EPAPER

CM Chandrababu: త్యాగాలు చేసిన వీళ్లకి.. చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారా?

CM Chandrababu: త్యాగాలు చేసిన వీళ్లకి.. చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారా?

CM Chandrababu: కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు. వైసీపీ ప్రభుత్వం వేధింపులు, పోలీసు కేసులు భరించి కేడర్‌ని కాపాడుకోవడానికి అష్టకష్టాలు పడ్డారు. తీరా ఎన్నికల టైంకి ఈక్వేషన్లు మారిపోయి కొందరు టికెట్లు దక్కకపోయినా అభ్యర్ధుల గెలుపు కోసం కృషి చేశారు. వారందని కష్టం ఫలించి కూటమి ప్రభుత్వం బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. దాంతో ఇక తమకు మంచి రోజులు వస్తాయని వస్తాయని భావించారు సదరు నాయకులు. అయితే నెలలు గడిచిపోతున్నా తమకు సుముచిత న్యాయం జరగకపోతుండంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారంట.


వైసీపీ హయాంలో విషమ పరీక్షలు ఎదుర్కొన్న టీడీపీ శ్రేణులు

వైసీపీ ప్రభుత్వం ఉన్న అయిదేళ్లు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు విషమ పరీక్షలు ఎదుర్కొన్నారు. జగన్ సర్కారులో తీవ్ర వేధింపులకు గురై ఆస్తులు కోల్పోయిన నాయకులు కూడా టీడీపీలో ఉన్నారు. కేసులు పాలై జైలు జీవితాలు గడిపారు. అన్నిటినీ భరిస్తూ టికెట్లు వచ్చినా రాకపోయినా కూటమి విజయానికి కృషి చేశారు. అటువంటి వారంతా కూటమి ప్రభుత్వం వస్తే తమకు సముచిత గౌరవం లభిస్తుందని ఆశలు పెట్టుకున్నారు. అయితే గౌరవం కాదు కదా కనీసం తమ నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ అపాయింట్‌మెంట్లు కూడా దొరకడం లేదని వారి అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


రెండు సార్లు జైలు కెళ్లి వచ్చిన పట్టాభిరామ్

ముఖ్యంగా బోశడీకే వివాదంతో సంచలనం రేపి, జగన్ సర్కార్‌కు టార్గెట్ గా మారి రెండుసార్లు జైలుకు వెళ్లి వచ్చారు టీడీపీ నేత పట్టాభిరామ్, ఆయన ఇంటిపై వైసీపీ శ్రేణులు దాడి చేసి.. నానా ఇబ్బందులూ పెట్టారు. ఎన్నికల్లో ఆయనకు పార్టీ సీట్ ఇస్తుందని అంతా భావించారు.. కానీ సీటివ్వలేదు. కనీసం పార్టీ అధికారంలోకి వచ్చాక.. ఏదైనా మంచి పోస్ట్ ఇస్తారని భావించారు. ఇంతవరకూ ఎలాంటి పోస్ట్ ఇవ్వకపోవడంపై ఆ పార్టీలోనే తీవ్రమైన చర్చ జరుగుతోంది. పట్టాభి నేరుగా పార్టీ అధిష్టానం దగ్గర అసంతృప్తిని వ్యక్తం చేయకపోయినప్పటికీ.. సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారంట.

వైసీపీ హయాంలో వేధింపులకు గురైన దేవినేని ఉమ

ఇక మాజీ మంత్రి దేవినేని ఉమ.. జగన్ పాలనలో అనేక వేధింపులకు గురయ్యారు. రెండు సార్లు జైలుకు వెళ్లారు.. కష్టకాలంలో పార్టీ వెన్నంటే ఉన్నారు. కానీ చివరికి ఆయనకు సొంత నియోజకవర్గం మైలవరం టికెట్ కూడా దక్కలేదు. వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణప్రసాద్ కు సీటు ఇచ్చినప్పటికీ దేవినేని ఉమ పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పార్టీ కోసం పనిచేశారు.. మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ విజయానికి కృషి చేశారు.  పార్టీ అధికారంలోకి వచ్చాక దేవినేనికి పెద్ద పోస్ట్ ఏదో ఇస్తారని అంతా భావించారు. కానీ అయిదు నెలలు గడుస్తున్నా ఉలుకూపలుకూ లేకపోవడం. మాజీ మంత్రిని చంద్రబాబు పట్టించుకోక పోవడంపై పార్టీలో పెద్ద చర్చే జరుగుతుంది.

Also Read: జనావాసాల మీద దాడులు చేస్తున్న వన్యమృగాలు.. కారణాలు ఇవేనా?..

5 నెలలు అవుతున్నా మాజీ మంత్రిని పట్టించుకోని సీఎం

మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నదీ అదే పరిస్థితి.. జగన్ సీఎంగా ఉన్నపుడు డైరెక్ట్‌గా ఆయన్నే టార్గెట్ చేస్తూ అనేక వేధింపులకు గురయ్యారు.  బుద్దా వెంకన్నపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. చంద్రబాబు ఇంటిపై అప్పటి మంత్రి జోగి రమేష్ దాడికి వెళ్లినపుడు బుద్దా వెంకన్న తన అనుచరగణంతో వెళ్లి అడ్డుకున్నారు అంతేగాదు పార్టీ వాయిస్‌లా మారి.. వైసీపీ విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టేవారు. చివరికి ఎన్నికల సమయంలో.. తన రక్తంతో చంద్రబాబు గెలవాలని గోడలమీద రాశారు. బుద్దా వెంకన్న విజయవాడ పశ్చిమ సీటు ఆశించినప్పటికీ పొత్తు లెక్కలతో అది దక్కలేదు. అలా ఎన్నికల్లో పోటీ చేయలేకపోయిన మాజీ ఎమ్మెల్సీ ఇంత వరకు ఎలాంటి పదవి దక్కక పోవడంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట.

