EPAPER
Kirrak Couples Episode 1

Rapid Change in Global Economy | 2024లొ మారనున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు.. ఇకపై నో ఫ్రీ ట్రేడ్?

Rapid Change in Global Economy | ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు వేగంగా మారబోతున్నాయి. New Yearలో Global business system ఒక నవ శకానికి నాంది పలకబోతోంది. భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ అంతర్జాతీయ బిజినెస్‌‌లో కీలక మార్పులు కోరుకుంటున్నాయి. ఈ మార్పుకు నాయకత్వం వహించబోతోంది ప్రపంచ సూపర్ పవర్ అమెరికా.

Rapid Change in Global Economy | 2024లొ మారనున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు.. ఇకపై నో ఫ్రీ ట్రేడ్?

Rapid Change in Global Economy | ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు వేగంగా మారబోతున్నాయి. New Yearలో Global business system ఒక నవ శకానికి నాంది పలకబోతోంది. భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ అంతర్జాతీయ బిజినెస్‌‌లో కీలక మార్పులు కోరుకుంటున్నాయి. ఈ మార్పుకు నాయకత్వం వహించబోతోంది ప్రపంచ సూపర్ పవర్ అమెరికా. కానీ ఈ మార్పుతో లాభాలే కాదు నష్టాలు కూడా కనిపిస్తున్నాయి. ఇంతకీ ఏమిటా మార్పులు.. ఆ మార్పులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?


International tradeపై ఆధిపత్యం సాధించిన చైనాకు చెక్ పెట్టేందుకు ప్లాన్ చేస్తున్న అమెరికా. చైనాపై ఆధారపడకుండా.. స్వయంగా manufacturing hubs పెట్టాలని అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ పిలుపునిచ్చారు. International బిజినెస్‌‌లో కింగ్ అయిన చైనా.. తన ఆర్థిక బలంతో ప్రపంచంపై క్రమంగా పెత్తనం చెలాయిస్తోంది. కానీ చెనాకు చెక్ పెట్టడం అంత ఈజీ కాదు.

ఏళ్ల తరబడిగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక system, ఒక పద్ధతి ప్రకారం నడుస్తోంది. ఇది చాలా క్లిష్టమైన system. ఈ వ్యవస్థతో ప్రపంచ దేశాలన్నీ ఒక కనెక్షన్‌లో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ connection cut చేసే దిశలో అమెరికా సహా పలు దేశాలు అడుగులు వేస్తున్నాయి. ప్రపంచంలో సూపర్ పవర్‌గా ఉండడానికి అంతర్జాతీయ వ్యాపారాన్ని ఒక అయుధంలా ప్రయోగిస్తున్న బడాదేశాల వైఖరే దీని ప్రధాన కారణం. ఇందులో ముఖ్యంగా తలపడేది అమెరికా, చైనా దేశాలే అయినా.. భారత్ లాంటి దేశాలపై దీని తీవ్ర ప్రభావం ఉంటుంది.


అసలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎలా ఏర్పడింది. అందులో ఏ మార్పులు రాబోతున్నాయో ఒకసారి చూద్దాం.

మనం style కోసం వేసుకునే బట్టలు, చెప్పులు, ఎక్కువ ఫీచర్లున్న computers, smartphones, ఇతర electronics, మనం తినే tasty chocolates, biscuits, ఇతర ఆహార పదార్థాలు, ఇవ్వన్నీ ఎక్కడో దూర దేశాలలో తయారు చేయబడి మన వరకూ ఎలా చేరుకుంటున్నాయి? ఈ ప్రశ్నకు సమాధానం Global trade.

