EPAPER
Kirrak Couples Episode 1

Mossad Secret Operations : టార్గెట్ చేస్తే శాల్తీ లేవాల్సిందే.. ప్రపంచాన్నిషేక్ చేస్తున్న ఇజ్రాయెల్ మొసాద్

Mossad Secret Operations : టార్గెట్ చేస్తే శాల్తీ లేవాల్సిందే.. ప్రపంచాన్నిషేక్ చేస్తున్న ఇజ్రాయెల్ మొసాద్

ఇజ్రాయెల్‌తో ఆటలాడే ప్రయత్నం చేసే ఎవ్వరైనా మొసాద్ కంటి నుండి తప్పించుకోలేరు. బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ జేమ్స్ బాండ్-007 అందరికీ తెలుసు. కానీ, ఇజ్రాయెట్ సీక్రెట్ స్పై మొసాద్ ఎంతమందికి తెలుసు? మిడిల్ ఈస్ట్‌లో తీవ్రవాద గ్రూపులకు, పాశ్చాత్య దేశాల్లో ఇజ్రాయెల్ కోవర్టులకు మొసాద్ ఎంత పరిచయం అంటే.. పేరు వింటేనే చెమటలు పట్టేటంత! అవును, ప్రపంచంలోనే అత్యంత పవర్ ఫుల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్. ఇజ్రాయిల్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ సర్వీస్‌గా 1947లో ఏర్పడిన ఈ ఏజెన్సీ ఇప్పుడు ఇజ్రాయెల్ చేసే యుద్ధాల్లో కీలక పాత్ర పోషిస్తోంది.

సెప్టెంబర్ 17న లెబనాన్‌లోని హిజ్బుల్లా తీవ్రవాదులు వాడుతున్న పేజర్లు వేల సంఖ్యలో పేలిపోయాయి. హిజ్బుల్లా టెక్స్ట్ మెసేజ్‌లు కోసం వాడే ఈ పేజర్లు లెబనాన్ వ్యాప్తంగా దాదాపు ఏకకాలంలో పేలాయి. బీరుట్‌లో ఈ పేలుళ్ల తీవ్రత ఎక్కువగా ఉంది. లెబనాన్ వ్యాప్తంగా వేల సంఖ్యలో పేజర్లు పేలిపోవడం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ పేలుళ్లలో చిన్నారులతో సహా 12 మంది మృతి చెందారు. దాదాపు 3 వేల మంది గాయపడ్డారు. ఇది ఎలా జరిగిందో అర్థం చేసుకొని, తేరుకునే లోపే, లెబనాన్ బీరుట్‌తో పాటు దక్షిణ లెబనాన్‌లో భారీ సంఖ్యలో వాకీ-టాకీలు కూడా పేలడం ప్రారంభించాయి.


సెప్టెంబర్ 18న జరిగి వాకీ-టాకీ పేలుళ్లలో 20 మంది మృతి చెందగా, దాదాపు 500 మంది గాయపడ్డారు. ఇరాన్ మద్దతు ఉన్న సాయుధ గ్రూపు హిజ్బుల్లాపై హఠాత్తుగా ప్రారంభమైన ఈ సీక్రెట్ దాడులు అంతే సాధారణంగా ముగిసాయి. ఎవరు చేశారు. ఎందుకు చేశారన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. అయితే, ఈ దాడికి సంబంధించి అందరి చూపులు మాత్రం ఇజ్రాయెల్ పైకే మళ్లాయి. ఎందుకంటే, ఆ దేశం వాడే సీక్రెట్ హైటెక్ టెక్నాలజీ అలాంటిది. అంతకుమించి, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీల సామర్థ్యం అలాంటిది. అందులోనూ, మొసాద్ అంటేనే ఇలాంటి ఆపరేషన్లకు పెట్టింది పేరు. అమెరికా సీఐఏ కూడా మొసాద్‌ను చూసి నేర్చుకోవాలనే విధంగా ఆ ఏజెన్సీ కామ్‌గా పని కానిచ్చేస్తుంది.

Also Read: పేజర్లు, వాకీటాకీలు, రాకెట్ లాంచింగ్ సైట్స్.. అసలు సినిమా ముందుందా ?

