EPAPER

Modi Ukraine Tour: మోదీ ఉక్రెయిన్ టూర్.. కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం

Modi Ukraine Tour: మోదీ ఉక్రెయిన్ టూర్.. కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం

Modi Ukraine Tour: నరేంద్రమోడీ ఉక్రెయిన్‌ టూర్‌పై ఇప్పుడిదే మాట వినిపిస్తోంది. చిన్న నోట్‌.. ఈ డైలాగ్‌ మనకు కాదు.. ఉక్రెయిన్‌ యాంగిల్‌లో చెప్పింది. ఎందుకంటే మోడీ పర్యటనతో ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి ఆనందంగానే ఉన్నా.. ఇంకా కాస్త బుంగమూతితో ఉన్నారని తెలుస్తోంది. ఇంతకీ ఈ టూర్‌తో మోడీ ఏం ప్రూవ్ చేశారు? ప్రపంచ దేశాలకు భారత్ ఇచ్చిన సందేశమేంటి? ఇరు దేశాల మధ్య జరిగిన చర్చలేంటి? ఒప్పందాలేంటి?


ఓ పర్యటన.. ఓ హగ్.. ఇప్పుడు వరల్డ్‌వైడ్‌గా డిస్కషన్‌కు కారణమైంది. అవును.. భారత ప్రధాని నరేంద్రమోడీ ఉక్రెయిన్‌లో పర్యటించడం అనేది నిజంగా మాములు విషయం కాదు. అది కూడా రష్యా అధ్యక్షుడిని ఆలింగనం చేసుకున్న ఆరు వారాల్లో ఆ దేశానికి శత్రువైన ఉక్రెయిన్‌ అధ్యక్షుడికి హగ్ ఇవ్వడం మోడీకే చెల్లింది. ఇది భారత్‌ తప్ప మరే దేశం చేయలేని సాహసమనే చెప్పాలి. సరే.. ఇవన్ని పక్కన పెడితే ఇరు దేశాల మధ్య కొన్ని కీలక ఘటనలు జరిగాయి. వాటి ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూద్దాం.

ఉక్రెయిన్‌కు చేరుకున్న మోడీకి ఘన స్వాగతం దక్కింది. అక్కడ ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత జెలెన్‌స్కీతో వన్‌ టు వన్‌ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్‌ తర్వాత కూడా మోడీ ఒకే స్టాండ్‌పై ఉన్నారు. తాము ఎవరి పక్షాన వకాల్తా పుచ్చుకోవడం లేదు. తాము శాంతివైపు మాత్రమే ఉన్నామని మరోసారి జెలెన్‌ స్కీ సమక్షంలోనే కుండ బద్ధలు కొట్టారు. కాబట్టి.. ఎక్కడికి వెళితే అక్కడి భజన చేయమని ప్రపంచానికి చెప్పకనే చెప్పింది భారత్. కానీ జెలెన్‌ స్కీకి కాస్త నచ్చనట్టు కనిపిస్తోంది. ఇండియా కేవలం ఉక్రెయిన్‌కే మద్ధతివ్వాలనేది ఆయన ఆలోచన. ఎందుకంటే ఈ యుద్ధంలో బాధితులుగా ఉన్నది తామే అని.. ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ తమకు మాత్రమే మద్దతివ్వాలంటున్నారు ఆయన.


కానీ.. ఇండియా వర్షన్‌ మాత్రం మరోలా ఉంది. మనకు రెండు దేశాలతో స్నేహం, సంబంధాలు అవసరమే. అందుకే రెండు దేశాలకు సమాన దూరం పాటిస్తుంది. ఇదే సమయంలో.. యుద్ధాన్ని కూడా ఆపాలని ఇరు దేశాలను రిక్వెస్ట్ చేస్తోంది. ఇరు దేశాలు చర్చలతో ఈ మారణహోమానికి చెక్ పెట్టాలని కోరుతోంది. ఈ టూర్‌లో హైలేట్‌ ఏంటంటే.. మోడీ రష్యాలో అడుగుపెట్టిన సమయంలో కీవ్‌పై దాడి జరిగింది. ఆ దాడిలో చిన్నారులతో సహా పలువురు మృతి చెందారు. ఇప్పుడు మోడీ పర్యటనలో భాగంగా అమరుల స్మారకం వద్ద నివాళులు అర్పించారు మోడీ.

