EPAPER

INS Arighat: INS అరిఘాత్‌ స్పెషాలిటీస్ ఏంటి? దీంతో చైనాకు చెక్ పెట్టేయొచ్చా ?

INS Arighat: INS అరిఘాత్‌ స్పెషాలిటీస్ ఏంటి? దీంతో చైనాకు చెక్ పెట్టేయొచ్చా ?

INS Arighat: రోజు రోజుకు బలపడుతూ తీర జలాల్లో ఇండియన్ నేవీకి సవాళ్లు విసురుతున్న చైనాకు చెక్ పెడుతోంది ఇండియన్ నేవీ. తన అమ్ములపొదిలో మరో న్యూక్లియర్‌ సబ్‌మెరైన్‌ను చేర్చుకుంది. ఏ హంగు, ఆర్భాటం లేకుండా ఇప్పుడు జలప్రవేశం కూడా కానిచ్చేసింది. ఇంతకీ ఈ లెటెస్ట్‌ న్యూక్లియర్‌ సబ్‌మెరైన్‌ INS అరిఘాత్‌ స్పెషాలిటీస్ ఏంటి? ముందు ముందు రాబోయే కొత్త నేవల్ షిప్స్ ఏంటి? అదే కాదు.. ఇండియన్ నేవీ రహస్యాలు ఇప్పుడు పాక్‌కు లీక్‌ అవుతున్నాయా?


ఇండియన్ నేవీ మరింత బలపడింది. అన్ని టెస్ట్‌లు పూర్తి చేసుకొని ఫుల్ ఆపరేషన్స్‌కు సిద్ధమైన INS అరిఘాత్ న్యూక్లియర్‌ సబ్‌మైరెన్‌ను డిఫెన్స్‌ మినిస్టర్ రాజ్‌నాథ్‌ సింగ్‌ జాతికి అంకితం చేశారు. నిజానికి సెప్టెంబర్‌లో ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా జరగాలి ఈ కార్యక్రమం. కానీ.. వైజాగ్‌లోని సీక్రెట్ షిప్ బిల్డింగ్‌ ఏరియాలో జరిగిపోయింది. ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన సబ్‌ మెరైన్‌. దీంతో ఇండియన్ న్యూక్లియర్‌ సబ్‌ మెరైన్‌ల సంఖ్య రెండుకు చేరింది. అంతేకాదు ఇవి రెండు కూడా సబ్‌మెరైన్‌ లాంచ్‌డ్‌ బాలిస్టిక్‌ న్యూక్లియర్ సబ్‌ మెరైన్‌ క్లాస్‌కు చెందినవి. ప్రస్తుతం మరో రెండు నిర్మాణంలో ఉన్నవి.

ఫస్ట్‌ న్యూక్లియర్ సబ్‌ మెరైన్ ఐఎన్‌ఎస్ అరిహంత్ 2016లో నెవీలో చేరింది. 2018 నుంచి ఫుల్లీ ఆపరేషన్‌లో ఉంది. ఇప్పుడు అరిఘాత్ కూడా 2017లోనే జలప్రవేశం చేసినా.. అన్ని టెస్ట్‌లు, ట్రయల్స్ పూర్తై ఫుల్లీ ఆపరేషన్‌ మోడ్‌లోకి రావడానికి ఇన్నేళ్లు పట్టింది. అరిహంత్, అరిఘాత్‌ కూడా రెండు ఒకే కోవకు చెందినవనే చెప్పాలి. ఇందులో 3,500 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్‌ను చేధించే K-4 మిసైల్స్ ఉంటాయి. ఇలాంటి 12 మిసైల్స్‌ను మోసుకెళ్లగలదు అరిఘాత్.
ఇక వచ్చే ఏడాది ఐఎన్‌ఎస్ అర్దిమాన్ నేవీ చేతుల్లోకి రానుంది.


Also Read: ఫేక్ మనుషులు-ఫోర్జరీలు.. 50 ఎకరాలు కొట్టేసిన ఉదయ్ కుమార్ రెడ్డి

నిజానికి ఇండియన్‌ నేవీని బలోపేతం చేయాలని మోడా సర్కార్ టార్గెట్‌గా పెట్టుకుంది. అందుకే అరిహంత్ క్లాస్‌ సబ్‌ మెరైన్స్‌తో పాటు.. ఆరు న్యూక్లియర్ అటాక్ సబ్‌మెరైన్స్‌ను కూడా నిర్మించాలని టార్గెట్‌గా పెట్టుకుంది. దీనికి తోడు మరో 15 కావేరి క్లాస్‌ డీజిల్ ఎలక్ట్రిక్‌ సబ్‌ మెరైన్‌ను కూడా సిద్ధం చేస్తోంది. నెక్ట్స్‌ రాబోయే అర్ధిమాన్‌తో పాటు మరో న్యూక్లియర్‌ సబ్‌ మెరైన్స్ మరింత పెద్దవి. ప్రస్తుతం అరిఘాత్‌ 6 వేల టన్నులు.. 111.6 మీటర్ల పొడవు ఉంటే.. తర్వాత వచ్చే సబ్‌ మెరైన్స్ 7 వేల టన్నులతో పాటు.. 125 మీటర్ల కంటే పొడవు ఉండనున్నాయి.

