలుగా హమాస్ కి హెల్ప్ చేస్తుంది.

హమాస్ లీడర్స్ కి షెల్టర్ ఇస్తుంది ..మానిటరీ సపోర్ట్ కూడా చేస్తుంది. హమాస్ లీడర్స్ పాలస్తీనా పేరుతో ఇతర దేశాలలో ఉంటున్నారు కానీ పాలెస్తీనా ప్రజలు మాత్రం వారి స్వేచ్ఛ కోసం వారి అస్తిత్వం కోసం పోరాడుతూనే ఉన్నారు.

ఇక ఖతార్ ఆసక్తి పరిశీలిస్తే.. హమాస్ లక్ష్యం స్పష్టంగా అర్థమైతుంది. ఇజ్రాయెల్ నుండి యూదులను తరిమేసి ఇజ్రాయెల్ అనేదే లేకుండా చేయాలనేది వారి ప్రధాన ఎజెండా. దీని వలన ఖతార్ కి లాభం ఏంటి? అసలు ఖతార్ లక్ష్యం ఏంటి? ఖతార్ డబుల్ గేమ్ వ్యూహం ఏంటో చూస్తే.. ఖతార్ చమురు వనరులు సమృద్ధిగా ఉన్నాయి. ఇది ప్రపంచానికి తెలిసిన విషయమే.. కానీ ఇంకో విషయంలో కూడా ఖతార్ చాలా పటిష్టం.. అదే ‘నెగోషియేషన్’. అంటే చర్చలు జరిపే సామర్ధ్యం.

ఈ ఆయుధాన్ని వినియోగించి ఖతార్ పాశ్చాత్య దేశాలకు దగ్గరవుతూ ఆర్ధికంగా బలపడుతుంది. మరోవైపు టెర్రరిస్ట్ గ్రూప్స్ కి ఫండ్ చేస్తూ రెండు వైపులా సమతుల్యత పాటిస్తుంది. ఖతార్ నెగోషియేషన్ వ్యూహం అర్ధమవ్వాలంటే .. మీరు ఇది తెలుసుకోవాల్సిందే..

ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం పెద్దదిగా మారుతున్న తరుణంలో పాశ్చాత్య దేశాలన్నీ ఒకే దేశం వైపు చూశాయి..అదే ఖతార్… ఖతార్ గత కొన్ని దశాబ్దాలుగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. తనకి తాను సంధానకర్తగా ప్రపంచానికి పరిచయం చేసుకుంది. ఖతార్..హమాస్ గ్రూప్‌తోనే కాకుండా .. లెబనాన్ కి చెందిన హేజ్బొల్లాతో, అలాగే తాలిబన్ల తో కూడా స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తుంది. ఇటీవలి కాలంలో ఇజ్రాయెల్‌పై దాడులు చేసిన హమాస్.. ఇజ్రాయెలీలను , మరికొంతమంది విదేశీయులను బందీలుగా చేసుకుంది. ఈ తరుణంలో ఖతార్.. హమాస్ చెర నుండి అమెరికాకు చెందిన తల్లీ, కూతుళ్లను విడిపించడంలో సక్సెస్ అయ్యింది.

నిజానికి 2014లో.. సెర్జెంట్ బౌల్ బెర్గ్డాల్. యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ సైనికుడు కిడ్నాప్ విషయంలో ఖతార్ తాలిబన్ల తో చర్చలు జరిపి సెర్జెంట్‌ను రిలీజ్ చేసేలా ఒప్పించింది. అందుకు బదులుగా ఐదుగురు తాలిబన్లను అమెరికా చెర నుండి విడిపించేలా ఒప్పందం చేసింది. ఈ నెగోషియేషన్స్ కారణంగా పాశ్చాత్య దేశాలన్నీ .. ఖతార్‌ను మిత్రదేశంగా చూడటం ప్రారంభించాయి.

