EPAPER

YCP – Janasena: లిక్కర్ కలిపిన బంధం.. కలిసిపోయిన జనసేన, వైసీపీ

YCP – Janasena: లిక్కర్ కలిపిన బంధం.. కలిసిపోయిన జనసేన, వైసీపీ

YCP – Janasena: ఎన్నికల్లో కత్తులు దూసిన నేతలు.. పరస్పర దాడులు కూడా చేసుకున్నారు. వీరి ఆవేశం చూసిన కార్యకర్తలు తమకు అండగా ఉంటారని భావించారు. ప్రస్తుతం సీన్ రివర్స్ అయ్యింది. డబ్బు అనే పదం ఇరు పార్టీల నేతల బంధాన్ని కలిపేసింది. ఐదేళ్ల తర్వాత లిక్కర్ షాపులను ప్రభుత్వం.. ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వటంతో పార్టీలకు అతీతంగా కలసిపోయారట. దుకాణాలు చేజిక్కించుకుని తిరిగి సిండికేట్ కావడానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నారట. ఇంతకీ ఎవరా నేతలు..? ఎక్కడా ముచ్చట ఓ లుక్కేద్దాం రండి.


ఎన్నికల ముందు చిత్తూరునుంచి వచ్చి బరిలో దిగిన ఆరణి శ్రీనివాసులును అడుగడుగునా అడ్డుకుంది వైసీపీ నేతలేనట. అదే సమయంలో ఆయనపై తీవ్ర విమర్శలు కూడా చేశారు. ప్రస్తుతం.. పరిస్థితి మారింది. మద్యం దుకాణాల వేలం.. రెండు పార్టీలకూ చెందిన నేతలను కలిపిందట. తిరుపతిలో వైసీపీ- జనసేన కలసిపోయిందా అనే రీతిలో వ్యాపారం కలసి చేస్తున్నారట. ఎన్నికల తర్వాత మెజార్టీ వైసీపీ నేతలు.. జనసేనతో కలసిపోయి తమకు TDR బాండ్స్ ఇష్యూలో ఇబ్బందులు రాకుండా చేసుకున్నారట. దశాబ్దాల కాలంగా తిరుపతిలో లిక్కర్ వ్యాపారం అంటే టక్కున గుర్తొచ్చేది ప్రతాపరెడ్డి, వెంకటరెడ్డి పేర్లే. వీరి కనుసన్నల్లోనే లిక్కర్ వ్యాపారం నడిచేది. ఏపీలో ఏ ప్రభుత్వం వచ్చినా.. ఈ ఇద్దరి హావా నడిచేదట. ఆ ఇద్దరూ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రస్తుతం వైసీపీలో కీలక నేతలుగా కొనసాగుతున్నారు.

తాజాగా జరిగిన లిక్కర్ షాపుల కోసం వెంకటరెడ్డి.. జనసేన MLA ఆరణి శ్రీనివాసులతో కలసి గ్రూపు తయారు చేసుకున్నారట. ఇందులో కొంతమంది టీడీపీ లిక్కర్ వ్యాపారులు కూడా చేరారని టాక్‌. తిరుపతి నగరంతో పాటు జిల్లాలో 325 దుకాణాలకు దరఖాస్తు చేశారు. లాటరీలో వీరికి.. ఎనిమిది దుకాణాలు వచ్చాయి. తిరుపతిలో ఆరు, శ్రీకాళహస్తి, తిరుపతి రూరల్‌లో ఒకటి.. చొప్పున మొత్తం 8 దుకాణాలను దక్కించుకున్నారట. అంతేకాదు.. మరిన్ని దుకాణాలను సొంత చేసుకోవడానికి ప్రయత్నాలు కూడా చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగానే సిండికేట్ ఏర్పాటుకు యత్నించారట. మొత్తం మీద తిరుపతిలో మాత్రం జనసేన- వైసీపీ జంటగా.. మద్యం వ్యాపారంలో భాగస్వాములు అయ్యారనే చర్చ జోరుగా సాగుతోంది.


