EPAPER

Nitish Kumar | బీహార్‌లో కొత్త సర్కారు అంత ఈజీ కాదు.. 400 సీట్లు గెలుస్తామనే మోదీకి ఊసరవెల్లి అవసరమెంత?

Nitish Kumar | నితీశ్ కుమార్ బిహార్ రాజకీయాల్లో ఇప్పుడు ఈ పేరు సంచలనంగా మారింది. ఇప్పటివరకు ఆయన అయిదు సార్లు రాజకీయ కూటములు మారి చరిత్ర సృష్టించారు.ఆదివారం ఉదయం బీహార్ ముఖ్యమంత్రికి పదవి రాజీనామా చేసిన ఆయన. సాయంత్రం మళ్లీ అదే పదవికి ప్రమాణ స్వీకారం చేశారు.

Nitish Kumar | బీహార్‌లో కొత్త సర్కారు అంత ఈజీ కాదు.. 400 సీట్లు గెలుస్తామనే మోదీకి ఊసరవెల్లి అవసరమెంత?

Nitish Kumar | నితీశ్ కుమార్ బిహార్ రాజకీయాల్లో ఇప్పుడు ఈ పేరు సంచలనంగా మారింది. ఇప్పటివరకు ఆయన అయిదు సార్లు రాజకీయ కూటములు మారి చరిత్ర సృష్టించారు.ఆదివారం ఉదయం బీహార్ ముఖ్యమంత్రికి పదవి రాజీనామా చేసిన ఆయన. సాయంత్రం మళ్లీ అదే పదవికి ప్రమాణ స్వీకారం చేశారు.


బీహార్ రాజకీయ పార్టీ జనతా దల్ యునైటెడ్(JDU) పార్టీకి అధ్యక్షుడైన నితీశ్ కుమార్ గత రెండేళ్లుగా రాష్ట్రీయ జనతా దల్(RJD) పార్టీతో కలిసి ప్రభుత్వం నడిపారు. అంతకుముందు 2020 ఎన్నికల్లో మొత్తం 243 సీట్లలో కేవలం 45 సీట్లు నితీశ్ కుమార్ పార్టీకి దక్కాయి. మరోవైపు బిజేపీకి 78 సీట్లు దక్కగా.. వీరిద్దరి ప్రత్యర్థి ఆర్ జెడీ మాత్రం అత్యధికంగా 79 సీట్లు సాధించింది. బిజేపీతో పొత్తు పెట్టుకొని జనతా దల్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది. నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యారు.

కానీ ఆ తరువాత బిజేపీతో పొసగక.. నితీశ్ కుమార్ తన ప్రత్యర్థి అయిన ఆర్‌జేడీ నేత తేజస్వి యాదవ్‌తో చేతులు కలిపారు. పొత్తులు మారినా ముఖ్యమంత్రిగా మాత్రం ఆయనే కొనసాగారు. ఆ సమయంలో ఆరు నూరైనా బిజేపీతో ఇక భవిష్యత్తులో కలిసేది లేదని నితీశ్ కుమార్ బహిరంగంగా ప్రకటించారు.


అలా రెండేళ్లు గడిచాక లోక్ సభ ఎన్నికల్లో చక్రం తిప్పుదామని ఇండియా కూటమిలో చేరి.. ఏకంగా ప్రధాన మంత్రి పదవి ఆశించారు. అది దక్కే అవకాశం లేదని తెలిసి.. ఎన్నికల దృష్ట్యా మళ్లీ ఆర్జేడీని తన రాజకీయ శత్రువుగా మార్చుకునేందుకు బిజేపీతో చేతులు కలిపారు. ఏదైతేనే మళ్లీ ఆయనే సిఎం. కానీ తాజాగా కొలువుదీరిన బిజేపీ-జెడియు ప్రభుత్వం కొనసాగడం అంత సులువు కాదని తెలుస్తోంది. కొత్త ప్రభుత్వం గడువు మరో 22 నెలలు అంటే నవంబర్ 2025 ఎన్నికల వరకు ఉంది. ఈ రెండేళ్లపాటు బిజేపీతో జెడియు కలిసి నడవడం కష్టమే. మళ్లీ నితీశ్ కుమార్ కాంగ్రెస్, ఆర్ జెడీతో కలిసేందుకు ప్రయత్నించినా ఆశ్చర్యం లేదు.

