EPAPER

What is the THAAD: థాడ్ అంటే ఏంటి? ఇది వాడితే ఏ దేశమైనా నాశనమేనా?

What is the THAAD: థాడ్ అంటే ఏంటి? ఇది వాడితే ఏ దేశమైనా నాశనమేనా?

క్షిప‌ణి వ్యవ‌స్థలో థాడ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఇది అత్యంత ప‌టిష్టమైన వ్యవ‌స్థ. అత్యంత శక్తివంతమైన క్షిపణి నిరోధక ఆయుధాల్లో ఇది ఒకటి. స్వల్ప, మ‌ధ్య శ్రేణి క్షిప‌ణుల‌ను థాడ్ మిసైల్ వ్యవ‌స్థ మొద‌టి ద‌శ‌లోనే ధ్వంసం చేస్తుంది. అంటే 150 నుంచి 2 వందల కిలోమీటర్ల పరిధిలోనే బాలిస్టర్ క్షిపణులను నామరూపాలు లేకుండా చేస్తుంది. ఇది ఎన్నో సార్లు ప్రూ అయింది కూడా.

అధునాతన రాడార్ సిస్టమ్స్, మరియు ఇంటర్ సెప్టర్ల కలయికను ఉపయోగించి థాడ్ ను రూపొందించారు. ఇందులో 4 ప్రధాన భాగాలు ఉన్నాయి. అవి ఇంటర్‌సెప్టర్లు, లాంచర్లు, రాడార్, ఫైర్ కంట్రోల్ సిస్టమ్‌లు ఉన్నాయి. ఇంటర్‌సెప్టర్ ఇంపాక్ట్ ఫోర్స్‌ని ఉపయోగించి ఇన్‌కమింగ్ క్షిపణులను నాశనం చేయడంలో సహాయపడుతుంది, అయితే లాంచ్ వెహికల్స్ ఇంటర్‌సెప్టర్‌ను మోసుకెళ్లి లాంచ్ చేస్తాయి. అదేవిధంగా, రాడార్ సాంకేతికతలు 870 నుండి 3,000 కిలోమీర్ల పరిధిలో ఉన్న మిసైల్స్ ను పసిగట్టగలదు. ఇప్పుడు అగ్నిమాపక నియంత్రణ వ్యవస్థలు ఇంటర్‌సెప్టర్ల ప్రయోగ, లక్ష్యాన్ని సమన్వయం చేస్తాయి. థాడ్ షార్ట్, ఇంటర్మీడియట్ , ఇంటర్మీడియట్-రేంజ్ బాలిస్టిక్ క్షిపణులకు వ్యతిరేకంగా రక్షిస్తుంది. ఇందులో ఎలాంటి పేలుడు వార్‌హెడ్‌లు ఉండకపోవడం దీని ప్రధాన ప్రత్యేకత. సెన్సార్ సహాయంతో లక్ష్యాలను నాశనం చేస్తుంది.


టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా వరకు దూసుకెళ్లి శత్రువుల మిస్సైళ్లను గాల్లోనే అంతమొందిస్తాయి. అంతేకాదు అమెరికాకు మాత్రమే ఉన్న ఈ టెక్నాలజీ.. అపదలో ఉన్న మిత్ర దేశాలకు ఆయా సమయాల్లో అందిస్తుంది అగ్రరాజ్యం. గతంలో యుఏఈ, దక్షిణ కొరియాకు లాంటి దేశాలకు సాయం అందించింది థాడ్. అమెరికా షిప్పుల్లో థాడ్ కనిపిస్తుంటుంది.

అమెరికా మిలటరీకి ఏడు థాడ్ బ్యాటరీలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఆరు ట్రక్కు- మౌంటెడ్ లాంచర్ లను కలిగి ఉంటుంది. ఒక్కొక్కటి ఎనిమిది ఇంటర్ సెప్టర్ లతో శక్తివంతమైన రాడార్ సిస్టమ్, ఫైర్ కంట్రోల్, కమ్యూనికేషన్ కంపోనెంట్ కలిగి ఉంటుంది. అంటే శత్రు దేశాల నుంచి వచ్చే క్షిపణులను ముందుగానే కనిపెట్టి.. దూరం నుంచి వాటిని మట్టుపెడుతుంది. అయితే ఇన్నాళ్లు ఇరాన్ ఇజ్రాయెల్ పై ప్రయోగించే మిస్సైల్స్ ను ఇజ్రాయెల్ అపలేకపోయింది. అంతేందుకు ఏప్రిల్ 13న జరిగిన దాడి.. మొన్నటికి మొన్న ఈనెల 1న జరిగిన క్షిపణుల దాడులు ఇజ్రాయెల్ కు భారీ నష్టాన్ని మిగిల్చాయి. అందుకే ఈసారి ఆ ఛాన్స్ తీసుకోకుండా ఇజ్రాయెల్ కు థాడ్ పంపుతోంది అగ్రరాజ్యం. కానీ అవి అపరేట్ చేయడం అంత ఈజీ పని కాదు.. ఇందులో అరితేరిన వారి దీని ప్రయోగానికి అర్హులు. అందుకే అమెరికా వీటిని ప్రయోగించేందుకు వంద మంది సైనికులను ఇజ్రాయెల్ కు పంపుతోంది.

