EPAPER

Uniform Civil Code in India: దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ రాబోతుందా..?

Uniform Civil Code in India: దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ రాబోతుందా..?

ప్రతిపాదిత యుసిసి “అన్ని వర్గాలకు మేలు” మాత్రమే కాకుండా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విజన్ అయిన ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’కు అనుగుణంగా ఉంటుందని.. ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ ఆలోచనాతీరుతో నడుస్తుందని బీజేపీ వర్గాలు చెబుతూ వస్తున్నాయి. అయితే, యూసీసీలోని ప్రతిపాదనల్లో బహుభార్యత్వం, బాల్య వివాహాలపై పూర్తి నిషేధం, అన్ని మతాలలోని బాలికలకు ప్రామాణికమైన వివాహ వయస్సు, విడాకుల కోసం ఎవ్వరికైనా ఒకే ప్రక్రియ ఉన్నాయనీ.. లింగ సమానత్వం, సామాజిక ఐక్యతను పెంపొందించే లక్ష్యంతోనే ఈ చట్టాన్ని తీసుకువస్తున్నట్లు ఆ పార్టీ నేతలు వాదిస్తున్నారు.

ఈ యూసీసీ ముసాయిదా పౌర జీవితంలోని వివిధ కోణాలకు ఆపాదించబడుతుంది. వారసత్వ హక్కులు, తప్పనిసరి వివాహ నమోదు, బాలికలకు పెరిగిన వివాహ వయస్సు, వివాహానికి ముందు వారి విద్యాభ్యాసాన్ని సులభతరం చేయడం వంటి సిఫార్సులు ఉన్నాయి. అదనంగా, తమ వివాహాలను నమోదు చేసుకోని జంటలు ప్రభుత్వ సౌకర్యాలకు అనర్హులవుతారు. కనుక ఇది చట్టపరమైన డాక్యుమెంటేషన్‌ను తప్పనిసరి చేసే చట్టంగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.


అయితే, ఈ ప్రతిపాదిత యూసీసీ చట్టం.. ముస్లిం మహిళలతో సహా ప్రతి ఒక్కరికీ దత్తత హక్కులను మంజూరు చేస్తోందని అంటున్నారు. అయితే, ఇది హలాలా, ఇద్దత్ వంటి.. విడాకులు తీసుకున్నా… భర్త మరణించిన తర్వాత స్త్రీ తప్పనిసరిగా పాటించాల్సిన ఇస్లామిక్ పద్ధతులను తొలగిస్తోంది. అలాగే, లివ్-ఇన్ రిలేషన్స్ డిక్లరేషన్‌‌లో ఉన్న సహజీవనాన్ని ప్రోత్సహించడం, సులభమైన దత్తత ప్రక్రియల వంటి పద్ధతులను నిషేధిస్తుంది. ప్రతిపాదిత యూసీసీ అమల్లోకి వచ్చిన తర్వాత, ఇద్దరి మధ్య సహజీవనం అనేది చట్టం ప్రకారం నమోదు చేయాల్సి ఉంటుంది. అలాంటి సంబంధాలను నమోదు చేసుకోవడం వల్ల పురుషులు, మహిళలు ఇద్దరికీ ప్రయోజనం చేకూరుతుందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. దీనితో, మహిళలు నమోదు చేసే తప్పుడు కేసులు కూడా తగ్గుతాయనీ.. అలాంటి కేసుల్లో ఇప్పుడు చట్టపరమైన పవిత్రత ఉంటుందనే అభిప్రాయాలు ఉన్నాయి.

ఇక యూసీసీ ఇతర ముఖ్య లక్షణాలను గమనిస్తే.. కుమారులు, కుమార్తెలకు సమాన ఆస్తి హక్కులు, చట్టబద్ధమైన, చట్టవిరుద్ధమైన పిల్లల మధ్య వ్యత్యాసాలను తొలగించడం.. దత్తత తీసుకున్న, బయోలాజికల్‌గా జన్మించిన పిల్లలకు సమాన హక్కులను అందిస్తుంది. ఒక వ్యక్తి మరణించిన సందర్భంలో, ప్రతిపాదిత UCC ప్రకారం, జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులకు సమానమైన ఆస్తి హక్కులు అందుతాయి. అటువంటి హక్కులను పరిమితం చేసిన గత చట్టాలు దీనితో రద్దుచేయబడతాయి. అయితే, ఉత్తరాఖండ్‌లో అమలు చేస్తున్న ముసాయిదాలో జనాభా నియంత్రణ చర్యలతో పాటు, ఉత్తరాఖండ్ జనాభాలో 3 శాతం ఉన్న షెడ్యూల్డ్ తెగలను మినహాయించారు. దీని ప్రకారం, ఇతర రాష్ట్రాల్లో కూడా యూసీసీని తీసుకువస్తే షెడ్యుల్ తెగలను మినహాయించి, ఇతర హిందూయేతర కమ్యూనిటీలకు వర్తించే విధంగా.. అంటే, ముఖ్యంగా.. అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న ముస్లీంలకు వర్తించే విధంగా దీన్ని అమలు చేయాల్సి ఉంటుంది.

