EPAPER

Telangana Future City: ఫ్యూచర్ సిటీ ముచ్చర్ల.. ఫోర్త్ సిటీ కోసం అదిరిపోయే ప్లానింగ్

Telangana Future City: ఫ్యూచర్ సిటీ ముచ్చర్ల.. ఫోర్త్ సిటీ కోసం అదిరిపోయే ప్లానింగ్

హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి ముఖ్యంగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్, ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్ నుంచి ఫ్యూచర్ సిటీకి రోడ్డు, మౌలిక సదుపాయాలు, మెట్రో రైలు కనెక్టివిటీ కల్పించడంపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే వివిధ శాఖలతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఓ గైడెన్స్ ఇచ్చారు. క్లారిటీ కల్పించారు. ఫ్యూచ‌ర్ సిటీకి 16 రేడియల్ రోడ్లు నిర్మించాలని ఇప్పటికే రూట్ మ్యాప్ ఇచ్చారు సీఎం. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి 20 నిమిషాల్లో ఫోర్త్ సిటీకి చేరుకునేలా ఉండాలన్నారు. ముచ్చర్ల అభివృద్ధిపై అధికారుల‌కు ఎప్పటికప్పుడు సూచ‌న‌లు చేస్తూనే ఉన్నారు. రోడ్ల నిర్మాణానికి ముందే ఎక్క‌డెక్క‌డ అవి మెయిన్ రోడ్ల‌కు లింకప్ కావాలి., సిగ్న‌ల్‌, ఇత‌ర స‌మ‌స్య‌లు లేకుండా సాఫీగా జర్నీ చేసేందుకు వీలుగా నిర్మాణాలు ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్నారు. రేడియ‌ల్ రోడ్లు, ఓఆర్ఆర్‌, ఆర్ఆర్ఆర్ ల అనుసంధానానికి అనువుగా ఉండాల‌ని, ఫ్యూచ‌ర్ సిటీలో ఏర్పాటుకానున్న వివిధ ప‌రిశ్ర‌మ‌లు, సంస్థ‌ల‌కు ఉప‌యోగ‌క‌రంగా ఉండేలా చూడాల‌ని సీఎం రేవంత్ అన్నారు.

నిజానికి ఈ అద్భుత నగరం గురించి న్యూయార్క్ నుంచి హైదరాబాద్ దాకా సీఎం రేవంత్ ప్రచారం చేసి వచ్చారు. ఫ్యూచర్ సిటీ భవిష్యత్తులో ఇండియాకు సమాధానం అవుతుందని, ఇది ఇండియా మొదటి నెట్ జీరో కార్బన్ సిటీ అవుతుందన్నారు సీఎం. ఫ్యూచర్ సిటీలో AI, మెడికల్ టూరిజం, స్పోర్ట్స్, సాఫ్ట్‌వేర్ అలాగే ఫార్మాకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారుతుందని చెప్పారు. ఇది సెకండ్ గోల్డ్ రష్ గా అవుతుందన్నారు. తెలంగాణకు కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తున్నామని, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, ఉన్నవాటిని విస్తరించడం చాలా ఈజీ చేస్తామని ఇటీవలి విదేశీ పర్యటనల్లో పారిశ్రామిక వేత్తలకు సీఎం హామీ ఇచ్చి వచ్చారు.


