EPAPER

Narayana Murthy : మూర్తి గారి మాటల్లో మంచీ చెడూ..!

Narayana Murthy : మూర్తి గారి మాటల్లో మంచీ చెడూ..!
narayana murthy

Narayana Murthy : భారతీయ యువత వారానికి 70 గంటలు పనిచేయగలిగితే.. మన ఆర్థిక వ్యవస్థ ఊహించని స్థాయిని అందుకోగలదంటూ ఇటీవల ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు పదిరోజులగా దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి. ఇన్ఫోసిస్ మాజీ సీఈఓ మోహన్‌దాస్ పాయి ఆధ్వర్యంలోని 3 వన్ 4 క్యాపిటల్ పాడ్‌కాస్ట్ ‘ది రికార్డ్’ తొలి ఎపిసోడ్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారతీయల పని సంస్కృతిని విశ్లేషించే క్రమంలో.. మన పనిగంటలు.. చైనా కంటే తక్కువనీ, రెండవ ప్రపంచయుద్ధ కాలంలో జపాన్‌, జర్మన్‌ ప్రజలు పనిచేసిన రీతిలో మన యువత పనిచేయాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.


మూర్తి వ్యాఖ్యల్లో సాధ్యాసాధ్యాలను, మంచి చెడులను కాసేపు పక్కనబెడితే.. చాలా ఏళ్ల తర్వాత భారత్‌లోని వర్క్‌ఫోర్స్ .. ప్రత్యేకించి ఐటీ ఉద్యోగుల పనిగంటలు, వేతనాలు, పని సంస్కృతి, వారు ఎదుర్కొంటున్న ఒత్తిడి తదితర అంశాలపై లోతైన చర్చ జరిగేందుకు ఆయన మాటలు ఒక అవకాశాన్ని కల్పించాయని చెప్పాలి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆరోగ్యకరమైన చర్చ… భారతదేశంలోని యంగ్ వర్క్‌ఫోర్స్, కార్పొరేట్ ఇండియాకు మధ్యగల అంచనాల్లోని తేడాను బయటపెట్టగలింది.

ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ డేటా ప్రకారం.. భారతీయ ఉద్యోగులు వారానికి 47.7 గంటల పని చేస్తూ.. పనిగంటల పరంగా ప్రపంచంలోనే తొలిస్థానంలో ఉన్నారు. రెండవస్థానంలో చైనా(46.1 గంటలు), 3,4,5,6,7,8,9,10 స్థానాల్లో వరుసగా.. దక్షిణ కొరియా( 37.6 గంటలు), జపాన్ (36.6 గంటలు), అమెరికా (36.4 గంటలు), ఇటలీ (36.1 గంటలు), బ్రిటన్ (35.1 గంటలు), జర్మనీ (34.1 గంటలు), కెనడా (32.1 గంటలు), ఫ్రాన్స్ (30.1 గంటలు) నిలిచాయి. ఎట్టిపరిస్థితిలోనూ వారానికి 48 గంటలకు మించి పని చేయించరాదని ఇంటర్‌నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ స్పష్టం చేస్తోంది.


ఈ ఇంటర్వ్యూలో నారాయణ మూర్తి 1947లో మనకు రాజకీయ స్వాతంత్య్రం వచ్చిందని, 1991 నుండి ఆర్థిక స్వాతంత్య్రం వచ్చిందన్నారు. అదే వేదిక మీద షేర్‌‌మార్కెట్‌ను మన డెవలప్‌మెంట్‌కు ఒక ఇండికేటర్‌గా చెప్పుకొచ్చారు. నేటి షేర్ మార్కెట్ మార్కెట్లోని 69% సంపద కేవలం 5 శాతం మంది చేతుల్లోనే ఉందనే సంగతి ఆయన దృష్టికి రాకపోవటం ఆశ్చర్యమనే చెప్పాలి.

ఒక గంట పనిచేయటం ద్వారా మనం ఉత్పత్తి చేసే వస్తు, సేవల విలువనే లేబర్ ప్రొడక్టివిటీ అంటారు. ఇది పనిగంటలను బట్టి మాత్రమే గాక మంచి టెక్నాలజీ మీద ఆధారపడి ఉంటుంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ వర్క్‌ఫోర్స్ ఏడాదికి 2200 – 2400 గంటలే పనిచేశారు. అంటే.. వారానికి 5 రోజుల పని ప్రకారం.. వారు రోజులో 8.3 నుండి 9 గంటలే పనిచేశారు. 1970 -2020 కాలంలో వీరి పనిగంటలు ఏడాదికి 1400 – 1600 గంటలకే పరిమితమయ్యాయి. అయితే.. 1970 నుంచి ఈ దేశాల్లో వర్కింగ్ అవర్స్ తగ్గినా.. ఈ సమయంలో లేబర్ ప్రొడక్టివిటీ జపాన్‌లో గంటకు 43 డాలర్లు, జర్మనీలో గంటకు 69 డాలర్లకు పెరిగింది. అదే.. భారత్‌లో మాత్రం 1970 – 2020 మధ్యకాలంలో లేబర్ ప్రొడక్టవిటీ 2 డాలర్ల నుంచి 9 డాలర్లకే పరిమితమైంది.