UCCని అమలు చేసిన మొదటి భారతీయ రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించినప్పటికీ, ఇంకొన్ని రాష్ట్రాలు కూడా దీనిని అమలు చేయాలనే ఉద్దేశాన్ని పలుమార్లు వ్యక్తం చేశారు. కర్నాటకలో 2023 ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ పార్టీ యూసీసీ అమలు చేస్తామని హామీ ఇచ్చింది. అయితే ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రాలేదు. ఇక, గతేడాది ఫిబ్రవరి 2024 నాటికి అస్సాంలో యూసీసీని అమలు చేస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చెప్పారు. ట్రిపుల్ తలాక్ గురించి శర్మ మాట్లాడుతూ, “ఎవరూ ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలను కలిగి ఉండటానికి అనుమతించబడరు. మన ముస్లిం మహిళల గొప్ప ప్రయోజనాల కోసం యూనిఫాం సివిల్ కోడ్‌ను అమలు చేయాలి” అని అన్నారు. అలాగే, జూన్ 2023లో, ప్రధాని మోడీ మహారాష్ట్రలో యూసీసీ అమలు చేస్తామని చెప్పారు. దీనిపై ఆ రాష్ట్రం తొమ్మిది మంది సభ్యుల కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇక, 2022లో, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్, హర్యానా, గుజరాత్‌లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు కూడా యూసీసీ అమలు చేస్తామని చెప్పారు. అయితే, ఇంతవరకూ ఉత్తరాఖండ్ మినహా ఇతర రాష్ట్రాలు ఏవీ ప్రతిపాదనను ముందుకు కొనసాగించలేదు.

Also Read: ‘కిసాన్ కీ బాత్’.. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త రేడియో కార్యక్రమం

అయితే, ఈ సమస్యకు మూలాలు బ్రిటీష్ వలస పాలనలోనే మొదలయ్యాయి. దీనికి హిందూ కోడ్ బిల్లు సాక్ష్యంగా నిలించింది. ఇక, భారతదేశంలోని క్రిమినల్ చట్టాలు ఒకే రీతిగా, అందరికీ సమానంగా వర్తిస్తే… వారి వారి మత విశ్వాసాలు ఏమైనప్పటికీ, పౌర చట్టాలు సదరు విశ్వాసం ద్వారా ప్రభావితమవుతాయి. మత గ్రంధాలకు లొంగిపోయి, సివిల్ కేసుల్లో అమలులోకి వచ్చే వ్యక్తిగత చట్టాలు రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఇప్పటికీ అమలు చేస్తున్నారు. ఇక, ఇటీవల మూడు కొత్త క్రిమినిల్ చట్టాలను తీసుకొచ్చిన మోడీ ప్రభుత్వం… ఇప్పుడు, పౌర చట్టాలను కూడా మార్చి ఒకే యూనీఫాం సివిల్ కోడ్‌ని తీసుకురావాలని అనుకుంటుంది. అయితే, తాజాగా మోడీ ప్రతిపాదిస్తున్న సెక్యులర్ సివిల్ కోడ్ అనే మాట యూనీఫాంకు కొత్త అర్థం ఇస్తుందా? అనే సందేహాలు కలుగుతున్నాయి. అంటే, యూనీఫాం అనే మాటకు బదులు సెక్యురల్ అని వాడుతుంటే.. అది, అన్ని మతాలకు సమాన ప్రాతినిధ్యం వహించాలి. కానీ, మతాలు వేటికవి విభిన్న ధర్మాలను పాటిస్తున్నప్పుడు పౌర చట్టాలను సెక్యులర్ చేయడం ఎంత వరకూ సాధ్యమౌతుందనేది ప్రశ్నార్థకంగా ఉంది.

