EPAPER

Donald Trump VS Kamala Harris: ట్రంప్ కు ఓటమి భయం.. రాజకీయంగా ఎదుర్కోలేక జాతి వివక్ష

Donald Trump VS Kamala Harris: ట్రంప్ కు ఓటమి భయం.. రాజకీయంగా ఎదుర్కోలేక జాతి వివక్ష

US Election 2024, Kamala Harris’ winning odds hit an all time high against Trump:
అదేంటీ, అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ట్రంపే అని టాక్ నడుస్తుంటే.. ఆయన కథ ఎలా అడ్డం తిరుగుంది అనే సందేహం రావచ్చు. ఇక్కడే, ట్రంప్‌కు పెద్ద ట్విస్ట్ వచ్చింది. కమలా హ్యారిస్ తన ఆటోబయోగ్రఫీలో తాను ఏ జాతికి చెందిన వ్యక్తో స్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పుడు దానికి విరుద్ధంగా ట్రంప్ వ్యాఖ్యానాలు ఉన్నాయి. అందులోనూ, అమెరికా స్థాపనలోనే పలు జాతుల మిశ్రమం ఉంది. అలాంటి చోట ట్రంప్ జాత్యహంకార వ్యాఖ్యలు అసలుకే మోసం తెచ్చేలా ఉన్నాయి.


ఇప్పుడు, ట్రంప్ చేసిన కంపుతో నల్లజాతీయులతో పాటు అమెరికా ఎన్నికల్లో కీలక ఓటర్లుగా ఉన్న భారతీయులు కూడా ఆలోచనలో పడ్డారు. ఇప్పుడే ఇలా ఉంటే.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకెలా ఉంటుందో అనుకుంటున్నారు. అయితే, గతంలోనూ జాతి ప్రాతిపదికన తన ప్రత్యర్థులపై దాడి చేసిన చరిత్ర ట్రంప్‌కు ఉంది. అమెరికా తొలి నల్లజాతి అధ్యక్షుడైన బరాక్ ఒబామా.. అమెరికాలో పుట్టలేదని ఒకప్పుడు తప్పుడు ఆరోపణలు చేశారు ట్రంప్. అలాగే, ఐక్యరాజ్య సమితి మాజీ రాయబారి, ఒకప్పటి తన రిపబ్లికన్ ప్రాధమిక ప్రత్యర్థి నిక్కీ హేలీని ఉద్దేశిస్తూ… ఆమె జన్మించినప్పుడు తన తల్లిదండ్రులు అమెరికా పౌరులు కాదు కాబట్టి, ఆమె అధ్యక్షురాలిగా గెలవలేకపోయిందని ట్రంప్ పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే, కమలా హ్యారిస్ డెమోక్రటిక్ అభ్యర్థిగా మారినప్పటి నుండి వరుస దాడులు చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. కమలా హ్యారిస్ విద్యార్హతలపై కూడా ట్రంప్ దాడి చేశారు. ఆమె తన న్యాయవాద వృత్తిలో బార్ పరీక్షలో ఫెయిల్ అయ్యిందని ఎద్దేవా చేశారు. “తన బార్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదనీ… ఆమె పాస్ అవుతుందని ఆమే అనుకోలేదనీ.. ఏమి జరిగిందో నాకు తెలియదు గానీ.. బహుశా ఆమె ఉత్తీర్ణులై ఉండవచ్చు అంటూ నోటికొచ్చింది వాగారు. అయితే, కమల హ్యారిస్ 1989లో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా హేస్టింగ్స్ కాలేజ్ ఆఫ్ లా నుండి పట్టభద్రుడయ్యారు. ఇక, కమలా హ్యారిస్‌కు వస్తున్న మద్దతును తగ్గించడానికి ట్రంప్ ఇలాంటి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విశ్లేషకులు కూడా ఒప్పుకుంటున్నారు.


ఇటీవల, ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లోని బిలీవర్స్ సమ్మిట్‌లో ప్రసంగిస్తూ, కమలా హ్యారిస్‌ను ఉద్దేసించి.. ఆమె ఒక “బమ్” అని ట్రంప్ వ్యాఖ్యినించినప్పుడు కూడా ఇదే రచ్చ జరిగింది. ఈ అభ్యర్థిత్వాన్ని ఆమె అడుక్కొని తెచ్చుకున్నారనీ, ఆమె ఒక లూజర్ అని వ్యాఖ్యానించారు ట్రంప్. మరో సందర్భంలో కమలా హ్యారిస్‌ పేరును ప్రస్తావిస్తూ ట్రంప్ రేసిజాన్ని రెచ్చగొట్టారు. ఆమె పేరును ప్రస్తావించినప్పుడు ఉద్దేశపూర్వకంగా తడబడినట్లు నటించాడని విమర్శలు ఎదుర్కున్నారు. “ఆమె పేరు చెప్పడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఆమె పేరు ఎలా పలకాలో తన సిబ్బంది తనకు వివరిస్తూ.. ‘కామా-లా.. కహ్-మాలా అని ఎలాగైన చెప్పవచ్చు’ అని అన్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఆమె పేరును ఏడు రకాలుగా పలకొచ్చనీ.. కావాలంటే చాలా రకాలుగా పిలవొచ్చని హేళనగా మాట్లాడారు.