Global trade అంటే ప్రపంచ వ్యాప్తంగా దేశాల మధ్య జరిగే వ్యాపారం. ఈ Global tradeపైనే Global economy అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది. వందల సంవత్సరాల నుంచి ప్రపంచంలో Global trade జరుగుతోంది. ఉదాహరణకు మన దేశంలో తయారు చేయబడే కాటన్, టెక్స్ టైల్, మసాలాలు వేరే దేశాలకు ఎగుమతి అవుతాయి. అదే సౌదీ అరేబియా లాంటి గల్ఫ్ దేశాల నుంచి మనకు కావాల్సిన పెట్రోల్, డీజిల్, అలాగే చైనా నుంచి Oppo, Redmi, Vivo లాంటి smartphones, జర్మనీ, జపాన్ లాంటి దేశాల నుంచి కార్లు, మెషీన్లు భారత దేశం దిగుమతి చేసుకుంటుంది. అలా దేశాల మధ్య జరిగే వ్యాపార లావాదేవీలతో Global economy నడుస్తుంది.

20th century ప్రారంభం వరకూ అంటే 1914 వరకూ అంతా బాగానే ఉంది. ప్రపంచంలోని దేశాలన్నీ తమ దేశ ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ.. తమకు కావాల్సినవి దిగుమతి చేసుకునేవారు. కానీ ప్రతీ దేశం తమకు తొచిన రీతిలో పన్నులు విధించేది. తమ కరెన్సీలోనే వ్యాపారం చేయాలని నిబంధనలు విధించేవి. ఇలాంటి problems ఉండగా.. ఒక్కసారిగా ప్రపంచ మొత్తం అతలాకుతలమైపోయింది. కారణం రెండు ప్రపంచ యుద్దాలు World War 1, World War 2. ఈ యుద్దాల సమయంలో ప్రపంచం రెండు భాగాలుగా విడిపోయింది. రెండో ప్రపంచ యుద్ధం తరువాత అప్పటికి వరకూ ప్రపంచ సూపర్ పవర్‌గా ఉన్న బ్రిటీషర్లు కుప్పకూలిపోయారు. కానీ అదే సమయంలో అమెరికా సూపర్ పవర్‌గా ఆవిర్భవించింది. అమెరికాకు పోటీగా రష్యా సోవియట్ యూనియన్ ఉన్నప్పటికీ.. అది ముక్కలైపోయి బలహీనమైపోయింది.

ఆ వెంటనే అంతర్జాతీయ వ్యాపారంలో కూడా కొత్త Rules వచ్చాయి. ప్రపంచ దేశాలకు అమెరికా పెద్దన్న పాత్ర పోషించింది. ఈ కారణంగానే అమెరికా కరెన్సీ డాలర్ baseగా వ్యాపారం కొనసాగించేందుకు ప్రపంచ దేశాలు అంగీకరించాయి. దీంతో దేశాల మధ్య జరిగే వ్యాపారం సజావుగా సాగేది. ఆ సమయంలో ప్రపంచ యుద్ధాల కారణంగా చాలా దేశాల ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతినడంతో అన్ని దేశాలు.. అమెరికా ప్రతిపాదించిన free tradeకు అనుమతించాయి. free trade అంటే ఎగుమతులు, దిగుమతులపై ఆంక్షలు, లేదా పన్నులు లేకుండా చేయడం. ఈ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ క్రమంగా బలపడడం మొదలైంది.

అమెరికా ఈ free tradeని ప్రోత్సహించాలని కోరింది. ఈ free trade కారణంగా ధనిక దేశాలు.. పేద దేశాలలో పెట్టుబడులు పెట్టారు. తక్కువ ఖర్చుకే భూమి, లేబర్ దొరకుతుండడంతో అక్కడ దొరికే వనరులతో అక్కడే products తయారు చేసి ఎగుమతులు చేయడంతో ఎక్కువ లాభాలు పొందేవారు. క్రమంగా ప్రపంచమంతా ఒక్క పెద్ద మార్కెట్ లాగా మారిపోయింది. దీని వల్ల లక్షల, కోట్ల మందికి ఉద్యోగాలు కూడా దొరికాయి. అప్పుడే సీన్‌లోకి చైనా ఎంట్రీ ఇచ్చింది. అమెరికా ఒక Capitalist. దాని పెట్టుబడి విధానాలకు కమ్యూనిస్టు అయిన రష్యా దూరంగా ఉన్నా, మరో కమ్యూనిస్టు దేశం చైనా మాత్రం అమెరికా విధానాలతో బిజినెస్ చేయాలని ముందుకొచ్చింది.

