EPAPER

Savji Dholakia : ఓ బేకరిలో చిన్న ఉద్యోగి.. 12000 కోట్ల ఆస్తికి వారసుడు!

Savji Dholakia : గుజరాత్‌లోని ప్రధాన వ్యాపార కేంద్రం సూరత్ నగరం. ఆ నగరంలో అత్యంత ధనవంతుడు.. బడా వ్యాపారవేత్త సావ్జీ ఢోలకియా (61). వజ్రాల వ్యాపారి అయిన సావ్జీ ఢోలకియా ఆయన నికర ఆస్తుల విలువ రూ.12 వేల కోట్లు. సూరత్‌లో ఎక్కడిపోయినా ఆయన పేరు వినిపిస్తుంది. ఆయన పెద్ద ధనవంతుడు కావడంతో అందరూ ఆయనను సావ్జీ ధన్జీ అని పిలుస్తారు.

Savji Dholakia : ఓ బేకరిలో చిన్న ఉద్యోగి.. 12000 కోట్ల ఆస్తికి వారసుడు!

Savji Dholakia : గుజరాత్‌లో ప్రధాన వ్యాపార కేంద్రం సూరత్ నగరం. ఆ నగరంలో అత్యంత ధనవంతుడు.. బడా వ్యాపారవేత్త సావ్జీ ఢోలకియా (61). వజ్రాల వ్యాపారి అయిన సావ్జీ ఢోలకియా నికర ఆస్తుల విలువ రూ.12 వేల కోట్లు. సూరత్‌లో ఎక్కడికిపోయినా ఆయన పేరు వినిపిస్తుంది. ఆయన పెద్ద ధనవంతుడు కావడంతో అందరూ ఆయనను సావ్జీ ధన్జీ అని పిలుస్తారు.


భారతదేశంలో అతిపెద్ద వజ్రాల తయారీ, ఎగుమతి కంపెనీ అయిన హరి కృష్ణ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని, వ్యవస్థాపకుడు, చైర్మన్ ఈ సావ్జీ ఢోలకియా. ఈ కంపెనీ వజ్రాల తయారీ ఫ్యాక్టరీ సూరత్ నగరంలో ఉంది. ఆయన కంపెనీ మెయిన్ ఆఫీస్ ముంబైలోని ప్రధాన కేంద్రం బాంద్రా కుర్లాలో 19-అంతస్తుల భవనంలో ఉంది. అలాంటి వేల కోట్లు కలిగిన సావ్జీ కుమారుడు ద్రవ్య ఢోలకియా మాత్రం ఒక చిన్న బేకరీలో ఓ చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. అంతకుముందు ఓ చెప్పుల షాపులో, మెక్‌డొనాల్డస్ వద్ద వెయిటర్‌గా.. ఓ కాల్ సెంటర్‌లో కూడా చిన్న ఉద్యోగం చేశాడు. అంత పెద్ద ధనవంతుడి ఇంట్లో పుట్టి ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తూ జీవనం ఎందుకు సాగిస్తున్నాడనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే.. ముందు సావ్జీ ఢొలకియా జీవితం గురించి తెలుసుకోవాలి.

సావ్జీ ఢొలకియా ఏప్రిల్ 12, 1962న గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లా దుధాలా గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించాడు. ఆయనకు ముగ్గురు తమ్ముళ్లు.. తులసి, హిమ్మత్ మరియు ఘనశ్యామ్ ఉన్నారు. పేద కుటుంబంలో పుట్టిన ఆయన నాలుగవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. ఆ తరువాత 14 ఏళ్ల వయసు వచ్చేసరికి.. సూరత్ నగరంలోని తన బాబాయ్ వద్ద వజ్రాల దుకాణంలో చేరాడు. అక్కడే ఉండి వజ్రాల వ్యాపారంపై పట్టు సాధించాడు. ఆ తరువాత తన ముగ్గురు సోదరులను కూడా తనతో పాటే పనిలో పెట్టుకున్నాడు. వారందరికీ వజ్రాల తయారీ, అమ్మకాల గురించి నేర్పించాడు.


అలా సావ్జీ ఢొలకియా తన సోదరులతో కలిసి.. 1992లో వజ్రాల వ్యాపరం కోసం హరి కృష్ణ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీని స్థాపించాడు. కాలక్రమేణా ఆ కంపెనీ దేశంలోని అతిపెద్ద వజ్రాల తయారీ, ఎగుమతి కంపెనీలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఆ తరువాత 2005 సంవత్సరంలో సావ్జీ దేశీయ ఆభరణాల కంపెనీ కిస్నాని కూడా స్థాపించాడు. ఇప్పుడు ఆయన కంపెనీకి దేశవ్యాప్తంగా 6,250 బ్రాంచీలు ఉన్నాయి. 79 దేశాలకు ఆయన కంపెనీ వజ్రాలను ఎగుమతి చేస్తోంది.