Also Read:  జర్నలిస్టులపై మరోసారి మండిపడ్డ డొనాల్డ్ ట్రంప్!

అయితే, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న రేసిస్ట్ వ్యాఖ్యలకు కమలా హ్యారిస్ గతంలోనే వివరణ ఇచ్చేశారు. ఆమె తన ఆత్మకథలో కూడా తన గుర్తింపును వెల్లడించారు. కాలిఫోర్నియాలోని ఓక్లాండ్‌లో ఇద్దరు వలస తల్లిదండ్రులకు జన్మించారు కమల హ్యారిస్. భారతదేశంలో జన్మించిన తల్లి, జమైకాలో జన్మించిన తండ్రి. భారత, ఆఫ్రికన్ మూలాలతో కమల జననం జరిగింది. అయితే, ఆమె ఐదు సంవత్సరాల వయస్సులో తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు.

తర్వాత, హిందువైన కమల తల్లి శ్యామలా గోపాలన్ హ్యారిస్ దగ్గర ఇద్దరు పిల్లలూ పెరిగి పెద్దయ్యారు. అయితే, తన తల్లి ఓక్లాండ్ నల్లజాతి సంస్కృతిని స్వీకరించిందని తన ఆటోబయోగఫ్రీ ‘ది ట్రూత్ష్ వి హోల్డ్’ కమలా హ్యారిస్ పేర్కొన్నారు. అలాగే, తనతో పాటు తన సోదరి మాయను కూడా నల్లజాతి సంస్కృతిలోనే పెంచారని స్పష్టం చేశారు. ఆమెను దత్తత తీసుకున్న మాతృభూమి తననూ, తన సోదరి మాయను నల్లజాతి అమ్మాయిలుగా చూస్తుందని తన తల్లికి తెలుసునని వెల్లడించారు. మేము గర్వించదగిన నల్లజాతి మహిళలుగా ఎదగాలని తన తల్లి నిశ్చయించుకున్నట్లు పేర్కొన్నారు.

నిజానికి, కమలా హ్యారిస్‌కు ఉన్న ద్విజాతి మూలాలు, పెంపకం చాలా మంది అమెరికన్లతో వారు కలగలిసిపోవడాన్ని ధ్రువీకరిస్తోంది. ఇది అమెరికాలో తనకు మద్దతును ఆకర్షించడానికి భారీగా పనిచేసింది. గత ఎన్నికల్లోనూ ఇది నిరూపితమయ్యింది. అమెరికా వ్యాప్తంగా వేగంగా మారుతున్న జనాభాలోని తేడా ఆ ప్రాంత రాజకీయాలను మార్చడానికి తగినంత సానుకూలంగా ఉన్నాయనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే కమలా హ్యారిస్‌ను అమెరికాలో మార్పుకు చిహ్నంగా చూస్తున్నారు.

అందుకే, కమలా హ్యారిస్ వైట్ హౌస్ రేస్ ప్రారంభించిన తర్వాత.. నల్లజాతి ఓటర్లు, అమెరికావాసులుగా ఉన్న ఇతర రంగుల వారు కొత్త ఉత్సాహాన్ని ప్రదర్శించారు. జులై 30న విడుదల చేసిన రాయిటర్స్-ఇప్సోస్ పోల్ ప్రకారం.. పోల్ మార్జిన్ ఆఫ్ ఎర్రర్‌లో హారిస్ ట్రంప్‌పై 43-42 శాతం ఆధిక్యంలో ఉన్నారు. అలాగే, జులై 22, 23 తేదీల్లో నిర్వహించిన పోల్ ప్రకారం.. కమలా హ్యారిస్‌కు 44%, డొనాల్డ్ ట్రంప్‌కు 42% మద్దతు వచ్చింది. దీని ప్రకారం కూడా.. ట్రంప్‌కు హ్యారిస్ గట్టి పోటీగా ఉంటారన్నది స్పష్టం అయ్యింది. అందుకే, ట్రంప్ జాతి వివక్షను రెచ్చగొట్టడానికి సిద్దమైనట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు.

