EPAPER
Kirrak Couples Episode 1

Train Accidents Tragedy: మృత్యుశకటంలా రైలు ప్రయాణం.. వరుస ప్రమాదాలకు కారణాలేంటి..?

Train Accidents Tragedy: మృత్యుశకటంలా రైలు ప్రయాణం.. వరుస ప్రమాదాలకు కారణాలేంటి..?

Train Accidents Tragedy: ఆనందం.. ఆహ్లాదం.. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం. పైగా అలుపు తెలియదు. నైట్ ఎక్కేసి బిస్తర్ వేశామంటే.. తెల్లారి గమ్యస్థానం చేరుకున్నాకే మెలకువ. రైలు ప్రయాణమంటే ఇప్పటివరకు గుర్తుకొచ్చేది ఇదే. బట్ ఇప్పుడు మన ఆలోచన విధానం మారుతుంది. ఇంతకుముందు చెవులకు ఆనందంగా వినిపించే ట్రైన్ శబ్ధం.. ఇప్పుడు యమరాజు వెహికల్‌ హారెన్‌గా వినిపిస్తుంది. వరుస ప్రమాదాలతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇండియన్ రైల్వేస్‌ పరిస్థితి ఎందుకిలా తయారైంది..? అసలు బెంగాల్‌లో జరిగిన ట్రైన్‌ ట్రాజెడీకి రీజనేంటి ?


సమయం ఉదయం 8 గంటల 55 నిమిషాలు.. వెస్ట్‌ బెంగాల్ జల్ పై గురి లో కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ను వెనక నుంచి ఓ గూడ్స్ ట్రైన్‌ ఢీ కొట్టింది. ప్రమాద తీవ్రత ఎంతలా ఉందంటే.. ప్యాసింజర్‌ ట్రైన్‌ కోచ్ ఏకంగా ఇంజిన్‌ పైకి ఎక్కేసింది. బోగీలన్ని చెల్లాచెదురుగా పడిపోయాయి. 15 మంది చనిపోయారు.. ఈ కౌంట్ మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఎందుకంటే హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఇది ప్రమాదానికి సంబంధించిన రిపోర్ట్.

అసలు ఇండియాలో రైలు ప్రమాదాలు ఎందుకు పెరుగుతున్నాయి.. ? వరుస ప్రమాదాలు ఇండియన్ రైల్వేస్‌కు ఎందుకు గుణపాఠంలా మారడం లేదు? ఇది ప్రజలు ఇండియన్‌ రైల్వేశాఖకు వేస్తున్న ప్రశ్న. నిజానికి ఇండియన్‌ రైల్వేస్ నెట్‌వర్క్‌ అనేది ప్రపంచంలోనే పెద్దదనే చెప్పాలి. కానీ ఎవరికి వారు వారి పనులను పర్‌ఫెక్ట్‌గా చేస్తేనే మొత్తం ఈ నెట్‌వర్క్‌ సరిగా నడిచినట్టు.. కానీ అలా జరుగుతుందా? అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే.. గడచిన ఏడాదిన్నరగా చాలా ప్రమాదాలు జరిగాయి. వందలాది మంది తమ గమ్యస్థానానికి చేరకుండానే ప్రాణాలు వదిలారు.


Also Read: బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం.. రెండు రైళ్లు ఢీ..గాల్లోకి లేచిన బోగీలు

రైలు ప్రమాదం అంటేనే రీసెంట్‌గా అందరికి గుర్తొచ్చేది ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన దారుణం. మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టాయి. దాదాపు 300 మందిని పొట్టన పెట్టుకోగా.. మరో 900 మందికి గాయాలు చేసింది ఈ ప్రమాదం. ఆ తర్వాత ఏపీలో జరిగిన విశాఖ – పలాస.. విశాఖ-రాయగడ ప్యాసింజర్ రైళ్లు ఢీ కొన్న ఘటన. ఈ ప్రమాదంఓ 14 మంది చనిపోయారు. ఆ తర్వాత బీహార్‌లోని బక్సర్‌లో పట్టాలు తప్పిన నార్త్‌ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్. పట్టాలు తప్పిన రైళ్లు.. రైళ్లలో అగ్ని ప్రమాదాలు. ఇలా చెప్పుకుంటే అనేకం ఉన్నాయి.