అందుకు అమెరికాకు తమ ఉత్పత్తులు ఎగుమతి చేసేందుకు చైనా ప్రభుత్వం తమ దేశంలోని ప్రధాన సముద్ర తీర నగరాలలో షిప్పింగ్ హార్బర్‌లు, factoryలు నిర్మించింది. లక్షలు, కోట్ల సంఖ్యలో చైనాలోని పేద ప్రజలు ఈ సముద్ర తీర నగరాలకు ఉపాధి కోసం తరలివచ్చారు. వారంతా తక్కువ లేబర్‌కే కష్టపడి పనిచేసేందుకు సిద్ధమయ్యారు. ఎంత తక్కువ ఖర్చు అంటే అమెరికాలోని Detroit, Buffalo లాంటి నగరాల్లో ఉన్న కంపెనీలు ఖర్చు తకువ కావడంతో తమ factoryలను చైనాకు తరలించాయి. దీంతో చైనా ఒక బిజినెస్ హబ్‌గా మారిపోయింది. చైనాలోని నగరాల్లో నివసించే పేదలు కాస్త మిడిల్ క్లాస్, ధనికులుగా మారిపోయారు.

దీని వల్ల నష్టాలు కూడా జరిగాయి. అమెరికా, ఇతర ధనిక దేశాలలో చాలా మంది ఉద్యోగాలు కోల్పాయారు. చిన్న చిన్న గ్రామాల్లో పేదరికం సమస్య మొదలైంది. దీనినే అమెరికాలో చాలా మంది చైనా షాక్ అని అంటారు. కానీ ఈ సమస్యను ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఎందుకంటే ప్రజలకు సూపర్ మార్కెట్లలో చైనా లాంటి దేశాల నుంచి వచ్చే products తక్కువ ఖరీదుకే అందుబాటులోకి వచ్చాయి. బట్టలు, చెప్పులు, టీవీలు, వాహింగ్ మెషీన్లు, బొమ్మలు, ఫర్నీచర్ ఇలా అన్నీ చైనా ఫ్యాక్టరీల నుంచి తక్కువ ఖరీదుకే Wal Mart లాంటి SUPER MARKETSలో లభించేవి.

చైనాను చూసి ఇండియా, Thailand, Vietnam,చిలీ లాంటి దేశాలు తక్కువ ఖర్చుతో ఎగుమతులు చేసేందుకు స్పీడు పెంచాయి. 1980వ దశకం వచ్చేసరికి చైనా ఎకానిమీ బలంగా తయారైంది. ఈ సమయంలోనే అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాలు ఆర్థిక పాలసీలు మరింత సులభతరం చేసి Globalization అంటూ ప్రపంచం ముందు కొత్త మంత్రం మొదలుపెట్టాయి.

1990 దశకంలో ప్రధాని పివి నరసింహారావు నేతృత్వంలో ఇండియా కూడా ఈ గ్లోబలైజేషన్‌కు జైకొట్టింది. ఫలితంగా దేశంలో విదేశీ పెట్టుబడులు వరదలా వచ్చాయి. ఆర్థిక సంక్షోభంలోన్న భారత్‌లో ఈ గ్లోబలైజేషన్‌ వల్ల భారీగా నిధులు వచ్చాయి. భారీ సంఖ్యలో ప్రజలకు ఉద్యోగాలు దక్కాయి. ఈ free trade కారణంగా దేశాల మధ్య శత్రుత్వాలు కూడా తగ్గాయని చెప్పాలి. ఎందుకంటే దేశాల మధ్య లావాదేవీల ద్వారా వచ్చే లాభాల ముందు పాత కక్షలను అక్కడి ప్రభుత్వాలు పక్కన పెట్టాయి. రష్యా మాత్రం మిగతా ప్రపంచంతో కలవకుండా విడిగా ఉండడం వల్ల చాలా నష్టపోయింది. అక్కడి ప్రజలు ముఖ్యంగా యువత ఉద్యోగాలు లేక కమ్యూనిజంకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు.