అమెరికా అయితే ఖతార్‌లో సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసింది. అమెరికా మరో అడుగు ముందుకేసి ఖతార్‌‌ను నాటోయేతర మిత్రుడుగా చూడటం ప్రారంభించింది . మన దాయాది దేశం పాకిస్తాన్ కూడా ఈ లిస్ట్ లో ఉంది. ఈ నాటోయేతర మిత్రుడుగా గుర్తించిన దేశాలకు అమెరికా వాణిజ్యం, భద్రత, రక్షణ లాంటి అనేక ఇతర లాభాలను చేకూర్చుతుంది. నాటోయేతర మిత్రుడుగా గుర్తించిన తర్వాత .. ఖతార్ .. అమెరికా నుండి ప్రత్యేక ఆర్థిక, సైనిక లాంఛనాలను పొందుతుంది.

అయితే అమెరికా తన ప్రయోజనాల కోసం ఇతర దేశాలను ఎలా వాడుకుంటుందో ఖతార్ ముందే పసిగట్టింది. ఈ విషయం లో ఖతార్ చాల స్మార్ట్ గా వ్యవహరించింది. ఉగ్రవాదం పై ఉక్కుపాదం మోపుతున్న అమెరికాకు సపోర్ట్ చేస్తూనే .. ఖతార్ టెర్రరిస్ట్ గ్రూప్స్ కి ఫండింగ్ చేస్తూ ద్విపాత్రాభినయం చేస్తుంది.

ఇలా ఖతార్ తన అస్థిత్వాన్ని చెక్కు చెదరకుండా చేసుకుంటోంది. ఇదే విషయంపై బీబీసీ ప్రపంచ దేశాలకు వార్నింగ్ ఇచ్చింది. ఖతార్ తీవ్రవాద సంస్థలతో చాలా దగ్గరగా ఉంటుందని చెప్పింది. ఆఫ్గనిస్తాన్ లోని తాలిబన్లతో , సిరియా లోని ఆల్ ఖైదాతో, యెమెన్ లోని హౌతీ రెబెల్స్‌తో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తుందని తెలిపింది.

సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి దేశాలు.. ఖతార్ టెర్రర్ ఫండింగ్ చేస్తోందని ఆరోపిస్తూ వస్తున్నాయి. ప్రపంచ దేశాలన్నిటికి ఖతార్ చేసే టెర్రర్ ఫండింగ్ గురించి తెలుసు కానీ ఇప్పటివరకు ఖతార్ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక్కడే ఖతార్ డబుల్ గేమ్ బయటపడింది. ఏదైనా టెర్రరిస్ట్ గ్రూప్ పాశ్చాత్య దేశాల నుంచి కానీ, ఏదైనా అరబ్ దేశాల నుంచి కానీ ఎవరినైనా కిడ్నాప్ చేస్తే నెగోషియేషన్స్ కోసం ముందుగా ఎదురుచూసేది ఖతార్ కోసమే.

2017లో సిరియా లో ఇరాన్ అధికారులను కిడ్నాప్ చేసినప్పుడు ఖతార్ వన్ బిలియన్ డాలర్ల ఒప్పందంకు వారిని విడిపించింది. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాలతో ఖతార్ సంబంధాలు దిగజారుతూ వచ్చాయి . మధ్యప్రాచ్యంలో అస్థిరతకు ఖతార్‌ఏ కారణం అని ఆరోపించాయి. కానీ 2021లో సీన్ రివర్స్ అయ్యింది. సౌదీ అరేబియా, యూఏఈ ఖతార్ తో మళ్ళీ ఆరోగ్యకరమైన సంబంధాలను కొనసాగించడం ప్రారంభించింది. ఇదే తరుణంలో సౌదీ అరేబియా ఖతార్ పై ఉన్న దిగ్బంధనాన్ని ఎత్తివేసింది.


ఇదే సమయం లో ఖతార్ విదేశాంగ మంత్రి ఒక సంచలన ప్రకటన చేసాడు. ఒక సంధానకర్త బాధ్యత కాంఫ్లిక్ట్ ని పరిష్కరించడం .. ఆ నెగోషియేషన్స్ ద్వారా తాము ఎలాంటి లాభాలు పొందుతున్నాము అనేది అనవసర చర్చ అని తన మనసులోని మాట బాహ్య ప్రపంచానికి చెప్పనే చెప్పాడు.

