EPAPER

Israel-Iran War: ఇరాన్‌పై దాడికి ఇజ్రాయెల్ వ్యూహం ఇదే!

Israel-Iran War: ఇరాన్‌పై దాడికి ఇజ్రాయెల్ వ్యూహం ఇదే!

గతేడాది అక్టోబర్ 7న.. ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన ఆకశ్మిక దాడి తర్వాత మిడిల్ ఈస్ట్ మరోసారి రగులుకోవడం ప్రారంభించింది. ఆ దాడితో మొదలైన ఇజ్రాయెల్‌ ప్రతీకారం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మొదట హమాస్ మాత్రమే ఇజ్రాయెల్ లక్ష్యంగా ఉన్నప్పటికీ తర్వాత పరిణామాలు అనూహ్యంగా మారిపోయాయి. హమాస్‌తో మొదలుపెట్టి, మిడిల్ ఈస్ట్‌లో ఇజ్రాయెల్‌కు థ్రెట్‌గా ఉన్న హిజ్బుల్లా, హౌతీలను కూడా నాశనం చేయడానికి పూనుకుంది. అయితే, ఈ రాడికల్ గ్రూపులను పెంచి పోషిస్తున్న ఇరాన్ కూడా ఈ ఛాన్స్‌ను వినియోగించుకోడానికే సిద్ధపడినట్లు వ్యవహరించింది. హమాస్, హిజ్బుల్లా లీడర్లను హతమార్చినందుకు ప్రతీకారంగా రెండు సార్లు ఇజ్రాయెల్‌పై బాంబుల వర్షం కురిపించింది. మొదటిసారి కాస్త సంయమనం పాటించిన ఇజ్రాయెల్.. రెండో సారి మాత్రం అవకాశాన్ని వదలదలుచుకోలేదు. ఇప్పుడు, ఇజ్రాయెల్ సైన్యానికి ఇరాన్‌లో స్పష్టమైన లక్ష్యాలు ఉన్నాయి. ఈ లక్ష్యాలను మూడు కేటగిరీలుగా వర్గీకరించి, ఇజ్రాయెల్ దాడులు చేయడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది.

ఇజ్రాయెల్ వ్యూహాల్లో భాగంగా.. ఇరాన్ సంప్రదాయ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన స్థావరాలే ఇజ్రాయెల్‌కు ప్రాథమిక లక్ష్యం కావచ్చనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇందులో, ఇరాన్ క్షిపణి ప్రయోగ కేంద్రాలు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు, ఇంధనం నింపే ట్యాంకులు, స్టోరేజ్ బంకర్‌లు ఉన్నాయి. వీటిపై ఇజ్రాయెల్ దాడులు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక, ఇరాన్‌లోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ అండ్ కార్ప్స్‌కు చెందిన స్థావరాలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు , మిస్సైల్ బ్యాటరీలపైనా కూడా దాడులు జరగవచ్చు. అలాగే, ఇరాన్ బాలిస్టిక్ మిస్సైళ్ల తయారీ కార్యక్రమంలో పాల్గొంటున్న వ్యక్తుల్ని కూడా ఇజ్రాయెల్ హతమార్చడానికి సిద్ధపడే అవకాశం ఉంది.


