EPAPER
Kirrak Couples Episode 1

BJP: బీజేపీ ఉత్తరాది పోకడలు మార్చుకోదా? ఇలాగైతే దక్షిణాదిన నెగ్గుకొచ్చేనా?

BJP: బీజేపీ ఉత్తరాది పోకడలు మార్చుకోదా? ఇలాగైతే దక్షిణాదిన నెగ్గుకొచ్చేనా?
PM-MODI-AMIT-SHAH-JP-NADDA

BJP News Telangana(Telugu news live today): కమలనాథులు. పొలిటికల్ మాస్టర్ మైండ్లు. ఎన్నికలను బీజేపీ మేనేజ్ చేసినట్టు ఇంకే పార్టీ చేయలేదంటారు. అంత స్ట్రాటెజికల్‌గా ఉంటుంది కాషాయం స్కెచ్. ఎలక్షన్లు జరగబోయే రాష్ట్రాల్లో ఆర్నెళ్ల ముందే బలగం దిగిపోతుంది. మోదీ పేరు చెప్పి, మోదీ బొమ్మ చూపించి, రామరాజ్యం, హిందుత్వం అంటూ.. కాషాయ జెండాను ఎగరేస్తుంటారు. బీజేపీకి మంచి పట్టుండే ఉత్తర భారతదేశంలో వారి స్ట్రాటజీ బాగా వర్కవుట్ అవుతూ వస్తోంది. కానీ, సౌత్ ఇండియాలో మాత్రం పదే పదే మిస్ ఫైర్ అవుతోంది. కాస్తోకూస్తో ఛాన్స్ ఉన్న కర్నాటకలో సైతం ఫసక్ అంది. ఇక తెలంగాణపైనే కంప్లీట్ ఫోకస్ పెట్టింది. దక్షిణాది తమకు కొరుకుడు పడటం లేదని తెలిసినా.. ఇంకా ఉత్తరాది పోకడలతోనే ఇక్కడా రాజకీయం చేస్తుండటం ఆ పార్టీకి బిగ్ మైనస్. నార్త్ వేరు.. సౌత్‌ కల్చర్ వేరు. అక్కడి భాష, యాస వేరు. ఇక్కడి ప్రాంతీయతత్వం వేరు. ఇంత చిన్న లాజిక్ మిస్ అవుతూ.. ఇంకా అక్కడి హిందీతోనే ఇక్కడా రాజకీయం చేద్దామంటే కుదురుతుందా?


జేపీ నడ్డా, అమిత్ షాలు.. తమిళనాడు, ఏపీ, తెలంగాణలను చుట్టేస్తున్నారు. మోదీ 9ఏళ్ల పాలన అంటూ.. దక్షిణాదికి పొలిటికల్ టూరిస్టులుగా మారారు. ఇంతటి ప్రతిష్టాత్మక కార్యక్రమానికి బీజేపీ పెట్టుకున్న పేరు..”మహాజన్ సంపర్క్ అభియాన్”. ఇక్కడెవరికైనా తెలుస్తుందా.. ఈ పేరుకు అర్థం ఏంటో? పెద్ద పెద్ద సభలు పెడుతూ.. పెద్ద పెద్ద మాటలు చెబుతున్న ఆ పెద్దోళ్లు.. ఇక్కడికి ఎందుకు వస్తున్నారో? ఏ కార్యక్రమంలో భాగంగా ఈ మీటింగులు పెడుతున్నారో? తెలుసుకోవాలంటే మనకు పూర్తిస్థాయి ఉత్తరాది హిందీ రావాల్సిందే. ‘మహాజన్ సంపర్క్ అభియాన్’ కోసం షా, నడ్డాలు ఏపీ, తెలంగాణకు వస్తున్నారంటే ఎవరికైనా మైండ్‌కు ఎక్కుతుందా? కనీసం ఆ పదాన్ని తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేసైనా చెప్పొచ్చుగా? దక్షిణాది టూర్ల కోసమైనా కాస్త లోకల్ టైటిల్ పెట్టొచ్చుగా?

