EPAPER

Sam Altman : పురుషులతో సహజీవనం.. చాట్‌జీపిటీ అద్భుత ఆవిష్కరణ.. విచిత్ర మేధావి!

Sam Altman : సామ్ ఆల్ట్‌మ్యాన్.. టెక్ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తోంది. ఇంతకీ ఎవరీ సామ్ ఆల్ట్ మ్యాన్ ఎందుకు ఆయన గురించి ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది.

Sam Altman : పురుషులతో సహజీవనం.. చాట్‌జీపిటీ అద్భుత ఆవిష్కరణ.. విచిత్ర మేధావి!

Sam Altman : సామ్ ఆల్ట్‌మ్యాన్.. టెక్ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తోంది. ఇంతకీ ఎవరీ సామ్ ఆల్ట్ మ్యాన్ ఎందుకు ఆయన గురించి ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది.


టెక్నాలజీ ప్రపంచంలో ఏడాది కిందట వచ్చిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్స్ట్ వర్షన్ ‘చాట్ జీపిటి’ రూపకర్తలలో ఒకరు సామ్ ఆల్ట్‌మ్యాన్. చాట్ జీపిటీ టెక్నాలజీ ‘ఓపెన్ ఏఐ’ అనే స్వచ్చంధ సంస్థకు చెందినది. ఓపెన్ ఏఐ సంస్థలో సామ్ ఆల్ట్‌మ్యాన్ సీఈఓ పదవిలో ఉన్నారు.

అయితే నవంబర్ 17వ తేదిన సామ్ ఆల్ట్ మ్యాన్‌ను ఆ సంస్థ ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ వార్త ప్రపంచమంతా సంచలనం రేపింది. ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. ఒక వ్యక్తి స్థాపించిన సంస్థ నుంచి అతడినే తొలగించడం అనేది వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ చర్చ జరుగుతుండగా అంతలోనే నవంబర్ 20న సామ్ ఆల్ట్‌మ్యాన్‌ను మైక్రోసాఫ్ట్ సంస్థ పిలిచి మరీ ఉద్యోగం ఇచ్చింది. దీంతో ఓపెన్ ఏఐ సంస్థలో పనిచేసే 500 మందికి పైగా ఉద్యోగులు కూడా మైక్రోసాఫ్ట్‌కు తరలి వెళుతున్నారని తెలిసింది.


దీంతో ఓపెన్ ఏఐ పని అయిపోయిందనుకున్నారంతా.. అంతలోనే ఓపెన్ ఏఐ సంస్థకు కొత్త సిఈఓ రావడం.. ఆయన సంస్థ ఉద్యోగులందరినీ అర్జెంట్ మీటింగ్ కోసం పిలవడం జరిగింది. కానీ ఆ మీటింగ్‌ను మూకుమ్మడిగా ఉద్యోగులందరూ బాయ్ కాట్ చేశారు. సామ్ ఆల్ట్ మ్యాన్ తిరిగి సంస్థలోకి రాకపోతే పనిచేసేది లేదని తెగేసి చెబుతూ ఒక వార్నింగ్ లెటర్ ఇచ్చారు. ఇదంతా చూస్తుంటే ఒక సినిమా కథలా అనిపిస్తోంది కదూ.. కానీ ఇదంతా నిజంగా జరిగింది.

ఇంత నాటకీయ పరిణామాల మధ్య ఇప్పుడు సామ్ ఆల్ట్ మ్యాన్ తిరిగి సంస్థలోకి వచ్చారు. ఇది కూడా అనూహ్య పరిణామమే. పైగా ఆయనను ఉద్యోగం నుంచి తొలగించిన బోర్డ ఆఫ్ డైరెక్టర్స్‌ ఉద్యోగం కూడా ఊడింది.

ఈ ఘటనలన్నీ చూస్తే.. ఒక విషయం మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు. సామ్ ఆల్ట్‌మ్యాన్ మామూలు వ్యక్తి కాదు.

ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం..

