EPAPER

Politics on Musi: మూసీ రాజకీయం.. బీఆర్ఎస్, బీజేపీ ప్లాన్ ఇదేనా?

Politics on Musi: మూసీ రాజకీయం.. బీఆర్ఎస్, బీజేపీ ప్లాన్ ఇదేనా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీకి కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలింది. 39 స్థానాలకే పరిమితమైన బీఆర్ఎస్‌కు గ్రేటర్ హైదరాబాద్‌లో మాత్రమే ఊరట లభించింది. గ్రేటర్లో అధికార కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యమే లభించలేదు. బీజేపీ సైతం గోషామహల్ సీటుతోనే సరిపెట్టుకుంది. ఎంఐఎం గెలుపొందిన స్థానాలు మినహా అన్నీ బీఆర్ఎస్ సొంతం చేసుకుంది. తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే అకాల మరణంతో కంటోన్మెంట్‌ సెగ్మెంటుకి జరిగిన బైపోల్స్‌లో కాంగ్రెస్ ఖాతా తెరిచి బీఆర్ఎస్ సిట్టింగు సీటుని గల్లంతు చేసింది. అప్పటికే ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి దానం నాగేందర్ కాంగ్రెస్ పంచకు చేరారు.

గ్రేటర్‌లో మరికొందురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌ని వీడడానికి రెడీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ తాను పార్టీ మారలేదని బహరింగ ప్రకటన చేసినా.. ఆయన పార్టీ మారిపోయారని గులాబీ నేతలే రచ్చ చేస్తున్నారు. ఇలాంటి గందరగోళ పరిస్థితుల మధ్య గ్రేటర్లో పార్టీ పట్టు నిలుపుకోవడం బీఆర్ఎస్‌కు ప్రతిష్టాత్మకంగా తయారైంది.. ఆ క్రమంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో తమ ఉనికి కోసం పాకులాడుతున్న గులాబీ పెద్దలకు మూసీ, హైడ్రా అంశాలు అయాచిత వరాలుగా మారాయి.


మూసి అంశాన్నే బేస్ చేసుకుని బీఆర్ఎస్ రాజకీయం చేయాలని చూస్తుంది. హైదరాబాద్ శ్రేయస్సు, భవిష్యత్తు అవసరాల కోసం మూసీ ప్రక్షాళన జరగాలని కాంగ్రెస్ సర్కారు పట్టుదలతో ఉంది. అయితే అది ప్రక్షాళన కాదు మూసీ సుందరీకరణ అంటూ, ప్రభుత్వ పెద్దలు రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసమే ఇదంతా చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అయితే మూసి రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు అయింది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే.. ఆ విషయాన్ని తెరమరుగు చేసే విధంగా మూసీ బాధితులకు అండగా నిలుస్తామంటూ గులాబీ నేతలు హడావుడి మొదలుపెట్టారు.

Also Read: గ్రూప్-1 పరీక్షలకు లైన్ క్లియర్.. స్టే ఇవ్వలేమన్న సుప్రీంకోర్టు, అభ్యర్థులకు సీఎం శుభాకాంక్షలు

ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతంలో బాధితుల పరామర్శ పేరుతో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు క్షేత్రస్థాయి పర్యటనలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల వరకు మూసీ అంశాన్ని రగిలిస్తూనే ఉండాలని . మూసీ పరివాహక ప్రాంత నియోజకవర్గ ఎమ్మెల్యేలు రోజుకొకరు ఆ ప్రాంతాల్లో పర్యటించాలని బీఆర్ఎస్ ఆదేశాలు జారీ చేసింది. ఇదే ఆంశంపై గ్రేటర్ పరిధిలో భారీ బహిరంగసభ పెట్టేందుకు ప్లాన్ చేస్తుంది గులాబీ పార్టీ.

మరోవైపు బీజేపీ కూడా మూసీ అంశంతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తుంది . ఈ నెల 23, 24న మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకంగా ఎంపీ, ఎమ్మెల్యేలతో మూసి పరీవాహక ప్రాంతాలలో పర్యటిస్తామని, అలాగే 25 న పెద్ద ఎత్తున ధర్నా చేయబోతున్నట్లు బీజేపీ ప్రకటించింది. ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతాల్లో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్ వంటి ముఖ్యనేతలందరూ పర్యటిస్తున్నారు.

గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో రెండో స్థానాన్ని దక్కించుకున్న బీజేపీ.. ఈసారి మేయర్ పీఠం సాధించేలా పావులు కదుపుతుంది. అందులో భాగంగానే మూసీ అజెండాగా ప్రజల్లోకి వెళ్లుతూ.. మేజార్టీ స్థానాలను సాధించాలనే లక్ష్యంతో కార్యచరణ సిద్దం చేసుకుంటున్నట్లు కనిపిస్తుంది. మొత్తానికి గ్రేటర్ ఎన్నికల పుణ్యమా అని మూసీ వ్యవహారమే అన్ని పార్టీలకు పొలిటికల్ అజెండాగా మారిందిప్పుడు.

Related News

Special Story: పెరిగిపోతున్న పెళ్లికాని ప్రసాదులు.. ఆ ‘కండిషన్స్’ అప్లై, అమ్మాయిల డిమాండ్లు ఏంటి సామి ఇలా ఉన్నాయ్?

YS Jagan vs Kottu Satyanarayana: కొట్టు సత్యనారాయణకి.. జగన్ బిగ్ షాక్?

TDP Leaders: అనంతపురం టీడీపీ నేతల్లో కొత్త టెన్షన్.. కారణం ఏం

BRS Leaders In Congress: కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ..?

Niagara Falls of India: చిత్ర కూట్‌లో చూడాల్సిన ప్రదేశాలు.. ఎలా వెళ్లాలో తెలుసా?

Cheetahs – Big Cats: చిరుత లాగే అడవి పిల్లి ప్రమాదకరమా? రెండింటికి తేడా ఏంటి?

Big Stories

×