EPAPER

Srikalahasti Politics: బొజ్జల వెంకటసుధీర్‌రెడ్డి Vs మధుసూదన్ రెడ్డి.. శ్రీకాళహస్తిలో బొజ్జల హవా వైసీపీకి ఎదురు దెబ్బ..?

Srikalahasti Politics: బొజ్జల వెంకటసుధీర్‌రెడ్డి Vs మధుసూదన్ రెడ్డి.. శ్రీకాళహస్తిలో బొజ్జల హవా వైసీపీకి ఎదురు దెబ్బ..?

Who will Win in Srikalahasti-  Bojjala Sudheer Reddy Vs Madhusudhan Reddy: ఆ సెగ్మెంట్లో పొలిటికల్ ఈక్వేషన్లు మారడం ఖాయమైందా? వరుసగా రెండో సారి గెలవాలని కోట్లు కుమ్మరించిన వైసీపీ ఎమ్మెల్యేకి ఈ సారి ఎదురు దెబ్బ తప్పదా? ప్రభుత్వ వ్యతిరేకత కంటే పోలీసు అధికారుల పెత్తనంతో విసిగిపోయిన ఆ నియోజకవర్గ ఓటర్లు ఈసారి కసిగా ఓట్లేసి పోలింగ్ శాతం పెంచేశారు. కొత్త ఓటర్లు, ఉద్యోగులు కూడా పోలింగ్ బూత్‌లకు పోటెత్తారు. ప్రజాతీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఆ క్రమంలో అక్కడ పోలింగ్ సరళి.. పోలింగ్‌కు ముందు చోటు చేసుకున్న పరిణామాలపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ సెగ్మెంట్ ఏదో? యంత్రాంగాన్నే నమ్ముకున్న ఆ ఎమ్మెల్యే ఎవరో మీరే చూడండి.


ఉమ్మడి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో టీడీపీ ఆవిర్బావం నుంచి సత్తా చాటుకుంటూ వచ్చింది. 1983 నుంచి పదిసార్లు ఎన్నికలు జరిగితే.. ఏడు సార్లు ఘనవిజయాలు నమోదు చేసింది. టీడీపీ సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అయిదు సార్లు గెలుపొంది టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సన్నిహిత మిత్రుడు అయిన బొజ్జల అధిపత్యం ఇక్కడ కొనసాగుతూ వస్తుంది. 1989లో మొదటి సారి కాళహస్తి నుంచి పోటీ చేసిన బొజ్జల అక్కడ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేశారు. 2003లో అలిపిరి ఘాట్‌ రోడ్డు లో నక్సలైట్లు క్లెమోర్‌ మైన్స్‌ పేల్చి న ఘటనలో చంద్రబాబుతో పాటు బొజ్జల కూడా కారులో ఉన్నారు. ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

2004లో కాంగ్రెస్ నుంచి ఎస్‌సీవీ నాయుడు ఆయన విజయపరంపరకు బ్రేకులు వేశారు. తర్వాత వరుసగా రెండు సార్లు బొజ్జల విజయం సాధించి నియోజకవర్గంలో తన పట్టు నిలుపుకున్నారు. 2019 ఎన్నికల్లో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు బొజ్జల వెంకటసుధీర్‌రెడ్డి టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగి. వైసీపీ తరుపున బియ్యం మదుసూదన్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. ఈ సారి బియ్యం మధుసూధన్‌రెడ్డిపై సుధీర్‌రెడ్డి మరోసారి పోటీ చేయడంతో కాళహస్తి ఓటర్లు ఎవరికి పట్టం కట్టారనేది ఆసక్తికరంగా మారింది.


Also Read: మామ VS అల్లుడు.. మధ్యలో గాంధీ

2019లో శ్రీకాళహస్తిలో మొత్తం 1, 95, 994 ఓట్లు పోలయ్యాయి. 95,540 మంది పురుషులు, లక్షా 426 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 1,780 పోస్టల్ ఓట్లతో కలిపి అప్పట్లో 83 పోలింగ్ శాతం నమోదైంది. వైసీపీ అభ్యర్ధి 38 వేల మెజార్టీతో విజయం సాధించారు. అయితే గత ఎన్నికల్లో జనసేన, బీజేపీలు కూడా ఆ ఆధ్యాత్మిక పట్టణంలో పోటీ చేయడం టీడీపీకి పెద్ద మైనస్ అయింది. ఈ సారి దాదాపు రెండు శాతం పోలింగ్ శాతం పెరగడం. జనసేన, బీజేపీలు బొజ్జలకు పూర్తిగా సహకరించడంతో టీడీపీ శ్రేణుల్లో గెలుపుపై ధీమా వ్యక్తమవుతుంది.