సామ్ ఆల్ట్‌మ్యాన్ ఏప్రిల్ 22 1985లో అమెరికాలోని మిసోరి రాష్ట్రంలో పుట్టారు. 8 ఏళ్ల వయసున్నప్పుడే ఆయన తల్లిదండ్రులు ఆయన కోసం ఒక APPLE Macintosh COMPUTERని బహుమతిగా ఇచ్చారు. అప్పటి నుంచి ఆయనకు యాపిల్ టెక్నాలజీ పరికరాలంటే చాలా ఇష్టం. బాల్యం నుంచే ఆల్ట్ మ్యాన్.. యాపిల్ కంపెనీ అధిపతి స్టీవ్ జాబ్స్‌ని తన ఐడియల్‌గా భావించేవారు.

కానీ సామ్ ఆల్ట్‌మ్యాన్‌ 16 ఏళ్ల వయసున్నప్పుడు ఒక సమస్యతో బాధ పడేవారు. ఆయన ఓ స్వలింగ సంపర్కడు.. ఆయన గే. అవును సామ్ ఆల్ట్ మ్యాన్‌ మగవారంటే ఇష్టపడేవారు. ఈ విషయం గురించి ఆయనకు ఎవరితో చెప్పాలో అర్థమయ్యేది కాదు. కానీ ప్రపంచంలో తనలాంటి వారు చాలా మంది ఉన్నారని తెలిసి.. ఆయన బయటి ప్రపంచానికి తన గురించి చెప్పారు. ఆయన ప్రస్తుతం ఆస్ట్రేలియాకు చెందిన ఓలివర్ ముహేరిన్ అనే పురుషుడితో డేటింగ్ చేస్తున్నారు.

19 ఏళ్ల వయసులో సామ్ ఆల్ట్ మ్యాన్ స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ డిగ్రీలో చేరారు. కానీ ఆయన తన ఐడియల్ స్టీవ్ జాబ్స్ లాగే డిగ్రీ పూర్తి చేయకుండానే కాలేజ్ వదిలేశారు. 2005లో ఆయన చదువు మానేసి కేవలం 20 ఏళ్ల వయసులో ‘లూప్ట్’ అనే సోషల్ నెట్‌వర్కింగ్ అప్లికేషన్‌ కంపెనీని స్థాపించారు. అంతకు ముందు నుంచే లూప్ట్ కంపెనీ సహవ్యవస్థాపకుడు నిక్ సేవోతో సామ్ సహజీవనం చేసేవారు. వారిద్దరు 9 ఏళ్ల పాటు కలిసి ఉన్నారు.

2008లో సామ్ ఆల్ట్ మ్యాన్ తను గురువుగా భావించే స్టీవ్ జాబ్స్‌ని కలిశారు. అప్పుడాయన సంతోషానికి హద్దులు లేవు. మనం ఎంతగానో ఆరాధించే వ్యక్తి ఒక్కసారిగా తన కళ్లముందు వచ్చేసరికి ఎవరైనా నర్వస్ అవుతారు. అలాగే స్టీవ్ జాబ్స్‌ని ఎదురుగా చూసి సామ్ ఆల్ట్ మ్యాన్ నర్వస్ అయ్యారు. ఈ విషయం ఒక మీడియా Interviewలో స్వయంగా చెప్పారు.

2012లో ఆయన స్థాపించిన లూప్ట్ సంస్థ నష్టాల్లో ఉండడంతో దాన్ని గ్రీన్ డాట్ కార్పొరేషన్ సంస్థకు అమ్మేశారు. ఆ తరువాత సామ్ ఆల్ట్ మ్యాన్ Y Combinator అనే టెక్ సంస్థలో చేరారు. ఆ కంపెనీని తన talentతో 2014 సంవత్సరంలో ఫోర్బ్స్ 30 లిస్టులోకి చేర్చారు.

కానీ ఆయన దృష్టి ఎప్పుడూ భవిష్యత్తులో ఎలాంటి టెక్నాలజీ ఉపయోగపడుతుందనే అంశంపైనే ఉండేది. అందుకే ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ అంటే కృత్రిమ మేధస్సుపై ఫోకస్ చేశారు.

