EPAPER

PM Modi: సైనికులు చనిపోతుంటే.. సైలెంట్ గా మోదీ.. కారణం ఇదేనా..?

PM Modi: సైనికులు చనిపోతుంటే.. సైలెంట్ గా మోదీ.. కారణం ఇదేనా..?

PM Modi Silence on Jammu Kashmir Attack(Telugu breaking news): జమ్మూ కాశ్మీర్‌లో గత 38 రోజుల్లో 9 దాడులు జరిగాయి. ఇందులో 12 మంది సైనికులు, 10 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల మధ్య కశ్మీర్‌లో పెరుగుతున్న ఉగ్రవాదానికి చెక్ ఎప్పుడు పడుతుందా అని అంతా వేచి చూస్తున్నారు. అయితే దీనికి ఉన్న అడ్డంకులేంటీ..? ఆర్మీ ఎందుకు ఫెయిల్ అవుతోంది..? కశ్మీర్‌లో శాంతి ఎప్పుడు సాధ్యమవుతుంది..?


జమ్మూ కశ్మీర్‌లో పెరుగుతున్న ఉగ్రవాదులు ఉనికిపై భారత్ ఆర్మీ, కశ్మీర్‌ పోలీసులతో కలిసి సంయుక్త ఆపరేషన్లు కొనసాగిస్తున్నాయి. జమ్మూ, దోడా, కథువా, జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాల్లో అనుమానాస్పద కదలికలు ఉన్నట్లు సమాచారం అందడంతో మరిన్ని భద్రతా బలగాలను మోహరించారు. జమ్మూలో, అఖ్నూర్ సెక్టార్‌లోని దిగువ ఘరోటా, థాథి, పరిసర ప్రాంతాల్లో పోలీసులు, CRPF సిబ్బంది సంయుక్తంగా ఆపరేషన్ చేస్తున్నారు. అలాగే, కథువాలో, లోహై మల్హర్‌లోని బద్నోటా గ్రామంతో సహా మాచెడి-కిండ్లీ-మల్హర్ పర్వత ప్రాంతాల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే, భద్రతా బలగాలు ఎంతగా కష్టపడుతున్నా.. ఉగ్రవాదులు తమ ప్లాన్లు మారుస్తూ.. కొత్త మార్గాల్లో కశ్మీర్‌లోకి చొరబడటం మరింత కలవరాన్ని సృష్టిస్తోంది.

జమ్మూ కాశ్మీర్‌లోని పీర్ పంజాల్‌కు దక్షిణ ప్రాంతం ఉగ్రవాదానికి కొత్త చిరునామాగా మారిందని భద్రతా అధికారులు చెబుతున్నారు. గత రెండేళ్లలో పీర్ పంజాల్‌కు ఉత్తరం నుంచి దక్షిణాన ఉన్న పీర్ పంజాల్‌కు టెర్రర్ కార్యకలాపాలు మారడంపై ఆర్మీ ఆందోళన చెందుతోంది. ఇటీవలి ఉగ్రదాడుల గురించి విశ్లేషించడానికి ఇటీవల యూనిఫైడ్ కమాండ్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అలాగే, ఆగస్టు 19తో ముగిసే అమర్‌నాథ్ యాత్రలో యాత్రికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. నిజానికి, ఈ ప్రాంతంలో శాంతి నెలకొందనే అభిప్రాయంతో ఇక్కడ భద్రతా బలగాలను తగ్గించారు. దీనితో ఇక్కడ ఉగ్రవాదుల కదలికలు ఎక్కువైనట్లు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో జమ్మూ ప్రాంతంలో భద్రతా, గూఢచార సంస్థలతో సంయుక్త ఆడిట్ కూడా నిర్వహించారు. ఎక్కడెక్కడ బలగాలు తక్కువగా ఉన్నాయో గుర్తించారు. ఆయా గ్యాపుల్లో బలగాలను మొహరించారు. అయితే, జమ్మూ ప్రాంతంలో మతపరమైన విధ్వంసాలను ఉపయోగించుకునేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని.. అందుకే ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా తెలిపాయి.