అలాగే ఆయన కంపెనీలో 6,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారందరికీ ఆయన ప్రతి ఏడాది దీపావళి రోజున ఖరీదైన బహుమతులు ఇస్తారు. ఖరీదైన ఆభరణాలు, కార్లు, ఫ్లాట్లు, వారి కుటుంబాల కోసం బ్యాంకు ఫిక్సిడ్ డిపాజిట్లు లాంటి బహుమతులు ఇచ్చి.. దీపావళి పండుగ దినాన ఉద్యోగులు సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటారు. అక్టోబర్ 2018లో, సావ్జీ ధంజీ తన అర్హులైన ఉద్యోగులకు 600 కార్లను బహుమతిగా ఇచ్చి.. వార్తల్లో నిలిచారు.

సావ్జీ ఢొలకియా ఒక సామాన్య జీవితం గడపడానికి ఇష్టపడతారు. ఆయన భార్య గౌరీబేన్‌తో కలిసి చాలా సాదాసీదాగా ఉంటారు. ఎక్కువగా ఆర్భాటాలు ఆయనకు నచ్చవు. ఆయనకు నలుగురు పిల్లలు. మీనా, నిమిషా, ద్రవ్య, కిస్నా. 12 ఏళ్ల క్రితం ఒకసారి ఆయన తన కుటంబంతో కలిసి లండన్‌లోని ఒక రెస్టారెంట్‌లో భోజనానికి వెళ్లారు. అక్కడ భోజనం తరువాత బిల్లు చూసి షాకయ్యారు. తాము డబ్బును ఖర్చుపెట్టే విధానం చూసి వారి పిల్లలు జీవితం పట్ల అశ్రద్ధగా ఉండే ప్రమాదముందని వారిద్దరు గ్రహించారు. అప్పుడు ఢొలకియా ఒక కఠిన నిర్ణయం తీసుకున్నారు. వారి పిల్లలకు కొన్ని నెలలపాటు జీవితంలో డబ్బు విలువ ఎంత ముఖ్యమైనదో తెలిసి వచ్చేలా చేయాలనుకున్నారు.

అందుకే ఆయన కుమారుడు ద్రవ్య ఢొలకియాని తన కుటుంబం, తండ్రి పేరు ఉపయోగించకుండా ఒక అనామకుడిగా కొన్ని నెలలపాటు జీవితం గడపాలని ఆదేశించారు. అలా ఆయన కుమారుడు ద్రవ్య.. జేబులో కొంత డబ్బుతో ఇంటి నుంచి బయటికి వెళ్లి.. చేతికి దొరికిన పని చేశాడు. మొదట్లో ఒక చెప్పుల షాపులో చిన్న ఉద్యోగం చేశాడు. ఆ తరువాత ఒక కాల్ సెంటర్‌లో పని చేశాడు. ఆ తరువాత మెక్‌డొనాల్డ్స్‌లో వేటర్‌ ఉద్యోగం కూడా చేశాడు.

ఎక్కడ పనిచేసినా అతను ఎక్కువ రోజులు చేయలేకపోయాడు. కారణం అతను విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు. కొన్ని రోజులు పని చేయడం ఆ తరువాత ఆ డబ్బులను విచ్చలవిడిగా ఖర్చుచేయడం. దీంతో అతనికి తన జీతం డబ్బులు సరిపోయేవి కావు. ఒకసారి అతని వద్ద భోజనం చేసేందుకు రూ.40 కూడా లేని పరిస్థితి ఎదురైంది. అప్పుడతనికి అర్థమైంది. దేశంలో ఎంతోమంది పేదవాళ్లు ఎలాంటి కష్టమైన జీవినం సాగిస్తున్నారని. ఆ తరువాత అతను ఒక బేకరిలో చిన్న ఉద్యోగం చేసి నెల నెలా డబ్బులు పొదుపు ఖర్చు చేసి.. మిగిలిన డబ్బులను తన తండ్రికి ఇచ్చాడు. ఇది చూసి సావ్జీ ఢొలకియాకి అర్థమైపోయింది.. తన కొడుకు జీవితాన్ని అర్ధంచేసుకున్నాడని. ఇప్పుడు ద్రవ్య కూడా తన తండ్రితో పాటు కుటుంబ వ్యాపారం చూసుకుంటున్నాడు.

Related News

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

Big Stories

×