అలా ఆయన ఆలోచనలో నుంచే చాట్ జీపిటి పుట్టింది. అలా 2015లో ఆయన ప్రముఖ వ్యాపారవేత్త ఇలాన్ మస్క్‌తో కలిసి ఓపెన్ ఏఐ అనే సంస్థను స్థాపించారు. స్థాపించినప్పుడు ఇది ఒక నాన్ ప్రాఫిట్ కంపెనీగా మొదలుపెట్టినా.. ఆల్ట్ మ్యాన్ మాత్రం దీనిని ఒక ప్రాఫిటెబుల్ కంపెనీగా తీర్చిదిద్దారు.

కంపెనీ తన జెనెరేటివ్ ఏఐ టూల్ DALL-Eతో టెక్నాలజీ రంగంలో ఒక విప్లవం తీసుకొచ్చింది. ఆ టూల్ నే తరువాత చాట్ జీపిటీ అని పేరు మర్చారు. దీంతో టెక్నాలజీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై రేసు మొదలైంది. ఇప్పుడు దాదాపు అన్ని కంపెనీలు తమ ఏఐ టూల్స్‌ని తీసుకొచ్చాయి.

కానీ చాట్ జీపిటీకి ఉన్న క్రజ్ వేరే. ఒక నెలకి సగటున చాట్ జీపిటీని 10 కోట్ల మంది ఉపయోగిస్తున్నారంటే.. అర్థం చేసుకోవచ్చు. దీనికున్న డిమాండ్ ఏమిటో.

చాట్ జీపిటీ వచ్చీ రాగానే.. మార్కెట్లో పెద్ద దుమారం రేపింది. దీని వల్ల ఎన్నో నష్టాలున్నాయని పలువురు మేధావులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా దీనివల్ల తప్పుడు సమాచారం చేరే ప్రమాదముందని, కాపీ రైట్ సమస్యలు వస్తాయని.. ఎన్నికల ఫలితాలు తారుమారు చేసే అవకాశం ఉందని ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు.

స్వయంగా సామ్ ఆల్ట్ మ్యాన్ కూడా ఏఐ వల్ల పెద్ద పెద్ద తప్పులు జరిగే ప్రమాదముందని అంగీకరించారు. అయితే దానిపై చర్చించాల్సిన అవసరముందని తెలిపారు.

అయినా చాట్ జీపిటీని చాలామంది నిరభ్యంతరంగా ఉపయోగిస్తున్నారు. నవంబర్ 30న చాట్ జీపిటి మొదలై ఒక సంవత్సరం పూర్తవుతుంది. ఇలాంటి సందర్భంలో సామ్ ఆల్ట్ మ్యాన్ కంపెనీలో నుంచి తీసేయబడడం.. మళ్లీ నాటకీయంగా తిరిగి రావడం అనేది ఆసక్తికరంగా మారింది.

అసలు సామ్ ఆల్ట్ మ్యాన్ తొలగింపుకు కారణాలేంటి?.. పరాభవం జరిగినా.. ఆయన మళ్లీ తిరిగి అదే కంపెనీలోకి ఎందుకొచ్చారు? అనే ప్రశ్నలకు సమాధానం..

ఇటీవల సామ్ ఆల్ట్ మ్యాన్ ఓపెన్ ఏఐ కంపెనీలో ఓ కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టారు. దాని గురించి పూర్తి వివరాలు ఎవరితోనూ షేర్ చేయడం లేదు అనే వాదనలు వినిపిస్తున్నాయి. కంపెనీలో బోర్డు డైరెక్టర్లు అయిన నలుగురు ‘ఇల్యా సూట్స్‌వేకర్’, ఆడమ్ డి ఆన్జెలో, తాషా మెకాలె, హెలెన్ టోనర్.. ఈ విషయంపై చర్చించి నవంబర్ 17న సామ్ ఆల్ట్ మ్యాన్‌ను గూగుల్ మీట్‌లో పిలిచి ఆయనను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు చెప్పారు.

ఓపెన్ ఏఐ సంస్థ బోర్డ ఆఫ్ డైరెక్టర్స్ దీని గురించి కారణం చెబుతూ.. సామ్ ఆల్ట్ మ్యాన్ పనీతీరు పారదర్శకంగా లేదు. ఆయన మాతో విషయాలు దాస్తున్నాడు. దీనివల్ల కంపెనీ పనితీరు ప్రభావితం అవుతోందని చెప్పారు.