తన జీవితంలో ఎన్నడూ ఒంటరిగా నితీశ్ కుమార్ ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2020లో బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజేపీతో పొత్తు పెట్టుకొని ఎన్నికలు గెలిచారు. కానీ 2022లో బిజేపీతో తెగదెంపులు చేసుకున్నారు. అయితే ఆయన ఎందుకు బిజేపీతో తెగదెంపులు చేసుకున్నారో తెలుసుకోవాలి. ఆ సమయంలో మోదీ నాయకత్వంలోని బిజేపీ దేశంలోని పలు రాష్ట్రాల్లో కూటమి ప్రభుత్వాలు నడుపుతోంది. కానీ ఒకమైపు కూటమి ప్రభుత్వాలు నడుపుతూనే బిజేపీ తమతో పొత్తు ఉన్న పార్టీల నాయకులను తనవైపుకు తిప్పుకోవడం ప్రారంభించింది. అంటే స్నేహంగా ఉంటూనే ఆ పార్టీని బలహీనం చేయడం. లేదా నాశనం చేయడం. అదే బిజేపీ పొత్తు ధర్మం. మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాల్లో ఇదే జరిగింది. పంజాబ్‌లో అకాళిదల్, మహారాష్ట్రలో శివసేన దుస్థితికి కారణం బిజేపీనే.

ఈ విషయాన్ని అత్యంత తెలివితేటలు, ఊసరవెల్లి గుణాలు కలిగిన నితీశ్ కుమార్ పసిగట్టేశారు. పైగా బిజేపీ నాయకులు హోమ్ మంత్రి పదవి కావాలని పట్టుబట్టారు. దీంతో బిజేపీకి చెక్ పెట్టేందుకు నితీశ్ తన మార్కు రాజకీయం చేశారు. శత్రవు అయినా సరే.. ఆర్‌జేడీనే బెటర్ అని తేజస్వీ యాదవ్‌తో చేతులు కలిపి.. బిజేపీకి ఝలక్ ఇచ్చారు. నితీశ్ పార్టీ వద్ద ఉన్నది కేవలం 45 సీట్లు. అయినా ఆయన ముఖ్యమంత్రి పదవిలోనే కొనసాగారు. హోమ్ మంత్రిత్వ శాఖ కూడా తన వద్దే పెట్టుకున్నారు. ఎందుకంటే పోలీసు శాఖను తన ఆధీనంలోనే ఉండాలని ఆయన జాగ్రత్త తీసుకుంటారు.

రెండేళ్లు ఆర్‌జేడీతో సంసారం చేసిన జెడియు.. లోక్ సభ ఎన్నికల్లో బిజేపీని బలంగా ఢీ కొట్టాలని ఇండియా కూటమిలో చేరింది. ఆ కూటమిలో నాలుగు సమావేశాలు కూడా జరిగాయి. కూటమి నాయకులు కూడా మోదీపై విమర్శలు బాగానే చేశారు. కానీ ప్రధాన మంత్రి పదవి ఎవరు అనే ప్రశ్నకు ఎవరి సమాధానం వారిదే. కాంగ్రెస్ అతిపెద్ద పార్టీ కాబట్టి రాహుల్ గాంధీ లేదా మల్లికార్జున ఖర్గే ఉంటారని ప్రచారం జరిగింది. కానీ అందుకు కేజ్రీవాల్, మమతా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇదంతా జరుగుతుండగా పైకి పెద్దమనిషిలా అందరితో స్నేహంగా మాట్లాడే నితీశ్ కుమార్ మాత్రం లోలోపల ఆ ప్రధాన మంత్రి పదవి తనే తీసుకుంటే తప్పేంటని భావించారు.

అందుకే ఇండియా కూటమిని పట్నా కేంద్రంగా నడిపారు. కానీ బేరం కుదరలేదు. పైగా గత రెండు ఎన్నికల్లో జెడియు ఓట్లు భారీగా తగ్గిపోతున్నాయి. దీంతో నితీశ్ కుమార్ మళ్లీ తన రాజకీయ ఆట ఆడారు. బిజేపీతో సంప్రదింపులు జరిపారు. ఇండియా కూటమిని వదిలేసి ప్రస్తుతానికి కమల దళంలో చేరారు. ఇది కూడా ఒకరకంగా పొత్తు మాత్రమే. ఎందుకంటే లోక్ సభ ఎన్నికలు వస్తున్నాయి. గత లోక్ సభ ఎన్నికల్లో అంటే 2019లో మొత్తం 40 ఎంపీ సీట్లలో బిజేపీ 17, నితీశ్ కుమార్ జెడియు 16, లోక్ జనశక్తి పార్టీ 6, కాంగ్రెస్ 1 సీటు గెలుచుకున్నాయి. అంటే ఆర్జేడీ లోక్ సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది.

