EPAPER

Mopidevi Shocks Jagan: టీడీపీలో చేరిన మోపిదేవి.. వాన్‌పిక్ కేసుల భయంలో జగన్!

Mopidevi Shocks Jagan: టీడీపీలో చేరిన మోపిదేవి.. వాన్‌పిక్ కేసుల భయంలో జగన్!

Mopidevi Shocks Jagan| వైసీపీ ఓటమి తర్వాత ఆ పార్టీ నుంచి వలసలు పెరిగిపోయాయి … జగన్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగిన నేతలు, ఆఖరికి ఆయన బంధువులు కూడా గుడ్ బై చెప్పి వెళ్లిపోతున్నారు … కనీసం వారిని ఆపే ప్రయత్నం కూడా మాజీ ముఖ్యమంత్రి చేయడం లేదు… వలసల గురించి జగన్ ఎప్పుడూ మాట్లాడలేదు… పోతే పోయారు అన్నట్లు వ్యవహరిస్తూ వచ్చారు.. అయితే తాజాగా మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరారు… మోపిదేవి గురించి మాత్రం జగన్ తెగ బాధపడి పోయారు … అసలు మోపిదేవి విషయంలో జగన్‌కి అంత ప్రత్యేకత ఏంటి?


మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ … మూడున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ఆయన కేరీర్ ఆద్యంతం ఆసక్తికరమే … 1989లో మొదటి సారి కాంగ్రెస్ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసిన ఆ మత్య్సకార సామాజికవర్గం నేత కూచినపూడిలో పరాజయం చవి చూశారు… ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించినప్పటికీ ఆయన మాత్రం ఓడిపోవడం విశేషం .. తర్వాత 1994లోనూ ఆయనకు అదృష్టం కలిసిరాలేదు … తర్వాత 1999లో అదే కూచిన పూడి నుంచి ఆయన గెలిచినప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటమి పాలైంది.

2004లో కూచినపూడి నుంచి రెండో సారి గెలిచిన మోపిదేవి 2009 నాటికి రేపల్లెకు షిఫ్ట్ అయి విజయం సాధించారు. వైఎస్, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు … కిరణ్ హయాంలో మంత్రిగా కొనసాగుతున్న టైంలోనే మోపిదేవికి బ్యాడ్ టైం మొదలైంది … వైఎస్ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు జగన్‌ చేసిన తప్పిదాలకు సహకరించినందుకు ఆయన వాన్‌పిక్‌ కేసులో ఇరుక్కున్నారు… సీబీఐ మోపిదేవిని(Mopidevi Venkataramana) నిందితుడిగా చేర్చడంలో ఆయన మంత్రి పదవి వదులు కోవాల్సి వచ్చింది … జగన్‌తో కలిసి ఆయన 16 నెలలకు పైగా జైలు జీవితం గడిపారు.


Also Read: జగన్ తీరు అప్పుడలా.. ఇప్పుడిలా.. ఇండియా కూటమి వైపు చూపులు?

2019 ఎన్నికల్లో వైసీపీ హవా నడిచినా మోపిదేవి మాత్రం ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఆ బీసీ నేతని ఎమ్మెల్సీని చేసిన జగన్ మంత్రి పదవి కూడా ఇచ్చారు… అదే సమయంలో శాసనమండలిలో వైసీపీకి బిల్లులు పాస్ చేయించుకునే బలం లేకపోవడం … మూడు రాజధానుల బిల్లు తిరస్కరణకు గురవ్వడంతో అసలు మండలినే రద్దు చేస్తానని జగన్ ప్రకటించారు. ఆ క్రమంలో మోపిదేవిని రాజ్యసభకు పంపించారు … అయితే మొన్నటి ఎన్నికల్లో మోపిదేవి రేపల్లె నుంచి పోటీ చేయాలని భావించినప్పటికీ జగన్ టికెట్ ఇవ్వలేదు.

ఆ అసంత‌ృప్తితోనో… లేకపోతే తనను జైలు పాలు చేయిచారన్న కోపంతోనో మోపిదేవి వైసీపీ ఓటమి తర్వాత వైసీసీకి గుడ్ బై చెప్పేసి.. తాజాగా టీడీపీలో చేరిపోయారు. తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా సమర్పించారు … వైసీపీ ఓటమి తర్వాత చాలా మంది సీనియర్ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేశారు… మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, జగన్ బంధువు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వంటి నాయకులు రాజీనామా చేసినప్పుడు కూడా జగన్ పెద్దగా స్పందించలేదు … అయితే మోపిదేవి రాజీనామాపై మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

మోపిదేవి వెంకటరమణ విషయంలో ఎప్పుడూ తప్పు చేయలేదు. ఆయనకు అన్నీ మంచే చేశా.. ఎక్కడా తక్కువ చేయలేదని జగన్ వ్యాఖ్యానించారు. మోపిదేవి పార్టీని వీడి వెళ్లడం బాధాకరం అని వైసీపీ అధ్యక్షుడు తెగ బాధపడిపోయారు. తాడేపల్లి ప్యాలెస్‌లో రేపల్లె నియోజకవర్గం నేతలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై ఆ సెగ్మెంట్‌కి కొత్త ఇన్చార్జ్‌ని ప్రకటించారు.

జగన్ ఒక్క మోపిదేవి గురించి మాత్రమే అంతలా బాధపడటం చర్చనీయాంశంగా మారింది. జగన్ ఇప్పుడు జాతీయ స్థాయిలో ఏ కూటమిలో లేరు. రాష్ట్రంలో కూడా ఒంటరిగానే ఉన్న ఆయనపై సీఐడీ, ఈడీ పెట్టిన అక్రమాస్తుల కేసులు విచారణలో ఉన్నాయి.. సదరు కేసులకు సంబంధించి సహ నిందితుడిగా ఉన్న మోపిదేవి అప్రూవర్‌గా మారితే జగన్ ఇరుక్కోవడం ఖాయం.. అప్పట్లో పెట్టబడుల శాఖ మంత్రిగా పనిచేసిన మోపిదేవికి వాన్ పిక్ భూముల కేసులో లొసుగున్నీ తెలుసు… ఇప్పుడా భయాందోళనలతోనే జగన్ అంత బాధ వ్యక్తం చేస్తున్నారంట. మరిప్పుడు జగన్‌కు రాజకీయ ప్రత్యర్ధిగా మారిన మోపిదేవి ఆయన భవిష్యత్తును ఎలా నిర్ధేశిస్తారో చూడాలి.

Related News

Kakinada News: భార్య వేధింపులు.. భర్త ఆత్మహత్యాయత్నం, సంచలనం రేపిన ఘటన ఎక్కడ?

Devaragattu Banni festival: దేవరగట్టులో బన్నీ ఉత్సవం.. కర్రల ఫైటింగ్‌లో హింస.. 70 మందికి గాయాలు

Chandrababu Chiranjeevi: సీఎం చంద్రబాబును కలిసిన చిరంజీవి.. అందుకేనా?

Crime News: ఐదేళ్ల బాలికపై అత్యాచారయత్నం.. గమనించిన యువతి.. ఆ తర్వాత.. ?

Sri Sathya Sai Incident : హిందూపురంలో దారుణం… స్పందించిన బాలకృష్ణ ఏమన్నారంటే!

CM Chandrababu : ప్రజా అభివృద్ధే ధ్యేయంగా సీఎం ప్రయత్నాలు.. నిత్యావసర సరుకులపై కీలక నిర్ణయం

Crime News: దారుణం.. అత్తాకోడలిపై అత్యాచారం.. దుండగుల కోసం పోలీసుల గాలింపు

Big Stories

×