ఈ వార్త బయటికి రావడం వల్ల మైక్రోసాఫ్ట్ కంపెనీకి పెద్ద దెబ్బ తగిలింది. మైక్రోసాఫ్ట్ మార్కెట్ షేర్లు విలువ భారీగా పడిపోయింది. దీనికి కారణం మైక్రోసాఫ్ట్.. ఓపెన్ ఏఐ సంస్థలో ఏకంగా 11 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది. పైగా సామ్ ఆల్ట్ మ్యాన్ ఓపెన్ ఏఐ కంపెనీకి ఒక బ్రాండ్ ఫేస్.. ఆయనే లేకపోతే ఇక కంపెనీ ఎలా ముందుకు సాగుతుందని అందరూ అనుమానపడ్డారు.

మైక్రోసాఫ్ట్‌కు భారీ నష్టం నుంచి తప్పించడానికి వెంటనే రంగంలోకి మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల దిగారు. సామ్ ఆల్ట్ మ్యాన్‌ని పిలిచి మరీ తమ సంస్థలో పెద్ద పదవి ఇచ్చారు. పైగా ఆయనతో ఓపెన్ ఏఐ ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రెక్ మెన్ కూడా తన పదవికి రాజీనామా చేసి.. మైక్రోసాఫ్ట్‌లో చేరారు. ఇది ఇంతటితో ఆగలేదు ఓపెన్ ఏఐ నుంచి 500 మందికి పైగా ఉద్యోగులు సామ్ ఆల్ట్ మెన్ లేకపోతే తాము కూడా మైక్రోసాఫ్ట్‌లో చేరుతామంటూ చెప్పారు. కానీ ఓపెన్ ఏఐ మేనేజ్మెంట్ బెదరలేదు. వెంటనే కొత్త సీఈఓగా ఎమ్మెట్ షియర్‌ని నియమించింది. ఆయన వచ్చీ.. రాగానే ఉద్యోగులందరితో మాట్లాడాలని గూగుల్ మీట్ పెడితే.. దాదాపు ఉద్యోగులందరూ ఆ మీటింగ్‌ని బాయ్ కాట్ చేశారు. సామ్ ఆల్ట్ మ్యాన్‌ని తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇది చాలదంటూ.. కంపెనీలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు కూడా డైరెక్టర్లపై ఒత్తిడి చేశారు.

ఇక చేసేదేం లేక కంపెనీ యజమాన్యం సామ్ ఆల్ట్ మ్యాన్‌ని తిరిగి కంపెనీలో చేరాలని కోరింది. కానీ ఆయన ఇందుకు షరతులు విధించారు. తనను ఉద్యోగం నుంచి తీసేసిన డైరెక్టర్లు కంపెనీలో ఉండకూడదని చెప్పారు. అందుకు కంపెనీ అంగీకరించడంతో సామ్ మళ్లీ తిరిగి వచ్చారు.

అయితే ఇంకడొక విషయం చెప్పాలి.. బోర్డు సభ్యలలో ఎవరికీ సామ్ ఆల్ట్ మ్యాన్‌ని తొలగించే అధికారం లేదని తాజాగా తెలిసింది. వారంతా కంపెనీలో స్వచ్ఛంద డైరెక్టర్లని.. వారెవరికీ కంపెనీలో ఎటువంటి వాటా లేదు.

ఎందుకంటే.. ఓపెన్ ఏఐ సాధారణ కమర్షియల్ కంపెనీ కాదు. అది ఒక నాన్ ప్రాఫిటెబుల్ కంపెనీ(లాభాపేక్ష లేకుండా పనిచేసే సంస్థ)గా మొదలైంది. కానీ సంస్థను నడిపించేందుకు 2018లో భారీగా నిధులు అవసరం వచ్చిపడింది. చాట్ జీపిటీ లాంటి సాఫ్ట్ వేర్ టూల్స్ చేయడానికి.. నిపుణులైన ఉద్యోగులను జీతాలు చెల్లించడానికి ఈ నిధులు కావాలి. అప్పుడు ఓపెన్ ఏఐ కంపెనీకి ఒక సబ్సిడరీ కంపెనీ ఓపెన్ ఏఐ ఎల్ఎల్‌సిని స్థాపించారు. ఈ కంపెనీ మార్కెట్ నుంచి నిధులు సమీకరిచింది. చాలా మంది ముందుకు వచ్చి పెట్టుబడ్డు పెట్టారు. అలా మైక్రోసాఫ్ట్ కూడా ఈ కంపెనీలో దశల వారీగా భారీ పెట్టుబడులు పెట్టింది.