Also Read: తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ ఎవరు ? జుట్టు పీక్కుంటున్న అధిష్టానం.. అర్వింద్ వ్యాఖ్యల వెనుక మర్మం?

ఇక ఈ టూర్‌లో ఇరు దేశాల మధ్య నాలుగు ఒప్పందాలు జరిగాయి. వ్యవసాయం, వైద్యం, మానవతా సాయం, సాంస్కృతికం. ఈ నాలుగు అంశాలపై ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరిగాయి. విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ వీటిపై సంతకాలు చేశారు. అంతేకాదు రష్యాతో కుదిరిన ఒప్పందాల విషయాన్ని కూడా జెలెన్‌స్కీ తెరపైకి తెచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఉక్రెయిన్‌కు ఓ గిఫ్ట్ అందించింది ఇండియా. భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహ్యోగితా అండ్ మైత్రీ.. సింపుల్‌గా భిష్మను ఆ దేశానికి అందించారు ప్రధాని మోడీ. సింపుల్‌గా చెప్పాలంటే ఇది మొబైల్ హాస్పిటల్. ఎమర్జెన్సీ సమయంలో దీనిని ఉపయోగించవచ్చు. దీని వల్ల ఒకేసారి 200 మందికి సేవలు అందించవచ్చు. ఇందులో అత్యవసర వైద్యానికి సంబంధించి 72 పరికరాలు ఉన్నాయి. సులభంగా క్యారీ చేయవచ్చు.. ఇది ఉక్రెయిన్ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో బాగా ఉపయోగపడుతుంది.

ఇక మోడీ రష్యాలో పర్యటించడంపై కాంట్రవర్సీ క్రియేట్ చేయాలని చూసింది వెస్ట్రన్ మీడియా. మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను హగ్ చేసుకోవడంపై కాంట్రవర్సీ క్రియేట్ చేయానుకున్నారు. అయితే మన విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ మూతోడ్ జవాబిచ్చారు.

అక్కడ పుతిన్‌ ఉన్నా.. జెలెన్‌ స్కీ ఉన్నా.. మరే నేత ఉన్నా.. భారత సంస్కృతి సాంప్రదాయం ప్రకారమే నడుచుకున్నాం కానీ.. ఒకరిని ఎక్కువగా.. మరోకరిని తక్కువగా చూడలేదంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు జై శంకర్. బహుశా భారత్ సంస్కృతి సాంప్రదాయాలపై మీకు అవగాహన లేదనుకుంటా అని చురకలు కూడా అంటించారు. అయితే అప్పటికీ కూడా కొన్ని మీడియా సంస్థలు మాత్రం వెస్ట్రన్‌ దేశాధినేతల మెప్పు కోసమే మోడీ ఉక్రెయిన్‌లో పర్యటించారంటూ తమ గ్యాస్ట్రిక్ సమస్యలను బయటపెట్టుకున్నాయి.

ఇక మోడీ ఉక్రెయిన్‌ టూర్‌పై అమెరికా రియాక్ట్ అయ్యింది. జెలెన్‌స్కీ చేస్తున్న శాంతి ప్రయత్నాలు మోడీ పర్యటనలో సాకారం కావాలంటూ స్టేట్‌మెంట్‌ రిలీజ్ చేసింది. ప్రపంచ దేశాలన్ని మోడీవైపే చూశాయంది. కాబట్టి.. మోడీ అడుగులను అగ్రదేశాలతో పాటు.. చిన్న దేశాలు కూడా అబ్జర్వ్‌ చేస్తున్నాయి. ఏదేమైనా ఈ టూర్‌తో ఇటు వెస్ట్రన్‌ కంట్రీస్‌కు.. అటు రష్యాకు మోడీ ఓ సందేశాన్ని ఇచ్చారు. అదేంటంటే.. తాము మాటలు మాత్రమే కాదు.. చేతలు కూడా న్యూట్రల్‌గానే ఉంటాయని. అలా ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటన కొంచెం ఇష్టం.. కొంచెం కష్టంగా సాగింది.

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×