అలాగే.. రెండవ ప్రపంచ యుద్ధకాలానికి (1945) నాటికే జపాన్, జర్మనీలు ఇండస్ట్రియల్‌గా బాగా డెవలప్ అయ్యాయి. అక్కడి వర్క్‌ఫోర్స్‌కి తగినంత వర్కింగ్ కేపిటల్, బెటర్ టెక్నాలజీ టూల్స్, స్కిల్ డెవలప్‌మెంట్ మీద వాళ్లు పెట్టిన శ్రద్ధ తోడవటంతో వారు మరింత ప్రొడక్టివిటీని పెంచుకోగలిగారు.

ఒకప్పుడు జపాన్‌లో కార్మికులు సమ్మెలు చేయకుండా, వర్కింగ్ అవర్స్ కంటే మరింత ఎక్కువ టైమ్ పనిచేసేవారు. దానివల్ల ప్రొడక్టివిటీ పెరిగి, తయారైన వస్తువులకు డిమాండ్ లేక.. వారి ఎకానమీ దెబ్బతినటంతో ఈ పద్ధతిని అక్కడి వర్క్‌ఫోర్స్ దశాబ్దం నాడే వదిలేసింది.

ఇక.. మూర్తి వ్యాఖ్యలు.. మన భారతీయ పరిస్థితులకు వర్కవుట్ అవుతాయో కూడా చూడాల్సి ఉంది. భారత్‌లో 1992 నుంచి ఎకనమిక్ రిఫార్మ్స్ అమల్లోకి రాగా, ఓ పదేళ్ల తర్వాత వాటి ప్రత్యక్ష ప్రభావం మనదేశంలో కన్పించటం మొదలైంది. దీంతో మన రూరల్, అర్బన్ ఏరియాల్లోని ఎబౌ మిడిల్ క్లాస్ పిల్లలు ఐటీ, ఫార్మా వంటి సర్వీస్ సెక్టార్ జాబ్స్ పొందేందకు కావాల్సిన ఎడ్యుకేషన్‌ను పొంది, వెంటనే మంచి జాబ్స్ కొట్టేశారు. దీంతో వారి లైఫ్‌స్టయిల్‌లో చాలా మార్పులొచ్చాయి. అయితే.. ఈ జాబ్స్.. మన కుటుంబ, సాంస్కృతిక, ఆర్థిక పరిమితులను ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్లేందుకు హెల్ప్ చేయలేకపోయాయి.

కేంద్రం లెక్కల ప్రకారం.. మన ఐటీ, ఐటీ అనుబంధ సేవల రంగం 2021 నాటికి ప్రత్యక్షంగా 44 లక్షలు, పరోక్షంగా 1.2 కోట్ల జాబ్స్‌ను ఇవ్వగా, 2022 నాటికి మరో 5 లక్షల జాబ్స్ వచ్చాయి. ఈ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 37% మహిళా ఉద్యోగులు. కానీ.. మనదేశంలో ఇంటిపని, పిల్లలు, కుటుంబ బాధ్యతల్లో మగవాళ్లు బాధ్యతలను పంచుకునే పద్ధతి లేదు. జాబ్ వల్ల మహిళా ఉద్యోగులకు ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చినా.. కుటుంబ బాధ్యతలు, కట్టుబాట్ల విషయంలో ఆ స్వాతంత్ర్యం రాలేదు. మరి.. వారానికి 70 గంటల పనిచేస్తూ.. మహిళా ఉద్యోగులు.. కుటుంబ బాధ్యతలను మేనేజ్ చేయటం సాధ్యమేనా? ఇదే పరిస్థితి వస్తే.. వారు జాబ్స్ వదులుకునే పరిస్థితి రాదా? అనే డౌట్స్ వస్తున్నాయి.

ఇక.. శాలరీ పరంగానూ మూర్తి వాదనలో లాజిక్ మిస్సయిందనేది ఇన్ఫోసిస్ ఫ్రెషర్స్ , CEOల శాలరీలను చూస్తే తెలిసిపోతోంది. ఇన్ఫోసిస్ సీఈవోకు 2012లో ఇచ్చిన యాన్యువల్ ప్యాకేజీ రూ. 80 లక్షలు కాగా.. నేడు అది రూ. 80 కోట్లకు పైమాటే. మరి 2012లో ఫ్రెషర్‌ శాలరీ రూ. 2.75 లక్షలుండగా, నేడు అది కేవలం రూ. 3.60 లక్షలకే పెరిగింది. అంటే.. ఇద్దరికీ వర్కింగ్ అవర్స్ సమానమే అయినా.. శాలరీలో మాత్రం 2,200 టైమ్స్ డిఫరెన్స్ ఉంది. అదే సమయంలో 2012-2022 పీరియడ్‌లో ఇన్ఫోసిస్ క్లైంట్స్‌ నుంచి ఛార్జి చేసే ఫీజులు వందల రెట్లు పెరిగాయి. ఇంత డిఫరెన్స్ కళ్లముందు కనిపిస్తుంటే.. ఇంకా అక్కడే ఉంటూ.. ఉద్యోగులు 70 గంటలు పనిచేస్తారా?

