EPAPER
Kirrak Couples Episode 1

Nostradamus : 2024 గురించి నోస్ట్రడామస్ ఎప్పుడో చెప్పిన భయంకర నిజాలు..

Nostradamus : 2024 గురించి నోస్ట్రడామస్ ఎప్పుడో చెప్పిన భయంకర నిజాలు..

Nostradamus : కొత్త ఆశలతో కొత్త సంవత్సరం వచ్చేసింది. మరి ఈ 2024 ఎలా ఉండబోతోంది. ప్రపంచస్థాయి జ్యోతిష్య శాస్త్రవేత్తలు, ఆధ్యాత్మిక వేత్తలు ఈ ఏడాది గురించి ఊహించిందేమిటి? ఏం జరగబోతోంది. ప్రపంచంలో పెను మార్పులు సంభవించబోతున్నాయా? లేదంటే అద్భుతాలు జరుగుతాయా? ప్రపంచమంతా ఆసక్తికరంగా ఎదురుచూసే నోస్ట్రడామస్ కాలజ్ఞానంలో 2024 సంవత్సరం గురించి ఏం చెప్పారన్నది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉత్కంఠగా మారింది.


కొత్త ఏడాదికి ప్రపంచమంతా ఘనంగా స్వాగతం పలికింది. కేరింతలు కొట్టింది… కొత్త ప్రతిజ్ఞలు.. కొత్త ఉత్సాహం.. కొత్త ఆశయాలు.. కొత్త ఆకాంక్షలు.. కొత్త లక్ష్యాలు.. ఒక్కటేమిటి కొత్తొక వింత అన్నట్లుగా జనమంతా కొత్త ఏడాది 2024కు ఘన స్వాగతం పలికేశారు. మరి ఈ ఏడాది భూగోళానికి ఎలాంటి సిగ్నల్స్ ఇవ్వబోతోంది… ఏం మార్పులు జరుగుతాయన్నది చాలా ఉత్కంఠగా ఆసక్తికరంగా మారింది. ఈ ఏడాది గురించి ఎప్పుడో కాలజ్ఞానంలో రాసుకున్న ఘటనలు కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా తెరపైకి వస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా ప్రపంచస్థాయి కాలజ్ఞానిగా పేరున్న నోస్ట్రడామస్ జోస్యం ఏంటన్నది ఉత్కంఠగా మారింది.

మనకు ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం ఎలా ఉంటుందో.. ప్రపంచ దేశాల్లో కొన్ని నమ్మకాలు ఉన్నాయి. ముఖ్యంగా భవిష్యత్ ను వాస్తవికంగా అంచనా వేసిన ప్రఖ్యాత ఆస్ట్రాలజీ నిపుణుల మాటల్ని కొన్ని దేశాల్లో బలంగా నమ్ముతారు. వారు చెప్పినవి ఏటేటా నిజమవుతుండడంతో ఇలాంటి భవిష్యవాణి గురించి ప్రపంచమంతా ఆసక్తి నెలకొంటుంది. ఇప్పుడు ఫ్రెంచ్ కాలజ్ఞాని, 16వ శతాబ్దానికి చెందిన సిద్ధాంత కర్త నొస్ట్రడామస్ భవిష్య వాణిలో ఈ ఏడాది 2024 గురించి ఏం చెప్పారన్నది కీ పాయింట్ గా మారింది. ప్రపంచవ్యాప్తంగా నోస్ట్రడామస్ కాలజ్ఞానంపై చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. ఇందులో కొన్ని భయంకరమైన నిజాలు ఉంటాయి. ఆయన భవిష్యత్ గురించి అంచనా వేసి చెప్పినవి గతంలో ఎక్కువ జరగడంతో ఈ ఏడాది గురించి జనంలో భయాలు.. కొంత ఉత్కంఠ, ఇంకొంచెం ఆందోళన కనిపిస్తున్నాయి.


కాలజ్ఞానుల్లో ప్రపంచవ్యాప్తంగా పేరున్న వారు కొందరే ఉన్నారు. అందులో నోస్ట్రడామస్ ఒకరు. ఈయన ఫ్రాన్స్ దేశానికి చెందిన వ్యక్తి. అలాగే బల్గేరియా దేశానికి చెందిన బాబా వంగ కూడా కాలజ్ఞానికి పేరు గడించారు. ఆయన చెప్పినవి కూడా చాలా వరకు జరగడంతో ప్రపంచమంతా… వారు 2024కు సంబంధించి ఎలాంటి విషయాలను ముందే ఊహించి ప్రస్తావించారన్నది కీలకరంగా మారింది.

ఫస్ట్.. నోస్ట్రడామస్ 2024 గురించి ఎలాంటి భయంకరమైన విషయాలు జోస్యం చెప్పారో చూద్దాం. భవిష్యత్ ను చాలా వాస్తవికంగా అంచనా వేసే నోస్ట్రడామస్ ఈ ఏడాది గురించి కొన్ని భయంకర విషయాలను ముందే రాసుకున్నాడు. ప్రపంచంలో జరగబోయే అనేక షాక్ కు గురి చేసే సంఘటనలను తన పుస్తకం ది ప్రొఫెసీస్ లో రాశాడు. పుస్తకంలో అనేక సందేహాలు, సందిగ్ధతలు ఉన్నప్పటికీ, హిట్లర్ ఆవిర్భావం, జాన్ కెన్నెడీ హత్య, 9/11 బాంబు దాడులు, కోవిడ్-19 మహమ్మారి మొదలైన అనేక చారిత్రక సంఘటనలను అతను సరిగ్గా అంచనా వేశాడు నోస్ట్రడామస్.