ఈ Globalization, free trade ఫలితాలు చూసి చాలా దేశాలలో ప్రజలు అమెరికా, భారత్ తరహా ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నారు. ఎందుకంటే అక్కడి ఆర్థిక పాలసీ వల్ల పేదరిక సమస్యకు సమాధానం దొరికింది. అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్.. చైనా కూడా ప్రజాస్వామ్యం స్వీకరిస్తే దాని ఎకానమీ మరింత బలోపేతం అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశాల మధ్య free trade కొనసాగితే యుద్దాలు ఉండవని చెప్పారు. దీనికి ఉదాహరణ యూరప్ దేశాలు. యూరప్ దేశాల మధ్య ఎప్పుడూ యుద్ధాలు జరిగేవి. కానీ ఇప్పుడు యూరప్ దేశాలు ఆర్థికంగా బలపడేడానికి చేతులు కలిపాయి. ఈ దిశగానే యూరప్ దేశాల కూటమి.. యూరోపియన్ యూనియన్ ఏర్పడింది.

ఈ free trade ద్వారా ప్రపంచంలోనే అత్యధిక ఎగుమతులు చేస్తూ అంతర్జాతీయ బిజినెస్‌లో లీడర్‌గా ఎదిగింది చైనా దేశం. చైనా చేసే ఎగుమతులలో సింహ భాగం అమెరికాకే వెళతాయి.

free trade కారణంగా దేశాల మధ్య శత్రుత్వాలు తుడిచిపెట్టుకుపోతాయని భావిస్తున్న తరుణంలో మళ్లీ దశాబ్ద కాలంగా పరిస్థితులు వెనక్కి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా, చైనా మధ్య ప్రపంచంలో సూపర్ పవర్‌గా ఎదిగేందుకు ఒక రేసు మొదలు కావడమే దీనికి ప్రధాన కారణం. చైనా ఎదుగుదలను చూసి, దాని మిలిటరీ పవర్ చూసి.. అమెరికా Dragon country నుంచి వచ్చే దిగుమతులపై ఆంక్షలు విధించింది. ముఖ్యంగా చైనా నుంచి వచ్చే సరుకు మీద 2019 నుంచి వీపరీతంగా పన్నులు విధించింది.

ఒక్క అమెరికానే కాదు చాలా దేశాలు ఇప్పుడు క్రమంగా free trade తగ్గించేశాయి. దిగుమతులపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ కూర్చుంటే పూర్తిగా ఆ దేశాలపైనే ఆదారపడాల్సిన పరిస్థితి వస్తోంది.. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని ఆయా దేశాల ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఉదాహరణకు ఇండియా నుంచే మొదలు పెడితే..ఇండియా ప్రభుత్వం దేశీయ electronics, ఫార్మా కంపెనీలపై ఫోకస్ పెంచింది. ఇకపై చైనా నుంచి ఈ రంగంలో దిగుమతులు క్రమంగా తగ్గించాలనేది భారత్ ఉద్దేశం.

అమెరికా మిత్ర దేశమైన South Korea స్వదేశంలోనే Green Energy Infrastructure నిర్మించేందుకు కంపెనీలను ప్రోత్సహిస్తోంది. మరోవైపు జపాన్ కూడా చైనాలోని తమ బ్రాండ్ కార్ల కంపెనీలు Nissan, Mistsubishi లాంటి కార్ల
factoryలను చైనా నుంచి తిరిగి వచ్చేయాలని ఆదేశిస్తోంది. Australia విదేశీ కంపెనీలకు బదులు స్వదేశీ కంపెనీలకే మైనింగ్ contract కట్టబెట్టాలని నిర్ణయిచింది. Nigeria ఇకపై నుంచి దిగుమతి అయ్యే సరుకుపై భారీగా పన్నులు విధిస్తోంది. ముఖ్యంగా ధాన్యం, సిమెంట్ తమ దేశంలోనే ఉత్పత్తి చేయాలని భావిస్తోంది. ఇదే పరిస్థితి యూరప్ దేశాలలో కూడా ఉంది. అక్కడ దేశీయ కంపెనీలకు ప్రభుత్వాలు భారీ incentives ప్రకటిస్తున్నాయి.