ఇప్పుడు మళ్లీ లోక్ సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ సారి కూడా బిజేపీ రామ మందిరం అంటూ జోరు మీద ఉంది. దీంతో బిజేపీతో జతకడితేనే తనకు ఎక్కువ సీట్లు వస్తాయని నితీశ్ ప్లాన్. మరోవైపు 2022లో నితీశ్ కుమార్ తమ పార్టీని కాదని కాంగ్రెస్, ఆర్జేడీతో పొత్తు పెట్టుకున్న సమయంలో బిజేపీ అగ్రనేత అమిత్ షా మండిపడ్డారు. ఇకపై నితీశ్ కుమార్ కోసం బిజేపీ తలుపులు మూసివేశామని.. అవి ఎప్పటికీ తెరుచుకోవని ఆగ్రహంగా చెప్పారు. కానీ ఇప్పుడు మళ్లీ కలుపుకోవడానికి బిజేపీ అంగీకరించిందంటే.. అది కూడా ఒక ప్లాన్.

గత ఎన్నికల్లో 17 ఎంపీ సీట్లు గెలుచుకున్న బిజేపీ వద్ద, ప్రజా శక్తి పార్టీకి సంబంధించిన 6 సీట్లతో కలిపి 23 సీట్లున్నాయి. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు జరిగితే జెడియు వద్ద ఉన్న 16 సీట్లు తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. ఎందుకంటే బిజేపీకి 400 ఎంపీ సీట్లు సాధించడమే టార్గెట్. అందుకే నితీశ్ కుమార్ ఎన్ని ఆటలు ఆడినా సైలెంట్‌గా చూస్తూ ఉంది. అయితే బిజేపీ తాజా బిహార్ ప్రభుత్వంలో హోమ్ మంత్రిత్వ శాఖ కావాలని షరతు విధించిందని ప్రచారం జరుగుతోంది.ఇందుకు నితీశ్ కుమార్ ఒప్పుకుంటారా? అనేది పెద్ద ప్రశ్న. పైగా అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ఎదురుచూస్తోంది. ఈ తరుణంలో కొందరు సొంత పార్టీ నేతలు నితీశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఉన్నారని తెలుస్తోంది. అలా రెబెల్ జెడియు నేతలు ఎక్కువ సంఖ్యలో ఉంటే ఈ కొత్త ప్రభుత్వం కూలిపోవడం ఖాయం.

మరోవైపు లోక్ సభ ఎన్నికల తరువాత 2025లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికలు వచ్చేసరికి నితీశ్ మళ్లీ గోడ దూకే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్‌జేడీ బలం ముందు జెడియు నిలబడలేదని గత ఎన్నికలు నిరూపించాయి. పైగా మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్‌కు విపరీతమైన ప్రజాదరణ ఉంది. అందుకే ఆయన యువకుడైనా తన సత్తా ఏంటో 2020 ఎన్నికల్లో నిరూపించాడు. మెజారిటీ సీట్లు సాధించకపోయినా రాష్ట్రంలోనే అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా ఆర్‌జేడీని ఒక ఎత్తుకు తీసుకెళ్లాడు. ఆ సమయంలో బిజేపీ లాంటి అతిపెద్ద పార్టీతో నితీశ్ పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలో దిగారు. కానీ తేజస్వి యాదవ్ ఒంటరి పోరు చేసి అత్యధిక సీట్లు గెలుచుకున్నారు. పైగా ఆ సమయంలో ఆయన తండ్రి జైల్లో ఉన్నారు.

ఇప్పుడు ఆయన ఒకే మంత్రం జపిస్తున్నాడు. బీహార్‌లో నిరుద్యోగ సమస్య పోవాలని.. మందిర్ మసీదు గొడవలు పోవాలని. అందుకే బిహార్ యువత నుంచి ఆయనకు భారీ మద్దతు లభిస్తోంది.

ఇదంతా చూస్తుంటే.. నితీశ్ కుమార్‌కు ఇదే చివరి ఎన్నికలు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆయన చాలా సార్లు గోడ దూకే రాజకీయాలు చేశారు. మరోవైపు ఆయన ప్రత్యర్థిగా తేజస్వి యాదవ్ బలం రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇదంతా ప్రజలు చూస్తున్నారు.

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×