ఒకే ట్రాక్‌పైకి రెండు రాళ్ల రావడం, సిగ్నల్స్‌లో సమస్యలు, సిగ్నల్‌ను జంప్‌ చేయడం, ట్రైన్ ప్రమాదాలకు మెజారిటీ కారణాలు ఇవే. వందలాది ప్రాణాలు పోవడానికి ఇదే కారణం. బెంగాల్ ప్రమాదానికి కూడా సిగ్నల్‌ జంపే కారణం. ప్రమాదం జరిగిన రూట్‌ మొత్తం ఆటోమెటిక్‌ సిగ్నలింగ్ వ్యవస్థ ఉన్న ప్రాంతం. ఈశాన్య రాష్ట్రలను కలిపే రైల్వే లైన్ అది.. అత్యంత బిజీగా ఉండే రూట్‌ కూడా. మరి లోకో పైలెట్‌ను సిగ్నల్‌ను గమనించలేదా ? లేక గమనించి కూడా పట్టించుకోలేదా ? కారణమేంటో తెలీదు కానీ.. వెనక నుంచి రావడం.. వేగంగా ఢీకొట్టడం.. క్షణాల్లో జరిగిపోయింది. అంతే వేగంగా ప్రయాణీకుల ప్రాణాలు కూడా పోయాయి. ఈ ప్రమాదంలో అత్యంత వేగంగా ప్రాణాలు కోల్పోయినవారు గూడ్స్‌ ట్రైన్‌ లోక్‌ పైలెట్, అసిస్టెంట్ లోకో పైలెట్, కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ గార్డ్‌. సో ఇది మానవ తప్పిదం కారణంగా జరిగిన ప్రమాదం అని తెలిసిపోతుంది.

Also Read: Jagan on EVM’s Voting : బ్యాలెట్‌ ఉండగా.. ఈవీఎం ఎందుకు దండగ ? అప్పుడలా.. ఇప్పుడిలా.. అలా ఎలా జగన్ ?

ఇలాంటి ప్రమాదాలు జరిగిన ప్రతిసారీ అందరికి ఒకటి గుర్తొస్తుంది. అదే కవచ్ సిస్టమ్. రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చి ఢీ కొట్టకుండా తీసుకొచ్చిన వ్యవస్థ ఇది. కేంద్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా దీనిని తీసుకొచ్చింది. గతంలో కేంద్ర మంత్రి వీడియో ప్లే చేసి మరి చూపించారు. కానీ ఇలాంటి ప్రమాదాలు జరిగిన ప్రతిసారి అసలు ఈ వ్యవస్థ ఏమైందన్న ప్రశ్న తెరపైకి వస్తుంది. అసలు ప్రతిష్టాత్మకమైన కవచ్ టెక్నాలజీ పని చేస్తుందా..? లేదా? సమాధానం రైల్వేశాఖనే చెప్పాలి. పనిచేస్తే ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయి.? భద్రత విషయంలో రైల్వే శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందా..? లోకో పైలెట్‌ సిగ్నల్ జంప్‌ చేస్తే ఇక ప్రయాణీకుల ప్రాణాలు గాల్లో పెట్టిన దీపాలేనా?అనే ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి.

నిజానికి మన దేశంలో చాలా మంది ప్రయాణించడానికి ఉపయోగించే ఏకైక సాధనం రైల్వే. బస్సు, విమానాల్లో టికెట్‌ ధరలతో పోలిస్తే ట్రైన్ టికెట్ చాలా చీప్‌. ఇక జర్నీ కూడా చాలా కంఫర్టబుల్‌గా ఉండటం కూడా దీనికి రీజన్. అంతేకాదు రోడ్ జర్నీతో పోలిస్తే.. ప్రమాదాల శాతం కూడా చాలా తక్కువ అని ప్రయాణికులు నమ్ముతారు. రైల్వేశాఖ ఇకనైనా ఈ ప్రమాదాల నుంచి గుణపాఠాలు నేర్చుకొని భద్రతా పరమైన చర్యలపై ఫోకస్ చేస్తేనే ప్రజలకు రైల్వేలపై ఉన్న నమ్మకం పోకుండా ఉంటుంది.

Related News

President Draupadi Murmu : రేపు హైదరాబాద్‌కు రాష్ట్రపతి ముర్ము.. ఈ మార్గాల్లో వెళ్తే అంతే సంగతులు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జోలికొచ్చి బుక్కైన నానీలు..

Russia Vs Ukraine War: దూసుకొస్తున్న రష్యా మిస్సైల్? వణికిపోతున్న ఉక్రెయిన్

YS Jagan vs Botsa Satyanarayana: వైసీపీ నేతల పార్టీ మార్పు వెనుక బొత్స వ్యూహం ఉందా?

Irregularities: జూబ్లీహిల్స్‌లో బయటపడ్డ మరో భారీ బాగోతం.. 36 ఏండ్ల నుంచి..

Alla Nani: వైసీపీ రాజీనామా నేతలకు జనసేన డోర్లు తెరుచుకుంటాయా ? ఆళ్ల నాని పరిస్థితి ఏంటి ?

Hydra Demolitions: కూల్చివేతలపై భిన్న స్వరాలు.. కేసీఆర్ అలా.. కేటీఆర్ ఇలా..

Big Stories

×