అప్పుల ఊబిలో ప్రపంచ దేశాలను ముంచేస్తున్న చైనా

అమెరికా మొదలు పెట్టిన free tradeతో చైనా ప్రపంచంలోని అన్ని దేశాల కంటే ఎక్కువ లాభపడింది. వచ్చిన ఆదాయంతో చాలా fastగా అభివృద్ధి సాధించింది. మిలిటరీపైన భారీగా ఖర్చు చేసి.. ప్రపంచంలోనే అతి పెద్ద సైన్యం చైనా వద్ద ఉంది. సంపాదిస్తున్న ఆదాయంతో ప్రపంచంలో సూపర్ పవర్‌గా ఎదగడానికి పక్కా ప్లాన్ వేసింది. క్రమంగా ఇతర దేశాలకు అప్పు ఇస్తూ.. వాళ్లు చెల్లించలేని స్థాయికి తీసుకెళ్లింది. ఇది ఒక రకమైన trap.

ప్రపంచంలోని చాలా దేశాలు ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు లేదా ఏదైనా పెట్టుబడుల కోసం ముఖ్యంగా ప్రపంచ బ్యాంక్ లేదా IMF లాంటి సంస్థల తలుపులు తట్టి అప్పులు తెచ్చుకుంటాయి. అక్కడి నుంచి అప్పు లభించే స్థితి చేజారితే అప్పుడు చైనా ఎంట్రీ ఇస్తుంది. కానీ చైనా ఉద్దేశం ఆ దేశానికి సహాయం చేయడమో లేక అప్పుపై వచ్చే వడ్డీతో లాభం పొందడం కాదు. అంతకు మించి. అదేంటని ఆలోచిస్తున్నారా? చాలా simple అప్పు ఇచ్చే సమయంలో చైనా సదరు దేశానికి చాలా conditions పెడుతుంది.

ఉదాహరణకు అప్పు తీసుకొని ఒక project కడితే ఆ project కట్టడానికి contract China companies కే ఇవ్వాలి. అప్పు తీర్చలేకపోతే ఆ project china సొంతం. అంటే రుణం తీసుకున్న దేశ సంపదను చైనా ఆక్రమించేసుకుంటుంది. ఇలా china.. భారత్ పొరుగుదేశమైన Sri Lankaతో చేసింది.

Sri Lankaలో HambanTota port నిర్మించడానికి Sri Lanka ప్రభుత్వం china పెట్టిన conditionsకు ఒప్పుకొని చాలా పెద్ద లోన్ తీసుకుంది. ఆ project china పూర్తిచేసింది. కానీ Sri Lanka ప్రభుత్వం దివాలా తీసింది. ఇప్పుడు contrat ప్రకారం.. HambanTota portలో 80 శాతం ownership హక్కులు చైనా సొంతం. china తలుచుకుంటే HambanTota portలో తన నౌకదళ base నిర్మించవచ్చు. ఇలాగే బంగ్లాదేశ్‌‌లో చిట్టగాంగ్ పోర్ట్, పాకిస్తాన్‌లో గ్వాదర్ పోర్ట్ కూడా నిర్మించింది. పాకిస్తాన్ పరిస్థితి కూడా దయనీయంగా తయారైంది. చైనా నుంచి తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించలేని పరిస్థితి. ఈ మూడ portsపై చైనా ఆధిపత్యం ఉంది. అమెరికాకు సన్నిహిత దేశమైన ఇండియాను కట్టడి చేసేందకు ఈ portsను ఉపయోగించగలదు.

