EPAPER

Typical Habits: ఎవడి పిచ్చి.. వాడికి ఆనందం..!

Typical Habits: ఎవడి పిచ్చి.. వాడికి ఆనందం..!

Typical Habits: ప్రపంచంలో తమ తమ రంగాల్లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మేధావులు, శాస్త్రవేత్తలు ఎందరో ఉన్నారు. అయితే.. సామాన్యుల మాదిరిగానే వీరికీ తమవైన కొన్ని అలవాట్లున్నాయి. వినటానికి ఆశ్చర్యంగా, కొన్నిసార్లు పరమ రోతగా ఉండే ఈ అలవాట్లున్నప్పటికీ వారంతా వారి రంగాల్లో లెజెండ్స్ అనిపించుకొని చరిత్ర సృష్టించినవారే. అలాంటి కొందరు ప్రముఖులు.. వారికి ఉన్న వింత అలవాట్ల గురించి మీరూ తెలుసుకోండి.


ప్రముఖ తత్వవేత్త, విఖ్యాత రచయిత వోల్టేర్ ఎన్నో గొప్ప గొప్ప గ్రంథాలు రాశారు. ఆయన రోజుకు 40 నుండి 50 కప్పుల కాఫీ తాగేవారు. అలా తాగితే ఆరోగ్యం పాడవుతుందని డాక్టర్లు చెప్పినా.. ఆయన ఆ అలవాటు మానలేకపోయారట. అయినా 83 సంవత్సరాలు జీవించారు.

ప్రముఖ శాస్త్రవేత్త బెంజిమన్ ఫ్రాంక్లిన్ రోజూ ఉదయం 2 గంటలు పూర్తి నగ్నంగా ఒంటరిగా తన గదిలోనే పచార్లు చేసేవారట. అలా చేస్తే కొత్త ఆలోచనలు వస్తాయన్నది తన అభిప్రాయమట.


ప్రముఖ శాస్త్రవేత్త థామస్ అల్వా ఎడిసన్‌ తన వద్ద ఉద్యోగం కోసం వచ్చేవారికి రుచీ పచీ లేని ఓ సూప్ ఇచ్చేవాడు. ఆ టేబుల్ మీద సాల్ట్ డబ్బా కూడా పెట్టేవాడు. ఆ అభ్యర్థిని ‘సూప్‌ఎలా ఉందోయ్’ అని నవ్వుతూ అడిగేవాడు. మొహమాటానికి పోయి.. ‘బాగుంది సార్’ అంటే వాడిని, ‘రుచిగా లేదు’ అన్నవాడినీ పంపేసేవాడు. సూప్ రుచి చూసి.. టేబుల్ మీది సాల్ట్ తీసుకుని కలుపుకుని తాగుతూ.. ‘ ఇప్పుడు ఇది చాలా బాగుంది’ అనేవారికే ఉద్యోగం ఇచ్చేవారు. ప్రయోగం పూర్తి కాకుండానే నిర్ణయాలు తీసుకొనే వారితో తానూ పనిచేయలేననేది ఆయన అభిప్రాయం.

తన జీవితంలో 3000 ఆవిష్కరణలు చేసిన ఈ జపాన్ శాస్త్రవేత్త యోషిరో నకమత్సు తనకు కొత్త ఐడియాలు రానప్పుడు.. స్విమ్మింగ్ పూల్‌లో దిగి గంటల తరబడి ఈత కొడతారట. అలా చేస్తే.. బయటికి రాగానే సరికొత్త ఆలోచనలు వస్తాయని చెప్పేవాడు.

అబ్రహం లింకన్: అమెరికా 16వ అధ్యక్షుడైన లింకన్‌కు ఎవరైనా ‘ఇది చాలా రహస్యం.. మీకు మాత్రమే తెలియాల్సిన విషయం’ అంటూ ఏదైనా డాక్యుమెంట్ ఇస్తే.. ఆయన వెంటనే అటూ ఇటూ చూసి.. టక్కున దాన్ని తన టోపీ కింద పెట్టుకుని ఏమీ జరగనట్టే నడుచుకుంటూ పోయేవారట.

విక్టర్ హ్యూగో: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ రచయిత ఏదైనా రాయాలనుకుంటే.. వెంటనే పనివాళ్లను పిలిచి.. ఒంటిమీది బట్టలతో సహా ఇంట్లో ఉన్న తన బట్టలన్నీ ఇచ్చి… ఉతుక్కురమ్మని పురమాయించేవాడట. అప్పటివరకు అలా నగ్నంగానే ఉంటూ బట్టలు వచ్చేలోపు రచనలో నిమగ్నమయ్యేవాడట.