నిజానికి, యునైటెడ్ స్టేట్స్ జాతిపరంగా, కమ్యూనిటీల పరంగా భిన్నమైన జనాభాను కలిగి ఉన్న దేశం. ఇక, ఫెడరల్ స్థాయిలో, జాతి, కమ్యూనిటీలను వేరుగా వర్గీకరించారు. ఇటీవలి, యునైటెడ్ స్టేట్స్ జనాభా గణన ప్రకారం, అమెరికా ఐదు రకాల జాతి వర్గాలను గుర్తించింది. వైట్, బ్లాక్, నేటీవ్ అమెరికన్ లేదంటే అలాస్కా నేటీవ్, ఆసియా, నేటీవ్ హవాయి/ఇతర పసిఫిక్ ద్వీపవాసులు. వీరితో పాటు, రెండు లేదా అంతకంటే ఎక్కువ జాతి వర్గాలకు చెందిన వ్యక్తులు కూడా అమెరికాలో ఉన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే, అమెరికాకు ఒక జాతి అంటూ ఎలాంటి గుర్తింపు లేదు. ఎందుకంటే, యునైటెడ్ స్టేట్స్ జాతిలోని విస్తృత భావనను గుర్తిస్తుంది.

Also Read: అల్లర్లకు కారణమైన ఆ గ్రూప్ పై నిషేధం..బంగ్లాదేశ్ కీలకనిర్ణయం

2000 సెన్సస్, 2010 అమెరికన్ కమ్యూనిటీ సర్వేలో.. నేటీవ్ అమెరికన్ల పూర్వీకుల గురించి లెక్కలేశారు. 2020 జనాభా లెక్కలు, నేటీవ్ అమెరికా జాతి మూలాలను లోతుగా ఆరా తీసింది. ఈ ఫలితాలను బట్టి, సెన్సస్ బ్యూరో.. నేటీవ్ అమెరికన్లను, హిస్పానిక్ లేదా లాటినోగా వర్గీకరించింది. ఈ జాతి దేశంలోని మైనారిటీ సమూహాన్ని కలిగి ఉన్న జాతిగా గుర్తించింది. ఇక, ఇలాంటి ఎన్ని లెక్కలు గట్టినా.. అమెరికా ఏ జాతి వారసత్వమూ ఉన్నది కాదనీ, అది జాతుల సమూహంతో స్థాపించిన దేశమని అర్థమవుతుంది. ఇక, అమెరికా లాంటి విభిన్న జాతులున్న ప్రజాస్వామ్య దేశంలో డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న కంపు, ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని అంతా భావిస్తున్నారు.

అయితే, ట్రంప్ వ్యవహార శైలి ఇలాగే కొనసాగితే.. అది ఆయనకే సమస్యగా మారుతుందనే అభిప్రాయం కూడా ఉంది. ఇక, డెమొక్రాటిక్ పార్టీ ఎన్నికల వ్యూహంలో భాగంగానే కమలా హ్యారిస్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది కాబట్టి, ఆమెకు నల్ల జాతీయుల నుండి భారీ మద్దతును ఆశిస్తుంది. దానికి తోడు, ఇప్పుడు ట్రంప్ జాతి వివక్ష మాటలు కూడా కమలా గెలుపుకు ఊతమిచ్చేలా ఉన్నాయి. మరి, డొనాల్డ్ ట్రంప్ రాబోయే రోజుల్లో అయినా తన వ్యవహార శైలిని మార్చుకుంటారో లేదో చూడాలి.

Related News

Nimmala Ramanaidu: నిమ్మల గ్రేట్ జాబ్.. చంద్రబాబు ప్రశంసలు

Kim Jong Un: ఇదేం రూల్ రా నాయనా.. ప్రపంచానికి షాక్ ఇచ్చిన నార్త్ కొరియా

Chakali Ailamma: తెలంగాణ హక్కుల బావుటా.. ఐలమ్మ..!

HYDRA: వాడ్రా రావాలి.. ఓరుగల్లు మారాలి!.. స్వేచ్ఛ స్పెషల్ పార్ట్ 2

Nandigam Suresh: నందిగం సురేష్‌కి.. బిగిస్తున్న ఉచ్చు..

Mahesh Kumar Goud:హేమా హేమీలు పోటీలో ఉన్నా.. టీపీసీసీగా మహేష్ కుమార్ గౌడే ఎందుకంటే?

Kaloji Narayana Rao: తెలంగాణ తొలిపొద్దు.. కాళోజీ..!

Big Stories

×