ఫ్యూచర్ సిటీకి వివిధ ప్రాంతాల నుంచి రోడ్డు, రైలు మార్గాలపై ప్రణాళికలు తయారు చేసి యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని అధికారులను ఇటీవలే సీఎం ఆదేశించారు. అవుటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగు రోడ్డును అనుసంధానం చేసేలా ప్రణాళిక చేయాలన్నారు. కొత్త హైకోర్టు నుంచి శంషాబాద్ విమానాశ్రయం మీదుగా ఫ్యూచర్ సిటీకి మెట్రో మార్గానికి ప్రణాళికలు తయారు చేయాలని సీఎం సూచించగా.. వారు కొన్ని మోడల్స్ ను రెడీ చేశారు. అవుటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగు రోడ్డును అనుసంధానం చేసేలా ప్రణాళిక చేయాలన్నారు. భూసేకరణ, ఇతర అంశాలపై వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. కొత్త హైకోర్టు నుంచి శంషాబాద్ విమానాశ్రయం మీదుగా ఫ్యూచర్ సిటీకి మెట్రో మార్గానికి ప్రణాళికలు తయారు చేయాలని చెప్పారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి రోడ్ కనెక్టివిటీ కోసం ప్రతిపాదించిన రూట్ మ్యాప్‌ను అధికారులు సీఎంకు వివరించారు.

Also Read: పూర్తి సోలార్ మయంగా మారనున్న సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం

ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీకి మెట్రో సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఇందులో భాగంగా మెట్రో రూట్, అలాగే రోడ్డు మార్గాలను నిర్మించాలని గత నెలలో నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. మెట్రో రైలు ప్రతిపాదిత రెండో దశ 78 కిలోమీటర్లతో ఐదు కారిడార్లు రానున్నాయి. ఇందులో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు హైదరాబాద్ సిటీలోని మెట్రో లైన్లతో లింకప్ కానున్నాయి. అటు ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్‌సిటీకి మెట్రో రైలు రూట్ ఆప్షన్లను అధికారులు కొద్దిరోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి రావిర్యాల మీదుగా ఒకటి, తుక్కుగూడ మీదుగా శ్రీశైలం మార్గంలో మరోటి రెండేసి ఆప్షన్లు రూపొందించారు. ఆప్షన్ 1లో భాగంగా ఎయిర్ పోర్ట్ నుంచి స్కిల్ వర్శిటీ దాకా దూరం 32 కిలోమీటర్లు ఉంటే… స్టేషన్ల సంఖ్య 12 ఉంటాయని, నిర్మాణానికి 6173 కోట్లు అవసరమవుతాయని అంచనాలు ఇచ్చారు. ఆప్షన్ 2లో భాగంగా ఎయిర్ పోర్ట్ నుంచి స్కిల్ వర్శిటీ వయా రావిర్యాల మీదుగా అయితే 32 కిలోమీటర్లు ఉండగా, 10 స్టేషన్లు, నిర్మాణ వ్యయం 5216 కోట్లు అవుతాయని లెక్కలేశారు. ఆప్షన్ 3లో భాగంగా ఎయిర్ పోర్ట్ నుంచి వయా శ్రీశైలం రోడ్డు ద్వారా 32 కిలోమీటర్లు ఉండగా, 12 స్టేషన్లు, 3256 కోట్లు అవసరమవుతాయని లెక్కేశారు. 2028 నుంచి 2053 వరకు ప్రయాణికుల సంఖ్య కూడా ఎంత ఉంటుందో అంచనాలు వేసి అంతా పకడ్బందీగా ప్రణాళికలు రచిస్తున్నారు.

అటు అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్ తరహాలో ఫ్యూచర్ సిటీలో వాణిజ్య కేంద్రం ఏర్పాటు చేసేందుకు వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రతినిధులు ముందుకొచ్చారు. ఇటీవల ప్రభుత్వంతో ఇందుకు సంబంధించిన ఒప్పందం జరిగింది. ఈ నేపథ్యంలో దాని నిర్మాణానికి అనువైన స్థలం కోసం రెవెన్యూ, పరిశ్రమల శాఖ అధికారులు అన్వేషిస్తున్నారు. విమానాశ్రయం, మెట్రో రైల్ స్టేషన్లకు వేగంగా చేరుకునేలా తమకు 50 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని, అలాగే భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పార్కింగ్ కోసం అదనంగా మరో 20 ఎకరాలు కేటాయించాలని సంస్థ ప్రతినిధులు కోరుతున్నారు. సో అన్ని రకాలుగా ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ ప్లాన్ తో శరవేగంగా రెడీ అవుతోంది.

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×