EPAPER

Medical colleges : వైద్య కళాశాలల్లో వికృత సంప్రదాయాలు.. సామాన్యులే సమిధలు..

Medical colleges : వైద్య కళాశాలల్లో వికృత సంప్రదాయాలు.. సామాన్యులే సమిధలు..

Medical colleges : వైద్య విద్య సామాన్యులకు అందని ద్రాక్షే. మెడిసిన్ సీటు సాధించటం అంత ఈజీకాదు. ఇంటర్ కార్పొరేట్ కళాశాలల్లో చదివే విద్యార్థులే ఎక్కువగా మెడిసిన్ సీట్లు సాధిస్తారు. ఒకప్పుడు రాష్ట్రస్థాయిలో ఎంసెట్ ఆధారంగా మెడికల్ సీట్లు వచ్చేవి. కానీ కేంద్రం జాతీయస్థాయిలో నీట్ ను అమల్లోకి తెచ్చింది. దీంతో తెలుగు మీడియంలో చదివే పేద విద్యార్థులకు మెడిసిన్ సీటు సాధించడం మరింత కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఎంతో మంది పేద విద్యార్థులు పట్టుదలతో మెడిసిన్ సీట్లు సాధిస్తున్నారు. మారుమూల గిరిజన తండాల చెందిన వారు డాక్టర్లు అవుతున్నారు. వైద్య విద్య అభ్యసించాలనే కలను నెరవేర్చుకునేందుకు ఎంతో ప్రయాస పడుతున్నారు. కానీ మెడికల్ కళాశాలల్లో పేరుకుపోయిన వికృత సంప్రదాయాలు వారి కలలను చిదిమేస్తున్నాయి. అలా బలైపోయిన అమ్మాయే ప్రీతి. ఇలా గతంలో ఎంతోమంది బలపోయారు. కొన్ని ఘటనలే బయటకు వస్తున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగవనే గ్యారంటీ కూడా లేదు.


మెడిసిన్ సీట్ సాధించడం ఒక ఎత్తు అయితే తాము చేరిన కళాశాలలో చదువును కొనసాగించడం పేద విద్యార్థులకు కత్తిమీద సాములా మారుతోంది. వైద్యకళాశాలల్లో పేరుకుపోయిన ర్యాగింగ్ భూతం ఎంతో మంది విద్యార్థుల ఆశలను చిదిమేస్తోంది. ఆ వారి లక్ష్యాలను చంపేస్తోంది. మెడికల్ కళాశాలల్లో సీనియర్ల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయని ఎన్నో ఘటనలు నిరూపించాయి. గతంలో ర్యాగింగ్ ఘటనలు జరిగినా ఆయా కళాశాలల వరకే పరిమితమయ్యేయి. కానీ నేడు టెక్నాలజీ పెరగడంతో సోషల్ మీడియా వేదికగా రచ్చ చేస్తున్నారు. సీనియారిటీ పేరుతో జూనియర్లపై బాసిజం ప్రదర్శిస్తున్నారు. తాము చెప్పిందే చేయాలని పంతం పడుతున్నారు. నలుగురిలో జూనియర్లను అవమానాల పాలు చేస్తున్నారు. వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై మరింత కక్ష గట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి ఘటనల్లో ఎక్కువగా బలయ్యేది సామ్యాన కుటుంబాల నుంచి వచ్చిన వారే ఎక్కువగా ఉంటున్నారు. మారుమూల ప్రాంతాలు, పేద కుటుంబ నుంచి వచ్చిన వారినే మెడికల్ కళాశాలల్లో టార్గెట్ చేస్తారనే ఆరోపణ ఎప్పటి నుంచో ఉంది.

వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో అనస్థీషియా విభాగంలో పీజీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ప్రీతి మరణమే ఇందుకు బలమైన సాక్ష్యం. ప్రీతి ఓ సామాన్య గిరిజన కుటుంబానికి చెందిన యువతి. జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్ని తండా నుంచి మెరిసిన విద్యాకుసుమం ప్రీతి. తండ్రి రైల్వే ఏఎస్ఐ . డాక్టర్ కావాలన్న కుమార్తె కోరికను నెరవేర్చేందుకు ఆయన ఎంతో కష్టపడ్డారు. ఇంతలోనే ప్రీతి సీనియర్ వేధింపులకు బలైపోయింది. ఆమె మృత్యువుతో ఎంతో పోరాడి ఓడిపోయింది. ఆత్మహత్య ముందు ఆమె జీవితంలో ఎంతో పోరాటం చేసింది. సీనియర్ విద్యార్థి సైఫ్ తనను వేధిస్తున్నాడని తల్లిదండ్రుల దృష్టికి తీసుకొచ్చింది. ఆమె తండ్రి తన కుమార్తెకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కళాశాల యాజమాన్యానికి మొరపెట్టుకున్నారు. అయినా సరే తనపై వేధింపులు ఆగడంలేదని తల్లితో చివరి సారిగా ఫోన్ లో చెప్పుకుని ప్రీతి ఆవేదన చెందింది. తండ్రి కూడా తన కుమార్తె సమస్యను తీర్చలేకపోతున్నానని మదనపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రీతి తను ఇక పోరాడలేనని నిర్ణయించుకుంది. సైఫ్ తో సహా సీనియర్లు అందరూ ఏకమవుతారని ఇక తనకు సహకరించరని నిర్ధారించుకుంది. కళాశాల హెచ్ వోడీ కూడా తననే మందలించడంతో దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది. ఎంతో ధైర్యశాలిగా , ఆత్మాభిమానం ఉన్న అమ్మాయిగా పేరున్న ప్రీతి .. మెడికల్ కళాశాలలో ఒంటరిగా మిగిలిపోయింది. ఇక తనకు అన్నిదారులు మూసుకుపోయాయని అనుకుంది. ఆత్మహత్యే తన సమస్యకు పరిష్కారంగా భావించింది.


మెడికల్ కళాశాలల్లో ప్రీతి ఘటన మొదటి కాదు గతంలో ఎంతోమంది అమాయకులు ఇలా బలైపోయారు. రాజకీయ ప్రాబల్యం, కుటుంబ పలుకుబడి ఉన్న విద్యార్థుల జోలికి వెళ్లేందుకు సీనియర్ విద్యార్థులు సాహసం చేయరు. కేవలం తమ ఆధిపత్యాన్ని అమాయకులపైనే ప్రదర్శిస్తున్నారు. కులాల పేరుతో అవమానపరుస్తున్నారు. ఎదురు తిరిగితే టార్గెట్ చేసి మరింతగా వేధిస్తారు. అందుకే ఎక్కువ మంది పేద విద్యార్థులే ర్యాగింగ్ భూతాలకు, సీనియర్ల అరాచకాలకు సమిధిగా మారుతున్నారు. ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నా ప్రభుత్వాలు కంటితుడుపు చర్యలే తీసుకుంటున్నాయి. బాధిత కుటుంబాలకు ఎంతో కొంత పరిహారం ప్రకటించి చేతులు దులుపుకుంటున్నాయి. ఏదో ఒక కమిటీ వేసి విచారణను మమా అనిపిస్తున్నాయి. చివరికి ఆర్థిక సమస్యల కారణంగానో, ప్రేమవైఫల్యం కారణంగానో, ఆరోగ్యసమస్యల కారణంగానో బాధిత విద్యార్థులు చనిపోయారని తేలుస్తున్నాయి. దోషులు మాత్రంగా సులువుగా తప్పించుకుంటున్నారు. మెడికల్ కళాశాలల్లో కొనసాగుతున్న వికృత సంప్రదాయాలను రూపుమాపడానికి ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకుకోవడంలేదనేది వాస్తవం. ఇకనైనా వైద్యకళాశాలల్లో కొనసాగుతున్న దుష్ట సంప్రదాయాలను తుంచి వేయాలని ప్రజలు కోరుతున్నారు.

మెడికల్ కళాశాలల్లో తిష్టవేసిన అరాచకశక్తులతో పేద, గిరిజన, దళిత విద్యార్థుల చదువులు కొనసాగడం కష్టంగా మారుతోంది. సామాన్యులు వైద్య విద్య చదవాలంటే భయపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎన్నో వ్యయప్రయాసలు పడి ఆర్థిక ఇబ్బందులకు ఎదురీది చదువుకుంటున్న పేదలను ఆధిపత్య , అహంకారం ధోరణితో కొందరు అణచివేస్తున్నారు. దీంతో సామాన్యుల తల్లిదండ్రులు వైద్య విద్యకు తమ పిల్లలను పంపేందుకు భయపడుతున్నారు. ఇలాగైతే పేదలకు ఉన్నత విద్య ఎలా అందుతుంది? దేశంలో అన్నివర్గాలకు సమన్యాయం ఎప్పుడు జరుగుతుంది? ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరుస్తాయా? పేద విద్యార్థులు ధైర్యంగా చదువుకునే వాతావరణాన్ని కల్పిస్తాయా?

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×