అలాగే ఆఫ్రికా దేశాలను కూడా అప్పుల ఊబిలోకి లాగుతోంది. ఆఫ్రికా దేశాలైన కెన్యా, నైజిరియా, అంగోలా, ఇథియోపియా, జిబూతీ, జాంబియా, ఉగాండా.. చైనా నుంచి భారీ అప్పులు తీసుకొని ఇప్పుడు చెల్లించలేక వాటి దేశ సంపదను చైనాకు కట్టబెడుతున్నాయి. ముఖ్యంగా ఉగాండా అంతర్జాతీయ airport ఇప్పుడు చైనా సొంతం. ఇకపై ఆ airport నుంచి వచ్చే ఆదాయంలో మెజారిటీ చైనా తీసేసుకుంటుంది. అలాగే జాంబియా national assetsను కూడా చైనా తన రుణ వలయం ద్వారా లాగేసుకుంది. మరో ఆఫ్రికా దేశం జిబూతీ కూడా చైనా నుంచి భారీగా అప్పులు తీసుకుంది. ఆ అప్పులు జిబూతీ GDPకి 70 percent Totalతో సమానం. ఆఫ్రికా దేశాలలో చైనా కంపనీలు ఎయిర్ పోర్ట్‌లు, రైల్వే లైన్లు, రోడ్లు, భారీ వంతెనలు లాంటివి నిర్మిస్తున్నాయి. పాకిస్తాన్‌లో కూడా భారత సరిహద్దుల చుట్టూ ఒక ప్లాన్ ప్రకారం చైనా నిర్మాణాలు చేసింది. అంతెందుకు భారత భూభాగమైన అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా ఒక గ్రామమే నిర్మించింది.

ఇది ఒక రకంగా కుట్ర అనే చెప్పాలి. ప్రపంచంలో తన ఆధిపత్యం పెంచుకునేందుకు చైనా ఇలా మెల్లగా కీలక దేశాలలో పాగా వేసి ఆ తరువాత అక్కడి సంపదను దోచుకుంటోంది లేదా ఆక్రమించుకుంటోంది. ఒకప్పుడు బ్రిటీషర్లు ప్రపంచ దేశాలని ఇలా కుట్రలు చేసే ఆక్రమించుకున్నారు. ఇప్పుడు చైనా వద్ద అప్పు తీసుకున్న దేశాల లిస్టులో మొత్తం 95 దేశాలున్నాయి.

ఇదంతా చూసి అమెరికాకు భయం పట్టుకుంది. ఎందుకంటే అమెరికాతో తలపడే సైన్యం, ఆయుధాలు, నౌకాదళం ప్రపంచంలో చైనా తప్ప మరే దేశం వద్ద లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చైనాను కట్టడి చేయడం తప్పనిసరి అయిపోయింది.

అందుకే free trade, Globalisationని encourage చేయాలని ఆసియా దేశాలను ఇంతకాలం కోరిన అమెరికన్ ప్రెసిడెంట్లు ఇప్పుడు free tradeను తమ ఆర్థిక పాలసీల నుంచి క్రమంగా తొలగిస్తున్నారు. ముఖ్యంగా చైనా నుంచి దిగుమతి అయ్యే micro chipsను ఇకపై అమెరికాలోనే తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఈ micro chips, semi conductor chips ద్వారానే ఆధునిక technology ఆయుధాలు తయారు చేయవచ్చు. చైనాతో ఒకవేళ యద్ధమే చేయాల్సి వచ్చినా.. లేక ఏదైనా యుద్ధంలో చైనా తమ శత్రువుల పక్షాన నిలబడినా చైనా నుంచి వచ్చే ఈ semi conductor chips ఆగిపోతాయని అమెరికా భయం. ఈ micro chips ఎక్కువగా చైనా, తైవాన్‌లో తయారు చేస్తారు. అందుకే చైనా.. గత రెండు సంవత్సరాలుగా తైవాన్‌ను చైనాలో భాగమని చెబుతోంది. త్వరలోనే తైవాన్‌పై సైనిక చర్య చేసి చైనాలో కలుపుకునేందుకు ప్రయత్నాలు కూడా మొదలుపెట్టింది.

తైవాన్.. చైనాలో కలిసిపోతే అమెరికాకు తైవాన్ నుంచి వచ్చే micro chips ఇక అందవు. అందుకే అమెరికా తైవాన్ కోసం పోరాడుతోంది. Back up planగా తైవాన్‌లో micro chips తయారు చేసే కంపెనీలకు అమెరికాలోని Albany, Ohio ప్రాంతాలలో factoryలు పెట్టాలని ఆఫర్ చేస్తోంది.

