EPAPER

Vizag Mayor : హాట్ టాపిక్ గా విశాఖ కార్పొరేషన్ రాజకీయం.. కొత్త మేయర్ ఎవరు ?

Vizag Mayor : హాట్ టాపిక్ గా విశాఖ కార్పొరేషన్ రాజకీయం.. కొత్త మేయర్ ఎవరు ?

Vizag New Mayor Politics(Andhra politics news): రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. గతంలో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ వ్యతిరేక పవనాలు వీచినప్పుడు కూడా విశాఖలో టీడీపీ ఎమ్మెల్యేలే గెలిచారు. అయితే తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడిన వైసీపీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ కార్పొరేటర్లు వరుసగా వైసీపీకి గుడ్‌బై చెప్తూ.. టీడీపీ, జనసేనల్లో చేరిపోతున్నారు. విశాఖ కీలక నేతలు కార్పొరేటర్లను చేర్చుకుంటూ స్థాయి సంఘాల ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. అవసరమైతే ప్రభుత్వ పరంగా చట్ట సవరణ చేసైనా మేయర్‌ను మార్చే దిశగా పావులు కదుపుతుండటం ఆసక్తి రేపుతోంది.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే తలమానికమైన నగరం విశాఖ. కొద్ది రోజులుగా విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయం రాష్ట్రంలోనే హాట్‌టాపిక్‌గా మారింది. రాష్ట్రంలో పెద్దదైన మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మార్పు వ్యవహారం తెరమీదకు రావడంతో దానిపై పెద్ద చర్చ జరుగుతుంది. 98 డివిజనల్లు ఉన్న విశాఖ నగరపాలక సంస్థలో ఇప్పటివరకు వైసీపీ అధికారంలో ఉంది. వైసీపీకి 59 మంది కార్పొరేటర్లు ఉంటే.. టీడీపీకి 29 మంది, జనసేనకు ముగ్గురు, బీజేపీకి ఒకరు, సీపీఎం, సిపిఐలకి ఒక్కొక్కరు, స్వతంత్ర కార్పొరేటర్ల నలుగురు ఉన్నారు.

విశాఖ మేయర్ పదవి కోసం వైసీపీ నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆ తర్వాత ఎమ్మెల్సీ అవ్వడంతో కార్పొరేటర్ గా రాజీనామా చేశారు. అప్పటి నుండి ఆ స్థానం ఖాళీగానే ఉంది. మొన్న జరిగిన ఎన్నికల్లో వంశీకృష్ణ శ్రీనివాస్‌యాదవ్ వైసీపీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి జనసేన టికెట్‌తో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడిగి పెట్టారు. ఆయన వైసీపీకి రాజీనామా చేసినప్పుడే విశాఖ నగర మేయర్‌ని మారుస్తామని.. అనేకమంది కార్పొరేటర్లు తమ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని ప్రకటించి కలకలం సృష్టించారు.


Also Read : వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్.. కొనసాగింపుపై కీలక ప్రకటన

దానికి తగ్గట్లే కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే వైసీపీ కార్పొరేటర్లు వరుసగా టీడీపీ, జనసేన బాట పడుతున్నారు. ఇప్పటికే వైసీపీకి చెందిన 12 మంది కార్పొరేటర్లలో ఏడుగురు టీడీపీలో చేరితే.. జనసేన పార్టీలో ఐదుగురు చేరారు. కార్పొరేటర్ల పార్టీ మారే విషయాన్ని ముందుగానే గమనించిన జగన్ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ని రంగంలోకి దింపి చర్చలు జరిపించారు. అయితే గుడివాడ అమర్నాథ్‌ ఎంత బతిమలాడినప్పటికీ 12 మంది కార్పొరేటర్లు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.

వంశీకృష్ణ శ్రీనివాస్‌యాదవ్ కార్పొరేటర్‌గా రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానాన్ని తప్పిస్తే మిగిలిన 58 కార్పొరేటర్లలో 12 మంది టిడిపి, జనసేనల్లో జాయిన్ అవడంతో ప్రస్తుతం వైసీపీకి 46 మంది కార్పొరేటర్లు మాత్రమే మిగిలారు. మేయర్‌ పీఠం దక్కించుకోవాలంటే 50 మంది కార్పొరేటర్ల బలం ఉండాలి. జాయిన్ అయినా కొత్త కార్పొరేటర్లతో కలిపి ప్రస్తుతం కూటమి పార్టీలకు 45 మంది కార్పొరేటర్లు ఉన్నారు. స్వతంత్రులు, కమ్యూనిస్టు పార్టీల కార్పొరేటర్‌లతో పనిలేకుండానే కూటమికి విశాఖ కౌన్సిల్‌లో అవసరమైన బలముంది. కోఆప్షన్ మెంబర్లుగా ఉండే గ్రేటర్ విశాఖ పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలతో పాటు విశాఖ, అనకాపల్లి ఎంపీలతో కలిపితే కూటమికి 54 ఓట్లు వస్తాయి. దాంతో సునాయాసంగా మేయర్ పీఠాన్ని కూటమి చేజిక్కించుకోవచ్చు.