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అధికారులు పోకడలు వైసీపీ ప్రతికూలంగా మారాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.. కాళహస్తి సీఐగా అంజూ యాదవ్ ఎంత వివాదాస్పదంగా మారారో తెలిసిందే.. ప్రతిపక్ష నేతలపై పరుష పదజాలం వాడటం… విపక్షాలు కనిపిస్తే విరుచుకుపడటం ఆమె స్టైల్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా చిన్నపాటి నిరసనన కార్యక్రమం చేపట్టినా వైసీపీ నేతల కంటే ఎక్కువ హైరానా పడిపోతారు.. సాటి మహిళలపై బూటు కాలితో వీరంగం వేశేవారు.

అమెపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన అధికారపార్టీ అండతో చాలా కాలం శ్రీకాళహస్తిలోనే కొనసాగారు ఆ లేడీ ఆఫీసర్ ఆమెతో పాటు కొందరు పోలీస్ అదికారులు వ్యవహారించిన తీరు నియోజకవర్గంలో వైసీపీని అప్రతిష్ట పాలు చేసింది. అది మధ్య తరగతి వారి ఓటింగ్‌పై ప్రభావం చూపిందంటున్నారు. అలాగే స్థానిక మాజీ ఎమ్మెల్యే ఎస్‌సీవీ నాయుడు టిడిపిలో చేరడంతో పాటు జనసేన ఓటింగ్ కూడా ఎక్కువుగా ఉండటం కూడా టీడీపీకి లాభించాయంటున్నారు. నియోజకవర్గంలో కొత్తగా ఓటర్లు 4 వేల మంది అధికారపక్షానికి వ్యతిరేకంగా ఓటు వేసారన్న ప్రచారం జరుగుతుంది. మరో వైపు ఉద్యోగుల ఓటింగ్ టీడీపీకి ప్లస్ అయిందంటున్నారు.

Also Read: Palamaner Assembly Constituency: పలమనేరులో పాగా.. టీడీపీ కంచుకోటలో వైసీపీ పవర్ ఎంత?

ఈ సారి ఎన్నికలను టీడీపీ అదిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. స్థానికంగా బొజ్జల సుధీర్‌ను వ్యతిరేకించే వారిని టీడీపీ పెద్దలు బుజ్జగించారు. జనసేన ఇన్జార్జ్ వినూతతో సైతం పవన్ స్వయంగా మాట్లాడి సెట్ చేసారు. అదే విధంగా బిజెపితో పాటు, మాజీ ఎమ్మెల్యే ఎస్‌సీపీ సైతం టీడీపీ విజయానికి సీరియస్‌గా పనిచేసారు. మరో వైపు రేణిగుంట మండలంలో పట్టున్న తిరుపతి నాయకులు జేబీ శ్రీనివాస్, మబ్బు దేవనారాయణ రెడ్డిలు ప్రచారం చేయడమే కాకుండా తమ క్యాడర్ తో పనిచేయించారు. అలాగే డాలర్స్ దివాకర్ రెడ్డి కూడా అక్కడ పనిచేసారు. టిడిపి అదిష్టానం కూడా నియోజకవర్గంలో మెజార్టీ ఓట్లున్న వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన గురవారెడ్డి లాంటి నాయకులకు పార్టీ పదవులు ఇవ్వడం కలిసి వస్తుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

వైసీపీ ఎన్నికల తేదీల ప్రకటనకు ముందు నుంచే దూకుడు ప్రదర్శించింది. బియ్యం మదుసూదన్ రెడ్డి ముందునుంచి అంగబలాన్ని, అర్థిక బలంతో పాటు అధికారబలాన్ని వాడుకున్నారు. రాష్టంలో ఎక్కడ లేని విధంగా జగన్ నవరత్నాలకు అలయం నిర్మించి తన భక్తి చాటుకున్నారు. మరోవైపు టిడిపిలోని గ్రూపులను ప్రోత్సాహించడానికి ప్రయత్నించారు. దాంతో పాటు తన నియోజకవర్గంలో ఎక్కవుగా ఉన్న వన్నెకుల క్షత్రియు సామాజిక వర్గానికి చెందిన రష్ సుబ్రమణ్యానికి ఎమ్మెల్సీ పదవి రావడంలో కీలక పాత్ర పోషించారు.

Also Read: Nandyal Assembly Constituency: పుష్ప పవర్ ఎంత? శిల్పా లెక్క మారిందా?