నోస్ట్రడామస్ ను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన చెప్పిన వాటిలో మెజారిటీ నిజం అయ్యాయి. భవిష్యత్ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. రేపు ఏం జరుగుతుందన్నది చాలా మంది అప్రస్తుతం అనుకుంటారు. కొందరు ఊహిస్తారు. ఆ ఊహలు కొందరి విషయంలో నిజమవుతాయి. అందులో నోస్ట్రడామస్ ది కీలకమైన కాలజ్ఞానం. ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా సముద్ర సరిహద్దు సమస్యలు పెరుగాయన్నాడు. ప్రతిచోటా అల్లకల్లోలం ఉంటుందని తన పుస్తకంలో జోస్యం చెప్పారు. నోస్ట్రడామస్ కథకుడు మారియో రీడింగ్ ప్రకారం ఇంగ్లండ్ రాజకుటుంబంలో ప్రిన్స్ హ్యారీ…. కింగ్ చార్లెస్ – 3 వారసుడు అవుతాడు.

మరోవైపు, చైనా ,తైవాన్ మధ్య యుద్ధం జరుగుతుందని, అది కూడా ప్రత్యేకించి నావికా యుద్ధం జరగవచ్చని ఆయన అంచనా వేశారు. అంతేకాదు నోస్ట్రాడమస్ తన పుస్తకంలో 2024 సంవత్సరంలో తీవ్రమైన వాతావరణ విపత్తులు, కరువులు, కార్చిచ్చులు, విపరీతమైన ఉష్ణోగ్రతలు మొదలైనవాటిని చూస్తారని, దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన వాతావరణ సంఘటనలు, కరువు పెరుగుతుందని అంచనా వేశాడు నోస్ట్రడామస్. ఇవే నిజమైతే పెను సవాళ్లకు సిద్ధంగా ఉండాల్సిందేనన్న సంకేతాలు ఇచ్చినట్లే. క్యాథలిక్ పోప్ స్థానంలో మార్పు వస్తుందని, వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించి కొత్త పోప్‌ను ఎన్నుకుంటారని ఆయన అంచనా వేశారు.

మనం నోస్ట్రడామస్ అంచనాను తక్కువగా అంచనా వేయలేము. ఎందుకంటే 2023లో ఉక్రెయిన్‌ను యుద్ధ మేఘం చుట్టుముడుతుందని, గోధుమల ధర పెరుగుతుందని ఆయన చెప్పారు. అంతా చెప్పినట్లే జరిగింది. 2024లో కూడా చాలా భయాలను ఆయన మోసుకొచ్చారు. నిజానికి భవిష్యవాణి చెప్పే వారు ఒక పది విషయాలు చెబితే.. అందులో కొన్ని జరగొచ్చు.. కొన్ని జరగకపోవచ్చు. మెజార్టీ జరగొచ్చు.. మెజారిటీ విషయాలు నిజం కాకపోనూ వచ్చు. అయితే ఇది నమ్మకాలకు సంబంధించిన వ్యవహారం. చాలా వరకు నిజమైతే ఒక ఆందోళన పెరగడం సహజమే.

నోస్ట్రడామస్ ఈ ఏడాదిలో భారీ సునామీ వస్తుందని జోస్యం చెప్పారు. ఇది మొత్తం వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. మరోవైపు సహజ తుఫానులు ఉండవని.. దీని కారణంగా కరువు సంభవిస్తుందని చెప్పుకొచ్చారు. ఒకవైపు కరువు, మరోవైపు అతివృష్టి సంభవిస్తుందన్నారు. అంతేకాకుండా 2024లో భారత్-చైనా వివాదం ఏర్పడుతుందని, ఇది హిందూ మహాసముద్రంపై ప్రభావం చూపేంతగా ఉంటుందని నోస్ట్రడామస్ జోస్యం చెపుతోంది. ఈయన కేవలం కొన్ని ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యవాణి చెప్పలేదు.. అన్ని దేశాల పరిస్థితినీ అంచనా వేశారు.

నోస్ట్రడామస్ రాసుకున్న విషయాలను సరిగ్గా డీకోడ్ చేయగలిగితేనే దాని అసలైన అర్థం బయటకు వస్తుంది. దాన్ని వేర్వేరు అంశాలకు అన్వయిస్తే పరిస్థితి మరోలా ఉంటుంది. యుద్ధాలు, నావికా యుద్ధాలను ఊహించారు. ఎరుపు ప్రత్యర్థి అనే పంక్తులు ఉన్నాయి. అంటే దానర్థం, చైనా, లేదంటే ఉత్తరకొరియా దూకుడును ఊహించవచ్చు అంటున్నారు. చతుర్భుజం సింబల్ సముద్రంలో ఘర్షణను సూచిస్తుంది. అంటే నావికా యుద్ధానికి ఈ ఏడాది బలమైన అవకాశం ఉందంటున్నారు.

Tags

Related News

Kutami Strategy: ఎన్నికల ప్రచారంలో పవన్ చేసిన ఛాలెంజ్ నిజమవుతోందా ? సీనియర్లు ఏమంటున్నారు ?

BRS BC Plan: బీసీ మంత్రాన్ని జపిస్తోన్న బీఆర్ఎస్.. కాంగ్రెస్ పోస్ట్ తో కేటీఆర్ కామెంట్స్ వైరల్

Young India Skill University: ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ తో స్కిల్ హబ్ గా తెలంగాణ..

Tirumala Laddu Politics: లడ్డూ కాంట్రవర్సీ.. దేవదేవుడి ప్రసాదంపైనే ఇన్ని రాజకీయాలా ?

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Big Stories

×