భారతదేశ చారిత్రక, సాంస్కృతిక పరిస్థితులను బట్టి చూసినప్పుడు.. యూనీఫాం సివిల్ కోడ్‌ అమలు కత్తిమీద సాములాంటిదే. ఒకవైపు పురుషాధిక్య సమాజం, మరోవైపు మత విశ్వాసాల మధ్య జీవిస్తున్న సమాజంలో చట్టం అమలు.. దాని లక్ష్యానికి తగ్గట్లు వ్యక్తులను, ముఖ్యంగా స్త్రీలకు రక్షణ కల్పించడం కష్టసాధ్యంతో కూడుకున్న పని. అంతకుమించి, ఈ చట్టం కుటుంబ సంబంధాల్లో మరిన్ని సమస్యలు తెచ్చే పెట్టే అవకాశం ఉందనే వాదనలూ లేకపోలేదు. చట్టం చుట్టూ.. ఏకరూపత, లింగ సమానత్వం, సాంఘిక ఏకీకరణ కనిపిస్తున్నప్పటికీ.. అదే సమయంలో మత స్వేచ్ఛ, వ్యక్తిగత హక్కుల గురించి ఆందోళనలను కూడా పెంచుతుంది.

ఇక, భారతదేశంలో ఉన్న వ్యక్తిగత చట్టాలు, ప్రస్తుత మతపరమైన ఆచారాలు, సంప్రదాయాల ఆధారంగానే ఉన్నాయి. హిందూ వ్యక్తిగత చట్టాలనేవి పురాతన గ్రంథాలు, ఆచారాల నుండి ఉద్భవించాయి. హిందూ సమాజంలో వివాహం అనేది విడాకులు, వారసత్వం వంటి విషయాలను నియంత్రిస్తాయి. మరోవైపు, ముస్లిం పర్సనల్ లా బోర్డు, ముస్లింల వ్యక్తిగత విషయాలను పర్యవేక్షిస్తుంది. అలాగే, ఇతర మత సంఘాలు వారి స్వంత వ్యక్తిగత చట్టాలను కలిగి ఉంటాయి. అయితే, వీటన్నింటనీ నిషేధిస్తూ ఈ చట్టం రావడం వారి మనోభావాలను పూర్తిగా విస్మరించడమే అనే వాదనలు వస్తున్నాయి.
ఇక, భారతదేశ విభిన్న మతపరమైన సంక్లిష్టతల దృష్ట్యా యూసీసీ లక్ష్యాన్ని సాధించడంలో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది.

సంవత్సరాలుగా, న్యాయవ్యవస్థ యూనిఫాం సివిల్ కోడ్ వర్తింపు, పరిధిపై విభిన్న వివరణలను వెలువరించింది. న్యాయస్థానాలు తరచుగా వ్యక్తిగత హక్కులను రాష్ట్రాల సంక్షేమ లక్ష్యాలతో సమతుల్యం చేస్తాయి. మతపరమైన స్వేచ్ఛ, సామాజిక ప్రయోజనాల మధ్య సమన్వయం ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి. కాబట్టి, యూసీసీ అమలుకు ఒక వ్యక్తి ప్రాథమిక హక్కులను సమర్థించడం, సామాజిక సంక్షేమ లక్ష్యాలను నిర్ధారించడం మధ్య సున్నితమైన బ్యాలెన్స్‌ను సాధించడం అవసరం. మొత్తం సమాజానికి ప్రయోజనం చేకూర్చే ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించేటప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛపై ఎటువంటి ఉల్లంఘన జరగకుండా నిరోధించడానికి రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండటం చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ చట్టం దాన్ని సాధించాల్సి ఉంది.

యూనీఫాం సివిల్ కోడ్‌ అమలుకు ఉన్న సవాళ్లలో మత పెద్దలదే కీలక పాత్ర. వీరిలో కొందరు సామరస్యం, జాతీయ సమైక్యతల కోసం వాదిస్తుంటే.. మరికొందరు మత స్వేచ్ఛ, సాంస్కృతిక పద్ధతులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇవి మతాంతర వివాహాలు, సంబంధాలపై ప్రభావం చూపిస్తాయి. వివాహంలో స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది. విభిన్న మతపరమైన నేపథ్యాలకు చెందిన జంటలు ఎదుర్కొనే సంక్లిష్టతను తగ్గిస్తుంది. అదే సమయంలో కుల దురహంకార పరువు హత్యలను మరింత తీవ్రతరం చేసే అవకాశం కూడా ఉంటుందనే వాదనలు ఉన్నాయి.

అందుకే, యూనిఫాం సివిల్ కోడ్‌కు సంబంధించి వివిధ సంఘాలు భిన్నమైన అభిప్రాయాలు, ఆందోళనలను కలిగి ఉన్నాయి. కొందరు మెరుగైన సాంఘిక ఐక్యత ఉంటుందని చెబుతుంటే.. మరికొందరు సాంస్కృతిక గుర్తింపు కోల్పోవడం గురించి భయాందోళనలను వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య మోడీ ప్రతిపాదిస్తున్న ఈ సెక్యులర్ సివిల్ కోడ్‌ వ్యవహారంలో రాష్ట్రాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో చూడాల్సి ఉంది.

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×