అయితే బియ్యం నోటి దురుసు ఆయనకు బూమరాంగ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. చంద్రబాబు, లోకేష్‌తో పాటు వారి కుటుంబ సభ్యులపై విమర్శల వర్షం కురిపించంలో ముందుంటారు కాళహస్తి ఎమ్మెల్యే.. జగన్ మెప్పు కోసం అభ్యంతరకర పదజాలం వాడుతుంటారు. అది ఆయనకు మైనస్‌గా మారింది. గత ఎన్నికల్లో ప్యాన్ గాలితో పాటు ఎస్‌సీవీ నాయుడు గ్రూపు కూడా అయన విజయానికి కారణమైంది. అయితే ఈ సారి ఎస్‌సీవీ నాయుడు టీడీపీకి పని చేసి బియ్యానికి పెద్ద షాక్ ఇచ్చారు.

ఆ క్రమంలో బియ్యం మధుసూదన్ ఎన్నికల తతంగాన్ని నడిపించడానికి క్యాడర్ కంటే ఎక్కువుగా వాలంటీర్లు ,సచివాలయ సిబ్బంది మీదే అధారపడ్డారు. ప్రలోభాల తతంగం కూడా వాలంటీర్ సైన్యంతోనే నడిపించారు. దాంతో పార్టీ కేడర్ పోల్‌మేనేజ్‌మెంట్‌లో మొండి చేయి చూపించింది. తమని నమ్మనప్పుడు ఆయనకు ఎందుకు సహకరించాలని కేడర్ ఎమ్మెల్యేకి దూరం జరిగింది. ఏదేమైనా తన విజయం ఖాయమని.. మెజార్టీ తగ్గినా గెలుస్తానని బియ్యం మధు ధీమా వ్యక్తం చేస్తున్నారంట.

అయితే అక్కడ పనిచేసిన సీఐలు అంజూయాదవ్ , శ్రీహారిలు బియ్యం మధుకి పెద్ద మైనస్ అయ్యారన్న అభిప్రాయం ఉంది. వైసీపీ కార్యకర్తల్లా పనిచేసిన ఆ అధికారులు.. పెట్టిన టార్చర్‌తో టీడీపీలోని వర్గాలన్నీ ఏకమైన ఈ ఎన్నికల్లో కసిగా పనిచేశాయంట. ఆ క్రమంలో కాళహస్తిలో వైసీపీ ఓడిపోతే సగం పాపం పోలీస్ అధికారులదే అన్న టాక్ వినిపిస్తుంది. అటు జనసేన నాయకుడిని కొట్టడం అదే విధంగా హోటల్ యజామనిపై దాడి.. మహిళలని కూడా చూడకుండా అంజూ యాదవ్ ఎగిరిఎగిరి తన్నడం సామాన్యుల్లో కూడా వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచాయంటున్నారు.

Also Read: మారిన లెక్కలు.. ధర్మవరంలో గెలిచేదెవరు?

అదే విదంగా నారా లోకేష్ పాదయాత్రలో లోకేష్ మీదకు రాళ్ల దాడికి ప్రయత్నించడం , పోలీస్ అధికారి శ్రీహారి టిడిపి వారిని బెదరించడం లాంటి చర్యలు ఎమ్మెల్యేకి ప్రతికూలంగా మారాయట. అయితే జగన్ నవరత్నాలతో పాటు వలంటీర్ సైన్యాన్నే నమ్ముకున్న మధుసూధనరెడ్డి మాత్రం తన విజయంపై ధీమాతోనే కనిపిస్తున్నారు. మరి చూడాలి శ్రీకాళహస్తి ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో..

Tags

Related News

Sabarmati and Thames River: సబర్మతి, థేమ్స్ నదులు ఎలా బాగుపడ్డాయి?

Israel-Iran War: ఇరాన్‌పై దాడికి ఇజ్రాయెల్ వ్యూహం ఇదే!

Osho Rajneesh: కళ్ళకు కట్టినట్టుగా ఓషో రజనీష్ నిజస్వరూపం

YS Jagan: కడపలో జగన్ ప్లాన్ సక్సెస్.. ఎలాగంటే..

YS Jagan in Confusion: అంబటి, రజిని దెబ్బకి.. అయోమయంలో జగన్

Bigg Boss 8 Day 33 Promo1: మార్నింగ్ మస్తీ.. చిలకజోస్యంతో అదరగొట్టిన మణికంఠ..!

Balineni vs Prakasam Riyaz: బాలినేని మైండ్ గేమ్.. షాక్ ఇస్తున్న శిష్యుడు

Big Stories

×