గ్యాబ్రియెల్ కోకో ఛానల్: పేరు ప్రఖ్యాతులున్న ఈ డ్రెస్ డిజైనర్ బయటికి వెళ్లేటప్పుడు మెడలో ఉన్న ఛైన్‌కు ఓ కత్తెర వేలాడేసుకుని పోయేవాడట. వేరే డిజైనర్లు రూపొందించిన డ్రెస్ వేసుకొని కనిపిస్తే ‘మీ డ్రస్ బాగుంది.. కానీ.. ఇలా కట్ చేసి ఉంటే మరింత బాగుండేది’ అంటూ వారి బట్టలు తన మెడలోని కత్తెరతో కట్ చేసే వాడట. రోజూ జనం చివాట్లు పెడుతున్నా జీవితాంతం ఈ అలవాటు మాత్రం మానలేకపోయాడట.

ఫ్రేడరిక్ షిల్లర్: ప్రఖ్యాత రచయిత అయిన రచయిత తాను కూర్చుని రాసుకునే చోట భయంకరమైన కంపు ఉండాలట. అందుకే ఆయన తన రాతబల్ల డెస్క్‌లో యాపిల్స్ తెచ్చి పడేసేవాడట. అవి బాగా కుళ్లి భరించలేనంత దుర్వాసన వస్తే గానీ.. ఆయన కలం ముందుకు సాగేది కాదట.

హేన్రి ఫోర్డ్: ప్రపంచ సంపన్నుల్లో ఒకడు, కార్ల కంపెనీ యజమాని ఫోర్డ్.. స్ట్రీట్ ఫుడ్ అంటే పడి చచ్చేవాడట. కారులో వెళ్తూ.. ఎక్కడ బడితే అక్కడ ఆగి.. నచ్చిన చిరుతిండి తినేవాడు. అలాగే.. పొలాల్లోని పచ్చగడ్డిని తెప్పించి వాటితో శాండ్విచ్, సలాడ్, సూప్‌లు చేయించి.. రుచిచూసేవాడట.

జార్జ్ గోర్డాన్ బైరన్: ఈ రచయితకు జంతువులంటే ప్రాణం. ఈయన కేంబ్రిడ్జ్‌కి విద్యార్థిగా వెళ్తూ.. కుక్కపిల్లను తీసుకుపోగా, కేంపస్‌లోకి కుక్కలతో రానివ్వం అన్నారట. దీంతో ఏకంగా ఎలుగుబంటి పిల్లను స్టూడెంట్ హాస్టల్‌లో పెంచేవాడట. ఇదీ కుదరదని అధికారులు అనగా, ‘వర్సిటీ రూల్స్ బుక్‌‌లో కుక్కల గురించి ఉందిగానీ.. ఎలుగుబంటి గురించి లేదుగా’ అంటూ లా పాయింట్ లేవనెత్తి.. అక్కడ ఉన్నన్నాళ్లూ.. దానితోనే గడిపాడట.

ఆస్కార్ వైల్డ్: జగమెరిగిన ఈ రచయిత జంతు ప్రేమ మిగిలిన వారికంటే కాస్త ప్రత్యేకంగా ఉండేది. కుక్క, పిల్లి వంటి వాటికి బదులుగా ఈయన పెద్ద ఎండ్రకాయను పెంచేవాడు. అంతేకాదు.. దానినీ తనతో బాటు వాకింగ్‌కు తీసుకుపోయేవాడట. అలాగే థియేటర్‌కు పోయేటప్పడు ఓ తెల్ల ఎలుకను తన కోటులోనే వెంట తీసుకుపోయావాడట.
సారా బెర్న్ హర్డ్ట్: ఈ హాలీవుడ్ నటి తాను ఎక్కడకు వెళ్లినా.. కారులో ఒక శవ పేటికను తీసుకువెళ్లేది. పోయిన చోట.. కాస్త ఖాళీ దొరికితే ఆ శవపేటికను తీసి అందులో పడుకొని.. మర్నాటి షూటింగ్‌లో చెప్పాల్సిన డైలాగుల్ని బట్టీ పట్టేది.

లుడ్విగ్ వాన్ బీథోవెన్: గడ్డం పెంచుకుంటే క్రియేటివ్ ట్యూన్ వస్తాయనే నమ్మకంతో ఈ విఖ్యాత మ్యూజిక్ కంపోజర్ నాలుగైదేళ్లకోసారి గడ్డం గీసుకునేవాడట. అలాగే.. చిరిగిన, నలిగిపోయిన, మాసిపోయిన మురికి దుస్తులు ధరించేవాడట. ఖచ్చితంగా 60 కాఫీ గింజలను అప్పటికప్పుడు గ్రైండ్ చేసి, దాంతో చేసిన కాఫీనే సేవించేవాడట.

డొనాల్డ్ ట్రంప్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి కూడా ఓ చిత్రమైన అలవాటు ఉంది. ఆయన 365 రోజులూ.. తన జేబులో శానిటైజర్ పెట్టుకొని తిరుగుతుంటాడు. ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇవ్వగానే.. ఒక నిమిషం ఆగి శానిటైజర్ లేదా హ్యాండ్ కర్చీఫ్ తీసి.. తన చేతిని క్లీన్ చేసుకుంటూ ఉంటాడు.

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×