తెలంగాణ కాస్త బెటర్. చాలామందికి హిందీ అర్థమవుతుంది. అయితే ఇక్కడి హిందీలో ఉర్దూ మిక్స్ అయి ఉంటుంది. సో, తెలంగాణ వాదులకు సైతం మహాజన్ సంపర్క్ అభియాన్ అంటే తలకెక్కడం లేదు. ఇక, ఏపీ వాసుల గురించి చెప్పనక్కరలేదు. ఆంధ్రాలో హిందీ బొత్తిగా రాదు. లేటెస్ట్‌గా విశాఖలో అమిత్ షా సభలో.. ఆయన చేస్తున్న హిందీ ప్రసంగాన్ని తర్జుమా చేయలేక, ఎంపీ జీవీఎల్ ఎంతగా కష్టపడ్డారో తెలియంది కాదు. అమిత్ షా మాట్లాడే హిందీ.. ఢిల్లీలో ఉండే జీవీఎల్‌కే అర్థం కాకపోతే.. ఇక మనోళ్లకు ఇంకేం తెలుస్తుంది? కనీసం, ఏపీ సభల్లోనైనా హిందీలో కాకుండా.. ఇంగ్లీష్‌లో మాట్లాడి ఉంటే కొంతైనా అండర్‌స్టాండ్ అయ్యేదంటున్నారు. మరి, షాకు ఇంగ్లీష్ వచ్చా? అనే డౌట్ ఇంకోవైపు.


అంతెందుకు, హిందీని తీవ్రంగా వ్యతిరేకించే తమిళనాడుకు వెళ్లి మరీ.. హిందీలోనే మాట్లాడుతున్నారు కమలనాథులు. అందుకే, ఇప్పటికీ తమిళులు బీజేపీని.. పరాయి పార్టీగానే చూస్తున్నారని అంటున్నారు. ఏమన్నా అంటే.. హిందీ జాతీయ భాష.. మాట్లాడితే తప్పేంటి? అని సమర్థించుకోవచ్చు. కానీ, దక్షిణాదిన దూసుకుపోవాలంటే.. మోదీ, షా, నడ్డాల వాగ్దాటి వర్కవుట్ అవ్వాలంటే.. ఉత్తరాది స్టైల్ మార్చితే బెటర్..అంటున్నారు.

ఇక, అమిత్ షా తెలంగాణ టూర్‌కు రెడీ అవుతున్నారు. బుధవారం హైదరాబాద్ రానున్నారు. గురువారం స్టార్ డైరెక్టర్ రాజమౌళిని కలిసి.. 9 ఏళ్ల మోదీ పాలనలో జరిగిన అభివృద్ధిని వివరించనున్నారు. ఇది కూడా బీజేపీ కార్యక్రమమే. దీనికి వాళ్లు పెట్టుకున్న పేరు.. “సంపర్క్ సే సమర్థన్”. మళ్లీ సేమ్ కన్ఫ్యూజన్. ఎంతమందికి తెలుస్తుంది.. ‘సంపర్క్ సే సమర్థన్’ అంటే ఏంటో? కాస్త, ఇక్కడి వారికి అర్థమయ్యేలా పెట్టొచ్చుగా? అందుకే, అంటున్నారు నార్త్ వేరు, సౌత్ వేరు. ఇక్కడ రాణించాలంటే.. అక్కడి భాష పనికిరాదు.

Related News

MP Vijayasai Reddy: విజయ సాయిరెడ్డి అక్రమ నిర్మాణాల కూల్చివేత.. చంద్రబాబుపై మండిపాటు

Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదం, విచారణ ఆపాలంటూ సుబ్బారెడ్డి పిటిషన్, సాయంత్రానికి రిపోర్ట్

Tirupati laddu: తిరుపతి లడ్డూ వివాదం.. అముల్ కంపెనీ ఏం చెప్పిందంటే..

MLC Botsa Comments: తిరుమల లడ్డూ కల్తీ వివాదం.. దేవుడితో రాజకీయాలొద్దన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స

Jagan clarification: ఒప్పేసుకున్న జగన్.. మళ్లీ బెంగుళూరుకి, పోతే పోనీ అంటూ

MLA Adimulam case: ఎమ్మెల్యే ఆదిమూలం కేసు కొత్త మలుపు.. అసలేం జరుగుతోంది?

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

Big Stories

×