మరోవైపు చైనా కూడా ఇలాంటి ఆంక్షలే అమెరికాపై విధించే అవకాశం ఉంది. కొన్ని అరుదైన ఖనిజాలు అంటే rare earth elements చైనా భూభాగంలో మాత్రమే ఎక్కువగా లభిస్తాయి. ఈ rare earth elements జాబితాలో
lanthanum, cerium, lithium, praseodymium, neodymium, promethium, samarium, europium, gadolinium, terbium, dysprosium, holmium, erbium, thulium, ytterbium, lutetium, scandium, yttrium ఉన్నాయి.

ఈ rare earth elementsలలో కొన్ని electric vehicles, wind turbines, military equipment, laser equipmentలు తయారు చేసేందుకు ఉపయోగిస్తారు. ఇలాంటి rare earth elements ఎగుమతి ఆపేస్తే అప్పుడు ఆ టెక్నాలజీ చైనాకు మాత్రమే పరిమితమవుతుంది. అప్పుడు చైనాతో పోరాడేందుకు ఏ దేశం సాహింసచలేదు. అందుకే వ్యాపారపరమైన ఆంక్షలు విధించకూడదని విశ్లేషకులు అభిప్రాయం.

అమెరికా సంగతి పక్కనపెడితే.. ఇండియాకు కూడా చైనాతో సరిహద్దు వివాదం చాలా కాలంగా నడుస్తోంది. చైనా నుంచి ఇండియా దిగుమతి చేసుకునే సరుకులో ప్రధానమైనది Lithium. ఈ Lithium ప్రధానంగా smart phone batteries, laptop batteries, eletric vehilce batteries, తయారు చేసేందుకు ఉపయోగపడుతుంది.
ఇండియాకు కావాల్సిన Lithiumలో 50 percent చైనా నుంచే వస్తుంది. ఇండియా , చైనా మధ్య ఒకవేళ యుద్దమే జరిగితే అప్పుడు ఇండియాకు Lithium దొరికని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఇండియా కూడా Lithium దిగుమతుల కోసం south America వైపు చూస్తోంది.

South Americaలోని అర్జెంటీనా, చిలీ, బొలివియా దేశాలలో Lithium నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే భారత్ అర్జెంటీనాతో ఒప్పందం కుదుర్చుకుంది. అందుకోసం ఇండియా 200 కోట్లు రూపాయలు ఖర్చుపెట్టి.. అర్జెంటీనాలో Lithium mines leaseపై తీసుకోవాలనుకుంటోంది.

ఇలా చైనా కుట్రలను పసిగట్టిన అమెరికా, భారత్ లాంటి దేశాలు చైనా నుంచి తక్కువ ధరకు వచ్చే దిగుమతులపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఇకపై తమ దేశంలోనే తమకు కావాల్సిన productsని తయారుచేసుకోవాలని భావిస్తున్నాయి. ఫలితంగా దశాబ్దాలుగా కొనసాగుతున్న free trade, Globalisation ఇకపై ఆగిపోతుందని Global Trade Analysts చెబుతున్నారు.

Related News

మేఘా అవినీతి ముసుగులో అధికారులు..!

TDP MLA Koneti Adimulam Case: నా ఇష్టంతోనే ఆ పని! ఆదిమూలం బాధితురాలు సంచలనం

Mossad Secret Operations : టార్గెట్ చేస్తే శాల్తీ లేవాల్సిందే.. ప్రపంచాన్నిషేక్ చేస్తున్న ఇజ్రాయెల్ మొసాద్

Tirupati Laddu Controversy: 300 ఏళ్ల చరిత్రకి మరకలు పడ్డాయా.. తిరుపతి లడ్డూ గురించి ఎవరికీ తెలియని నిజాలు

Kutami Strategy: ఎన్నికల ప్రచారంలో పవన్ చేసిన ఛాలెంజ్ నిజమవుతోందా ? సీనియర్లు ఏమంటున్నారు ?

BRS BC Plan: బీసీ మంత్రాన్ని జపిస్తోన్న బీఆర్ఎస్.. కాంగ్రెస్ పోస్ట్ తో కేటీఆర్ కామెంట్స్ వైరల్

Young India Skill University: ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ తో స్కిల్ హబ్ గా తెలంగాణ..

Big Stories

×