EPAPER

New Headache To YS Jagan: జగన్‌కు కొత్త తలనొప్పి.. కనక దుర్గ కండిషన్స్

New Headache To YS Jagan: జగన్‌కు కొత్త తలనొప్పి.. కనక దుర్గ కండిషన్స్

New Headache To YS Jagan: రాష్ట్రంలో అధికారం కోల్పోయాక రాష్ట్రవ్యాప్తంగా వైసీపీలోని వర్గ విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. పెద్దదిక్కలుగా వ్యవహరించిన మంత్రులు, ఎమ్మెల్యేలు పరాజయం పాలవ్వడంతో స్థానిక సంస్థల్లో నేతలు సిగపట్లకు దిగుతున్నారు. తాజా మార్కాపురం చైర్మన్ వ్యవహారం ప్రకాశం జిల్లాలో కలకలం రేపుతోంది. గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం పదవి మార్పిడీ జరగకపోవడంతో కౌన్సిల్‌లో వార్ మొదలైంది. పార్టీ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మహిళా నేత కు ఇచ్చిన హమీ నెరవేర్చకపోవడంతో కథ అడ్డం తిరిగిందంట.పెట్టిన ఖర్చు అడిగిన ఆమహిళ నేతను మాజీ ఎమ్మెల్యే సొదరుడు బెదిరిస్తుండటంతో వివాదం.


ప్రకాశం జిల్లా మార్కాపురం మునిసిపాలిటీ ఛైర్మన్ పదవిపై వైసీపీలో రగడ మొదలైంది. గత మునిసిపల్‌ ఎన్నికల్లో మొత్తం 35 డివిజన్లకు గాను 30 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. చైర్మన్‌ ఎంపిక విషయంలో అప్పటి ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి నిర్ణయానికి వ్యతిరేకంగా మాజీ సీఎం జగన్‌ నిర్ణయం తీసుకోవడంతో సమస్య ఆరంభమైంది. మార్కాపురంలో ప్రముఖ వైద్యురాలైన కనకదుర్గను చైర్మన్‌ను చేయాలని నాగార్జున భావించారు. ఆ మేరకు ఆమెకు హామీ ఇచ్చి ఎన్నికల ఖర్చు మొత్తం పెట్టించారు.

ఎన్నికల ఫలితాల తర్వాత జగన్‌ జోక్యం చేసుకొని డాక్టర్‌ కనకదుర్గ.. రెడ్డి సామాజికవర్గం అవ్వడంతో వేరే సామాజికవర్గం వారికి చైర్మన్‌ పదవి ఇవ్వాలని ఆదేశించారు. దాంతో మాజీ ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ఆర్యవైశ్య వర్గానికి చెందిన చిర్లంచెర్ల బాలమురళీకృష్ణను చైర్మన్‌ పదవికి ఎంపిక చేశారు. దాంతో నిరాశకు గురైన డాక్టర్‌ కనకదుర్గ తన వద్ద మున్సిపల్‌ ఎన్నికల వ్యయం కోసం తీసుకున్న డబ్బులు వెనక్కు ఇవ్వాలని నాగార్జున రెడ్డిపైనా, ఆయన సోదరుడు కృష్ణమోహన్‌రెడ్డి పైనా ఒత్తిడి తేవడం మొదలుపెట్టారు.


ఈ క్రమంలో చైర్మన్‌ అయిన మురళీకృష్ణ నుంచి వారిద్దరూ కొంత డబ్బు తీసుకొని ఆమెకు చెల్లించినట్లు తెలిసింది. తనకు ఇంకా రెండు కోట్లు రావాల్సి ఉందని ఆమె అడిగినట్లు సమాచారం. ఈ పరిణామాల నడుమ ఆమెను గత వైసిపి ప్రభుత్వంలో శ్రీశైలం దేవస్థానం పాలకమండలి సభ్యురాలిగా నియమించారు. దానికి ఆమె నిరాకరిస్తూ చైర్మన్ పదవే కావాలని పట్టుపట్టారు. లేకపోతే తన డబ్బు తిరిగివ్వాలని జగన్‌ నుంచి నాగార్జునరెడ్డి వరకు అందరిపై ఒత్తిడి పెంచారంట.

అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న నాగార్జునరెడ్డి.. కనకదుర్గను బుజ్జగిస్తూ వస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి.  నాగార్జునరెడ్డిని జగన్ గిద్దలూరు షిఫ్ట్ చేసి గిద్దలూరు నుంచి రాంబాబును మార్కాపురం అభ్యర్థిగా పంపించారు. అప్పుడు అప్రమత్తమైన కనకదుర్గ తన పరిస్థితి తేల్చాలని నాగార్జునరెడ్డి ఇంట్లో తిష్ట వేశారు. ఆయన మునిసిపల్‌ చైర్మన్‌ మురళీకృష్ణను పిలిపించి ఆమెకు డబ్బులు ఇవ్వండి. లేదా పదవి నుంచి తప్పుకోమని చెప్పారంట. ఆ క్రమంలో నాగార్జునరెడ్డి వారి మధ్య ఒప్పందం కుదిర్చి ఒక అగ్రిమెంట్ కూడా రాయించారంట.