ఇంతకుముందు ఇలాంటి వ్యూహాలను అమలు జరిపిన చరిత్రను పరిశీలిస్తే.. దీని వెనుక ఇజ్రాయెల్ గూఢాచార సంస్థ మొసాద్ ఉందనే అభిప్రాయాలు వెల్లడయ్యాయి. ఎందుకంటే, ఒకేసారి వేల సంఖ్యలో పేజర్లే, వాకీ-టాకీలు పేలాయంటే.. ఈ ఆపరేషన్ ఒక్క రోజులో జరిగేది కాదు. 2022లో ఈ పేజర్లను హిజ్బుల్లా గ్రూపులు కొనుగోలు చేశాయి. అంటే, అప్పటికి హిజ్బుల్లా-ఇజ్రాయెల్ మధ్య ఇప్పుడున్నంత ఉద్రిక్తతలు లేవు. అయినా, మొసాద్ సీక్రెట్ ఆపరేషన్ లక్ష్యం సాధారణ ఊహలకు మించింది. రెండేళ్ల తర్వాత చేయాల్సిన పని కోసం అప్పుడే సిద్ధమయ్యారు. శత్రువులు వారి జేబుల్లో బాంబులు పెట్టుకు తిరుగుతున్నారన్న విషయం వారికే తెలియకుండా చేశారు. మరి, ఇంత డేంజరస్ మిషన్ వెనుక మొసాద్ కాకపోతే ఎవరుంటారు..?

ఇజ్రాయెల్‌ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్‌కు ఇలాంటి పనుల్లో ఆరితేరింది. 1996లో గాజాలో “ది ఇంజనీర్” అనే పేరుతో ఫేమస్‌ అయిన, హమాస్‌ మాస్టర్ బాంబ్ మేకర్, యాహ్యా అయ్యాష్‌ను హతమార్చడానికి సరిగ్గా ఇలాంటి వ్యూహాన్నే అమలు చేసింది మొసాద్. రహస్యంగా పేలుడు పదార్థాలతో అమర్చిన మొబైల్ ఫోన్‌ను ఈ ఆపరేషన్‌లో ఉపయోగించారు. అలాగే, 1972లోనూ మొసాద్ సీక్రెట్ టీమ్ ఇదే తరహాలో పాలస్తీనా లిబరేషన్ కార్యకర్త మహమూద్ హంషారీని హత్య చేశారు. మ్యూనిచ్ ఒలింపిక్స్‌లో 11 మంది ఇజ్రాయెల్ అథ్లెట్లను చంపినందుకు ప్రతీకారం తీర్చుకోవడంలో భాగంగా, పారిస్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో హంషారీ ఉపయోగించిన ఫోన్‌కు మొసాద్ స్పైలు రిగ్గింగ్ చేశారు. హంషారీ ఫోన్ లేపగానే రిమోట్‌తో ఫోన్‌లో దాచి ఉంచిన పేలుడు పదార్థాలను పేల్చేశారు. తొలి రిమోట ఆపరేషన్ వ్రాత్ ఆఫ్ గాడ్, బేనెట్ అని దీనికి పేరు. ఇక, అదే ఏడాది, పాలస్తీనా లిబరేషన్ ప్రతినిథి, బస్సమ్ అబు షరీఫ్‌ను బీరూట్‌లో పుస్తకంలో అమర్చిన బాంబ్‌తో మొసాద్ పేల్చేసింది. మొసాద్ పనితనానికి ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు ఉన్నాయి.

