EPAPER

Pawan Kalyan: పవన్ లో మార్పు.. ప్రచారంలో కొత్త అస్త్రం!

Pawan Kalyan: పవన్ లో మార్పు.. ప్రచారంలో కొత్త అస్త్రం!

Pawan Kalyan latest political news


2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పవన్ పోటీ చేశారు.. కానీ ఆ ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయారు.. దీంతో తీవ్ర విమర్శలకు గురయ్యారు.. ఓ రకంగా వైసీపీ నేతలు ఆయనను చాలా దారుణంగా ట్రోల్ చేశారు.. కానీ ఈసారి ఎన్నికల్లో ఆయన రూట్ మార్చారు. ఈ ఎన్నికల్లో ఆయన కేవలం పిఠాపురం నుంచే బరిలోకి దిగుతున్నారు.. ఫోకస్ మొత్తం పిఠాపురంపైనే పెట్టారు. అంతేకాదు గతానికి భిన్నంగా జనంలోకి వెళుతున్నారు.. 2019లో కేవలం ర్యాలీలు, రోడ్‌ షోలకే పరిమితమయ్యారు పవన్.. కానీ ఇప్పుడు నడుస్తూ జనంలోకి వెళుతున్నారు.. ప్రతి ఒక్కరిని పలకరిస్తున్నారు. అంతేకాదు. 2019లో అడగలేదు.. కానీ ఇప్పుడు అడుగుతున్నాను ప్లీజ్ గెలిపించండి అంటున్నారు.


Also Read: ఏపీపై కన్నేసిన ఈసీ… నెక్ట్స్ జాబితాలో వీళ్లిద్దరేనా?

రెండు చేతులెత్తి నమస్కరిస్తూ రిక్వెస్ట్ చేస్తున్నారు.. మీ కోసం నిలబడతానంటున్నారు.. మీ ఆశీర్వాదాలు కావాలంటున్నారు.. ప్లీజ్ ఒక్కచాన్స్‌ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. తన ప్రచారంలో దేవాలయాల అభివృద్ధిని హైలేట్ చేస్తున్నారు పవన్.. పిఠాపురంలో వైసీపీ దేవాలయాల అభివృద్ధిని పట్టించుకోవడం లేదంటున్నారు. తాను గెలిచిన వెంటనే 70 నుంచి 100 కోట్ల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానంటున్నారు. మాములుగానే పవన్‌ బీజేపీతో పొత్తులోఉన్నారు.. సో ఆటోమెటిక్‌గా హిందూత్వ ముద్ర పడుతోంది. దాన్ని చెరిపేసుకోవాలని చూస్తున్నారు పవన్.. అందుకే చర్చిల బాట కూడా పట్టారు.. ఆంధ్ర బాప్టిస్టు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బషీర్‌ బీబీ దర్గాను సందర్శించారు. ఇలా సర్వమత ప్రార్థనస్థలాలను చుట్టేస్తూ.. తనకు అన్ని మతాలు సమానమే అనే సిగ్నల్స్ ఇస్తున్నారు.

మరి గెలవాలంటే ఏ ఒక్కవైపు స్టాండ్ తీసుకుంటే సరిపోదు కాబట్టి. అందరిని మచ్చిక చేసుకునే పనిలో ఉన్నారు పవన్. అదే సమయంలో సెంటిమెంట్‌ను రగిలించే పనిలో కూడా ఉన్నారు పవన్.. మాములుగానే పవన్ ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫ్యాన్స్‌ కుప్పలు కుప్పలుగా వస్తారు. అది రోడ్‌ షో అయినా.. బహిరంగ సభ అయినా.. పవన్‌ను టచ్‌ చేయాలని.. ఆయనతో షేక్‌ హ్యాండ్ అయినా ఇవ్వాలని ట్రై చేయని అభిమాని ఉండరు. అయితే అభిమానుల ముసుగులో అరాచక శక్తులు తనపై దాడులు చేస్తున్నారంటున్నారు పవన్. ఇది పవన్ చెబుతున్న మాట.. తనపై, తన సెక్యూరిటీ సిబ్బందిపై బ్లేడ్‌లతో దాడులు చేస్తున్నారంటున్నారు. ఇకపై 200 మందితో సెల్ఫీలు దిగుతానని చెబుతున్నారు. దాడులు ఎవరు చేస్తున్నారో మీకు తెలుసు కదా. అంటూ ఆన్సర్‌ని తన అభిమానులకే వదిలేశారు.