Also Read: ‘అడ్డుతొలగండి.. లేకపోతే మీకే నష్టం’.. లెబనాన్‌ ఐరాస కార్యకర్తలను హెచ్చరించిన నెతన్యాహు

అయితే పెటగాల్ అందించిన సమాచారం ప్రకారం…C-17, C-5 US వైమానిక దళానికి చెందిన కార్గో విమానాల ద్వారా THAADని త్వరలోనే ఇజ్రాయెల్ లో ల్యాండ్ కానున్నాయి. అయితే అవి ఎప్పుడు వస్తాయి.. ఎక్కడ యాక్ట్ గా పెడతారో మాత్రం వెల్లడించలేదు. మరో విషయమేంటంటే.. ఇజ్రాయెల్‌కు థాడ్ బ్యాటరీని పంపడం ఇదే మొదటిసారి కాదు. 2019లో ఓ ప్రయోగంలో భాగంగా అప్పుడు కూడా ఇజ్రాయెల్ గడ్డపై కాలుమోపాయి థాడ్. అంతకు ఉత్తర కొరియా ప‌దేప‌దే చేస్తున్న మిసైల్ బెదిరింపుల‌ను ఎదుర్కొనేందుకు అమెరికా థాడ్ వ్యవస్థను రంగంలోకి దించాల్సి వచ్చింది. అయితే థాడ్ మిస్సైళ్ల ను అప్పట్లో చైనా తీవ్రంగా వ్యతిరేకించింది.

గతేడాది ఇజ్రాయెల్ పై హమాస్ చేసిన దాడికి ఇజ్రాయెల్ ఇంకా ప్రతీకారం తీర్చుకుంటూనే ఉంది. ఉగ్రవాద మూలాలు ఎక్కడున్న అంతమొందించాలనే లక్ష్యంతో బాంబులతో విరుచుకుపడుతోంది. అదే టైంలో ఇరాన్ తాజాగా ఇజ్రాయెల్ పై మిస్సైళ్ల వర్షం కురిపించింది. ఇంకేముంది ఇరాన్ పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగే అవకాశం ఉందనే వార్తలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. అదే సమయంలో ఇరాన్ కూడా తగ్గేదేలే అంటోంది. అరబ్ దేశాలతో పాటు గల్ఫ్ లోని అమెరికా మిత్ర దేశాలకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ పై దాడి చేసేందుకు ఇజ్రాయెల్ కు అరబ్ దేశాలు సహకరిస్తే ఆ దేశాలపై ప్రతీకారం తీర్చుకుంటాని హెచ్చరించింది ఇరాన్.

ఇక, హిజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా చేసుకుని లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులకు దిగిన సమయంలో ఇరాన్ సైతం రంగంలోకి దిగింది. ఇజ్రాయెల్ పై క్షిపణి దాడితో ఇరాన్ ప్రత్యక్షంగా పాల్గొంది. అక్టోబర్ 1న జరిగిన ఈ దాడికి నెతన్యాహు ప్రభుత్వం రగిలిపోతోంది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇప్పటికే ప్రతిజ్ఞ చేసింది. ఇజ్రాయెల్ పై ఒక్క బాంబు కూడా పడకుండా పడ్బంది ప్లాన్ అమలు చేస్తోంది. అదే టైంలో ఇరాన్ కు బుద్ధి చెప్పడానికి అగ్రరాజ్యం, ఇజ్రాయెల్ వేస్తున్న ప్లాన్.. ఎటు దాడి తీస్తుందోనన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.

Related News

Baba Siddique Murder: బిష్ణోయ్ కులదైవానికి సల్మాన్ బలి..

JC Prabhakar Reddy: వాటా ఇవ్వాల్సిందే.. దుమారం రేపుతున్న జేసీ మాటలు..

Harish Rao: నెంబర్ 2 నేనే..!

Vijayasai Reddy EVM: ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయి విజయ్‌సాయిరెడ్డి ట్వీట్.. 2019లో టాంపరింగ్ సాధ్యం కాదని చెప్పిన జగన్!

CID Takes TDP Attack Case: సిఐడీ చేతికి టీడీపీ ఆఫీసుపై దాడుల కేసులు.. విచారణ వేగవంతం

PAC Chairman Arikepudi: పీఏసీ చైర్మన్ పదవిపై హరీష్ రావు రాజకీయాలు.. గట్టి కౌంటర్ కౌంటర్ ఇచ్చిన మంత్రి శ్రీధర్‌బాబు

Big Stories

×