ఇక.. ఐటీ కంపెనీలన్నీ సిటీల్లోనే ఉన్నాయి. ఐటీ ఉద్యోగుల్లో 58 శాతం ఫ్రెషర్సే ఉన్నారు. వీరి శాలరీ తక్కువ గనుక వీరు సిటీ చివర్లో తక్కువ రెంట్ ఇళ్లలోనే ఉండాల్సి వస్తోంది. రోజూ 20 కి.మీ ప్రయాణం చేస్తూ వీరు జాబ్ చేయాల్సి ఉంది. వీరిలో మెజారిటీ ఉద్యోగులు కారు, డ్రైవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎఫోర్డ్ చేయలేరు. సిటీలోని పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్స్, ట్రాఫిక్ సంగతి గురించి మనకు తెలిసిందే. వీరంతా 8 గంటల పనికి 3.5 గంటలు ట్రావెల్ చేయక తప్పని పరిస్థితి. ఇక.. వారానికి 70 గంటలు పనిచేస్తే.. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ సాధ్యమేనా?

మరోవైపు.. వారానికి 55 గంటలకు మించి పనిచేసే ప్రతిపది మంది ఉద్యోగుల్లో ఒకరు.. అనారోగ్యంతో చనిపోతున్నట్లు World Health Organisation, International Labour Organisationలు కలిసి రూపొందించిన 2016 నాటి రిపోర్టు చెబుతోంది. మరి.. నూటికి 60 మంది యంగ్ వర్స్‌ఫోర్స్ ఉన్న భారత్.. వారానికి 70 గంటలు పనిచేస్తే ఏమవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

డెవలప్‌డ్ కంట్రీస్ కంటే మన వర్క్ క్వాలిటీ, ప్రొడక్టివిటీ తక్కువ అని మూర్తి చెప్పుకొచ్చారు. కానీ.. దీనిని నిపుణులు అంగీకరించటం లేదు. బెటర్ వర్క్ ఎన్విరాన్‌మెంట్, మౌలిక సదుపాయాలు, టైం టు టైం అప్‌డేట్ అయ్యేందుకు కావలసిన ట్రైనింగ్ లభించకపోవటం, మహిళా ఉద్యోగుల బాగోగులు పట్టించుకునే సిస్టమ్స్ లేకపోవటం, వర్క్‌ప్లేస్‌లో వేధింపుల కొనసాగటం, గవర్నమెంట్ పాలసీల్లో లోపాలు.. ఇవన్నీ మన సమస్యకు అసలు మూలాలు అని ఆ నిపుణులు చెబుతున్నారు. కానీ.. వీటిని పట్టించుకోకుండా.. కేవలం ఎంప్లాయి వారానికి 70 గంటలు పనిచేసినా.. లాభమేమీ ఉండదని వారి వాదన.

చివరిగా.. నారాయణమూర్తి తన సెక్టార్‌లో ఒక లెజెండ్ అని ఒప్పుకోవాల్సిందే. ఆయన సాధించిన విజయాలు అంతర్జాతీయంగా మనదేశానికి మంచి పేరు తెచ్చేందుకు, లక్షలమందికి జాబ్స్ వచ్చేందుకు ఉపయోగపడ్డాయనే మాటను కాదనలేము. వయసు, ఎక్సిపీరియన్స్ రీత్యా కూడా ఆయన గౌరవించదగిన వ్యక్తే. కానీ.. మూర్తి తాజా వ్యాఖ్యల్లో ఎందుకో.. వాస్తవికత, నేటి యువత ఆకాంక్షలు, ఆలోచననలు, అవసరాలకు సముచిత స్థానం దక్కలేదనే భావన మాత్రం దేశవ్యాప్తంగా వ్యక్తమైంది. అదేసమయంలో.. మరోవైపు మన దేశంలోని ఉద్యోగుల బాధలు, శ్రమదోపిడి మీద కూడా చాలాకాలం తర్వాత ఒక ఆరోగ్యవంతమైన చర్చ జరిగేందుకు కూడా మూర్తి వ్యాఖ్యలు ఉపయోగపడ్డాయని మాత్రం చెప్పక తప్పదు…!

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×