EPAPER

Medplus : మెడ్ ప్లస్ మెడికల్ దందా.. స్టింగ్ ఆపరేషన్ తో యాజమాన్యంలో గుబులు ?

Medplus : మెడ్ ప్లస్ మెడికల్ దందా.. స్టింగ్ ఆపరేషన్ తో యాజమాన్యంలో గుబులు ?

Medplus Medicines : మెడ్ ప్లస్ లో అసలేం జరుగుతుంది ? సే నో టూ డ్రగ్స్ నిఘాలో భాగంగా.. స్వేచ్ఛ- బిగ్ టీవీ చేసిన స్టింగ్ ఆపరేషన్ తో యాజమాన్యంలో టెన్షన్ మొదలైందా ? అందుకే ఉద్యోగులందరితో జూమ్ మీటింగ్ నిర్వహించిందా ? ఈ ప్రశ్నలకు సమాధానం.. అవును. స్వేచ్ఛ- బిగ్ టీవీ చేసిన స్టింగ్ ఆపరేషన్ తో మెడ్ ప్లస్ యాజమాన్యం అప్రమత్తమైంది. బిగ్ టీవీ కథనంతో టెన్షన్ పడింది. ఉద్యోగులందరితో జూమ్ మీటింగ్ నిర్వహించింది. బిగ్ టీవీ ప్రతినిధులను స్టోర్లలోకి రానివ్వద్దని ఆదేశాలు జారీ చేసింది. ఎవరేం అడిగినా చెప్పవద్దని సూచించింది.


అసలు మెడిప్లస్ లో పనిచేసే స్టాఫ్ ఫార్మాసిస్టులేనా అంటే అస్సలు కానే కాదు. టెన్త్, ఇంటర్ పాసైతే చాలు. ఉద్యోగాలిస్తాం. మేమే ట్రైనింగ్ ఇచ్చి.. జీతం కూడా చెల్లిస్తామంటూ పోస్టర్లు పెడుతుంది. టెన్త్ పాసైన వారు ఇంటర్వ్యూకి వెళ్తే.. అంతా మేమే చూసుకుంటామని చెబుతుంది యాజమాన్యం. బీ.ఫార్మసీ డిగ్రీ లేకుండా.. ఇలా మందుల గురించి కనీస నాలెడ్జ్ లేనివారిని సేల్స్ కు వాడుకుంటుంది మెడ్ ప్లస్. టెన్త్ చదివిన వారికి మెడిసిన్ గురించి.. వాటిలో వాడే డ్రగ్ గురించి అవగాహన ఉండదు. ఇలా ఇష్టారాజ్యంగా అర్హత లేనివారికి ఉద్యోగాలిచ్చి.. మెడికల్ దందా నడుపుతోంది మెడ్ ప్లస్.

ఒక రిటైల్ ఫార్మసీ చెయిన్ గా వ్యాపించిన మెడ్ ప్లస్.. మొత్తం 600 పట్టణాలలో 4,250 స్టోర్లను రన్ చేస్తోంది. 10 రాష్ట్రాల్లో ఉన్న మెడ్ ప్లస్ స్టోర్లలో 25 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. బయటేమో 20 శాతం, 50 శాతం, అప్ టు 80 శాతం డిస్కౌంట్ అని బోర్డులు దర్శనమిస్తాయి. లోపలికి వెళ్లాక.. యాన్యువల్ మెంబర్ షిప్ తీసుకున్నవారికే ఆ డిస్కౌంట్ అన్ని మందులపై వర్తిస్తుందని చెబుతారు. ఏడాదికి రూ.1800 పెట్టి మెంబర్ షిప్ తీసుకుంటే 50 శాతం డిస్కౌంట్ ఇస్తామంటారు. అలాగే బ్లడ్ టెస్ట్ లపై కూడా డిస్కౌంట్ వర్తిస్తుందని చెబుతారు. ఇదంతా నమ్మిన కస్టమర్లు మెంబర్ షిప్ తీసుకుంటారు.


