EPAPER

Kolkata Doctor Case: కోల్ కతా జూనియర్ డాక్టర్ హత్యాచారం వెనుక కుట్రకోణం.. అందుకే చంపేశారా ?

Kolkata Doctor Case: కోల్ కతా జూనియర్ డాక్టర్ హత్యాచారం వెనుక కుట్రకోణం.. అందుకే చంపేశారా ?

Kolkata Junior Doctor Case: కోలకతా ఆర్ జీ కార్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఒక జూనియర్ డాక్టర్ హత్యాచారం యావత్ దేశాన్ని కదిలించింది. మొదట వచ్చిన పోస్టుమార్టం రిపోర్టులో వచ్చిన విషయాలివేనని వైరల్ అవుతున్న వార్తల్లో వాస్తవం లేదని బుకాయించారు పోలీసులు. కానీ.. నిన్న వైద్యులు వెల్లడించిన అటాప్సీ రిపోర్టులో రక్తం మరిగిపోయే విషయాలు తెలిశాయి. పోస్టుమార్టం రిపోర్టులో ఆమెను ఎలా హత్యాచారం చేశారో చెబుతుంటే.. విన్నవారికి.. ఆ పని చేసిన వాడిని ముక్కలు ముక్కలుగా నరికేయాలన్నంత కోపం వచ్చింది.


అత్యంత దారుణంగా, పాశవికంగా జూనియర్ డాక్టర్ ను హత్యచేసిన ఆ నీచుడిని కఠినంగా శిక్షించాలని దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దేశంలోని వైద్యులంతా ఒక్కటై ఆందోళనలు చేశారు. ఆ అమ్మాయికి న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నారు. కానీ తాజాగా ఈ కేసుకు సంబంధించిన ఒక్క విషయం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జూనియర్ డాక్టర్ ను అత్యాచారం చేసి చంపలేదని, పక్కా ప్లాన్ ప్రకారమే ఆమెను హత్య చేసి.. దానిని రేప్ అండ్ మర్డర్ గా క్రియేట్ చేయాలని చివరిలో రేప్ చేశారని ఆ వైరల్ కంటెంట్ సారాంశం.

అసలు ఒక జూనియర్ డాక్టర్ ను అంత పక్కా ప్లాన్ తో చంపాలన్న ఉద్దేశం ఎవరికైనా ఎందుకు ఉంటుందన్న అనుమానం మీకు రావొచ్చు. కానీ ఇక్కడ అచ్చం మనం సినిమాల్లో చూసినట్లే ఒక ఘటన జరిగిందంటున్నారు. ఏదైనా సంస్థకు సంబంధించిన సీక్రెట్స్ అందులో పనిచేసే వ్యక్తులకు తెలిస్తే వాళ్లని గుట్టుచప్పుడు కాకుండా చంపేస్తుండటాన్ని సినిమాల్లో చూస్తుంటాం. నిజ జీవితంలో జూనియర్ డాక్టర్ హత్యకు కూడా అదే కారణమంటున్నారు. ఆ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషంట్స్ గురించి, హాస్పిటల్ కు సంబంధించిన డార్క్ సీక్రెట్స్ గురించి జూనియర్ డాక్టర్ తెలుసుకుని వాటిని బయటపెడుతుందని తెలియడంతో కొందరు వ్యక్తులు ఆమెను ప్లానింగ్ ప్రకారం హత్యాచారం చేశారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.


Also Read: కోల్‌కతా ఘటనలో కీలక మలుపు.. నిందితుడికి లై-డిటెక్టర్ టెస్ట్

దీనివెనుక పెద్ద పెద్దవాళ్లే ఉన్నారని, వారిపేర్లు బయటకు రాకుండా.. ఒకడిని మాత్రం పోలీసులకు అప్పగించారని అంటున్నారు. ఎందుకంటే ఈ ఘటన జరిగిన నాలుగైదు రోజులవరకూ అక్కడి సీఎం మమతా బెనర్జీ స్పందించలేదు. ఆ తర్వాత రోడ్డుపైకి వచ్చి.. బాధితురాలికి, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన చేశారు. అసలు న్యాయం చేయాల్సిన సీఎమ్మే.. న్యాయం కోసం రోడ్డెక్కడం ఏంటి ? నాలుగు రోజుల వరకూ ఆవిడకు ఈ విషయం తెలియలేదా ? ఆగస్టు 10 నుంచి మీడియా ఈ ఘటనపై గొంతు చించుకుంటోంది. అయినా అవేవీ ఆవిడకు వినిపించలేదా ? దీనివెనుక ఉన్న పెద్దవాళ్లను తప్పించడానికే దీదీ అన్నిరోజులు మౌనంగా ఉండిపోయారా ? అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

అసలు జూనియర్ డాక్టర్ ను అంత కిరాతకంగా ఒక్క వ్యక్తే చంపడం సాధ్యం కాదన్నది డాక్టర్ల వాదన. ఆమె శరీరంపై మల్టిపుల్ ఇంజ్యూరీస్, ఊరిపితిత్తుల్లో రక్తస్రావం అవ్వడం, కళ్ల నుంచి రక్తం రావడం, 24 ప్రదేశాల్లో తీవ్రమైన గాయాలు.. ఒక్కడే ఆమెను ఇంత హింసపెట్టి చంపాడన్న విషయం వైద్యులకే కాదు.. ఈ విషయం తెలిసిన ఎవ్వరికీ నమ్మశక్యం కావడం లేదు. జూనియర్ డాక్టర్ హత్యాచారం వెనుక ఉన్న పెద్దలెవరో ? ఆమెను ఎందుకు చంపారన్న విషయాలను సీబీఐ పూర్తిస్థాయిలో విచారణ చేసి తెలుసుకోవాలన్నదే అందరి డిమాండ్.

 

 

Related News

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Big Stories

×