ఇండియన్ నేవీకి చెందిన సబ్‌మెరైన్స్ స్పెషాలిటీ ఏంటంటే.. ఇండియన్ నేవీ షిప్స్ అంటే డిస్ట్రాయర్స్, ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్స్ ఇలా అనేక రకాల షిప్స్ అని కూడా ఇండియన్ నేవీకి చెందిన ఏదో ఒక నావల్ స్టేషన్‌ అండర్‌లో వర్క్‌ చేస్తాయి. కానీ సబ్‌ మెరైన్స్‌ మాత్రం స్పెషల్ స్ట్రాటజిక్ ఫోర్స్‌ అండర్‌లో పనిచేస్తాయి. ఇది ప్రధానమంత్రి ఆధ్వర్యంలో నడుస్తోంది. అక్కడి నుంచి మాత్రమే ఆర్డర్స్‌ను తీసుకుంటుంది.

నిజానికి ఇవన్ని వింటుంటే చాలా బాగా అనిపిస్తోంది కదా. కానీ ఇప్పటికి కూడా మనం చాలా వెనకడపడి ఉన్నామనేది బిట్టర్ ట్రూత్. మనకంటే అమెరికా, రష్యా, చైనా ఈ విషయంలో చాలా ముందున్నాయి. మనకంటే లాంగ్‌ రేంజ్‌ మిసైల్స్‌తో పాటు.. ఇంకా అత్యాధునిక, అత్యధిక సబ్‌మెరైన్స్‌ ఈ దేశాల వద్ద ఉన్నాయి. ఫర్‌ ఎగ్జాంపుల్ చైనా వద్ద ఆరు న్యూక్లియర్ సబ్‌ మెరైన్స్ ఉన్నాయి. ఇందులో 10 వేల కిలోమీటర్ల రేంజ్‌ ఉన్న న్యూక్లియర్ మిసైల్స్ ఉంటాయి. ఇక అమెరికా అయితే ఏకంగా 14 SSBNలు ఉన్నాయి. దీనికి ఫాస్ట్‌ అటాక్, హంటర్ కిల్లర్స్ అదనం. అన్నీ కలిపితే యూఎస్ నేవీ వద్ద 70కి పైగా సబ్‌ మెరైన్స్ ఉన్నాయి.

Also Read: రాజకీయ సంక్షోభం దిశగా పశ్చిమ బెంగాల్..!

ఇక రష్యా సంగతి సరే సరి. ఆ దేశం కూడా అమెరికాకు ఏమాత్రం తగ్గకుండా ఉంది. అమెరికా, రష్యాలతో ఇప్పట్లో మనకు వచ్చిన చిక్కులేం లేవు కానీ.. చైనాతోనే మనకు వచ్చిన చిక్కంతా. కాబట్టి మనం మరింత వేగంగా ఈ నెంబర్స్‌ను పెంచుకోవాల్సిన అవసరం ఉంది.

ఇదంతా ఒకవైపు అయితే.. ఇండియన్‌ నేవీలో ఇంటి దొంగల సంఖ్య పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. పాక్‌ ఐఎస్‌ఐ కోసం కొందరు పని చేస్తున్నట్టు నేషనల్ ఇన్వెస్టిగేషన్‌ గుర్తించింది. ఇప్పటికే రంగంలోకి దిగిన NIA ఏకంగా 7 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించింది. ఇందులో మన తెలంగాణ కూడా ఉంది. గుజరాత్, కర్ణాటక, కేరళ, యూపీ బీహార్, హర్యానాలోని మొత్తం 16 ప్రాంతాల్లో సోదాలు చేసింది. అంతేకాదు కొందరు అనుమానితులను కూడా అదుపులోకి తీసుకున్నారు.
ఇందులో మరింత సాడ్ పార్ట్ ఏంటి అంటే.. ఇండియన్‌ నేవీ టాప్‌ సీక్రెట్స్‌ వైజాగ్‌లోని ఇండియన్ నేవీ కేంద్రం నుంచి లీక్‌ అవుతున్నట్టు గుర్తించింది. నిజానికి మన నేవీకి సంబంధించిన టాప్‌ సీక్రెట్స్ ఆపరేషన్స్ వైజాగ్‌లోనే ఉంటాయి.

ప్రస్తుతం మనం స్వదేశీయంగా నిర్మిస్తున్న షిప్స్‌, సబ్‌ మెరైన్స్ అన్ని కూడా మెజార్టీ వైజాగ్‌లోనే రూపుదిద్దుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో NIA ఇలాంటి విషయాలు కాస్త కంగారు పెడుతున్నాయి. ఎందుకంటే ఈ ఇన్ఫోను పాక్‌ ఐఎస్‌ఐ వెంటనే చైనాతో షేర్ చేసుకుంటుంది. అది మనకి మరింత ముప్పు తెచ్చి పెట్టే విషయమనే చెప్పాలి. ఇప్పటికే ఇద్దరు ఈ కేసులో తమ నేరాన్ని ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. మరికొందరు అనుమానితులను విచారిస్తోంది NIA. అంటే మనం వేగంగా ముందుకు వెళ్తూనే.. మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×