Also Read : ‘డెడ్’ ప్లస్.. స్వేచ్ఛ-బిగ్ టీవీ స్టింగ్ ఆపరేషన్

అయితే.. మెడ్ ప్లస్ అమ్మే మందుల్లో.. సొంతంగా తయారు చేసిన మందులు కూడా కలిపి అమ్మేస్తున్నారు. కస్టమర్ క్వశ్చన్ చేస్తే.. మాది కూడా సేమ్ ఫార్ములానే.. కాకపోతే కస్టమర్లకు మందులు ఇంకాస్త చవకగా అందాలని తక్కువకే ఇస్తున్నట్లు చెబుతారు. అందులో ఏ డ్రగ్ ఉందో ఏంటో ఎవరికీ తెలీదు. వాడు అమ్మాడు.. వీళ్లు వేసేసుకుంటున్నారు అంతే. మరి మెడ్ ప్లస్ ను నమ్మి మందులు వాడిన వారికి ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత అన్నదానికి సమాధానం లేదు.

కడపలో పదేళ్లుగా మెడ్ ప్లస్ స్టోర్ రన్ అవుతుంది. ప్రిస్క్రిప్షన్ లేకుండానే నిద్రమాత్రలు, షెడ్యూల్ H1, షెడ్యూల్ X డ్రగ్ ల అమ్ముతున్నారు. ఫార్మాసిస్టులు లేకుండానే ఫార్మసీని రన్ చేస్తున్నారు. మందులు వేసుకున్న వారికి ఏమైనా జరిగితే ఏంటని బిగ్ టీవీ బృందం ప్రశ్నించగా.. సరైన సమాధానం లేదు.

సే నో టూ డ్రగ్స్ నిఘాలో భాగంగా.. మాసబ్ ట్యాంక్‌లో మెడిప్లేస్ స్టోర్ కి బిగ్ టీవీ బృందం వెళ్లింది. ఈ స్టోర్ లో ఫార్మాసిస్ట్ లేకుండానే మందులు అమ్ముతున్నారు. ఓ ఫార్మాసిస్ట్ కు సంబంధించి సర్టిఫికెట్ పెట్టి వేరే వారిచే మందులు అమ్మేస్తుంది మెడ్ ప్లస్ యాజమాన్యం. రెండు నెలలు ట్రైనింగ్ ఇచ్చి నేరుగా ఉద్యోగం ఇస్తున్నారని మెడ్ ప్లస్ లో పనిచేస్తున్న ఉద్యోగి తెలిపాడు.

సే నో టూ డ్రగ్స్‌ సెర్చ్‌ ఆపరేషన్‌లో భాగంగా బిగ్‌టీవీ బృందం.. అనంతపురంలోని ఓ మెడ్ ప్లస్ స్టోర్‌ను సందర్శించింది. అందులో పనిచేస్తున్న ఓ అమ్మాయి.. తనకు ఇంటర్మీడియట్ అర్హతతో ఉద్యోగం వచ్చినట్లు చెబుతోంది. నిజానికి బీఫార్మసీ చేసిన వారు కచ్చితంగా దుకాణంలో ఉండాలి. కానీ ఆ రూల్ ను మెడ్ ప్లస్ యాజమాన్యం ఉల్లఘించిందని ఇక్కడ తేటతెల్లమైంది.

కడప, నెల్లూరు, తిరుపతి, విశాఖపట్నం, అనంతపురం, హైదరాబాద్ లోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని మెడ్ ప్లస్ స్టోర్లలో జరుగుతుంది ఇదే. ఇంత జరుగుతుంటే డ్రగ్ కంట్రోల్ అధికారులు ఏం చేస్తున్నట్లు ? మెడ్ ప్లస్ స్టోర్లలో ఎందుకు తనిఖీలు చేయలేదు ? అన్నది ప్రశ్నార్థకమే. ఇప్పటికైనే కళ్లు తెరిచి మెడ్ ప్లస్ పై చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి.

Related News

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Big Stories

×