Also Read: కడపలో కుటుంబ పోరు.. గెలుపెవరిది?

సో చెప్పకనే చేసేదంతా వైసీపీనే అని చెప్పేస్తున్నారు పవన్.. ఇప్పుడే కాదు గతంలో కూడా పవన్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.. తన కాన్వాయ్‌ను కొందరు వెంబడిస్తున్నారని.. తనపై దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ అప్పుడు కూడా ఆరోపించారు.. ఇప్పుడు కూడా అదే మాటలు పవన్ నోటి నుంచి వినిపిస్తున్నాయి. పవన్ తీరు చూస్తుంటే గెలుపు కోసం సామ దాన భేద దండోపాయాలు అన్ని ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో గెలవాలి.. గెలవకపోతే జరిగే నష్టం అంతా ఇంతా కాదు. పిఠాపురంలో కనక పవన్ ఓడిపోతే పార్టీకి జరిగే డ్యామేజీ అంతా ఇంతా కాదు.. పార్టీని అటుంచి. సొంతంగా గెలవలేకపోయారన్న అపవాదు. పవన్‌ అకౌంట్‌లో చేరిపోతుంది.

ఇది జనసేన నేతలు, కార్యకర్తల మోరల్‌ను దెబ్బతీసే చాన్సుంది. అయితే పవన్ ఇంత కష్టపడేందుకు ఇంకా చాలా కారణాలు కూడా కనిపిస్తున్నాయి.. పవన్‌కు పోటీగా బరిలోకి దిగింది వైసీపీ ఎంపీ వంగా గీత.. పవన్‌ను ఎలాగైనా ఓడించాలన్న కసి వైసీపీలో కనిపిస్తోంది. వంగా గీత నిజానికి బలమైన అభ్యర్థి.. దీనికి తోడు పార్టీ అధికారంలో ఉంది.. ఇదీ కాదన్నట్టు ఒక్కో మండలానికి ఒక్కో కీలక నేతను రంగంలోకి దించారు.. ఏ కాపు కార్డునైతే పవన్‌ వాడి గెలవాలని చూస్తున్నారో.. ఆ ఎత్తులను చిత్తు చేసేందుకు ఏకంగా ముద్రగడను కూడా రంగంలోకి దించింది వైసీపీ.  సో గెలుపు నల్లేరుపై నడక కాదు. అందుకే పవన్‌ తీరు మార్చారు. నడక మార్చారు. మాటతీరు మార్చారు. మరి పిఠాపురం ప్రజల మనసులు గెలుచుకునేందుకు పవన్ ఫాలో అవుతున్న స్ట్రాటజీ.. ఎంత మేర ఉపయోగపడతాయన్నది చూడాలి.

Related News

Press Freedom: మీడియాతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ..!

Kargil War: కార్గిల్ యుద్ధం ఎందుకు జరిగింది?.. 25 ఏళ్ల తర్వాత నిజం ఒప్పుకున్న పాక్

Big Shock to YS Jagan: పూర్తిగా ఖాళీ అవుతున్న వైసీపీ.. వీళ్లంతా జంప్

US Presidential Election 2024: కమలా హారిస్ విన్ అవుతుందని.. అలన్ ఎలా చెప్తున్నాడు?

TDP Office Attack Case: పరారీలో జోగి రమేశ్‌, దేవినేని అవినాశ్‌?

YSRCP VS TDP: వరద పాలిటిక్స్.. బురదలో ప్రజలు.. నేతల గొప్పలు

Natural Disaster: క్లౌడ్‌ బరస్ట్‌తో ఆకస్మిక వరదలు.. విపత్తులను ఆపే దారేది?

Big Stories

×