EPAPER

AP Political Jumpings : ఎన్నికల ముందు ఆపరేషన్ ఆకర్ష్.. లాభమెవరికి ? నష్టమెవరికి ?

AP Political Jumpings : ఎన్నికల ముందు ఆపరేషన్ ఆకర్ష్.. లాభమెవరికి ? నష్టమెవరికి ?

Andhra politics news


AP Political Jumpings in front of Elections(Andhra politics news): ఎన్నికల వేళ ఏపీ రాజకీయం వలసలతో సందడిగా మారుతోంది. ఎవరు ఎక్కువ మందిని ఆకర్షిస్తే అంత బెటర్ మెంట్ ఉంటుందని అనుకుంటున్న పరిస్థితి ఉంది. కొత్తగా వచ్చే వారెవరూ లేరు. ప్రధాన పార్టీలుగా ఉన్న వైసీపీ, టీడీపీల్లో ఇప్పటికే ఉన్న లీడర్లు కొందరు అటువైపు, ఇంకొందరు ఇటువైపు జంప్ చేస్తున్నారు. షెడ్యూల్ కు ముందు జంపింగ్ పాలిటిక్స్ పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఎవరు వచ్చినా ప్రొఫైల్ తో పని లేకుండా, కాదనకుండా కండువాలు కప్పేస్తున్నారు.

ఏపీలో ఇప్పుడు వలస రాజకీయం జోరందుకుంది. నేతలు వస్తామని సిగ్నల్స్ ఇవ్వడమే ఆలస్యం.. టీడీపీ, వైసీపీ జై కొట్టేస్తున్నాయి. వెనకా ముందు ఆలోచించడం తర్వాతి సంగతి.. ముందైతే కండువా కప్పెయ్ అన్నట్లుగానే సీన్ నడుస్తోంది. ఎందుకంటే ఎన్నికల ముందు భారీగా చేరికలు ప్రజల్లో పాజిటివ్ సిగ్నల్స్ తీసుకెళ్తుంటాయి. దీంతో తమకు ఎడ్జ్ ఉంటుందన్న ఉద్దేశంతో ఓవైపు అధికార వైసీపీ, ఇంకోవైపు టీడీపీ వలసలను విపరీతంగా ప్రోత్సహిస్తున్నాయి. ఏ పార్టీలో ఎక్కువ మంది నేతలు చేరితే అంత మైలేజ్ అన్నట్లుగా ప్రిస్టీజియస్ గా తీసుకుంటున్నారు.


Read More : హు కిల్డ్‌ బాబాయ్‌.. జగన్‌ ఇప్పటికైనా చెప్పాలి..

నేతలు సరిగ్గా ఎన్నికల ముందే పార్టీలు మారడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఇన్నాళ్లు వారు జెండాలు మోసేది, పార్టీ కార్యక్రమాలకు డబ్బులు పెట్టుకునేది టిక్కెట్ల కోసమే. మరి అదే రాదని తెలిసినప్పుడు ఇక పార్టీల్లో ఉండి ఏం లాభం అని చాలా మంది మారుతుంటారు. ఇది ఒక్క ఏపీకే పరిమితమైన విషయం కాదు. అన్ని రాష్ట్రాలు, అన్ని పార్టీల్లో కనిపించేదే. అయితే ఇప్పుడు ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఒకేసారి ఉంటాయి కాబట్టి ఇలాంటి సమీకరణాలు మిగితా రాష్ట్రాల కంటే ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇప్పుడు ఏపీలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీల మధ్య వలసల జోరు ఓ రేంజ్ లో ఉంది. మోసేది, పార్టీ కార్యక్రమాలకు డబ్బులు పెట్టుకునేది టిక్కెట్ల కోసమే. మరి అదే రాదని తెలిసినప్పుడు ఇక పార్టీల్లో ఉండి ఏం లాభం అని చాలా మంది మారుతుంటారు. ఇది ఒక్క ఏపీకే పరిమితమైన విషయం కాదు. అన్ని రాష్ట్రాలు, అన్ని పార్టీల్లో కనిపించేదే. అయితే ఇప్పుడు ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఒకేసారి ఉంటాయి కాబట్టి ఇలాంటి సమీకరణాలు మిగితా రాష్ట్రాల కంటే ఇక్కడ జోష్, హీట్ రెండూ ఎక్కువే.

కొందరైతే అసలు టిక్కెట్ హామీ లేకపోయినా పార్టీ మారుతున్నారు. కారణం బాగా హర్ట్ అవడమే. ఏళ్లకేళ్లు పార్టీలను నమ్ముకుని పని చేస్తే తీరా సమయానికి టిక్కెట్ రాక, గుర్తింపు లేక చివరకు ఆగ్రహంతో పార్టీలు మారే వారూ ఉంటారు. ఇప్పుడు వైసీపీ, టీడీపీ రెండు పార్టీల నుంచి వలసల జోరు పెరిగింది. వస్తామంటే చాలు వచ్చెయ్ అన్నట్లుగానే పరిస్థితి ఉంది. అయితే పొలిటికల్ ప్రొఫైల్ చూసి, పార్టీకి వారి వల్ల లాభం ఉందంటేనే.. టిక్కెట్ హామీ ఉన్నా లేకున్నా వచ్చే వారికే ఇంకొన్ని పార్టీలు అవకాశం ఇస్తున్నాయి.

