EPAPER
Kirrak Couples Episode 1

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీంకోర్ట్‌కి కేంద్రం ఏం చెప్పబోతోంది?

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీంకోర్ట్‌కి కేంద్రం ఏం చెప్పబోతోంది?

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని ఉపయోగించారనే ఆరోపణలపై దర్యాప్తునకు ఏపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్నేకొనసాగించాలా? లేదంటే స్వతంత్ర సంస్థను ఏర్పాటుచేయాలా? అని సుప్రీంకోర్టు.. కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. దానిపై ఏ విషయాన్నీ గురువారం చెప్పాలని సొలిసిటర్‌ జనరల్‌ కు సూచించింది. కోట్లమంది భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ వివాదంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ జరిపించాలని కోరుతూ.. మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి, టీటీడీ బోర్డు మాజీ అధ్యక్షుడువైవీ సుబ్బారెడ్డి, మరి కొందరు దాఖలుచేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై విచారణ చేపట్టిన న ధర్మాసనం ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

టీటీడీ తరుపున విచారణకు హాజరైన సీనియర్ న్యాయవాది సిద్దార్ధ లూథ్రా తన వాదనను వినిపించారు. జులై 4 వరకు సరఫరా చేసిన నెయ్యి ట్యాంకర్లను పరీక్షీంచేందుకు పంపలేదని, జులై 6, 12 తేదీల్లో మాత్రమే కొన్ని ట్యాంకర్లు మాత్రమే నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు పరీక్షలకు పంపామని ఆయన పేర్కొన్నారు. వాటిలో ఆ నాలుగింటిలోను కల్తీ జరిగినట్లు కోర్టుకు తెలిపారు. జులై 26, 12 వ తేదీలో సరఫరా అయిన నెయ్యిని ఉపయోగించలేదని ఈవో చెప్పినట్లు సిద్ధార్ధ కోర్టు దృష్టికి వివరించారు.


Also Read: శభాష్… చాలా మంచి పని చేశారు, ప్రజలను మెచ్చుకున్న సీఎం చంద్రబాబు

అందులో వచ్చిన ఫలితాలను అనుసరించి దానిపై దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావించినట్లు పేర్కొన్నారు. దానికి అనుగుణంగా తిరుమల యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌పై దర్యాప్తు కోసం ఏపీ ముఖ్యమంత్రి 26న సిట్‌ను ఏర్పాటుచేసినట్లు చెప్పారు. ఏపీ చంద్రబాబు నాయుడు సెప్టెంబరు 18న ఈ అంశంపై బహిరంగంగా మాట్లాడారు. అయితే కోట్లమంది ప్రజల మనోభావాలపై ప్రభావం చూపే అంశాలపై ఉన్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు బహిరంగ ప్రకటనలు చేయడం సరికాదని సుప్రీం కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర సొలిసిటర్‌ జనరల్‌ సహకారం కోరింది.

సదరు విచారణ 4వ తేదీకి వాయిదా పడటంతో అప్పటి వరకు సిట్ సిట్ విచారణకు బ్రేక్ పడింది. సుప్రీం కోర్టులో విచారణ నేపథ్యంలో దర్యాప్తుకు బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించారు డీజీపీ ద్వారకా తిరుమలరావు. దీంతో మూడు రోజుల పాటు అంటే ఈ నెల 3 వరకు సిట్ దర్యాప్తు ఆగనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత తదుపరి విచారణ జరగనుంది.

Related News

Irregularities: ఆగమవుతున్న తెలంగాణ టూరిజం.. ఇష్టారీతిన దోచేసిన మాజీ ఎండీ

TDP VS BJP: కూటమిలో చిచ్చు పెట్టిన కమిషనర్‌! ఆ అధికారి ఎవరు ?

BRS Leaders: ఏదో చేద్దాం అనుకున్నారు కానీ.! అడ్డంగా బుక్కయ్యారు

Janasena Party: బాలినేని అండతో జనసేనలోకి మరో వైసీపీ మాజీ ఎమ్మెల్యే?

Sahithi Infrastructure Fraud: ల‌క్ష్మీనారాయణ లీల‌లు.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే

Real Estate Fraud: బూదాటి పాపం పండింది..! లెక్కలతో సహా ‘స్వేచ్ఛ’ ఎక్స్‌క్లూజివ్

Big Stories

×