EPAPER

OPENAI SAM ALTMAN : ఓపెన్ ఏఐ నుంచి తొలగింపునకు కారణమిదేనా?.. తిరిగి చేర్చుకోక తప్పదా?

చాట్ జీపిటి ఒక ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ చాట్ బోట్. దీంతో ఎన్నో రకాల పనులు సులభంగా చేసుకోవచ్చు. ఈ సేవల అందరికీ ఉచితం. విడుదలైన ఏడాదిలోనే ప్రపంచమంతటా దీనికి అనూహ్య స్పందన లభించింది. అయితే కొన్ని రోజుల క్రితం అనుకోకుండా ఆ కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు సామ్ ఆల్ట్ మెన్‌ని ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ వార్త ప్రపంచమంతా సంచలనం రేపింది.
OPENAI SAM ALTMAN : ఇంతలోనే సోమవారం మైక్రోసాఫ్ట్ సంస్థలో ఆయన చేరబోతున్నారని వార్త వచ్చింది. పైగా సామ్ ఆల్ట్ మెన్ త్వరలోనే తిరిగి ఓపెన్ ఏఐలో సిఈఓగా పగ్గాలు చేపడతారని వాదనలు వినిపిస్తన్నాయి.

OPENAI SAM ALTMAN : ఓపెన్ ఏఐ నుంచి తొలగింపునకు కారణమిదేనా?.. తిరిగి చేర్చుకోక తప్పదా?

OPENAI SAM ALTMAN : చాట్ జీపిటి టెక్నాలజీ రంగంలో ఓ విప్లవం తీసుకొచ్చిందని చెప్పవచ్చు. ఆ చాట్ జీపిటి మాత‌ృక సంస్థ ‘ఓపెన్ ఏఐ’ని 2015 సంవత్సరంలోస్థాపించిన అయిదు వ్యక్తులలో సామ్ ఆల్ట్ మెన్ ఒకరు. ‘ఓపెన్ ఏఐ’ సంస్థలో ఆయన సిఈఓ స్థాయిలో ఉన్నారు. ఆయన గత ఏడాది అంటే 2022 నవంబర్ 30న చాట్ జీపిటిని ప్రపంచానికి పరిచయం చేశారు. చాట్ జీపిటి డెవలప్మెంట్‌లో ఆయన కీలక పాత్ర పోషించారు.


చాట్ జీపిటి ఒక ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ చాట్ బోట్. దీంతో ఎన్నో రకాల పనులు సులభంగా చేసుకోవచ్చు. ఈ సేవల అందరికీ ఉచితం. విడుదలైన ఏడాదిలోనే ప్రపంచమంతటా దీనికి అనూహ్య స్పందన లభించింది. అయితే కొన్ని రోజుల క్రితం అనుకోకుండా ఆ కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు సామ్ ఆల్ట్ మెన్‌ని ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ వార్త ప్రపంచమంతా సంచలనం రేపింది. ఇంతలోనే సోమవారం మైక్రోసాఫ్ట్ సంస్థలో ఆయన చేరబోతున్నారని వార్త వచ్చింది. పైగా సామ్ ఆల్ట్ మెన్ త్వరలోనే తిరిగి ఓపెన్ ఏఐలో సిఈఓగా పగ్గాలు చేపడతారని వాదనలు వినిపిస్తన్నాయి.


ఓపెన్ ఏఐలోకి సామ్ ఆల్ట్‌మెన్‌ తిరిగి చేరే అవకాశాలు
సామ్ ఆల్ట్ మెన్ స్థానంలో తాజాగా ఎమ్మెట్ షియర్ కొత్త సీఈఓగా బాధ్యతులు చేపట్టారు. ఆయన రాగానే ఉద్యోగులతో అత్యవర మీటింగ్ చేయాలని అందరినీ గూగుల్ మీట్‌లో ఆహ్వానించినా ఎవరూ మీటింగ్‌కు హాజరుకాలేదు. వారంతా సామ్ ఆల్ట్ మెన్ తిరిగి సిఈఓగా రావాలని డిమాండ్ చేస్తున్నారు. పైగా కంపెనీలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు కూడా బోర్డు డైరెక్టర్ల నిర్ణయం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో సామ్ ఆల్ట్ మెన్ ఒక ప్రకటన చేశారు. ఆయన తిరిగి రావాలంటే.. ఆ బోర్టు డైరెక్టర్లు కంపెనీ నుంచి వెళ్లిపోవాలని షరతులు విధించారు. పైగా ఆయనతోపాటు చాట్ జీపిటి తయారు చేసిన ఓపెన్ ఏఐ’ ఉద్యోగులు కూడా మైక్రోసాఫ్ట్ సంస్థలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇవ్వన్నీ చూస్తుంటే.. సామ్ ఆల్ట్ తిరిగి ‘ఓపెన్ ఏఐ’లో చేరినా ఆశ్చర్య పోనవసరం లేదు.

