EPAPER

US Election 2024: క్లైమాక్స్‌లో అమెరికా ఎన్నికలు.. ఆ పార్టీ గెలిస్తేనే భారత్‌కు మేలు..!

US Election 2024: క్లైమాక్స్‌లో అమెరికా ఎన్నికలు.. ఆ పార్టీ గెలిస్తేనే భారత్‌కు మేలు..!

US Election 2024: అసలు, అమెరికాలో ఎలక్టోరల్ కాలేజ్ రేసు చాలా వెరైటీగా ఉంటుంది. అదే అమెరికా ఎన్నికలను క్లిష్టంగా.. అదే సమయంలో ప్రెసిడెంట్ అభ్యర్థికి చాలా అనువుగా మారుతుంది. అందుకే, చివరి క్షణం వరకూ అమెరికా ఎన్నికల్లో టెన్షన్ పీక్స్‌లో ఉంటుంది. వెంట్రుక వాసిలో గెలుపోటములు ఉత్కంఠను రేపుతాయి. ఇప్పుడు కూడా ట్రంప్, హారిస్‌ల మధ్య పోరు అలాగే కనిపిస్తుంది. అయితే, ఈ మధ్యలో అమెరికన్ బిలియనీర్ల పొలిటికల్ స్టాండ్‌పై కూడా చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇది ఎన్నికలపై ప్రభావాన్ని చూపుతాయనే అభిప్రాయం పెరిగింది.


యునైటెడ్ స్టేట్స్ ఎన్నికల ప్రక్రియ భిన్నమైన తీరులో ఉంటుంది. అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికలు ‘ఎలక్టోరల్ కాలేజీ సిస్టమ్’ అనే పద్ధతి ద్వారా నిర్వహిస్తారు. అమెరికాలోని రాష్ట్రాలు.. అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల కోసం నిర్దిష్ట సంఖ్యలో ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను కేటాయిస్తాయి. అయితే, ఒక రాష్ట్రంలో పోలైన అన్ని ఓట్లలో మెజారిటీని గెలుచుకున్న అభ్యర్థి… ఆ రాష్ట్రంలోని అన్ని ఎలక్టోరల్ కాలేజీ సీట్లను కైవసం చేసుకున్నట్లే లెక్క. దీన్ని ‘విన్నర్-టేక్స్-ఆల్ సిస్టమ్’ అని పిలుస్తారు. దీని ప్రకారం, యూఎస్‌లోని మొత్తం 50 రాష్ట్రాల్లో ప్రస్తుతం ఇద్దరు అభ్యర్థులకు 42 రాష్ట్రాల్లో సమానమైన ఎలక్టరోల్ మద్దతు అందుతుంది. కాగా, వాషింగ్టన్ DC కాకుండా మిగిలిన ఏడు స్వింగ్ స్టేట్స్‌లోని 93 సీట్లు కీలకంగా మారాయి. ఇప్పుడు ఈ సీట్లలో వచ్చిన ఓటింగ్ బట్టే ఎవరు విజయం సాధిస్తారో తెలుస్తుంది. నిజానికి, యూఎస్ ఎన్నికల్లో, ఒక అభ్యర్థి ప్రజలు వేసిన ఓటును కూడా గెలవకుండానే అధ్యక్షుడిగా మారొచ్చే లేదంటే మొత్తం పోలైన ఓట్ల సంఖ్యలో మెజారిటీ సాధించినా అధ్యక్షుడిగా గెలవొచ్చు.

2016లో ఎన్నికలనే చూసుకుంటే.. డెమొక్రాటిక్ హిల్లరీ క్లింటన్ కంటే దాదాపు 3 మిలియన్ల ఓట్లు తక్కువ పొందిన ట్రంప్, ప్రెసిడెంట్ అయ్యారు. అయితే, ఇలాంటి పరిస్థితి నాలుగు సందర్భాల్లో మాత్రమే జరిగింది. అమెరికా ఎన్నికల ప్రక్రియపై ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే..ప్రస్తుతం, స్వింగ్ రాష్ట్రాలపై దృష్టి పెట్టడం విజయానికి ఎంత కీలకమో అర్థం చేసుకోడానికి. ఇటీవలి న్యూయార్క్ టైమ్స్ పబ్లిక్ పోల్ ట్రాకర్ ప్రకారం.. ఈసారి ఏడు స్వింగ్ రాష్ట్రాల్లో ట్రంప్, హారిస్ నెక్ టు నెక్ ఫైట్ ఎదుర్కుంటున్నట్లు తెలిసింది. వీళ్లది మధ్య తేడా, మొత్తం ఏడింటిలో గరిష్టంగా ఒక్క శాతం పాయింట్ లేదా రెండు పాయిట్ల లోపల ఉంది. మొదటి నుండీ ఉన్న ఈ వెంట్రుకవాసి తేడా ఎటు మళ్లుతుందా అనేది ఉత్కంఠతను రేపుతోంది.