ఇక, కశ్మీర్‌లో శాంతి నెలకొనడం పాకిస్థాన్‌కు ఇష్టం లేదనీ.. అందుకే, జమ్మూ కశ్మీర్‌లోకి ఉగ్రవాదులను నెడుతున్నారని భారత్ ఆర్మీ చెబుతోంది. ముఖ్యంగా జమ్మూ ప్రాంతంలో మతపరమైన విధ్వంసాలను ప్రేరేపించేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని, అందుకే ఉగ్రవాదులు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని అంటున్నారు. ఈ ప్రాంతంలో పూర్తిగా సాధారణ పరిస్థితులు నెలకొన్నాయనే వాస్తవాన్ని పాకిస్తాన్ కూల్చివేయాలని కోరుకుంటోందని కశ్మీర్‌లో స్థానిక ఉగ్రవాద రిక్రూట్‌మెంట్‌లు తగ్గడం వల్ల, పాకిస్తాన్ సరిహద్దుల నుండి ఉగ్రవాదులను పంపుతోందని, జమ్మూ కాశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆర్‌ఆర్ స్వైన్ చెబుతున్నారు. అయితే, అనుకున్నంత ఎక్కువగా ఈ ప్రాంతంలో టెర్రరిస్టులు లేరనీ తక్కువ సంఖ్యలోనే ఉన్నారని అన్నారు.

Also Read: న్యాక్ గుర్తింపు నిబంధనలు మరింత సరళం

ఇక, పోలీస్ డీజే చెప్పిన మాటలను జమ్మూ కశ్మీర్‌లోని రాజకీయ పార్టీలు కొట్టిపారేస్తున్నాయి. ఇటీవల జరుగుతున్న దాడుల్ని ఖండించిన పీడీపీ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ.. కశ్మీర్‌ని యూటీగా మార్చి, కేంద్ర పాలనలోకి వెళ్లిన తర్వాత ఉగ్రదాడులు పెరిగాయని వెల్లడించారు. దాదాపు 50 మంది సైనికులు ప్రాణాలు కోల్పోతే.. ఎవ్వరికీ జవాబుదారీతనం లేదని విమర్శించారు. ఈ మేరకు డీజీ స్వేన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. డీజీగా ఉండి కశ్మీర్‌లో రాజకీయాలను చక్కదిద్దడంలో బిజీగా ఉన్నారనీ
ప్రజలను, జర్నలిస్టులను, రాజకీయ నాయకులను ఎలా వేధించాలా అని ఆయన ఆలోచిస్తున్నారని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం తీవ్రవాదంతో యుద్ధం చేయకుండా.. సొంతవారైన కశ్మీర్ ప్రజలతో యుద్ధం చేస్తుందని విమర్శించారు. ఎంతో మంది జవాన్లు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతున్నారనీ వారి బాధ్యత పోలీసులదా, రాజకీయ నేతలదా అని ప్రశ్నించారు. సరిహద్దులో ఉన్న భద్రతా బలగాలు తీవ్రవాదులు రాకుండా చూడాలనీ.. దానికి, కశ్మీరీ ప్రజలు, రాజకీయ నాయకులు బాధ్యులు కారని వెల్లడించారు. దీనికి పూర్తి బాధ్యత కేంద్రం వహించాలని డిమాండ్ చేశారు. అయితే, కశ్మీర్‌లో పరిస్థితులు ఎప్పుడూ సంక్లిష్టంగానే ఉంటాయన్నది నిజం. అందుకే, భద్రతా బలగాలు ఎంత ప్రయత్నించినప్పటికీ కశ్మీర్ నుండి ఉగ్రవాదాన్ని పూర్తిగా రూపుమాపలేకపోతున్నారు. దీనికి తోడు, స్థానికి గైడ్‌ల సహకారంతోనే విదేశీ ఉగ్రవాదులు కశ్మీర్‌లో పాగా వేస్తున్నారని ఇటీవల కూంబింగ్ ఆపరేషన్లలో భద్రతా బలగాలు కూడా గుర్తించాయి.