సామ్ ఆల్ట్‌మన్‌ తొలగింపుకు కారణం
‘ఓపెన్ ఏఐ’ ఒక స్వచ్చంధ సంస్ధ( నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ – లాభాపేక్ష లేకుండా పనిచేసే సంస్థ). ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ప్రయోజనాలు మానువులందరికీ ఉపయోగపడాలని ఆ సంస్థ ఉచితంగా సేవలందిస్తోంది. అందుకే చాట్ జీపిటీ అందరికీ ఉచితం. దీంతో చాట్‌జీపిటీ డిమాండ్ భారీగా పెరిగిపోయింది. కానీ ఉచితంగా అందించడం వలన రోజుకు దాదాపు రూ.5 కోట్లు ఖర్చు అవుతోందని కంపెనీ తెలిపింది. ఇలాగే కొనసాగితే.. కంపెనీ 2024 చివరికల్లా దివాలా తీసే పరిస్థితి ఏర్పడే అవకాశాలున్నాయి.

ఇది చూసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌‌ని ఇతర ప్రయోజనాల కోసం వృద్ధి చేయవచ్చని భావించిన సామ్ ఆల్ట్‌మన్‌.. చాట్‌జీపిటీ మాత్రమే ఉచితం. కంపెనీ తరపున కొత్త ఏఐ ప్రాడక్ట్స్‌ను కమర్షియల్ చేయాలని కంపెనీ డైరెక్టర్లకు చెప్పాడు. అందుకు వారు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో సామ్ ఆల్ట్‌మన్‌.. కొత్తగా ‘వరల్డ్‌కాయిన్’ అనే క్రిప్టోకరెన్సీ సంస్థలో కూడా సీఈఓగా పనిచేస్తున్నారు. ఇలా చేయడం నైతికంగా తప్పు అని ‘ఓపెన్ ఏఐ’ డైరెక్టర్లు వాదించారు.

అలాగే సామ్ ఆల్ట్‌మన్‌.. గూగుల్, మైక్రోసాఫ్ట్‌తో తమ సంస్థ గురించి రహస్యంగా చర్చలు జరుపుతున్నారని తెలిసింది. అసలు ఆయన ఎలాంటి ప్రణాళికలతో పనిచేస్తున్నారని కంపెనీలో ఎవరితో చర్చించరు. బోర్డు డైరెక్టర్లు అడిగినా సమాధానం చెప్పరు. సామ్ ఆల్ట్‌మెన్ పనితీరు పారదర్శకంగా లేదని కారణం చూపి.. ఆయనను కంపెనీ డైరెక్టర్లు.. ఉద్యోగం నుంచి తొలగించారు. కానీ దీని పర్యవసానాల గురించి వారు ఆలోచించలేదు.

Related News

Telangana: విమోచనం.. విలీనం.. విద్రోహం.. ప్రజా పాలనా దినం..! 2014 నుంచి 2024 దాకా..!

Telangana Armed Struggle: జనం నడిపిన విప్లవం.. సాయుధ పోరాటం..!

YS Jagan Mohan Reddy: జగన్ కాదు.. సీతయ్య.. వైసీపీలోనే గుసగుసలు

New Headache To YS Jagan: జగన్‌కు కొత్త తలనొప్పి.. కనక దుర్గ కండిషన్స్

New Election Commissioner: తెలంగాణ కొత్త ఎలక్షన్ కమీషనర్.. ఎవరంటే?

Big Shock to YS Jagan: వైసీపీ అడ్రస్ గల్లంతు.. 45 కార్పోరేటర్లు టీడీపీలోకి?

GHMC Elections: పాడి కౌశిక్ రెడ్డి ఎఫెక్ట్.. బీఆర్ఎస్‌కు మరో షాక్ తప్పదా?

Big Stories

×