EPAPER

CMRF SCAM: దొరికినంత దోచేశారా? తెలంగాణలో CMRF భారీ స్కామ్..

CMRF SCAM: దొరికినంత దోచేశారా? తెలంగాణలో CMRF భారీ స్కామ్..

ప్రైవేట్ హాస్పిటల్స్.. రోగంతో వచ్చిన వారికి ఎంత మేరకు నయమవుతుందో తెలీదు కానీ.. కావాల్సినంత పిండేస్తారు ఆ రోగి కుటుంబం నుంచి.. ఇప్పుడు అది చాలదన్నట్టు మరో దందాకు తెరలేపారు. అసలు లేని రోగికి కూడా ట్రీట్‌మెంట్ చేసినట్టు బిల్లులు సృష్టించి.. వాటిని CMRFకు పంపి.. వాటిని క్లెయిమ్‌ చేసేశారు. అయితే లెటెస్ట్‌గా కొన్ని బిల్లులపై అనుమానం వచ్చి ఫిర్యాదు చేయడంతో సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చింది సీఐడీ.. అప్పుడు వచ్చింది ఈ దందాపై ఓ క్లారిటీ.. ఇది ఒకటో, రెండో హాస్పిటల్స్‌లో జరిగే వ్యవహారం కాదని.. రాష్ట్రవ్యాప్తంగా అనేక హాస్పిటల్స్‌లో ఈ దందా జరిగినట్టు తేలింది.

నిజానికి పేదింటి వారికి భారం కాకూడదన్న ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్.. కానీ ఇదే ఆరోగ్యశ్రీ పేరుతో ఇప్పుడు ప్రభుత్వం వద్ద దోచేస్తున్నాయి ప్రైవేట్‌ హాస్పిటల్స్.. హైదరాబాద్‌తోపాటు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్.. రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లోని మొత్తం 17 ప్రైవేటు హాస్పిటల్స్‌పై CID కేసులు నమోదు చేసింది. అయితే ఈ దందాలో హాస్పిటల్స్ యాజమాన్యాల ప్రమేయం ఉందా? లేక వాటిలో పనిచేసిన ఉద్యోగులే.. యాజమాన్యానికి తెలియకుండా నకిలీ బిల్లులను సృష్టించారా? అనే డౌట్స్‌ కూడా ఉన్నాయి. నిజానికి ఈనెల 23న 6 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసింది సీఐడీ.. ఇప్పటికే అనేక CID బృందాలు జిల్లాల బాట పట్టాయి. ఒక్కో జిల్లాలో విచారణ జరుపుతూ కేసులు నమోదు చేస్తున్నాయి.


నిజానికి మంచిర్యాలలో లాస్ట్ ఇయరే ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోనూ గుర్తించారు. అసలు CMRF నిధులను కాజేసేందుకు ఉత్తుత్తి ఆసుపత్రులను తెరపైకి తెచ్చారు. ఎలాంటి రోగులు, వైద్య పరికరాలు లేకుండానే హాస్పిటల్ ఉన్నట్టు రికార్డులు సృష్టించారు. ఆ విధంగా రోగులకు చికిత్స చేసినట్లు నకిలీ బిల్లులు సృష్టించి.. CMRFకు దరఖాస్తు చేసి నిధులు కాజేశారు. అంటే లేని ఈ హాస్పిటల్స్‌ కేవలం పేపర్‌పై మాత్రమే కనిపిస్తాయి.. ఫీల్డ్‌లో ఎక్కడా ఉండవు..
కానీ నిధులు మాత్రం అకౌంట్లలో పడిపోతాయి.