జో బిడెన్ అధికారంలోకి వచ్చాక 2021 లో ఆఫ్గనిస్తాన్ నుండి తమ దళాలను ఉపసంహరించుకుంది. ఇదే సమయం లో ఆఫ్గనిస్తాన్ లోని తాలిబాన్లకు, అమెరికా దళాలకు మధ్య భీకర పోరు జరిగింది. కొంతమంది అమెరికా సైనికులు తాలిబన్లు బందీగా చేసుకున్నారు.. ఆ పరిస్థితిలో రక్షించడానికి వచ్చినవారు ఎవరో తెలుసా.. ఖతార్ ..ఇలా ఖతార్ డబుల్ గేమ్ వ్యూహాన్ని ఉపయోగిస్తూ వస్తుంది..

టెర్రరిస్ట్ గ్రూప్స్ తో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించడం వలన.. పాశ్చాత్య దేశాలకు ఏ సమస్య వచ్చినా ఖతార్ సహాయం కోసం ఎదురుచూస్తారు. ఈ విధంగా ఖతార్ ‘ప్రాబ్లమ్ సొల్వర్’ అనే ట్యాగ్ బిల్డ్ చేసుకుంది. చర్చల పేరుతో పాశ్చాత్య దేశాలపై ఖతార్ పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోంది.

ఖతార్ ఎలా గెలుస్తుంది??

ఖతార్..ప్రపంచంలో 13వ అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు. ప్రపంచ దేశాలకు ఆయిల్‌ను ఎగుమతి చేస్తుంది. ఖతార్, చమురుతో పాటు మరొక వస్తువును కూడా ఎగుమతి చేస్తోంది.

అదే ఎల్‌ఎన్‌జీ.. లిక్విఫీడ్ న్యాచురల్ గ్యాస్ .. చమురు,గ్యాస్ .. ఇవి క్షీణిస్తున్న వనరులు. ఈ వనరులపై ఆధారపడిన దేశాలు ఎక్కువ కాలం వాళ్ళ ఆర్థిక వ్యవస్థలను నడపలేవు.అరబ్ దేశాలు ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నాయి. యూఏఈ పర్యాటకంపై దృష్టి కేంద్రీకరిస్తుంటే సౌదీ అరేబియా విజన్-2030 లాంటి ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ చెయ్యడం స్టార్ట్ చేసాయి. ఒక్కో దేశం ఒక్కో వ్యూహాన్ని అమలుపరుస్తుంది. కానీ ..ఖతార్ స్ట్రాటజీ వేరు.

ఖతార్ తో యూరోప్ 27 సంవత్సరాలకు లిక్విఫీడ్ న్యాచురల్ గ్యాస్ దిగుమతి చేసుకునేలా ఒప్పందం చేసుకుంది . ఉక్రెయిన్ – రష్యా యుద్ధం కారణంగా యూరోపియాన్ యూనియన్ రష్యా నుంచి గ్యాస్ కొనుగోలు చెయ్యొద్దు అని నిర్ణయించుకుంది. అందుకే వారి చూపు ఖతార్ వైపు పడింది. ఈ ఒప్పందం ద్వారా ఖతార్ సంవత్సరానికి 3.5 మిలియన్ టన్నుల గ్యాస్‌ను ఎగుమతి చేస్తుంది.

ప్రపంచంలో యుద్దాలు జరుగుతున్నా.. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నా.. ఎన్నో ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతున్నా.. ఖతార్ మాత్రం స్మార్ట్ వ్యూహాలను ఉపయోగించడం ద్వారా ఆర్ధికంగా బలపడుతుంది. ప్రపంచ దేశాలను శాసించే స్థాయికి ఎదుగుతూ వస్తుంది. ఈ యుద్ధ వాతావరణం నుండి వలన ప్రపంచం నష్టపోతుంటే ఖతార్ లాభపడుతుంది.

.

.

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×