కొన్ని రిపోర్టుల ప్రకారం.. రిపబ్లికన్లు, డెమొక్రాట్‌లు ఇద్దరికీ తమ వ్యూహాలను మరింత పెంచడానికి చాలా అవకాశాలు ఉండటంతో.. ఈ సమయంలో ఏ పార్టీకి అంత డేంజర్ కండీషన్ లేదు, అలాగని, అంత సులవైన పరిస్థితులు కాదు. అందుకే, చివరి నిమిషంలో స్వింగ్ స్టేట్స్‌లో ఓట్లను లాగడానికి కమల హారిస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. చివరి క్షణాల్లో అమెరికా ఓటర్లు తనకు మద్దతు ఇస్తారని గట్టిగా నమ్ముతున్నారు.

Also Read: ‘యుద్ధం ఆపేందుకు ట్రంప్ సిన్సియర్‌గా కృషి చేస్తారు’.. బ్రిక్స్ సదస్సులో పుతిన్

దీనికి తోడు, బరాక్ ఒబామా, మిచెల్ ఒబామా, హిల్లరీ క్లింటన్ వంటి ఇతర అగ్ర నాయకులు తాము బలపరిచిన అభ్యర్థి కమల హారిస్ కోసం బలంగా ప్రచారం చేస్తున్నారు. ట్రంప్‌కి కూడా భారీగానే మద్దతు అందుతుంది. ఇందులో భాగంగా, అమెరికాలోని బిలియనీర్లు, మ్యూజిక్ స్టార్లు, సెలబ్రిటీలు చాలా మంది ర్యాలీలకు హాజరౌతూ.. వారి అభిమాన అభ్యర్థులకు మద్దతుగా విరాళాలు ఇస్తున్నారు. వీళ్లల్లో బిలియనీర్ల పాత్ర ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది. ఇటీవల, అనూహ్యంగా వీళ్లు బహిరంగంగా పొలిటికల్ స్టాండ్ తీసుకుంటుననారు. టెస్లా ఓనర్ ఎలన్ మస్క్ మొదటి నుండీ ట్రంప్‌కు మద్దతు ఇస్తుండగా.. ఇటీవల, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కమలా హారిస్‌ వైపు మొగ్గారు. అయితే, వీళ్ల మద్దతు, నెక్ నెక్ ఫైట్‌లో భారీ ప్రభావాన్ని చూపుతుందనే అభిప్రాయాలు వస్తున్నాయి.

అమెరికా ఎన్నికల హడావిడి మొదలైనప్పటి నుండీ ఎలన్ మస్క్, డోనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా సోషల్ మీడియాలో సంచలన కామెంట్లు చేస్తూ వచ్చారు. రిపబ్లికన్ శిబిరంలో తన స్థానాన్ని అలాగే ఉంచారు. ఇక, ఇటీవల ‘ఫ్యూచర్ ఫార్వర్డ్‌’ అనే ఎన్జీఓకి బిల్ గేట్స్ $50 మిలియన్ డాలర్లు విరాళంగా అందించారు. అయితే, ఈ సంస్థ కమలా హారిస్‌కు మద్దతుగా నిలుస్తోంది. అయితే, బిల్ గేట్స్ ఇస్తున్న పొలిటికల్ ఫండింగ్ ఆయన చేస్తున్న ఛారిటీ నేపధ్యానికి విరుద్ధంగా కనిపిస్తుందనే వాదనలు కూడా వస్తున్నాయి. మరోవైపు, మార్క్ క్యూబన్, లారెన్ పావెల్ జాబ్స్ వంటి అత్యున్నత వ్యక్తులతో పాటు పలువురు బిలియనీర్లు కూడా కమల హారిస్‌కు మద్దతు ఇస్తున్నారు. కమల హారిస్‌కు సపోర్ట్ ఇస్తున్న బిలియనీర్ల మొత్తంగా 76 మంది ఉన్నారు. అయితే, ఎలన్ మస్క్‌తో పాటు ఇతర ప్రభావవంతమైన ఇన్వెస్టర్ల నుండి ట్రంప్‌కు వస్తున్న మద్దతు కంటే హారిస్‌కు వస్తున్న మద్దతు కాస్త బలంగానే కనిపిస్తుంది.