Also Read: బిగ్ బ్రేకింగ్.. కవితకు బెయిల్ మంజూరు

నాలుగు లక్షలు.. నాలుగున్నర లక్షలు..ఆరు లక్షలు.. ఏడు లక్షలు.. ఇలా అమౌంట్‌ చిన్నదైనా.. మెల్లిమెల్లిగా.. కొద్దికొద్దిగా దోచేశాయి ప్రైవేట్ హాస్పిటల్స్.. చూడటానికి చిన్న అమౌంట్‌లానే కనిపిస్తున్నా.. మొత్తంగా లెక్కేస్తే ఈ దోపిడి కోట్లలో ఉంటుందని తెలుస్తోంది. అందుకే ప్రభుత్వం సీఐడీని రంగంలోకి దించింది. ఇప్పటి వరకు ఏకంగా 500 వరకు అనుమానస్పద అప్లికేషన్లను గుర్తించింది సీఐడీ.. ఇదో ఎగ్జాంపుల్.. ఆయన చెబుతున్నది ఏంటంటే.. ఐదు అనుమానస్పద ఫైల్స్‌ ఉంటే.. అందులో రెండు మాత్రమే జెన్యూన్.. మిగిలిన మూడు ఫేక్ డాక్యుమెంట్స్ అన్నట్టు.. అంటే అక్రమాలు జరుగుతున్నాయని తేలిపోయింది. అయితే ఇందులో పొలిటికల్ ఇన్‌వాల్వ్‌మెంట్‌ కూడా ఉన్నట్టు తెలుస్తోంది.. ఉదాహరణకు మహబూబాబాద్ ఏరియాలో జరిగిన CMRF దందాలో.. మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ హస్తమున్నట్టు తెలుస్తోంది. డాక్టర్లను అడ్డుపెట్టుకొని ఆయన CMRF దందా చేసినట్టు సీఐడీ అధికారులు గుర్తించారు. నకిలీ లెటర్లతో శంకర్‌ నాయక్‌ కోట్లు దండుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆస్పత్రులకు తెలియకుండానే నకిలీ బిల్లులు సృష్టించి ప్రభుత్వ ఖజానా గండికొట్టారనేది ఆయపై ఉన్న ఆరోపణ.. అందుకే వచ్చిన చెక్కులను ఆగమేఘాల మీద లబ్దిదారులకు అందించినట్టు కలరింగ్ ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది.

ఇది ఇప్పుడు జరిగిన దందా కాదు.. కరోనా టైమ్‌ నుంచి నడుస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఇంత జరిగినా అప్పటి ప్రభుత్వం ఎందుకు గుర్తించలేదు? ఎందుకు కేసులు నమోదు చేయలేదు? ఒకవేళ గుర్తించినా కావాలనే పట్టించుకోలేదా? ఇందులో అస్మదీయుల హస్తం ఉందని చూసి చూడనట్టు వదిలేశారా? సీఐడీ లబ్ధిదారులను మాత్రమే కాదు. వారి వెనకున్న వారిని కూడా గుర్తించాలి. ఎంతెంత మెక్కారో వారితోనే అంతా కక్కించాలి. అప్పుడే మరోకరు ఇలా చేయడానికి భయపడతారు.

Related News

GHMC Elections: పాడి కౌశిక్ రెడ్డి ఎఫెక్ట్.. బీఆర్ఎస్‌కు మరో షాక్ తప్పదా?

KTR : కోర్టు తీర్పుతో భయం.. కాంగ్రెస్ అంటేనే డ్రామాలమయం

Kakani Vs Somireddy: కాకాణి VS సోమిరెడ్డి‌.. రూ.100 కోట్ల లొల్లి

Russia-Ukraine war: మోడీ దెబ్బ.. వెనక్కి తగ్గిన పుతిన్.. యుద్దం ఆగినట్లేనా!

KCR Silent: నోరు మెదపని కేసీఆర్.. బయటపడ్డ అసలు కుట్ర!

 YS Jagan: పెద్దిరెడ్డిని సైడ్ చేసిన జగన్.. పుండు మీద కారం

Hindi: హిందీ హమారా.. హిందుస్థాన్ హమారా

Big Stories

×