EPAPER

Superstar Krishna : స్టార్ స్టార్ సూపర్ స్టార్ కృష్ణ.. సినీ ప్రస్థానం..

Superstar Krishna : స్టార్ స్టార్ సూపర్ స్టార్ కృష్ణ.. సినీ ప్రస్థానం..

Superstar : కృష్ణ సినీ కెరీర్ చిన్న పాత్రలతో మొదలైంది. కృషి, పట్టుదలతో ముందుకెళ్లిన ఆయన అనతికాలంలోనే సూపర్ స్టార్ గా ఎదిగారు.1962లో కొంగర జగ్గయ్య నిర్మించిన పదండి ముందుకు , అక్కినేని ‘ కులగోత్రాలు’, 1963లో పరువు ప్రతిష్ట 1964లో ఏఎన్ఆర్ ‘మురళీకృష్ణ’ సినిమాల్లో చిన్నచిన్న పాత్రలో కృష్ణ కనిపించారు. 1964లో ఆదుర్తి సుబ్బారావు తేనమనసులు చిత్రానికి ఇద్దరు హీరోల్లో ఒకరిగా కృష్ణను తీసుకున్నారు. ఈ చిత్రం నుంచే ఘట్టమనేని శివరామకృష్ణ పేరు కృష్ణగా మారింది. ఆ తర్వాత ఐదున్నర దశాబ్దాలు తెలుగుతెరపై వెలుగు వెలుగింది. యాక్షన్ మూవీస్, పొలిటికల్ సినిమాలతో సూపర్ స్టార్ గా ఎదిగిన కృష్ణ మూసధోరణిలో వెళ్లలేదు. పండంటి కాపురం, పాడిపంటలు, పచ్చని సంసారం, సంప్రదాయం లాంటి కుటుంబ కథా చిత్రాలతో మెప్పించారు. మల్టీస్టారర్ చిత్రాలతోనూ ఘన విజయం అందుకున్నారు.


గూడఛారి 116 సినిమా సూపర్ హిట్ కావడంతో ఒకేసారి 20 సినిమాలకు హీరోగా కృష్ణ బుక్ అయ్యారు.1968లో కృష్ణ నటించిన 10 సినిమాలు విడుదలయ్యాయి. 1969లో రికార్డుస్థాయిలో 19 సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఆ తర్వాత 1970లో సొంత నిర్మాణ సంస్థ పద్మాలయా పిక్చర్స్ ను ప్రారంభించారు. 1973లో కృష్ణ, విజయనిర్మల కలిసి విజయకృష్ణా నిర్మాణ సంస్థను స్థాపించారు.ఈ బ్యానర్ పై నిర్మించిన తొలి చిత్రం మీనా మంచి విజయాన్ని అందుకుంది. 1974లో పౌరాణిక చిత్రం కురుక్షేత్రంలో కృష్ణ నటించారు.

1980 దశకంలో రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, బాపయ్య కాంబినేషన్ లో కృష్ణ అనేక హిట్ మూవీస్ చేశారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో 9 సినిమాల్లో నటించగా అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. కిరాయి కోటిగాడు, రామరాజ్యంలో భీమరాజు, ఊరికిమొనగాడు, ప్రజారాజ్యం, కృష్ణార్జునులు, ముందడుగు, వజ్రాయుధం, అగ్నిపర్వతం ఈ సినిమాలన్నీ శతదినోత్సవం జరుపుకున్నాయి. కృష్ణ దర్శకత్వంలో వచ్చి సంచలన విజయం సాధించిన సినిమా సింహాసనం. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ బప్పీలహరి తెలుగు తెరకు పరిచయం చేసింది ఈ సినిమా.


1988లో కృష్ణ స్వీయ దర్శకత్వంలో కుమారులు రమేష్ బాబు, మహేష్ బాబులతో కలిసి నటించిన కొడుకు దిద్దిన కాపురం ప్రేక్షకుల అలరించింది. ఎన్టీఆర్, ఎన్నార్ అగ్రహీరోలుగా టాలీవుడ్ ను రాజ్యమేలుతున్న సమయంలో ఎంట్రీ ఇచ్చిన కృష్ణ తన కష్టంతో ఎదిగారు. ప్రత్యేక శైలితో ముందుకెళ్లారు. ఎవరూ చేయనన్ని ప్రయోగాలు చేశారు. సంచలన విజయాలు అందుకున్నారు. కృష్ణ తీసుకొచ్చిన కొత్త దనాన్ని ప్రేక్షకులు ఆదరించారు. ధైర్యసాహసాలతో ముందుకు సాగిన అద్భుత విజయాలు అందుకున్నారు. అందుకే సూపర్ స్టార్ గా ప్రేక్షకుల మదిలో స్థిరస్థాయిగా నిలిచిపోయారు.

Tags

Related News

Press Freedom: మీడియాతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ..!

Kargil War: కార్గిల్ యుద్ధం ఎందుకు జరిగింది?.. 25 ఏళ్ల తర్వాత నిజం ఒప్పుకున్న పాక్

Big Shock to YS Jagan: పూర్తిగా ఖాళీ అవుతున్న వైసీపీ.. వీళ్లంతా జంప్

US Presidential Election 2024: కమలా హారిస్ విన్ అవుతుందని.. అలన్ ఎలా చెప్తున్నాడు?

TDP Office Attack Case: పరారీలో జోగి రమేశ్‌, దేవినేని అవినాశ్‌?

YSRCP VS TDP: వరద పాలిటిక్స్.. బురదలో ప్రజలు.. నేతల గొప్పలు

Natural Disaster: క్లౌడ్‌ బరస్ట్‌తో ఆకస్మిక వరదలు.. విపత్తులను ఆపే దారేది?

Big Stories

×