EPAPER

HCA Power Bill Issue : కరెంట్ బిల్లుపై లొల్లి.. HCAలో ఏం జరుగుతోంది ?

HCA Power Bill Issue : కరెంట్ బిల్లుపై లొల్లి.. HCAలో ఏం జరుగుతోంది ?

hyderabad cricket association latest news


HCA Power Bill Conflict(Hyderabad news today): హెచ్‌సీఏ.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. స్టేట్‌వైడ్‌గా ఉన్న క్రికెట్ టాలెంట్‌ను దేశానికి అందించడంలో వెనక వరసలో.. వివాదాల్లో ముందు వరసలో ఉంటుంది. అయితే అవినీతి ఆరోపణలు.. లేదంటే ప్యానల్ సభ్యుల మధ్య పంచాయితీ. ఇక HCA ఎన్నికలొస్తే అదో మినీ వార్. అలాంటి HCA ఇప్పుడు మరోసారి హైలెట్ అయ్యింది. అది కూడా మరో వివాదంలోనే. ఈసారి కరెంట్ బిల్లు ఇష్యూలో జరిగింది ఈ వివాదం.

HCAలో వివాదాలు చాలా కామన్. ఈ క్రికెట్ అసోసియేషన్‌లో ఎప్పుడూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. మ్యాచ్‌ల నిర్వహణలో వివాదం. టికెట్ల ఇష్యూలో వివాదం. సౌకర్యాలు కల్పించడంలో వివాదం. HCA ఎన్నికల్లో వివాదం. ప్యానెల్ సభ్యుల మధ్య వివాదం. నిధుల వాడకంలో వివాదం. మొత్తంగా చూస్తే అంతో ఇంతో మిగిలి ఉన్న HCA ప్రతిష్టను దెబ్బతీయడానికే పనిచేస్తున్నారా? అన్నట్టు ఉంటుంది వ్యవహారం.


Also Read : PMLA పవరేంటి ? ఈడీకి చిక్కితే అంతేనా ?

ఎన్ని వివాదాలున్నా.. ప్రతి ఏటా వచ్చే ఐపీఎల్ HCAకు ఓ Golden Opportunity. కానీ దాన్ని కూడా మిస్‌ యూస్‌ చేసుకోవడమే. ఇప్పుడు సరిగ్గా SRH, CSK మ్యాచ్‌ ముందు ఎలక్ట్రిసిటీని కట్ చేశారు అధికారులు. దీనికి వారు చెబుతున్న రీజనేంటి అంటే.. కోట్లకు కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉంటే కట్ చేయక ఏం చేయాలి అంటున్నారు. ప్రస్తుతానికి ఇష్యూ రిసాల్వ్ అయిపోయింది. మ్యాచ్ యథావిధిగా జరుగుతోంది. కానీ జరగాల్సిన డ్యామేజీ అయితే జరిగిపోయిందిగా. నిన్న SRH, CSK టీమ్స్ ప్రాక్టీస్‌ చేస్తుండగా కరెంట్ తీసేశారు. దీంతో అప్పటికప్పుడు జనరేటర్స్‌తో మ్యానేజ్ చేశారు. ఇలాంటి కీలకమైన మ్యాచ్‌ ముందు కరెంట్ నిలిపివేత అనేది నేషనల్‌ వైడ్‌గా HCA పరువు తీసింది.