Also Read:  కళ్ళకు కట్టినట్టుగా ఓషో రజనీష్ నిజస్వరూపం

ఇక, ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కూడా ఇజ్రాయెల్ ప్రధాన టార్గెట్‌లలో ఒకటి. ఇందులో భాగంగా, ఇరాన్‌ను తీవ్రంగా నష్టపరిచే ప్రభుత్వ ఆస్తులపై దాడులు జరగే అవకాశం ఉంది. ఈ క్రమంలో.. ఇరాన్ పెట్రో కెమికల్ ప్లాంట్లు, విద్యుదుత్పత్తి కేంద్రాలు, నౌకలు ధ్వంసం కావచ్చు. అయితే, ఈ వ్యవస్థల మీద దాడి చేస్తే ఇరాన్ ప్రజల్లోనూ ఆగ్రహం చెలరేగే అవకాశం ఉంది. ఎందుకంటే, ప్రభుత్వ ఆస్తులపై దాడులు చేయడం వల్ల ప్రజల జీవితాలపై ప్రభావం పడుతుంది. ఇప్పటికే, ఇరాన్‌లో ప్రజలు రెండుగా చీలిపోయిన పరిస్థితిలు కనిపిస్తున్నాయి. నస్రల్లా హత్య తర్వాత ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు చేసినప్పుడు ఇరాన్‌లో చాలా మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని నినాదాలు చేశారు. మరోవైపు, ఇరాన్ చేసిన చర్యకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనీ… ఇరాన్‌ను కాల్చి బూడిద చేస్తారనీ, ఇది సామాన్యుల ప్రాణాలను బలివ్వడమేనని ఇరాన్‌లోని కొందరు ప్రజలు భావిస్తున్నరు. ఇలా, ఇరాన్ ప్రజలు రెండుగా చీలిపోయిన ఈ సందర్భంలో.. ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తే… అది ఇరాన్‌లో ఇజ్రాయెల్‌పై మరింత వ్యతిరేకతకు కారణం అవుతుంది.

ఇక, ఇరాన్‌లో ఇజ్రాయెల్ టెర్గెట్ చేసిన అత్యంత ముఖ్యమైన లక్ష్యం అణ్వస్త్రాలు. ఇజ్రాయెల్‌కు సంబంధించి ఇది చాలా పెద్ద చర్యగానే పరిగణించాలి. అణు విద్యుత్ ఉత్పత్తి కోసం అవసరమైన 20 శాతం కంటే ఎక్కువ యురేనియంను ఇరాన్ శుద్ధి చేస్తోందని ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ఇటీవల స్పష్టం చేసింది. ఈ పరిస్థితుల్లో.. ఇరాన్ అణుబాంబు తయారు చేసే స్థాయికి చేరుకుంటుందనీ… ఈ దశలో అది బ్రేక్ అవుట్ పాయింట్‌కు చేరుకుందని ఇజ్రాయెల్ సహా దాని మిత్ర దేశాలు కూడా అనుమానిస్తున్నాయి. అందుకే, ఇరాన్ లోపల ఇజ్రాయెల్ లక్ష్యాలలో ఇరాన్ అణు కార్యక్రమానికి కేంద్ర స్థావరమైన పర్చిన్, రీసర్చ్ రియాక్టర్లు ఉన్న తెహ్రాన్, బొనాబ్, రమ్సర్, ఇతర అణు స్థావరాలైన బుషెహర్, నటాంజ్, ఇష్ఫాహాన్, ఫెర్దో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే, అణు స్థావరాలపై దాడికి అమెరికా ససేమిరా ఒప్పుకోవట్లేదు. అది మరింత తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తుందని అమెరికా హెచ్చరిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇరాన్ అణుస్థావరాలపై ఇజ్రాయెల్ దాడి చేస్తూ అది మిడిల్ ఈస్ట్‌లో ఘెరమైన యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది.

Related News

Sabarmati and Thames River: సబర్మతి, థేమ్స్ నదులు ఎలా బాగుపడ్డాయి?

Osho Rajneesh: కళ్ళకు కట్టినట్టుగా ఓషో రజనీష్ నిజస్వరూపం

YS Jagan: కడపలో జగన్ ప్లాన్ సక్సెస్.. ఎలాగంటే..

YS Jagan in Confusion: అంబటి, రజిని దెబ్బకి.. అయోమయంలో జగన్

Bigg Boss 8 Day 33 Promo1: మార్నింగ్ మస్తీ.. చిలకజోస్యంతో అదరగొట్టిన మణికంఠ..!

Balineni vs Prakasam Riyaz: బాలినేని మైండ్ గేమ్.. షాక్ ఇస్తున్న శిష్యుడు

Big Stories

×