ఇప్పుడు మాతృక ఓపెన్ ఏఐ కంపెనీ నాన్ ప్రాఫిట్ సంస్థ కాబట్టి ఆ బోర్డు డైరెక్టర్లే పెత్తనం చెలాయిస్తున్నారు. ఈ డైరెక్టర్లు .. కంపెనీ మానవ సేవ ఉద్దేశ్యంత స్థాపించబడింది. కానీ ఇప్పుడు డబ్బులు, లాభాలు అంటూ తప్పుదోవ పట్టిందని చెబుతున్నారు. వారంతా దీనికోసం సామ్ ఆల్ట్ మ్యాన్‌నే నిందించారు. ఆయన కంపెనీలోకి నిధులు తీసుకురావాలని.. లాభాలు ఆర్జించాలనేవైపు ఫోకస్ చేస్తున్నారని.. పైగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ వల్ల వచ్చే ప్రమాదాలపై దృష్టి సారించడంలేదు. అని వాదిస్తున్నారు.

అసలు గొడవేంటి?
స్థానిక మీడియా ప్రకారం. సామ్ ఆల్ట్ మ్యాన్ ఒక కొత్త చిప్ ప్రాజెక్ట్ మొదులపెట్టారు. కొత్త ఏఐ టెక్నాలజీని నడిపేందుకు సెమీ కండక్టర్లు కావాలి. అవి కొనడానికి భారీ నిధులు కావాలి అంటే బిలియన్ల డాలర్లు అన్న మాట . అందుకోసం సామ్.. పలువురు ఇన్విస్టర్లతో రహస్యంగా చర్చలు కూడా జరిపారు. కానీ ఈ విషయం బోర్డు డైరెక్టర్లకు తెలియడంతో గొడవ మొదలైంది.

సామ్ ఆల్ట్ మ్యాన్‌కు ఎదురైన పరిస్థితులు.. ఒకప్పుడు ఆయన గురువు స్టీవ్ జాబ్స్‌కు కూడా ఎదురయ్యాయి. స్టీవ్ జాబ్స్ కూడా యాపిల్ కంపెనీ స్థాపించారు. కొన్నేళ్ల పాటు కంపెనీ బాగా నడిచాక ఆయనను ఆ కంపెనీ నుంచి తొలగించారు. అప్పుడాయన నెక్స్ట్ కంప్యూటర్స్‌ని స్థాపించి మళ్లీ విజయం సాధించారు. కానీ స్టీవ్ జాబ్స్ లేక యాపిల్ కంపెనీ పరిస్థితి డీలా పడిపోయింది. దీంతో ఆ కంపెనీ పెద్దలు మళ్లీ స్టీవ్ జాబ్స్‌ని తీసుకురావాలని.. ఆయన రెండవ కంపెనీ నెక్స్ట్ కంప్యూటర్స్‌ని కొనుగోలు చేసి.. యాపిల్ కంపెనీలో విలీనం చేశారు. అలా తిరిగివచ్చిన స్టీవ్ జాబ్స్ మళ్లీ యాపిల్ కంపెనీని లాభాల బాటలో నడిపించారు.

మరి ఆనాడు స్టీవ్ జాబ్స్ సాధించిన విజయాన్ని.. ఆయన శిష్యుడు సామ్ ఆల్ట్ మ్యాన్ కూడా రిపీట్ చేయాలని ఆశిద్దాం.

Related News

Tirumala Laddu Politics: లడ్డూ కాంట్రవర్సీ.. దేవదేవుడి ప్రసాదంపైనే ఇన్ని రాజకీయాలా ?

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Big Stories

×