ఇలాంటి పరిస్థితుల మధ్య కొన్ని ప్రాంతాలకు వెళ్లడానికి కూడా సైనికులు, పోలీసులు వెనకాడే పరిస్థితి ఉంది. కొన్ని మారుమూలు గ్రామాలకు వెళ్లాలంటే ఆర్మీ ఆపరేషన్లు నిర్వహించే సమయంలోనే సాధ్యం అవుతుంది. లేకపోతే, ఆయా గ్రామాలకు వెళ్లే పోలీసులు ప్రాణాలతో బయటపడలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కడైన అనుమానితులు ఉన్నా వారిపైన నిఘా ఉంచే పరిస్థితులు లేవు. ముఖ్యంగా, ఉత్తర కశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలు మిలిటెంట్లకు రక్షణ దుర్గాలుగా ఉన్నాయనే అనుమానాలు గతంలో బలంగా ఉండేవి. అయితే, అక్కడ భారీగా బలగాలను మోహరించడంతో ఇప్పుడు ఉగ్రవాదులు దక్షిణం వైపు దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఇక, దీన్ని ఎదుర్కోడానికి భద్రతా బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

నిజానికి, కాశ్మీర్ దశాబ్దాలుగా మిలిటెన్సీ సమస్యని ఎదుర్కుంటూనే ఉంది. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదుల చొరబాట్లతో పాటు, సరిహద్దు ఉగ్రవాదం భద్రతా సవాళ్లకు కారణం అవుతోంది. అయితే, కాశ్మీర్‌లో మొహరించిన సైన్యం.. స్థానిక ప్రజలను తీవ్రవాద దాడుల నుండి రక్షించడానికి ఉద్దేశించిందే అయినప్పటికీ.. కొన్ని సందర్భాల్లో భారత్ ఆర్మీ నుండి అమాయక ప్రజలు దాడుల్ని ఎదుర్కుంటున్నాయనే ఆరోపణలు కూడా లేకపోలేదు. గతంలో అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా నివేదికలు దీనికి సంబంధించిన వివరాలను కూడా ప్రచురించింది. దశాబ్దాలుగా ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి.

Also Read: నీట్ కేసు, టెస్టింగ్ ఏజెన్సీ నుంచి పేపర్ లీక్, కీలక నిందితుడు అరెస్ట్

ఓ నివేదిక ప్రకారం, సాయుధ దళాల దాడుల కారణంగా.. 2022లో 19 మంది పౌరులు చనిపోతే అందులో 9 మంది హిందూ మైనారీటీలు ఉన్నట్లుగా గుర్తించారు. అలాగే, 2019 ఆగస్ట్ నుండి 2021 నవంబర్ మధ్య 87 మంది పౌరులు చనిపోయినట్లు నివేదిక వెల్లడించింది. ఇక, కౌంటర్ టెర్రరిజం పేరుతో జమ్మూ కశ్మీర్‌లో పౌరులను టార్గెట్ చేస్తున్నట్లు నివేదికలు కొన్ని చెబుతున్నాయి. ఈ పరిస్థితుల మధ్య కశ్మీర్‌లో భద్రతా బలగాలపై స్థానికులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది, అక్కడ ఉగ్రవాదాన్ని తుడిచేయడంలో అడ్డంకిగా మారుతోందనే వాదన కూడా ఉంది.

అయితే, ఇటీవలి సంవత్సరాల్లో కాశ్మీర్‌లో పరిస్థితి మెరుగుపడినప్పటికీ, పూర్తిగా శాంతి నెలకొల్పడం కోసం మరింత దృష్టిపెట్టాల్సిన అవసరం కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే జమ్మూ కశ్మీర్‌లో అభివృద్ధి, ఆర్థిక వృద్ధి, సమ్మిళిత పాలనను ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని అధికారులు చెబుతున్నారు. కానీ, పాకిస్తాన్ నుండి వచ్చే నిరంతర శత్రుత్వం కారణంగా భారత్ తన రక్షణ చర్యలను మరింత ఉధృతం చేయాల్సి వస్తోంది. దీనితో పాటు, ఇంకొన్ని రోజుల్లో జమ్మూ కశ్మీర్ ఎన్నికలు కూడా ఉండటం కశ్మీర్‌ భద్రతపై కలవరాన్ని పెంచుతున్నాయి. దీనితో, కాశ్మీర్ నుండి సైన్యాన్ని ఉపసంహరించుకోవాలనే నిర్ణయాన్ని ఇప్పుడు కేంద్రం మరోసారి పునరాలోచిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల మధ్య జమ్మూ కశ్మీర్‌లో జీరో టెర్రరిజం కనిపించడానికి ఎంత సమయం పడుతోందో అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి.

Tags

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×