ఓ వైపు వైసీపీ, ఇంకోవైపు టీడీపీ-జనసేన కూటమి వరుసగా అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నాయి. దీంతో ఆయా పార్టీల్లో అసంతృప్తులు భారీగానే ఉంటున్నారు. అధికార పార్టీ వైసీపీలో అసంతృప్తులు పెరిగిపోతున్నారు. సీఎం జగన్ టిక్కెట్ల కేటాయింపుల విషయంలో ఈసారి భారీ ప్రయోగాలు చేపట్టారు. కొందరు సిట్టింగ్ లను పక్క నియోజకవర్గాలకు పంపారు. ఇంకొందరి పార్లమెంటరీ స్థానాలను మార్చేశారు. దీంతో వారంతా తీవ్ర నిరాశతో ఉన్నారు. చంద్రబాబు సైకిల్ పార్టీకి జై కొట్టేశారు. ఎన్నికలు దగ్గరపడుండడంతో గేర్ మార్చి స్పీడ్ పెంచాల్సిందే. ఇప్పుడు అదే పనిని టీడీపీ చేస్తోంది. వైసీపీ సిట్టింగ్ ఎంపీలు లావు కృష్ణదేవరాయలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వసంత కృష్ణరాయలు సైకిల్ ఎక్కారు.

Read More : వైసీపీకి వరుస షాక్‌లు.. టీడీపీలోకి వసంత, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి..

ఎన్టీఆర్ జిల్లా మైలవరం సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వైసీపీకి ఇటీవలే రాజీనామా చేశారు. వైసీపీ పాలనపై, జగన్ తీరుపైనా కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న వసంత కృష్ణప్రసాద్ పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటూ వచ్చారు. ఆయన టీడీపీలో చేరనున్నారని ముందే పసిగట్టిన సీఎం జగన్.. అక్కడ ఇంఛార్జీగా కొత్త అభ్యర్థిని నిలబెట్టారు. మైలవరం టీడీపీ ఇంఛార్జీగా పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఉన్నారు. వసంత చేరికతో ఆయన సీటుకు ఇబ్బంది ఏర్పడింది. అయితే దేవినేని ఉమను పెనమలూరు నుంచి పోటీ చేయించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. వసంత మాత్రం తాను బేషరతుగా వచ్చానన్నారు. అటు లావు శ్రీకృష్ణదేవరాయులును గుంటూరు నుంచి పోటీ చేయాల్సిందిగా వైసీపీ ఆదేశించింది. అయితే ఆ ప్రతిపాదనను లావు తిరస్కరించారు. తాను నరసరావుపేట నుంచే బరిలో ఉంటానని తేల్చి చెప్పారు. అప్పటి నుంచి వైసీపీకి, లావుకు మధ్య గ్యాప్ పెరిగింది. దీంతో ఆయన వైసీపీని వీడారు.

అటు నెల్లూరు జిల్లా పాలిటిక్స్ కూడా వేడెక్కాయి. ఇప్పటికైతే వైసీపీలో ఓవర్ లోడ్ ఉండడంతో చాలా మంది టీడీపీవైపు చూస్తున్నారు. ఇప్పటికే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి ఆ పార్టీని వీడగా, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సైతం పార్టీకి రాజీనామా చేశారు. సైకిల్ కు జై కొట్టారు. మరోవైపు ఇదే బాటలో ఇంకొందరు నేతలు ఉన్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే నెల్లూరు వైసీపీ ఖాళీ అవుతుందని టీడీపీ నేతలు లెక్కలేసుకుంటున్నారు. వైసీపీ ఖాళీ అయిందన్న సంకేతం జనాల్లోకి పంపగలిగితే టీడీపీ-జనసేన కూటమికి ప్లస్ అవుతుందని చంద్రబాబు అనుకుంటున్నారు. విజయానికి చేరికలు మరింత దగ్గర చేస్తాయనుకుంటున్నారు.

ఇటీవలే టీడీపీ – జనసేన ఫస్ట్ లిస్ట్ ప్రకటించాయి. అయితే టిక్కెట్ దక్కని వారు ఆందోళనకు దిగారు. కానీ చంద్రబాబు చాణక్యం ప్రదర్శించారు. అసంతృప్తులు పార్టీ మారకుండా సర్ది చెప్పే బాధ్యత భుజాన వేసుకున్నారు. ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థుల విషయంపై వారం వారం సర్వేల్లో ఎవరిదైనా పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే పేర్లు మారుస్తామని కూడా చెప్పేశారు. ఫస్ట్ లిస్ట్ ప్రకటన తర్వాత కొన్ని నియోజకవర్గాల నేతల్లో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చడానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు చర్చలు మొదలుపెట్టారు. ఉండవల్లి నివాసానికి పలు జిల్లాల నేతలను పిలిపించి మాట్లాడారు. పార్టీ నిర్ణయాన్ని గౌరవించి సహకరించాలని కోరారు. మరికొందరికి ప్రత్యామ్నాయ అవకాశాలపై హామీలు ఇచ్చారు. సీటు ఇవ్వలేదంటే.. మిమ్మల్ని పార్టీ వద్దని అనుకున్నట్లు కాదంటూ బుజ్జగించారు. కార్యకర్తల అభీష్టానికి వ్యతిరేకంగా అభ్యర్థుల నిర్ణయం జరిగిందని కొందరు ఫిర్యాదు చేయగా.. సర్వేల ఆధారంగానే నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు సర్ది చెప్పారు. తమ పార్టీ నుంచి పెద్దగా నేతలెవరూ బయటకు వెళ్లకుండా చక్రం తిప్పే పనిలో టీడీపీ అధినేత ఉన్నారు.

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×