కమల హారిస్‌‌కు వస్తున్న మద్దతుపై ఇటీవల ఎలన్ మస్క్ కామెంట్ చేస్తూ.. ట్రంప్ రెండో సారి అధికారం చేపడతారనే భయంతోనే హారిస్‌కు బిలియనీర్లు విరాళాలు ఇస్తున్నారంటూ వివాదస్పదాన్ని లేవనెత్తారు. ఇది, కొందరి బిలయనీర్లను సందిగ్థంలోకి నెట్టింది. ఇది సంపన్న వర్గాల మధ్య తీవ్రమైన విభజనకు కారణం అయ్యింది. ఇటీవల, మరో బిలయనీర్ వారెన్ బఫ్ఫెట్ తరుఫున ఓ మెసేజ్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టింది. బిలియనీర్ వారెన్ బఫ్ఫెట్ పెట్టుబడి ఉత్పత్తులలు, రాజకీయ అభ్యర్థులకు మద్దతు ఇవ్వడం గురించి ఫేక్ వార్తలు ప్రచారం అవుతున్నాయనీ.. బఫ్ఫెట్ ప్రస్తుతం పెట్టుబడి ఉత్పత్తులను ఆమోదించడం లేదనీ.. ఏ రాజకీయ అభ్యర్థులకు మద్దతు ఇవ్వట్లేదనీ బెర్క్‌షైర్ హాత్వే చేసిన ప్రకటన తెలియజేసింది. అయితే, ఈ ఎన్నిన్నికలకు ముందు.. 2016లో వారెన్ బఫెట్.. హిల్లరీ క్లింటన్‌కు మద్దతుదారుగా ఉన్నారు. అలాగే, 2012లో డెమోక్రాటిక్ అభ్యర్థి బరాక్ ఒబామాకు మద్దతు ఇచ్చారు. దీన్ని బట్టి, బఫెట్ న్యూట్రల్‌‌గా ఉన్నట్లు ప్రచారం చేసుకున్నా ఆయన హారిస్‌ను బలపరుస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఏది ఏమైనప్పటికీ.. అమెరికా ఎన్నికల ముందస్తు ఓటింగ్‌లో కమలా హారిస్ తన ప్రత్యర్థి ట్రంప్‌కి చెమటలు పట్టించారు. వెంట్రుకవాసిలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రారంభ ఓటింగ్ దశలో కాస్త ముందన్నా.. ట్రంప్, హారిస్ ఇద్దరికీ సమాన ఓటు దక్కిందనే చెప్పాలి. ఇక, అమెరికన్ బిలయనీర్ల ప్రభావంతో నవంబర్‌లో ఉన్న ప్రధాన పోలింగ్‌ ఫలితాలు మారుతాయా లేదా అనేది తేలాల్సి ఉంది.

 

Related News

Domestic Violence Act: గృహహింస చట్టానికి తూట్లు..

Nellore Politics: సై అంటే సై.. నెల్లూరు మంత్రుల మధ్య ఇసుక దుమారం

Mekathoti Sucharitha: వైసీపీకి మరో ‘మేడమ్‌’ గుడ్ బై..

YS Jagan: చిలకా ఏ తోడు లేకా బెంగళూరు వైపు ఒంటరి నడక..?

Iran Israel War: ప్రాణ మిత్రులు బద్ద శత్రువులు ఎలా అయ్యారు? ఇరాన్-ఇజ్రాయెల్ నడుమ చిచ్చు ఎలా మొదలైంది?

Kavitha: కవితకు ఏమైంది? సవాలు చేసి సైలెంట్ అయ్యారు ఎందుకు?

Big Stories

×