EPAPER

AP Elections 2024: చిత్తూరు.. ఎవరికి చిక్కు?

AP Elections 2024: చిత్తూరు.. ఎవరికి చిక్కు?
Reddeppa Vs Daggumalla Prasad Rao
Reddeppa Vs Daggumalla Prasad Rao

చిత్తూరు లెక్కలు టీడీపీ, వైసీపీలకు ప్రతిష్టాత్మకంగా మారిన చిత్తూరు చిత్తూరు ఎంపీ అభ్యర్ధిగా వైసీపీ నుంచి రెడ్డప్ప డీపీ అభ్యర్ధి దగ్గుమల్ల ప్రసాదరావు త జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టిన చంద్రబాబు శిష్యుడు రెడ్డప్ప కోసం మంత్రి పెద్దిరెడ్డి కసరత్తు ద్రబాబు వర్సెస్ పెద్దిరెడ్డిగా మారిన చిత్తూరు పార్లమెంటు సెగ్మెంట్ 1996 నుంచి టీడీపీకి కంచుకోటగా ఉంటూ వచ్చింది. యితే గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి శివప్రసాద్ అక్కడ హ్యాట్రిక్ విజయానికి దూరమయ్యారు. క్‌సభ స్థానం పరిధిలో ఒక్క కుప్పంలో తప్ప మిగతా అన్ని స్థానాలలో టీడీపీ భారీ తేడాతో ఓటమి పాలవ్వడం ఎంపీ స్థానంపై తీవ్ర ప్రభావం చూపించింది. ఆ క్రమంలో వైసీపీ అభ్యర్ధి రెడ్డప్ప లక్షా 30 వేల ఓట్ల తేడాతో శివప్రసాద్ పై విజయం సాధించారు. మరోసారి రెడ్డప్ప వైసీపీ నుంచి అభ్యర్థిగా రంగంలో ఉన్నారు.

గత ఎన్నికల్లో టీడీపీకి రాష్ట్రవ్యాప్తంగా ఊహించని పరాజయం ఎదురైంది.. దానిపై పోస్ట్ మార్టం చేసుకున్న టీడీపీ పెద్దలు… ఈ సారి అభ్యర్ధుల ఎంపికలో ఆచితూచి వ్యవహరించారు.. సర్వేల మీద సర్వేలు చేయించుకుని కేండెట్లను ప్రకటించారు. చిత్తూరు ఎంపీ అభ్యర్ధిగా అన్ని విధాలా బలమైన అభ్యర్ధి మాజీ ఐఅర్ఎస్ అధికారి దగ్గుమల్ల ప్రసాద్‌రావును బరిలో దింపారు. రాధే కన్స్‌ట్రక్షన్స్ యజామాని ప్రసాద్ రావు ఐఅర్ఎస్ అధికారిగా దేశంలోని వివిధ ప్రాంతాలలో పనిచేసారు.  షుగర్ ప్యాక్టరీల నిర్వహాణతో పాటు పాడి పరిశ్రమ, పౌల్ట్రి పరిశ్రమ,గ్రానైట్ పరిశ్రమలపై అవగాహన ఉన్న ఇండస్ట్రియలిస్ట్.  కుప్పంతో పాటు చిత్తూరులో గ్రానైట్ పరిశ్రమలు, పౌల్ట్రీ, పాడి పరిశ్రమలు ఎక్కువే. అందుకే ప్రసాదరావు అందరితో మమేకమవుతారనే తన సొంత నియోజకవర్గం అభ్యర్ధిగా ప్రకటించారంటున్నారు.


Also Read: తేలనున్న కాళేశ్వరం కహానీ! కమిటీ రూల్స్ ఇవే

మరోవైపు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో టీడీపీ బలమైన ఎమ్మెల్యే అభ్యర్ధులనే రంగంలోకి దింపించి  కుప్పం నుంచి చంద్రబాబు 8వ సారి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు మెజార్టీ 30 వేలు మాత్రమే రావడం ఎంపీ స్థానంపై ప్రభావం చూపించింది. అయితే ఈ సారి లక్ష మెజార్టీతో గెలిపిస్తామంటున్నారు కుప్పం టీడీపీ నేతలు. టీడీపీ యువ నేత కంచర్ల శ్రీకాంత్ తన యూత్ ఫోర్స్‌తో యువఓటర్లను ఆకట్టుకోవడనికి ఎప్పటి నుంచో గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. దాంతో పాటు స్థానికంగా పేరున్న డాక్టర్ సురేష్ బాబు క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. బాబుకు ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న వైసీపీ ఎమ్మెల్సీ భరత్.. తన సామాజికవర్గం ఓట్లతో పాటు.

మంత్రి పెద్దిరెడ్డి అండదండల్లే నమ్ముకున్నట్లు కనిపిస్తున్నారు. కుప్పం సెగ్మెంట్ స్థానిక సంస్థల్లో వైసీపీ పాగా వేయడంలో పెద్దిరెడ్డి కీలక పాత్ర పోషించడంతో.. ఈ సారి చంద్రబాబును కట్టడి చేస్తామన్న ధీమా భరత్‌లో వ్యక్తమవుతోంది. పలమనేరులో టీడీపీ నుంచి పోటీలో ఉన్న మాజీ మంత్రి అమర్నాథ్‌రెడ్డి తన పాత ప్రత్యర్థి అయిన వైసీపీ ఎమ్మెల్యే వెంకటేగౌడ్‌పై పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో తాను ఎంత తేడాతో ఓడిపోయానో.. అంతకంటే ఎక్కువ మెజార్టీతో గెలవాలన్న పట్టుదలతో ఉన్నారు అమర్నాథ్‌రెడ్డి. తంలో జరిగిన తప్పిదాలను దృష్టిలో ఉంచుకోని నియోజకవర్గంలోని ప్రతి తలుపు తడుతున్నారు. అయితే వెంకటే గౌడ్ ఈసారి వ్యూహత్మకంగా పావులు కదుపుతున్నారు .. వైసీపీ పఠిస్తున్న బీసీ మంత్రాన్ని ఫోకస్ ఆ కార్డు వాడుకుని గట్టెక్కే ప్రయత్నం చేస్తున్నారు.