Also Read: ఎమ్మెల్యేలకు బాబు స్ట్రాంగ్ వార్నింగ్.. అందులో వేలు పెట్టారో.. ఒప్పుకోనంటూ హెచ్చరిక

ప్రభుత్వం ఇచ్చే మార్జిన్ సరిపోదని.. సిండికేట్‌ అయితేనే తప్ప లాభాలు రావని మద్యం దుకాణాల యజమానులు భావిస్తున్నారట. ఇందులో భాగంగా.. తిరుపతి నగరంతో పాటు రూరల్‌లోని దుకాణాలను కూడా సిండికేట్‌లోని భాగస్వామ్యం చేయాలని నిర్ణయించుకున్నారట. దీనికోసం చంద్రగిరిలో ఓ యువ నాయకుడిని కూడా కలుపుకున్నారట. మద్యం బాబులకు MRP కంటే పది నుంచి ఇరవై రూపాయలు ఎక్కువుగా అమ్మడానికి ప్లాన్ చేస్తున్నారట. దీనిని గమనిస్తున్న టీడీపీలోని సీనియర్ నాయకులు.. ఇదే అదనుగా.. ఈ వ్యవహారాన్ని ఇప్పటికే అధిష్టానానికి దృష్టికి తీసుకెళ్లారని తెలుస్తోంది. పనిలో పనిగా.. తమను స్థానిక ఎమ్మెల్యే ఏ విధంగా దూరం పెడుతున్నారో పూస గుచ్చినట్లు చెప్పేశారట.

తిరుపతిలో అన్న క్యాంటీన్లను.. స్థానిక టీడీపీ నాయకులు లేకుండా MLA ఆరణి శ్రీనివాసులు ప్రారంభోత్సవం చేసిన విషయంపైనా టీడీపీ అధిష్టానానికి.. నేతలు… కంప్లైంట్ చేశారని తెలుస్తోంది. టిక్కెట్ ఇవ్వటం దగ్గర నుంచి ఉప్పూనిప్పులా ఉన్న టీడీపీ-జనసేన నేతల మధ్య రోజురోజుకూ గ్యాప్‌ పెరుగుతోందని.. దానికి గల కారణాలేంటనే అంశంపైనా పార్టీ పెద్దలతో తెలుగుదేశం నేతలు చర్చించారట. ఈ అగాధం కాస్తా తాజాగా జరిగిన మద్యం దుకాణాల సిండికేట్ వ్యవహారంతో మరింతగా ముదిరిందని టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే..లిక్కర్ షాపుల కోసం జనసేనతో కలసిన… వైసీపీ లిక్కర్ సిండికేట్ మాత్రం తెగ ఎంజాయ్ చేస్తోందట.

కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లు తమ దుకాణాలపై ఎక్సైజ్ శాఖ అధికారులు ఎలాంటి దాడులూ చేయరని హ్యాపీగా ఉన్నారట. మొత్తానికి రాష్ట్రవ్యాప్తంగా జనసేన- వైసీపీ ఉప్పూ నిప్పూలా ఉంటే.. తిరుపతిలో మాత్రం సీన్ వేరుగా ఉందని పొలిటికల్ వర్గాల టాక్‌. స్థానిక ఎమ్మెల్యేను తమ పార్టనర్‌గా కలుపుకుంటే.. భవిష్యత్‌లో ఎలాంటి సమస్యా ఉండదనే భావనలో వైసీపీ నేతలు ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కాబట్టి.. కాసుల ముందు రాజకీయమైనా.. ఇతర గొడవలైనా.. తక్కువే అన్నట్లుగా ఉందని స్థానికులు చెవులు కొరుక్కుంటున్నారట.

 

Related News

Dubbaka Politics: దుబ్బాక రాజకీయం.. వణుకుతున్న ఖాకీలు

India-Canada Crisis: ఆ దేశాల టార్గెట్ భారత్ పతనం.. అదే జరిగితే వరల్డ్ వార్ 3 తప్పదా?

Sajjala VS Vijay Sai Reddy: కేసుల్లో సజ్జల.. సంతోషంలో విజయసాయి రెడ్డి

Aliens: ఏలియన్స్ జాడ దొరికేసింది..! ఇదిగో సాక్ష్యాలు.. సంచలనం రేపుతున్న రిపోర్ట్..

South Korea Vs North Korea: యుద్దంలోకి కిమ్.. కొరియా అల్లకల్లోలం కానుందా..?

TDP VS Janasena: భగ్గుమన్న నిడదవోలు.. కూటమిలో కొట్లాట?

Big Stories

×