అయితే మేయర్‌గా ఎన్నికైన వారిపై నాలుగు సంవత్సరాలు పాటు అవిశ్వాస తీర్మానం పెట్టకుండా గతంలో టీడీపీ ప్రభుత్వమే చట్టం చేసి జీవో తీసుకొచ్చింది. ఇప్పుడు విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో స్థాయి సంఘాల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఆగస్టు ఏడో తేదీన ఈ ఎన్నికలు జరగనున్నాయి. పదిమంది స్థాయి సంఘాల నాయకులను ఈ ఎన్నికల్లో ఎవరు గెలిపించుకోవాలన్నా మెజారిటీ కార్పొరేటర్లు అవసరం.. ఆ స్థాయి సంఘం ఎన్నికల నాటికి ఇంకొందరు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ, జనసేనల బాట పట్టే పరిస్థితి కనిపిస్తుంది. పదికి పది స్థాయి సంఘాలను గెలుచుకునేలా టీడీపీ, జనసేన నేతలు పావులు కదుపుతున్నారు.

ఇప్పటికే మేయర్‌‌పై అవిశ్వాసం పెట్టి గెలిచే బలం చూకూరిన కూటమి నేతలు గతంలో తమ ప్రభుత్వమే తీసుకొచ్చినా.. నాలుగేళ్లు అవిశ్వాసం పెట్టకూడదన్నజీఓను రద్దు చేయించే ఆలోచనలో ఉన్నారంట. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల తర్వాత దానిపై ఆర్డినెన్స్ తెచ్చి.. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మరో ఐదు కార్పొరేషన్ల మేయర్ పీఠాలను చేజిక్కించుకోవడానికి కూటమి పెద్దలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

Also Read : ఢిల్లీలో నిజాలు చెప్పిన జగన్, అదీ.. మా ప్రభుత్వం..

అదే జరిగితే అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న వైసీపీకి.. క్షేత్రస్థాయిలో కూడా బలం లేకుండా పోతుంది. అప్పుడు ఆ పార్టీ తిరిగి నిలదొక్కుకోవడం కూడా కష్టమే. ఇప్పటికే వైసీపీ అధికారాన్ని అడ్డంపెట్టుకుని చేజిక్కించుకున్న పలు మున్సిపాల్టీల్లో లెక్కలు మారిపోతున్నాయి. పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్తుల్లో కూడా వైసీపీ చతికిలపడుతోంది. కార్పొరేషన్లు కూడా చేజారితే ఇక వైసీపీ కోలుకోవడం కష్టమే అంటున్నారు.

ఆ క్రమంలో విశాఖ కార్పొరేషన్‌లో ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విశాఖ ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు గంట శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణ, జ నసేన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో 12 మంది కార్పొరేటర్లు ఇప్పటికే టీడీపీ, జనసేనల్లో జాయిన్ అయ్యారు. విశాఖ నగర మేయర్‌ని మారుస్తానని పంతం పట్టిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌యాదవ్ ఆ దిశగా గట్టిగానే చక్రం తిప్పినట్లు కనిపిస్తున్నారు.

మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందు తమ్ముడు, కార్పొరేషన్లో టీడీపీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న పీల శ్రీను కూటమి మేయర్ అభ్యర్థిగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు వంశీకృష్ణతో పాటు పీలాగోవిందు కూడా కౌన్సిల్లో వైసీపీని ఖాళీ చేయించే పనిలో పడ్డారంట. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మరీ అతిగా ప్రవర్తించి.. అవినీతి, అక్రమాలకు పాల్పడిన 8 మంది వైసీపీ కార్పొరేటర్లను మాత్రం వారు వస్తామన్నా తీసుకోకూడదని కూటమి నేతలు డిసైడ్ అయ్యారంట. మొత్తమ్మీద అతి త్వరలోనే విశాఖ వాసులు కొత్త మేయర్ని చూడటం ఖాయంగా కనిపిస్తోంది.

Related News

Press Freedom: మీడియాతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ..!

Kargil War: కార్గిల్ యుద్ధం ఎందుకు జరిగింది?.. 25 ఏళ్ల తర్వాత నిజం ఒప్పుకున్న పాక్

Big Shock to YS Jagan: పూర్తిగా ఖాళీ అవుతున్న వైసీపీ.. వీళ్లంతా జంప్

US Presidential Election 2024: కమలా హారిస్ విన్ అవుతుందని.. అలన్ ఎలా చెప్తున్నాడు?

TDP Office Attack Case: పరారీలో జోగి రమేశ్‌, దేవినేని అవినాశ్‌?

YSRCP VS TDP: వరద పాలిటిక్స్.. బురదలో ప్రజలు.. నేతల గొప్పలు

Natural Disaster: క్లౌడ్‌ బరస్ట్‌తో ఆకస్మిక వరదలు.. విపత్తులను ఆపే దారేది?

Big Stories

×