EPAPER

Pakistan: కేజీ గోధుమ పిండి రూ.800, వంటనూనె రూ.900.. ‘పాకిస్తాన్ ప్రజలు గడ్డితింటారు కానీ అణు ఆయుధాలు కావాలి’

Pakistan: కేజీ గోధుమ పిండి రూ.800, వంటనూనె రూ.900.. ‘పాకిస్తాన్ ప్రజలు గడ్డితింటారు కానీ అణు ఆయుధాలు కావాలి’

Pakistan: పాకిస్తాన్ లో ఆర్థిక సంక్షోభం తీవ్రంగా ఉంది. చరిత్రలో ఇంతటి దారిద్ర్యం పాకిస్తాన్‌లో ఎన్నడూ లేదు. నిత్యావసరాలు అసల లభించడం లేదు. ఉన్న సరకు ధర పదింతలుగా మారింది. దీంతో పేదలు కాదు కదా… మధ్య తరగతి వారికి కూడా తినడానికి ఆహారం చాలా కష్టంగా లభిస్తోంది. గత రెండు సంవత్సరాలు పరిస్థితి దిగజారుతూనే ఉంది. ఇలా ఇంకెన్ని రోజులుంటుదో ఎవరూ చెప్పలేని పరిస్థితి.


పాకిస్తాన్ లో కిలో గొధుమ పిండి పాకిస్తానీ కరెన్సీ రూ.800, సంవత్సర క్రితం వరకు ఇది రూ.230 ఉంది. వంటనూనె లీటర్ రూ.900. ఈ విపరీతమైన ధరల పెరుగుదలకు ముఖ్య కారణం.. పాకిస్తాన్ కరెన్సీ విలువ అంతర్జాతీయ మార్కెట్ లో పడిపోవడం, ప్రపంచ బ్యాంకు నుంచి అందే సబ్సిడీలు ఆగిపోవడం. దీనివల్ల సామాన్య ప్రజలు బతుకు భారంగా మారి అల్లాడుతున్నారు. ఆహారం, ఇల్లు, వైద్యం, చదువు.. ఈ అవసరాలు కూడా చేతికి అందడం లేదు.

పరిస్థితి ఇంత దీనంగా ఉన్నా.. పాకిస్తాన్ ప్రభుత్వం ఇటీవల రక్షణ రంగంలో మిలిటరీ బడ్జెట్ లో మరో 15 శాతం పెంచింది. అంటే బడ్జెట్ లో రూ.2 లక్షల 12 వేల కోట్లు కేటాయించింది. ఇదెలా ఉందంటే.. తినడానికి తిండి లేదు కానీ.. చేతిలో ప్రతి ఒక్కరికీ తుపాకీ కావాలి.


ఈ నిధులను పాకిస్తాన్ పాలకులు న్యూక్లియర్ ఆయుధాలు కొనడానికి ఉపయోగిస్తారు. ఇప్పుడే కాదు గతంలో కూడా పాకిస్తాన్ ప్రభుత్వం.. ప్రజల కష్టాలు, అవసరాల కంటే మిలిటరీ కోసమే ఎక్కువ ఖర్చు చేస్తుంది. అందుకే 1965లోనే “పాకిస్తాన్ ప్రజలు గడ్డితింటారు.. కానీ న్యూక్లియర్ బాంబులు కొనడానికి ఖర్చు చేస్తారు” అని పాకిస్తాన్ మిలిటరీ జెనెరల్ జుల్ఫికర్ అలీ భుట్టో చెప్పారు.

Also Read: బంగ్లాదేశ్ కు వెళ్లొదు.. భారతీయులుకు ప్రభుత్వ మార్గదర్శకాలు!

గత నెలలో పాకిస్తాన్ పార్లమెంట్ లోని దిగువ సభ నేషనల్ అసెంబ్లీలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టింది. ఈ బడ్జెట్ లోనే మిలిటరీ బడ్జెట్ భారీగా పెంచేసింది. గత సంవత్సరం రూ. లక్షా 80 వేల కోట్లు ఖర్చుపెడితే.. అంతకుమందు సంవత్సరం.. లక్షా 52 వేల కోట్లు ఖర్చుపెట్టింది. ఇలా ప్రతీ సంవత్సరం అవసరం లేకపోయినా ఖర్చు పెడుతూనే ఉంది. అణు ఆయుధ మహాశక్తిగా పాకిస్తాన్ ఎదుగుతుందని రాజకీయ నాయకులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంటారు.

బడ్జెట్ సమయంలో ప్రస్తుత ఆర్థిక మంత్రి మొహమ్మద్ ఔరంగజేబు మాట్లాడుతూ.. రాబోయే సంవత్సరంలో 3.6 శాతం వృద్ధిని ఆశిస్తున్నామని తెలిపారు. గత సంవత్సరం ఈ టార్గెట్ 3.5 శాతంగా ఉంది. కానీ 2.8 శాతం వద్దే వృద్ధి ఆగిపోయింది. మొత్తం దేశ బడ్జెట్ దాదాపు రూ.18 లక్షల 88 వేల కోట్లు ఉంటే.. అందులో రూ.2 లక్షల 12 వేల కోట్లకు పైగా డిఫెన్స్ కోసమే కేటాయించింది.. పాక్ ప్రభుత్వం.

అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాక్.. చైనా అప్పులే సింహభాగం
దేశ బడ్జెట్ లో మిలిటరీ కేటాయింపులకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తే.. అంతకుమించి దేశ అప్పులు చెల్లించాల్సినవి ఉన్నాయి. 2024-25 సంవత్సరానికి గాను రూ.9 లక్షల 70 వేల కోట్ల అప్పులు పాకిస్తాన్ చెల్లించాలి. ఈ అప్పుల్లో సింహభాగం చైనాకు చెల్లించాలి. దేశ బడ్జెట్ రూ.18 లక్షల కోట్లుంటే.. అందులో సగం అప్పులు చెల్లించడానికే సరిపోతుంది. ద్రవ్యోల్బణం 2024-25కి 12 శాతం టర్గెట్ అని.. అందులో బడ్జెట్ డెఫిషిట్.. జిడిపిలో 6.9 శాతం గా అంచనా వేశారు.

పాక్ ఆర్థిక మంత్రి ప్రకటనలో మరో రెండు ముఖ్యమైన అంశాలు.. ప్రజల నుంచి రూ.12 లక్షల 97 వేల కోట్లు పన్నులు వసూలు చేయడం టార్గెట్, ప్రభుత్వ సంస్థలని ప్రైవేటు కంపెనీలకు విక్రయించడం, విమానాశ్రయాలను ప్రైవేట్ కంపెనీలకు ఔట్ సోర్సింగ్ చేయడం. ఆకలితో అలమటిస్తున్న ప్రజల నుంచి దాదాపు రూ.13 లక్షలు పన్నులు వసూలు చేస్తామని ప్రపంచంలో ఏ దేశం కూడా ప్రకటించి ఉండదు. అది పాకిస్తాన్ పాలకులకే చెల్లింది.

Tags

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×