EPAPER

Twist In SC /ST Sub-Classification: ఎస్సీల వర్గీకరణ.. ఇన్నాళ్లకు దక్కిన న్యాయం.. అసలు కథ ఇది

Twist In SC /ST Sub-Classification: ఎస్సీల వర్గీకరణ.. ఇన్నాళ్లకు దక్కిన న్యాయం.. అసలు కథ ఇది

అవును.. ఎస్సీల వర్గీకరణ వివాదం, పోరాటం ఇప్పటిది కాదు. ముప్పై ఏళ్ల చరిత్ర. అణచివేయబడ్డ సమూహంలోనే అసమానతలకు సంబంధించిన అంశమిది. ఎన్నో ఉద్యమాలు.. ఇంకెన్నో న్యాయపోరాటాలు. మాకు అన్యాయం జరుగుతోంది మమ్నల్ని గుర్తించండి మహా ప్రభో అని గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎలుగెత్తిన సందర్భమది. ఇన్నాళ్లకు న్యాయం వారిని కరుణించింది. వెనుకబడ్డ సమూహంలోనే ఉన్నా.. జనాభా ఎక్కువగా ఉన్నా ఫలాలు సరైన విధంగా అందుకోలేక ఇబ్బంది పడ్డ వర్గాలకు సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు చారిత్రకం.

ఎస్సీ వర్గీకరణ అనగానే దేశంలోనే ఇది మన దగ్గరే మొదలైంది. ఎస్సీల్లో ఉపకులాల జనాభా వేర్వేరుగా ఉంది. అణచివేతకు గురైన వారిలోనే ఇంకా వెనుకబడిన వర్గాలెన్నో ఉన్నాయి. అందరికీ ఒకే కోటా ఉండడం వల్ల కూడా నష్టం జరుగుతోందంటూ ఉద్యమం 30 ఏళ్ల కిందట మొదలైంది. అది ఇన్నాళ్లకు సుప్రీం తీర్పు రూపంలో ఫలించింది. కోటాలో సబ్ కోటా తప్పు కాదు అని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం 6:1 మెజార్టీతో తీర్పు చెప్పింది. ధర్మాసనంలోని ఆరుగురు న్యాయమూర్తులు ఈ వర్గీకరణను సమర్థించగా, ఒకరు వ్యతిరేకించారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పుచెప్పడం ద్వారా ఎస్సీ, ఎస్టీ కోటాలో ఉప వర్గీకరణ ఉండదని 2004లో ఐదుగురు సుప్రీం న్యాయమూర్తుల బెంచ్ ఇచ్చిన తీర్పును తాజా రాజ్యాంగ ధర్మాసనం తోసిపుచ్చింది.


షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల్లో ఉప కులాలను ఒకే సమూహంగా భావించలేమని, వారి జనాభా సంఖ్య, సామాజిక ఆర్థిక పరిస్థితుల వంటి డేటా ఆధారంగా రాష్ట్రాలు వర్గీకరించవచ్చని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ తన తీర్పులో పేర్కొన్నారు. షెడ్యూల్డ్ కులాలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా జనాభా ఉంది. ఇందులో ఉపకులాల్లో విభిన్నమైన ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులు ఉన్నాయి. సో రాష్ట్రాలు తమ పరిస్థితులకు తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకోవాల్సిన టైం వచ్చేసింది. ఇది వెనుకబడి వర్గాలకు పెద్ద ఉపశమనం కల్పించింది. విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నిజానికి ఈ వర్గీకరణ కోసం పోరాడి అమరులైన వారూ ఉన్నారు. ఇది ఒకరి ఓటమి కాదు. మరొకరి గెలుపు కాదు. ఒక చారిత్రక విజయం అంతే. వెనుకబడిన వర్గాలకు నిజమైన న్యాయం దొరికే సందర్భం.

Also Read: నీట్ కేసు.. తొలి ఛార్జిషీట్‌లో 13 మంది.. కాకపోతే..