Also Read: లోక్ సభ ఎన్నికలు.. సౌత్ లో సత్తా చాటేదెవరు ?

చిత్తూరు సెగ్మెంట్లో టీడీపీ ఈసారి కొత్త అభ్యర్థిని రంగంలో దింపింది. చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా గుడిపాల మండలానికి చెందిన రియల్టర్ గురజాల జగన్మోహన్ పట్టబట్టి మరీ టికెట్ దక్కించుకున్నారు. గత అరు నెలలుగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న గురజాల తన దైన రీతిలో దూసుకు పోతున్నారు. రోవైపు వైసీపీ నుంచి మరో బిగ్‌షాట్ అర్టీసి మాజీ వైఎస్ చైర్మన్ విజయానందారెడ్డి ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇద్దరూ బడాబాబులే అవ్వడంతో చిత్తూరు ఎన్నికలు అత్యంత కాస్ట్లీగా మారిపోయాయి.  వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బలిజ సామాజిక వర్గానికి చెందిన అరణీ శ్రీనివాసులకు టికెట్ ఇవ్వక పోవడంతో ఆ వర్గం నేతలు అసంతృతో కనిపిస్తున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యేలు సీకే బాబు, మనోహర్‌లు టీడీపీకి మద్దతు ప్రకటించడంతో తెలుగు తమ్ముళ్లు కొత్త ఉత్సాహంతో కనిపిస్తున్నారు. ఏదేమైనా అక్కడ పైసలే ఫలితాన్ని శాసించే పరిస్థితి నెలకొంది.

చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె ఉన్న చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఈసారి వైసీపీ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి పోటీలో ఉన్నారు.  టిడిపి నుంచి పులివర్తి నాని మరోసారి పోటీ చేస్తున్నారు … చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు నుంచి ఎంపిగా బరిలో ఉండి ఆ సెగ్మెంట్‌కే పరిమితమవుతుండటం యువకుడైన మోహిత్‌కు మైనస్‌ అయిందంటున్నారు. దేళ్లుగా చెవిరెడ్డి హయాంలో నియోజవర్గ అభివృద్ది పడకేసిందన్న విమర్శలున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తర్వాత చంద్రగిరిలోని అన్ని గ్రూపులు ఈసారి గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. డ ఎవరు గెలిచినా నామమాత్రపు మెజార్టీనే దక్కే పరిస్థితి కనిపిస్తోంది.

నగరి నియోజకవర్గంలో మంత్రి రోజా హ్యాట్రిక్ విజయంపై కన్నేసినా. స్థానిక పరిస్థితులు ఆమెకు అనుకూలంగా కనిపించడం లేదంట.. అక్కడ అన్ని మండలాల్లో ఆమెకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు గ్రూపుల కట్టారు.. అసలు రోజాకు టికెట్ ఇవ్వకూడదని వారు చాలా హడావుడే చేశారు. వారందర్నీ ఏకతాటిపైకి తెచ్చుకోవడం రోజాకు కత్తి మీద సామే అంటున్నారు. గరిలో టీడీపీ నుంచి దివంగత మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడి కుమారుడు గాలి భానుప్రకాశ్ రెండో సారి ఎన్నికల బరిలో నిలిచారు … గత ఎన్నికల్లో కేవలం రెండు వేల పైచిలుకు ఓట్లతో పరాజయం పాలైన గాలి వారసుడికి.. ఈ సారి వైసీపీలోని విభేదాలు కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది.. మరోవైపు జనసేన, బీజేపీ నేతలు ఆయనకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు.

Also Read: BIG Shock To Amanchi : ఆమంచి రూటెటు?మొదటికే…

రిజర్వుడు నియోజకవర్గం అయిన పూతలపట్టు లో వైసీపీ తరపున మాజీ ఎమ్మెల్యేడాక్టర్ సునీల్ పోటీ చేస్తున్నారు. ఈయన 2014 లో వైసీపీ నుంచి 900 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. త 2019లో ఎంఎస్ బాబు ముప్పయివేల ఓట్ల అధిక్యతతో వైసీపీ నుంచి గెలిచారు. ఈ సారి ఎంఎస్‌బాబుని పక్కన పెట్టిన వైసీపీ సునీల్‌కు అవకాశం ఇవ్వడంతో వైసీపీ శ్రేణుల్లో ఒకింత గందరగోళం కనిపిస్తోంది. ఈసారి టిడిపి నుంచి జర్నలిస్టు డాక్టర్ కలికిరి మురళీ మోహన్ పోటీ చేస్తున్నారు . టీడీపీ, మిత్రపక్షాల క్యాడర్ సహాకారంతో దూకుడు ప్రదర్శిస్తున్నారు. టీడీపీలోని అగ్రవర్ణాల నేతల ఇగోతో పార్టీకి ప్రతి సారి నష్టం జరుగుతుందన్న అభిప్రాయం ఉంది. అయితే ఈసారి అందరూ కలిసి పనిచేస్తుండటంతో టీడీపీ శ్రేణులు హ్యాపీ అవుతున్నాయి.

Tags

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×