EPAPER

IAS Amoy Kumar Scams: అమోయ్ కుమార్ డమ్మీ! త్వరలో ఆ బీఆర్ఎస్ నేత అరెస్ట్ ?

IAS Amoy Kumar Scams: అమోయ్ కుమార్ డమ్మీ! త్వరలో ఆ బీఆర్ఎస్ నేత అరెస్ట్ ?

అమోయ్ కుమార్ చుట్టూ ఈడీ నజర్

ఇక్కడ మీరు చూస్తున్నది ఐఏఎస్ అమోయ్ కుమార్. గత ప్రభుత్వ హయాంలో మేడ్చల్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా పని చేశారు. ప్రస్తుత పోస్ట్ పశుసంవర్థక శాఖ జాయింట్ సెక్రెటరీ. కానీ ఇప్పుడు ఈడీ లెన్స్ లో ఉన్నారీయన. రోజూ ఈడీ ఆఫీస్ చుట్టూ తిరిగే పరిస్థితి తెచ్చుకున్నారు. కారణం ధరణి వచ్చాక జరిగిన తిప్పిన భూ చక్రమే. రికార్డుల్లో పేర్లు మార్చేశారని, రాత్రికి రాత్రే ప్రైవేట్ వ్యక్తులు పొజిషన్ లోకి వచ్చేలా చక్రం తిప్పారన్నది అభియోగం. తీగ లాగితే లీలలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయంటున్నారు. ధరణి వచ్చాక తమ పేర్లు మిస్ అయిన వారు అప్పట్లో కలెక్టరేట్ కు తిరగని రోజంటూ లేదు. కానీ ఏ రోజూ పని జరగలేదు. ఇప్పుడు ఈడీ విచారణకు పిలిచిందని తెలియగానే అమోయ్ పై ఇప్పుడు అంతా కంప్లైంట్ల మీద కంప్లైంట్లు ఫైల్ చేస్తున్నారు.


రికార్డుల తారుమారుపై అభియోగాలు

ఒక జిల్లా కలెక్టర్ అంటే ఎలా ఉండాలి..? ప్రభుత్వానికి, ప్రజల ఆస్తులకు జవాబుదారీగా ఉండాలి. ఏదైనా ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకునేది ఐదేళ్ల కాలపరిమితికే. మళ్లీ ఎవరుంటారో ఎవరు ఉండొద్దో డిసైడ్ చేసేది జనం. కానీ ఐఏఎస్ అలా కాదు.. ఒక్కసారి పోస్టుకు ఎక్కాక రిటైర్మెంట్ దాకా కీలక బాధ్యతలు చూసుకోవాల్సింది వీళ్లే. వీరి సంతకం లేకుండా ఏ పనీ జరగదు. చివరికి సీఎం ఆదేశించినా సరే సీఎస్ ఫైల్ మూవ్ చేస్తేనే కదులుతుంది. అలాంటి కీలక బాధ్యతల్లో ఉన్న కలెక్టర్లు విలువైన ప్రభుత్వ ఆస్తులను, ప్రయోజనాలను ఎలా కాపాడాలి..? కానీ ఐఏఎస్ అమోయ్ కుమార్ పై ఇన్ని అభియోగాలు వస్తున్నాయంటే ఆయన ఎంతలా చక్రం తిప్పి ఉంటారన్న చర్చ జరుగుతోంది.

Also Reads: కేటీఆర్ పిచ్చి పట్టిందా! జగ్గా రెడ్డి పైర్

ధరణి వచ్చాక మరింతగా లీలలు

గత ప్రభుత్వ హయాంలో ప్రలోభాలకు లొంగారా.. ఎవరైనా కీలక నేతలు ఒత్తిడి తెచ్చారా.. లేదంటే సొంతంగా నిర్ణయాలు తీసుకున్నారో తెలియదు గానీ.. ఇప్పుడు అమోయ్ కుమార్ ఈడీ లెన్స్ లో ఉన్నారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్ గా పని చేశారు. ఆ రెండు జిల్లాల్లో భూముల విలువ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ ఏ దిక్కు చూసుకున్నా.. భూమాయాజాలాల్లో అమోయ్ పేరే వినిపిస్తోంది. భూదాన్ భూములు సహా అసైన్డ్ ల్యాండ్స్ వీటితో పాటు ధరణి వచ్చాక అసలు వ్యక్తులను కాదని, ప్రైవేట్ వ్యక్తులకు బదలాయించారన్న అభియోగాలు నడుస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం భూదాన్ భూముల చుట్టూ ఆరోపణలు గుప్పుమనడంతో తాజాగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. సమన్లు జారీ చేసింది. ఎంక్వైరీకి ఆయన హాజరయ్యారు కూడా.

అంతలా అమోయ్ చక్రం తిప్పారా?