ఇంతకీ TSSPDCL చెప్పుతున్నదేంటి అంటే.. HCAకు HBG 2192 కనెక్షన్ ఉంది. ఎన్నో ఏళ్లుగా విద్యుత్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్ బిల్స్‌ను క్లియర్‌ చేయకుండా రోటిన్‌గా విద్యుత్‌ను వాడటంతో.. విద్యుత్‌ చౌర్యం కేసులు కూడా నమోదయ్యాయి. 2015 నుంచి అసలు HCA బిల్లులే చెల్లించలేదని చెబుతోంది ఎలక్ట్రిక్ డిపార్ట్‌మెంట్. 2018లో అంటే ఆరేళ్ల క్రితం బిల్లులను చెల్లించాలంటే రంగారెడ్డి జిల్లా కోర్టులో.. విద్యుత్‌ శాఖ కేసు కూడా వేసింది. అప్పుడు కోర్టు కూడా విద్యుత్ అధికారులకు అనుకూలంగానే తీర్పు ఇచ్చింది. దీంతో HCA డిఫాలర్ట్‌గా మారింది. ఇంతకీ బిల్లులు ఎంత అనే కదా మీ డౌట్. పెండింగ్ బిల్లు అక్షరాలా కోటి 41 లక్షలు. ఇదే మొత్తం కాదు.. సర్ చార్జీ కూడా ఉంది.
సర్‌ చార్జీ కూడా కోటి 64 లక్షలు. మొత్తం కలిపితే 3 కోట్ల 5 లక్షలు. వీటన్నింటిని వారం రోజుల్లో చెల్లించాలంటూ అప్పట్లో కోర్టు తీర్పు ఇచ్చింది. కానీ HCA పట్టించుకోలేదు. అయితే సర్‌ చార్జీని ఎత్తేయాలని రిక్వేస్ట్ చేస్తోంది HCA. కానీ ఆ చాన్సే లేదంటోంది విద్యుత్ శాఖ. దీంతో వివాదం కంటిన్యూ అవుతూనే ఉంది.

Also Read : ఏపీ పాలిటిక్స్ లో లేఖ చిచ్చు.. పురందేశ్వరి లెటర్ లో ఏముంది ?

అప్పటి నుంచి SPDCL నోటీసులు ఇవ్వడం.. HCA పట్టించుకోకపోవడం. జరుగుతూనే ఉంది. ఫిబ్రవరి 20న కూడా నోటీస్ సర్వ్‌ చేశామని.. ఇప్పటికీ కూడా రెస్పాండ్ కాకపోయే సరికి కరెంట్ కట్ చేశారు. మినిమమ్ 50 పర్సెంట్ బిల్ సెటిల్ చేస్తే కానీ పవర్‌ను రిస్టోర్ చేయమని కరాఖండిగా చెప్పింది. మరి నిజంగానే బిల్‌ను పే చేశారా? లేక టైమ్ కావాలని రిక్వెస్ట్ చేశారో తెలీదు కానీ.. SPDCL మాత్రం పవర్‌ను రీస్టోర్ చేసింది. అయితే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడలేదు. ఉప్పల్‌లో మరో ఐదు మ్యాచ్‌లు జరగనున్నాయి.పెండింగ్‌ బిల్లులు కట్టించుకునేందుకు విద్యుత్ శాఖ ఇదే గోల్డెన్ చాన్స్‌లా ఫీలవుతుంది. మరి నెక్ట్స్‌ మ్యాచ్‌ వరకైనా ఈ వివాదానికి తెర పడుతుందా? లేదా? అనేది చూడాలి.

నాట్ ఓన్లీ ఎలక్ట్రిసిటీ.. టికెట్ల అమ్మకాలపై కూడా HCAపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆన్‌లైన్‌లో టికెట్లు పెట్టిన నిమిషాల వ్యవధిలో సోల్డవుట్ అవుతున్నాయి. 10 నిమిషాల్లో 40 వేలకు పైగా టికెట్లు ఎలా అమ్ముడుపోతాయన్నది ఓ మిస్టరీనే. అయితే బ్లాక్ దందా కొనసాగుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.స్టేడియం ఎదుటే వీటిని ఓపెన్‌గా అమ్ముతున్నారన్న ప్రచారం జరుగుతోంది. నెక్ట్స్‌ ఉప్పల్‌లో ఈ నెల 25న మ్యాచ్‌ SRH, ఆర్సీబీ మధ్య ఉంది. మరి అప్పటివరకైనా పరిస్థితులు మారుతాయా? లేదా? అన్నది చూడాలి.

Tags

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×