మురళీకృష్ణ ప్రస్తుతం తన వద్ద అంత డబ్బులు లేవని… ఎర్రగొండపాలెంలో తాను కడుతున్న అపార్ట్‌మెంట్‌లో మూడు ఫ్లాట్‌లు ఆమెకు ఇస్తానని లిఖితపూర్వకంగా రాసిచ్చారంట… అయితే తాను ఐదేళ్లపాటు చైర్మన్‌గా ఉంటేనే మూడు ఫ్లాట్లు ఇస్తానని మధ్యలో తనను పదవి నుంచి తొలగించినా వేరే రూపంలో తాను పదవి వదులుకోవాల్సి వచ్చినా.. వాటిని ఇవ్వనని స్పష్టంగా పేర్కొన్నారంట…. ఆ తర్వాత మార్కాపురం అభ్యర్థిగా వచ్చిన రాంబాబు వద్దకు కనకదుర్గ వెళ్లి తన విషయాన్ని తేల్చాలని పట్టుబట్టినట్లు తెలిసింది.

Also Read: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. ఆ మూడే సమాధానాలు, అదుర్స్ మూవీని తలపిస్తోందా?

మునిసిపల్‌ చైర్మన్‌ తన సామాజికవర్గమే అయినందున తాను ఎమ్మెల్యేగా గెలుపొందితే మురళీకృష్ణను మార్చి చైర్మన్‌గా కనకదుర్గకు అవకాశం కల్పించవచ్చన్న ఉద్దేశంతో ఎన్నికల అనంతరం సమస్యను సానుకూలంగా పరిష్కరించుకుందామని రాంబాబు హామీ ఇచ్చారంట. అయితే ఎన్నికల్లో ఇటు అన్నా రాంబాబు, అటు కుందురు నాగార్జున రెడ్డిలు ఓటమి చెందారు.

ప్రస్తుతం మార్కాపురం వైసిపి ఇన్‌చార్జి రాంబాబు అవ్వడంతో వారిద్దరి మధ్య జరిగిన అగ్రిమెంట్ పేపర్స్‌నిఆయనకు పంపి విషయం చెబుతానన. అక్కడ తేల్చుకోవాలని నాగార్జునరెడ్డి ఆమెతో చెప్పినట్లు సమాచారం. అయితే కౌన్సిలర్లు మొత్తం నాగార్జునరెడ్డి కేండెట్లు కాబట్టి ఆయన దగ్గరే తేల్చుకోవాలని రాంబాబు అంటున్నారంట. ఇద్దరు మాజీల మాటలతో కంగుతిన్న డాక్టర్‌ కనకదుర్గ మద్దతుదారులు మున్ముందు ఎలా వెళ్లాలన్న అంశంపై తర్జనభర్జన పడుతున్నారు.

చైర్మన్‌ మురళీకృష్ణ మాత్రం నాయకులు చెబితే పదవి వదిలేస్తా, ఒప్పందం మేరకు ఫ్లాట్లు ఇవ్వనంటున్నారంట.  ఒకవేళ మెజార్టీ కౌన్సిలర్లు పార్టీ మారి తనను చైర్మన్‌గా దింపేసినా అగ్రిమెంట్ క్యాన్సిలే అని స్పష్టం చేస్తున్నారంట. దాంతో ఈ వ్యవహారాన్ని ఎలా చక్కబెట్టాలో మాజీ ఎమ్మెల్యేలు రాంబాబు, నాగార్జునరెడ్డిలకు పాలుపోవడం లేదంటున్నారు. ఆ క్రమంలో కనకదుర్గ ఒత్తిడి తెస్తుంటే కుందురు నాగర్జునరెడ్డి సోదరుడు కృష్ణమెహన్‌రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నాడంట .. ఆ విషయం ఆమె తన సన్నిహితుల వాపోతుండటంతో టోటల్ ఎపిసోడ్ వెలుగు చూసింది.

గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరపరాజయం పాలవ్వడంతో తాజాగా ఆ రగడ మళ్లీ ఫోకస్ అవుతోంది.. మార్కాపురం మునిసిపాలిటీ పరిధిలో ఉన్న రెండు పోలింగ్‌ బూత్‌లలో మినహా మిగిలిన అన్నింటిలోనూ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి మెజార్టీ వచ్చింది. వైసీపీకి రెండు బూత్‌లలో ఒక చోట 30, మరో బూత్‌లో 50 ఓట్ల మెజారిటీ మాత్రమే లభించింది. ఇక ప్రభుత్వం మారగానే టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి వద్దకు అధికార యంత్రాంగం మొత్తం చేరింది. దీంతో పలువురు వైసీపీ కౌన్సిలర్లు కూడా టీడీపీ వైపు దృష్టి సారించారు.

తాజా పరిణామాలతో ఈ గోలంతా మనకెందుకు టీడీపీలో చేరితే బాగుంటుందన్న ఉద్దేశంతో వైసీపీ కౌన్సిలర్లు ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారంట. అయితే ఎమ్మెల్యే నారాయణరెడ్డి ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. ఎలాగూ అధికారులు మనమాటే వింటారు. మనం చెప్పిన పనులే జరుగుతాయి. ముందు వైసీపీలో పంచాయతీ తేల్చుకోనివ్వండని టీడీపీ నేతలతో చెప్పినట్లు తెలిసింది. మొత్తానికి ఇద్దరు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు ఆడుతున్న పొలిటికల్ గేమ్‌లో ఓ బడా డాక్టర్ అలా బుక్ అవ్వడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

Related News

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Jammu Kashmir Elections: కశ్మీర్ ఎన్నికలు.. కమలానికి అగ్నిపరీక్షే..

Why Atishi as Delhi CM: సీఎంగా అతిశీనే ఎందుకు? కేజ్రీవాల్ ప్లాన్ ఏంటి?

Amaravati: అమరావతి సేఫ్.. ఇక దూసుకుపోవడమే

Arvind Kejriwal Resignation: కేజ్రీ కొత్త వ్యూహం ఫలిస్తుందా?

Big Stories

×