EPAPER

Top 10 Earthquakes : ప్రపంచాన్ని వణికించిన 10 భయంకర భూకంపాలు..!

Top 10 Earthquakes : ప్రపంచాన్ని వణికించిన 10 భయంకర భూకంపాలు..!
Top 10 Earthquakes

Top 10 Earthquakes : మనిషి మేధస్సు ప్రకృతి ఆగ్రహం ముందు నిలవటం అన్ని సందర్భాల్లో సాధ్యంకాదు. ముఖ్యంగా భూకంపాల విషయంలో ఇది మరింత నిజం. దీనికి అప్రమత్తత ఒక్కటే పరిష్కారం. గత 60 ఏళ్లలో ప్రపంచాన్ని వణికించిన కొన్ని భయంకర భూకంపాలు, వాటి ప్రభావాల గురించి ఓ లుక్కేద్దాం.


1960, మే 22న చిలీలోలోని వాల్డివియాలో సంభవించిన భూకంపం 1655 మందిని క్షణాల్లో సజీవసమాధి చేసింది. 3 వేల మంది క్షతగాత్రులు కాగా.. 2 లక్షలమంది నిరాశ్రయులయ్యారు. క్షణాల్లో రూ. 430 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ భూకంప తీవ్రత 9.5గా నమోదైంది.

1964, మార్చి 28న అమెరికాలోని అలాస్కాలోని ప్రిన్స్ విలియం సౌండ్ ప్రాంతంలో సంభవించిన భూకంపపు తీవ్రతను 9.2గా అంచనా వేశారు. కెనడాతో సహా పరిసర ప్రాంతాలనూ వణికించిన ఈ భూకంపం ధాటికి అక్కడి భూమి 3 నిమిషాల పాటు ఊగిపోయింది. ముందస్తు జాగ్రత్తలు పాటించినా.. ఈ విపత్తులో 250 మంది మరణించగా, వేలాదిమంది గల్లంతయ్యారు.


2001లో గుజరాత్‌లోని భుజ్‌లో వచ్చిన భూకంప తీవ్రతను 7.7గా అంచనా వేశారు. ఈ భూకంపంతో పట్టణమంతా శిథిలాల కుప్పగా మారింది. కచ్, భుజ్‌లలో 30వేల మంది చనిపోగా, 1.5 లక్షల మంది పలువిధాల నష్టపోయారు.

2005, అక్టోబర్ 8న పాకిస్తాన్‌లోని క్వెట్టాలో సంభవించిన భూకంపంలొ 75 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 80 వేల మంది గాయపడ్డారు. ఈ భూకంప తీవ్రత 7.6గా నమోదైంది.

2012 ఏప్రిల్ 11న ఇండోనేషియాలోని సుమత్రాలో సంభవించిన భూకంప తీవ్రత 8.6గా నమోదైంది. ఈ భూకంపం భారీ విధ్వంసాన్ని సృష్టించింది. ఈ భూకంపంలో 2,27,898 మంది మరణించారు.

2011 మార్చి 11న జపాన్‌లోని ఫుకుషిమాలో సంభవించిన భూకంపం కారణంగా 18 వేల మంది మరణించారు. ఆ వెంటనే వచ్చిన సునామీ కారణంగా లక్షలమంది జీవితాలు కుదేలయ్యాయి.

2019 జనవరి 13న ఫ్రాన్స్‌లోని హైతీలో సంభవించిన భూకంప తీవ్రత 7.0గా నమోదయ్యింది. 3.16 లక్షల మందిని బలిగొన్న ఈ విపత్తు వల్ల ఏకంగా 80 వేల భవంతులు నేలమట్టమయ్యాయి.

2015, ఏప్రిల్ 25న నేపాల్‌లో సంభవించిన భూకంపం 8 వేల ప్రాణాలను బలిగొంది. భూకంప తీవ్రత 8.1గా నమోదయ్యింది. ఈ భూకంప ప్రభావం భారత్, చైనాల్లోనూ కనిపించింది.

2023, సెప్టెంబరు 8న ఆఫ్రికాలోని మొరాకోలో సంభవించిన భూకంపం కారణంగా 2 వేల మందికి పైగా చనిపోగా, నేటికీ గల్లంతైన అనేకుల జాడ తెలియరావటం లేదు.

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×