సరే ఎస్సీ వర్గీకరణను రాష్ట్రాలు చేసుకోవచ్చని ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. మరి అసలు సిసలు సవాళ్లు చాలానే ఉన్నాయి. నిజానికి వర్గీకరణ ఉద్యమం, కోర్టు కేసులు మొదలైందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే. ఈ ఇష్యూలో ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసు చుట్టూనే అన్ని పరిణామాలు జరిగాయి. ఆ తర్వాత పంజాబ్ ఇష్యూ కూడా సుప్రీం కోర్టు దాకా వెళ్లింది. సరే అది చరిత్ర. జరిగిపోయింది. మరి ఇప్పుడు జరగాల్సింది ఏంటి? అన్ని రాష్ట్రాలు వర్గీకరణను అమలు చేస్తాయా.. చేస్తే ఎప్పటి వరకు చేస్తాయి… వెనుకబడిన వర్గాలకు న్యాయం జరిగేదెప్పుడు? ఇలాంటి డౌట్లన్నీ వస్తున్నాయి. అందుకు దేశంలోనే మొదటగా సమాధానం చెప్పింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అవును సుప్రీం కోర్టు తీర్పుకు తగ్గట్లు ఏబీసీడీగా వర్గీకరణ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం ఉంటుందన్నారు. ఇప్పుడు అమలులో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా మాదిగ, మాదిగ ఉప కులాలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని, ఇందుకోసం అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తామన్నారు రేవంత్ రెడ్డి.

మాదిగ, మాదిగ ఉప కులాల వర్గీకరణకు వాయిదా తీర్మానం ఇస్తే సంపత్ కుమార్‌ను గత ప్రభుత్వం సస్పెండ్ చేసిందని, 2023 డిసెంబర్ 23న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ అడ్వకేట్ జనరల్‌ను సుప్రీం కోర్టుకు పంపించారని, వర్గీకరణపై సుప్రీం కోర్టు లో న్యాయ నిపుణులతో వాదనలు వినిపించారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. సో ఇప్పుడు 30 ఏళ్లు సాగిన ఉద్యమం విజయవంతమైంది. మరి అన్యాయానికి గురైన వర్గాల పక్షాన న్యాయవ్యవస్థ నిలబడింది. ఇప్పటిదాకా ఒక లెక్క. ఇప్పుడు మరో లెక్క.

ఇప్పటివరకూ ఉమ్మడి రిజర్వేషన్లు నడిచాయి. రిజర్వేషన్లు అందుకోలేకపోయిన వర్గాలు రిజర్వేషన్లు అందుకునే టైం వచ్చింది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసేందుకు, అవసరమైతే ప్రత్యేకంగా అసెంబ్లీ సెషన్ నిర్వహించేందుకు, ఆర్డినెన్స్ తెచ్చేందుకు ఇలా దేనికైనా రెడీ అంటున్నారు సీఎం రేవంత్. అన్ని రాష్ట్రాలూ వర్గీకరణ చేసి ఉపకులాలకు అందించాలని MRPS వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ కోరుకుంటున్నారు. సో ఎస్సీ వర్గీకరణ విషయంలో ఒక సుదీర్ఘ అధ్యాయం ముగిసింది. న్యాయం వెలువడింది. ఇక కావాల్సింది రాజకీయ నిర్ణయమే.

Related News

Nimmala Ramanaidu: నిమ్మల గ్రేట్ జాబ్.. చంద్రబాబు ప్రశంసలు

Kim Jong Un: ఇదేం రూల్ రా నాయనా.. ప్రపంచానికి షాక్ ఇచ్చిన నార్త్ కొరియా

Chakali Ailamma: తెలంగాణ హక్కుల బావుటా.. ఐలమ్మ..!

HYDRA: వాడ్రా రావాలి.. ఓరుగల్లు మారాలి!.. స్వేచ్ఛ స్పెషల్ పార్ట్ 2

Nandigam Suresh: నందిగం సురేష్‌కి.. బిగిస్తున్న ఉచ్చు..

Mahesh Kumar Goud:హేమా హేమీలు పోటీలో ఉన్నా.. టీపీసీసీగా మహేష్ కుమార్ గౌడే ఎందుకంటే?

Kaloji Narayana Rao: తెలంగాణ తొలిపొద్దు.. కాళోజీ..!

Big Stories

×