కలెక్టర్ సంతకం అంటే ఒక వాల్యూ. ఒక నమ్మకం. అదే ప్రలోభాలకు లొంగితే.. నేతల ఒత్తిళ్లకు లొంగితే సీన్ మరోలా ఉంటుంది. ఇప్పుడు అమోయ్ కుమార్ పై వచ్చినవి అభియోగాలే. వాటిలో నిజానిజాలేంటో ఈడీ తేల్చబోతోంది. ఇప్పటికే విజిలెన్స్ విచారణలో భూ బదలాయింపులకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసలు అమోయ్ కుమార్ ను ఈడీ ఉన్నఫళంగా విచారణకు ఎందుకు పిలిచిందో చూద్దాం. ఇది రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో ఉన్న భూదాన్ భూములు. నాగారంలోని సర్వే నంబర్ 181, 182లో 100 ఎకరాల భూమి చుట్టూ రగడ నడుస్తోంది. నిజానికి ఈ భూములు ప్రభుత్వ రికార్డుల్లో ప్రభుత్వ భూములుగా ఉన్నాయి. అయితే ఇదే ల్యాండ్ పై కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి. ఇదంతా ఉండగానే థర్డ్ పార్టీ పేరుపై మార్చే కథకు తెరలేచింది. మరి ఈ కొత్త పత్రాలు సృష్టించిందెవరు.. వాటిపై సంతకం పెట్టిందెవరు అన్న టాపిక్ ఇప్పుడు హాట్ డిబేట్ గా మారింది.

రికార్డుల్లో ప్రభుత్వ భూములుగా ఉన్నవే

ఇప్పుడు అమోయ్ కుమార్ ఈడీ ఎంక్వైరీ నడుస్తుండగా ఈ వంద ఎకరాల లాండ్ వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. ఫరూక్ అలీ ఖాన్ పేరు పై భూమి ఉందని ఆయన తరపు లాయర్ అబ్దుల్ ఖాదర్ అంటున్నారు. ఇందులో 50 ఎకరాలను అక్రమంగా ప్రైవేటు వ్యక్తికి కట్టబెట్టారని, భూదాన్ కు ఇచ్చిన 50 ఎకరాలతో పాటు మరో 20 ఎకరాలనూ కబ్జా చేసి ప్లాట్లుగా మార్చారని ఆయన ఆరోపిస్తున్నారు. భూదాన్ బోర్డుకు, ఫరూక్ కు మధ్య కోర్టు కేసు నడుస్తుండగానే ఫరూక్ వారసురాలి పేరుతో ఖాదర్ ఉన్నిసా అనే వ్యక్తి 42 ఎకరాలు తనవే అంటూ నకిలీ పేపర్లు సృష్టించారంటున్నారు. సో ఇప్పుడు ఫరూక్ తరపు లాయర్ చెప్పేదేంటంటే.. అసలు కోర్టు కేసులో ఉన్న ల్యాండ్ అది కూడా స్టేటస్ కో ఉన్న సర్వే నెంబర్ ల్యాండ్స్ ను ప్రైవేట్ వ్యక్తులకు ఆఫీసర్లు ఎలా కట్టబెట్టారంటున్నారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు నోటీసులూ అందుకున్న వారిలో అమోయ్ కుమార్ కూడా ఉన్నారంటున్నారు. వరుసబెట్టి రెవెన్యూ అధికారులంతా ఉన్నట్లు చెబుతున్నారు అడ్వొకేట్. అధికారుల ధన దాహానికి తగిన శాస్తి జరుగుతుందని కూడా చెబుతున్నారు.

ఏళ్ల తరబడి ఆ భూములు ఖాళీగా ఉండడంతో దాన్ని దక్కించుకునేందుకు చాలా మంది చక్రం తిప్పారు. పొలిటికల్ లీడర్లకు అధికారులు కూడా తోడవడంతో పేర్లు మారిపోయాయన్న మాట. తెలంగాణ వచ్చాక భూదాన్ బోర్డును గత ప్రభుత్వం రద్దు చేసింది. సో ఆ భూములన్నీ ప్రభుత్వానికే వచ్చాయి. అయితే రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో కథ ఇక్కడి వరకు వచ్చింది.

 

Related News

Sajjala Bhargava Reddy: సజ్జల భార్గవ రెడ్డి ఎక్కడ? అప్పుడు అరాచకం.. ఇప్పుడు అజ్ఞాతం, అవన్నీ బయటపడతాయనేనా?

Bharat Jagruthi: ‘జాగృతి’ జాడేది? ఆ డబ్బులన్నీ ఏమయ్యాయ్?

Vijay Political Party: తమిళ రాజకీయాల్లో రజినీ, కమల్ అలా.. మరి విజయ్? ఆ స్పేస్‌ను TVK భర్తీ చేయగలదా?

Israel-Iran War: ఇజ్రాయిల్ మిసైళ్ల వర్షం.. రక్తంతో తడిచిన ఇరాన్

BIG Shock To YS Jagan: జగన్‌కు మరో షాక్.. టీడీపీలోకి మరో ఎమ్మెల్యే?

Visakha Sarada Peetham: సాములోరి బాకీ తీర్చేస్తా.. ప్రభుత్వం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటుందా..?

Nagam Janardhan Reddy: ఆ ఒక్క తప్పు.. నాగం కొంప ముంచింది

×