EPAPER

Balineni vs Prakasam Riyaz: బాలినేని మైండ్ గేమ్.. షాక్ ఇస్తున్న శిష్యుడు

Balineni vs Prakasam Riyaz: బాలినేని మైండ్ గేమ్.. షాక్ ఇస్తున్న శిష్యుడు

Political War Between Balineni Srinivasa Reddy vs Prakasam Riyaz: ఒకప్పుడు ఆ మాజీ మంత్రి అక్కడ గట్టిగానే చక్రం తిప్పారు. సొంత పార్టీలో కాలం కలిసి రాక పార్టీ మారాల్సి వచ్చింది. కొత్త చోట ఆయన చిత్రమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందంట. ఆయన రాజకీయ శిష్యుడే అక్కడ జిల్లా పార్టీ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఈయన చేరిక ఆ అధ్యక్షుడికి నచ్చడం లేదంట. దాంతో ఒడలు, బళ్లు.. బళ్లు, ఓడలు అవుతాయి అంటారు చూడండి. అలా తయారైందంట మాజీ మంత్రి పరిస్థితి. ఇంతకీ ఆ గురుశిష్యులెవరో? ఆ కథేంటో మీరే చూడండి.


మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి.. ప్రకాశం జిల్లాలో ఒకప్పుడు కాంగ్రెస్‌కి, తర్వాత వైసీపీకి పెద్ద దిక్కుగా చక్రం తిప్పిన సీనియర్ నాయకుడు.. ఒంగోలు నుంచి ఐదు సార్లు గెలిచి రెండు సార్లు ఓడిపోయిన ఆయన.. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్ధం పుచ్చుకున్నారు. ఆయన చేరడంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన రెండుగా చీలిపోయింది. బాలినేని లాంటి సీనియర్ చేరిక జిల్లా జనసైనికుల్లో ఉత్సాహం నింపుతున్నా.. జిల్లా పార్జీ అధ్యక్షుడు రియాజ్‌కు ఆయన చేరిక మింగుడుపడటం లేదంట.

ఆ క్రమంలో జిల్లా జనసేన రియాజ్ వర్గం.. యాంటీ రియాజ్ వర్గంగా చీలిపోవడం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో జనసేన ఒక ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేదు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినప్పుడు కూడా ఖాతా తెరవలేదు. అసలు ఆ పార్టీకి మొన్నమొన్నటి వరకు జిల్లాలో ప్రజాబలం ఉన్న నాయకుడు ఒక్కరు కూడా లేరనే చెప్పాలి. అయితే కాంగ్రెస్, వైసీపీల్లో మంత్రిగా పనిచేసి.. జిల్లా వ్యాప్తంగా సొంత అనుచరగణం ఉన్న బాలినేని చేరికతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తుంది.


ఆయన చేరికతో జనసేన బలోపేతం అవుతుందని అందరూ భావించారు. అయితే బాలినేని చేరికతో జిల్లా పార్టీ అధ్యక్షుడు షేక్ రియాజ్ అనుకుల వర్గం, వ్యతిరేక వర్గం తయారయ్యాయి. జిల్లా అధ్యాక్షుడు రియాజ్‌పై పార్టీ నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. జిల్లా అధ్యాక్షుడిగా రియాజ్ తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీకి చెప్పుకోదగ్గ ఒక్క ప్రజాప్రతినిధి లేరు. గత స్థానిక సంస్థల ఎన్నికలలో ఒక ఒంగోలు నగరంలో ఒకే ఒక్క కార్పొరేటర్ గాజు గ్లాసు గుర్తుపై కార్పొరేటర్‌గా గెలిచారు. ఇక ఎక్కడా జనసేన పార్టీ సింబల్‌తో గెలిచిన ప్రజాప్రతినిధులు ప్రకాశం జిల్లాలో లేరు. ఇలాంటి పరిస్థితుల్లో బాలినేని చేరడంతో రానున్న స్థానికి సంస్థల ఎన్నికల్లో జనసేన సత్తా చాటుకుంటుందన్న అభిప్రాయం వ్యక్త మవుతుంది.

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరికను జిల్లా అధ్యాక్షుడు రియాజ్ వ్యతిరేకిస్తున్నారు .. పైకి మాత్రం బాలినేని చేరికను స్వాగతిస్తున్నాం అంటున్నా.. బాలినేని , రియాజ్ వర్గాల మధ్య మాటాలు తూటలు పేలుతూనే ఉన్నాయి. సమయం వచ్చినప్పుడల్లా రెండు వర్గాలు ఒక్కరి పై ఒక్కరు దుమ్మెతి పోసుకుంటున్నాయి. రియాజ్ జిల్లాలో జనసేన పార్టీ నాశనం చేస్తున్నారని మరికొంతమంది మీడియా సమావేశం నిర్వహించి విమర్శించారు. గిద్దలూరు కు చెందిన బెల్లంకొండ సాయి బాబు, ఇమ్మడి కాశి విశ్వనాద్, చీకటి వంశి దిప్, జడ బాల నాగేంద్ర వంటి నేతాలు రియాజ్ పై విమర్శలు చేశారు.