అంచనాలకందని వ్యూహాలను అమలు చేసి, విదేశాల్లోని ప్రత్యుర్థులను మట్టుబెట్టడంలో మొసాద్ ఆరితేరింది. లెబనాన్‌ పేజర్ దాడులకు ముందు, కొద్ది నెలల కిందటే పాలస్తీనా సాయుధ మిలిటెంట్ సంస్థ హమాస్ అగ్ర కమాండర్ ఇస్మాయిల్ హనియే, ఇరాన్ పర్యటనలో ఉండగా.. ఆయన ఉండే ఇంట్లో బాంబు పేల్చి హతమార్చిందీ మొసాద్ ఏజెన్సీనే. ఇరాన్‌లో వీవీఐపీ ప్రాంతంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉన్న ఇంట్లో.. హనియే రాకకు కొన్ని నెలల ముందే చాకచక్యంగా బాంబును అమర్చారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఆ బాంబును రిమోట్‌తో పేల్చేశారు. అయితే, ఆ ఇంటి పైకి రాకెట్ దాడులు జరిగాయని కూడా నాడు నివేదికలు పేర్కొన్నాయి. ఏది ఏమైనప్పటికీ, హనియే హత్యలో మొసాద్ పాత్ర ఉందనేది అందరూ నమ్మే నిజం. ఈ చర్య తర్వాతే ఇరాన్‌, హిజ్బుల్లాకూ.. ఇజ్రాయెల్‌కు మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. అది, లెబనాన్‌లో పేజర్లు పేలడానికి, తర్వాత ఇజ్రాయెల్ క్షిపణి దాడులు చేయడానికి కారణం అయ్యింది.

సుమారు మూడు బిలియన్ డాలర్ల వార్షిక బడ్జెట్‌తో, 7 వేల మంది సిబ్బందితో అమెరికన్ CIA తర్వాత పాశ్చాత్య ప్రపంచంలో రెండవ అతిపెద్ద గూఢచర్య సంస్థ మొసాద్. అందుకే, ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన వారిలో మొసాద్‌ చీఫ్‌ ఒకరిగా ఉంటారు. ప్రస్తుతం, మొసాద్ డైరెక్టర్‌గా ‘డాడీ’ అనే నిక్ నేమ్ ఉన్న డేవిడ్ బర్నియా ఉన్నారు. జూన్ 2021లో యోస్సీ కోహెన్ నుండి డాడీ బాధ్యతలు స్వీకరించారు. అయితే, మొసాద్ చీఫ్ ఎంపిక, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి కార్యాలయం, ఏజెన్సీ, సివిల్ సర్వీస్ అడ్వైజరీ కమిటీలోని ఎంపిక చేసిన కొంతమందికి మాత్రమే తెలిసిన రహస్యంగా ఉంటుంది. ఈ నియామకంలో దేశంలోని మంత్రివర్గం, పార్లమెంటు కూడా ప్రమేయం ఉండదు. సాధారణంగా, మొసాద్ హెడ్‌ను బహిరంగపరచరు. కానీ, 1996లో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ మాజీ డిప్యూటీ కమాండర్ మేజర్ జనరల్ డానీ యాటోమ్ నియామకంతో ఆ చరిత్ర మారింది. తర్వాత, మొసాద్‌ చీఫ్ పదవీ కాలం ఐదు సంవత్సరాలకు పరిమితం చేశారు. ఇక, మొసాద్ స్పై మాస్టర్లలో మొత్తం 13 మంది పురుషులు కాగా, ఇటీవలి కాలంలో ఏజెన్సీలో కొత్త ఒరవడి వచ్చింది. మొసాద్‌కు వెబ్‌సైట్‌ ఉంది. మొసాద్ రిక్రూటింగ్‌లో సాయం చేయడానికి ఫేస్‌బుక్ పేజీని కూడా నిర్వహిస్తుంది.

Related News

TDP MLA Koneti Adimulam Case: నా ఇష్టంతోనే ఆ పని! ఆదిమూలం బాధితురాలు సంచలనం

Tirupati Laddu Controversy: 300 ఏళ్ల చరిత్రకి మరకలు పడ్డాయా.. తిరుపతి లడ్డూ గురించి ఎవరికీ తెలియని నిజాలు

Kutami Strategy: ఎన్నికల ప్రచారంలో పవన్ చేసిన ఛాలెంజ్ నిజమవుతోందా ? సీనియర్లు ఏమంటున్నారు ?

BRS BC Plan: బీసీ మంత్రాన్ని జపిస్తోన్న బీఆర్ఎస్.. కాంగ్రెస్ పోస్ట్ తో కేటీఆర్ కామెంట్స్ వైరల్

Young India Skill University: ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ తో స్కిల్ హబ్ గా తెలంగాణ..

Tirumala Laddu Politics: లడ్డూ కాంట్రవర్సీ.. దేవదేవుడి ప్రసాదంపైనే ఇన్ని రాజకీయాలా ?

Big Stories

×