కొడాలి నానిపై పోరాటం చేసిన రావి వెంకటేశ్వరరావు

గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు.. అప్పటి మంత్రి కొడాలి నానిపై పోరాటం చేసి పార్టీకి అండగా నిలిచారు. ఆయన దాడులకు గురై ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఆయనకు గత రెండు సార్లుగా గుడివాడ టికెట్ దక్కలేదు. 2019 ఎన్నికల్లో దేవినేని అవినాష్ కోసం సీటు త్యాగం చేయాల్సి .. 2024లో అమెరికా నుంచి వచ్చిన వెనిగళ్ల రాముకు టీడీపీ టికెట్ దక్కితే ఆయన తరఫున ఎన్నికల్లో ప్రచారం చేశారు. అలాంటి వ్యక్తికి ఇంతవరకూ ఎలాంటి పదవి ఇవ్వకపోవడంపై ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఆరోసారి పొన్నూరు ఎమ్మెల్యేగా గెలిచిన ధూళిపాళ్ల

జగన్ సర్కార్ లో తీవ్ర ఇబ్బందులకు గురైన మరో నేత దూళిపాళ్ల నరేంద్ర.. తాను అధ్యక్షుడిగా ఉన్న సంగండైరీపై జగన్ అనేక దాడులు చేయించినా తట్టుకున్నారు. అనేక సార్లు జైలు కెళ్లారు.. అప్పటి జగన్ సర్కార్ను ఎండగట్టడంలో, వైసీపీ ప్రభుత్వ అన్యాయాలను ఆధారాలతో సహా బయటపెట్టడంలో కీలకపాత్ర పోషించారు. మొన్నటి ఎన్నికల్లో పొన్నూరు నుంచి ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ధూళిపాళ్ల నరేంద్రకు ఈ సారి కూడా మంత్రి పదవి దక్కలేదు. అంత సీనియర్ అయిన నరేంద్రకు మంత్రి పదవి దక్కకపోవడం పొన్నూరు తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు.

గౌతు శిరీషను తీవ్రంగా వేధించిన సిదిరి అప్పలరాజు

టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నపుడు అప్పటి మంత్రి సిదిరి అప్పలరాజు కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు పలాస ఎమ్మెల్యే గౌతుశిరీష. అనేక విధాలుగా నష్టపోయారు. పార్టీ వాయిస్ ను వినిపించడంలో శిరీష ముందు వరసలో ఉంటారు.  ఆమెకు మంత్రి పదవి వస్తుందని శ్రీకాకుళం వాసులు ఆశించారు. ఆమె అనుచరులు కూడా చాలా నమ్మకం పెట్టుకున్నారు. అయితే శిరీషకు కేబినెట్ బెర్త్ దక్కలేదు. పెనుగొండ నుంచి మొదటి సారి పోటీ చేసి గెల్చిన సవిత లాంటి వారికి మంత్రి పదవి ఇచ్చారు గానీ తనకు ఇవ్వలేదని ఆవిడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారంట.

పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేసిన వర్మ

మరో ఇంపార్టెంట్ లీడర్ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ .. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఖచ్చితంగా మంత్రిని చేస్తారని ఆయన అనుచరగణం భావించింది. అయితే అధికారంలోకి వచ్చాక మూడు ఎమ్మెల్సీ పదవుల్ని అయితే భర్తీ చేశారు కాని వర్మకు మాత్రం అవకాశం ఇవ్వలేదు. కనీసం మంత్రి వర్గం రేసులో కూడా ఆయన పేరు వినిపించలేదు. వీళ్లు కేవలం ఉదాహరణ మాత్రమే.. ఇలా పార్టీకోసం త్యాగాలు చేసి.. ఆస్తులు నష్టపోయి జైలుపాలైన ఎంతోమంది నేతలు, కార్యకర్తలు ఇప్పుడు పార్టీపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కనీసం నామినేటెడ్ పోస్టులు కూడా ఇవ్వడం లేదని ఆవేదన చెందుతున్నారు. మరి వారి వారి వేదనకు అధిష్టానం ఎప్పటికి తెరదించుతుందో చూడాలి.

Related News

Domestic Violence: వీళ్లేం మగాళ్లండి బాబు, భార్యలు అలా చేస్తే కొట్టేస్తారట.. మీరు ఇంతేనా?

Wild Animals Attacking Humans: జనావాసాల మీద దాడులు చేస్తున్న వన్యమృగాలు.. కారణాలు ఇవేనా?..

YS Jagan Vs YS Sharmila: నీకు చోటు లేదు.. జగన్‌కి షర్మిల ఝలక్

YS Jagan: విజయసాయిరెడ్డికి జగన్ కీలక పదవి.. తట్టుకోలేకపోతున్న ఆ నేత..

Maharashtra Politics: అన్ని రాష్ట్రాలు పాలిటిక్స్ ఒక్కవైపు.. మహారాష్ట్ర పాలిటిక్స్ మరోవైపు!

Israel–Hamas war: ఇజ్రాయెల్ చేతిలో హమాస్ లీడర్లు.. వీళ్లందర్నీ ఎలా హతమార్చింది?

Big Stories

×