Also Read: ఏపీలో మళ్లీ పర్నీచర్ లొల్లి, సిద్ధంగా ఉన్నామన్న వైసీపీ.. మంత్రి లోకేష్ ఆగ్రహం..

ఆ క్రమంలో రియాజ్ యాంటీ వర్గం బాలినేని చెంతకు చేరింది. రియాజ్ మాత్రం బాలినేని విషయంలో ఎక్కడ తగ్గడం లేదు. ఎంత సినియర్ నాయకుడైనా, మాజి మంత్రి అయినా.. తాను జిల్లా అధ్యాక్షుడినని బాలినేని తనను వచ్చి కలవాలని అంటున్నారంట. మరోవైపు బాలినేని పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేసినట్లు కనిపిస్తున్నారు. రియాజ్ కామెంట్స్‌ను లైట్‌గా తీసుకుంటూ.. త్వరలో జిల్లా పార్టీ అధ్యక్షుడు మారుతున్నారని తన వారితో ప్రచారం చేయిస్తున్నారంట.

ఇక ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, మాజీ మంత్రి బాలినేని మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఆ మధ్య బాలినేని జనసేనలో చేరిక సందర్భంగా ఒంగోలులో ప్లేక్సిలు పెడితే.. ఆ ఫ్లేక్సిలను రియాజ్, దామచర్ల అనుచరులు చింపేశారు . బాలినేనిజనసేన పార్టీలో జాయిన్ కాకుండా రియాజ్ తో కలిసి దామచర్ల ప్రయత్నించారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే బాలినేనిని పవన్‌కళ్యాణ్ స్వయంగా పార్టీలో చేర్చుకోవడం రియాజ్, దామచర్లలకి మింగుడు పడటం లేదంట. ఇన్న రియాజ్ ప్రభుత్వ ఏర్పాటైనప్పటి నుంచి ఒంగోలులో జరిగే ప్రతి కార్యక్రమంలో దామచర్ల వెన్నంటే ఉంటున్నారు.

ఇప్పుడు బాలినేని జనసేనలోకి ఎంట్రీ కావడంతో రియాజ్ దూకుడు కళ్లెం వేసినట్టైంది. బాలినేనికి త్వరలో జనసేన పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తున్నట్లు టాక్ నడుస్తుంది. అదే జరిగితే ఇప్పుడు వరకు బాలినేని పై ఫైట్ చేసిన రియాజ్ పరిస్థితి ఏంటన్నది పార్టీలో చర్చనీయాంశంగా మారింది. జనసేనలో బాలినేనికి కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారన్న ప్రచారంతో రియాజ్ వర్గంలో అలజడి మొదలైందంట. అయితే రియాజ్ కి బాలినేని విషయంలో ఎక్కడా తగ్గొద్దని దామచర్ల చెప్తున్నారంట. జనసేనలో జాయిన్ అయినా బాలినేని అవినీతి , ఆక్రమలపై చట్టం తన పని తను చెసుకొని పొతుందని దామచర్ల ,రియాజ్ అంటున్నారు.

ఒకప్పుడు యూత్ కాంగ్రెస్ లో బాలినేని ఫాలోయర్‌గా ఉన్న రియాజ్ 1999, 2004 ఎన్నికల టైంలో బాలినేని కోసం పనిచేశారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు ముస్లీం మైనార్టీ కార్పొరేషన్ డైరక్టర్ పదవి ఆశించిన రియాజ్‌కు అది దక్కలేదు. దాంతో హర్ట్ అయిన రియాజ్ అప్పటి నుంచి బాలినేనితో గ్యాప్ మెయిన్‌టెయిన్ చేస్తున్నారంట. అప్పటి సంగతులు ఇంకా గుర్తుపెట్టుకుని రాజకియ గురుపు పై ఇలా రాజకియ యుధ్దం మొదలుపెడతారని ఊహించలేదంటున్నారు బాలినేని అనుచరులు. మొత్తానికి ప్రకాశం జిల్లా వైసీపీ రాజకీయం అలా నడిచిపోతుంది.

Related News

Bigg Boss Day 32 Promo1: మార్నింగ్ మస్తీ.. చిలకజోస్యంతో అదరగొట్టిన మణికంఠ..!

Kondakal: కొండకల్ తండాలో ఏం జరుగుతోంది..? ‘స్వేచ్ఛ’ వార్తలతో విషయం వెలుగులోకి..

Kakatiya University: స్వేచ్ఛ ఎఫెక్ట్.. కేయూ అసిస్టెంట్ రిజిస్ట్రార్‌‌ సస్పెండ్!

Warangal Politics: కేటీఆర్ పెట్టిన చిచ్చు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌కు ఉచ్చు బిగుస్తోందా..?

Kolikapudi Srinivasa Rao: కొలికపూడి వివాదంలో కొత్త ట్విస్ట్.. అరెస్ట్ తప్పదా

Israel-Hezbollah War: భూతల దాడులు.. కూకటి వేళ్లతో పెకిలించి వేయడమే లక్ష్యం!

Big Stories

×