EPAPER

KTR in Confusion: కేటీఆర్ క్లారిటీ మిస్సమవుతున్నారా? కేసీఆర్ గురించి తటపటాయింపెందుకు?

KTR in Confusion: కేటీఆర్ క్లారిటీ మిస్సమవుతున్నారా? కేసీఆర్ గురించి తటపటాయింపెందుకు?

KTR in Confusion: కేటీఆర్ క్లారిటీ మిస్సమవుతున్నారా? తండ్రి ఆరోగ్యం గురించి అసలైన పాయింట్ చెప్పలేకపోయారా? కొత్త ప్రభుత్వం వచ్చి పది నెలలు కూడా కాలేదు.. పదేళ్లు పాలించిన నేత అప్పుడే పాదయాత్ర చేయాలనుకోవడమా..? ఇదెక్కడి లాజిక్? ఏం చేయాలనుకుని ఏం చేస్తున్నారు? ఒకదశలో రాజకీయాల నుంచే తప్పుకోవాలన్నంత విరక్తి వచ్చిందని ఎందుకన్నారు? అదిగో కేసీఆర్.. ఇదిగో కేసీఆర్.. వచ్చేస్తున్నారని చెప్పి 2025 తర్వాతే అని అనడం ద్వారా ముహూర్తాలు బాగా లేవా.. లేదంటే నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వానికి టైం ఇస్తున్నారా? మొత్తం గజిబిజి గందరగోళం.


దీపావళి వేళ కేటీఆర్ పేల్చిన సుత్లీ బాంబ్ తుస్సుమంది. ఆస్క్ మి అంటూ ట్విట్టర్ లో క్వశ్చన్ అవర్ పెట్టిన కేటీఆర్.. ఏదో చెప్పబోయి ఇంకేదో చెప్పేసి.. తాజాగా పాదయాత్ర ఇష్యూ ముందేసుకున్నారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అదేంటి మొన్నటిదాకా పదేళ్లు పాలించారు. కదా ఈ పది నెలల్లో ఏమై ఉంటుందని ఆల్ ఆఫ్ సడెన్ గా ఈ పాదయాత్ర అన్న ప్రశ్నలు వస్తున్నాయి. తమ పాలన బాగుందని, అందుకే తెలంగాణ ఈ స్థితిలో ఉందని చెబుతూ వచ్చిన కేటీఆర్.. పాదయాత్రను ముందేసుకోవడం వెనుక పెద్ద స్కెచ్చే ఉందన్న వాదనైతే వినిపిస్తోంది.

ఆస్క్ కేటీఆర్ క్వశ్చన్ అవర్ లో క్లారిటీ ఎలా మిస్సయిందో ఒక్కొక్కటిగా డీకోడ్ చేద్దాం. ఫస్ట్ కేసీఆర్ దగ్గర్నుంచి షురూ చేద్దాం. ఎందుకంటే గులాబీ బాస్ ప్రధాన ప్రతిపక్ష నేత. ప్రజలకు జవాబుదారీ ఉన్న వ్యక్తి. గత పదేళ్లు సీఎంగా పని చేసిన నాయకుడు. జనానికి కష్టం వచ్చినా, సుఖం వచ్చినా సుఖదుఖాలు పంచుకోవాల్సిన వ్యక్తి. అలాంటిది లోక్ సభ ఎన్నికల ప్రచారం తర్వాత అసలు జనంలో కనిపించడమే మానేశారు. పూర్తిగా ఫాంహౌజ్ కే పరిమితం అయ్యారు. ఎటూ వెళ్లడం లేదు. బయటకు రావడం లేదు. చాలా డీప్ గా ఆలోచిస్తున్నారా? ఏం చేయాలో ప్లాన్ చేస్తున్నారా? జనంలోకి ఎలా వెళ్లాలో తర్జనభర్జన పడుతున్నారా.. ఇలాంటి డౌట్లన్నీ జనానికి వచ్చాయి. ఆస్క్ కేటీఆర్ అని ఎక్స్ లో మాజీ మంత్రి సెషన్ పెట్టగానే చాలా మంది అడిగిన ప్రశ్న కూడా ఇదే. కేసీఆర్ ఎందుకు జనంలోకి రావడం లేదు.. ఎందుకు కనిపించడం లేదు? కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉంది.. ఇవే ప్రశ్నలు.


సీన్ కట్ చేస్తే జవాబు ఇవ్వకపోతే కుదిరేలా లేదనుకున్న కేటీఆర్.. ఆన్సర్ ఇచ్చేశారు. BRS అధినేత కేసీఆర్‌ ఆరోగ్యంగానే ఉన్నారని, రోజూ తమకు మార్గనిర్దేశం చేస్తున్నారన్నారు. అంతే కాదు ఎప్పుడు బయటికొస్తారన్న ప్రశ్నలకు 2025 తర్వాత కేసీఆర్‌ ప్రజల్లోకి విస్తృతంగా వస్తారని జవాబిచ్చారు. అక్కడితో ఆగలేదు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల అమలు కోసం ఆయన సమయం ఇస్తున్నారని, బాధ్యత గల ప్రతిపక్ష నేతగా కొత్త ప్రభుత్వానికి కేసీఆర్‌ టైం ఇస్తున్నట్లుగా వెనకేసుకొచ్చారు. కానీ ఇది నిజమా అంటే కానే కాదన్న మరో వెర్షన్ కూడా వినిపిస్తోంది. నిజానికి కేసీఆర్ ఎవరి మాటా వినరు. మైండ్ లో ఏది అనిపిస్తే అదే చేస్తారన్న టాక్ ఉంటుంది. ఒకరు చెబితే జనంలోకి రానే రారు. అనుకుంటేనే వస్తారు. అదీ మ్యాటర్.

Also Read:  ఆధిపత్యం కోసమేనా పాదయాత్ర? హరీష్‌ను తొక్కి.. నేనే సీఎం అని చెప్పేందుకేనా?

మొన్నటిదాకా కేసీఆర్ ఇగ వచ్చేస్తాడు.. అదిగో వచ్చేస్తాడని గులాబీ లీడర్లు జోరుగా ప్రచారం చేశారు. బస్సు యాత్ర అన్నారు. జిల్లాల యాత్ర అన్నారు. ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతారన్నారు. మొదట దసరా అన్నారు. ఆ తర్వాత దీపావళి అన్నారు. డిసెంబర్ అన్నారు. ఇప్పుడు ఏకంగా మరో ఏడాది ఆగాలంటున్నారు. 2025 గడిస్తే గానీ బయటికి రాబోరని ముందుగానే క్లారిటీ ఇస్తున్నారు. కేటీఆర్ చెప్పిన మాటల ప్రకారం చూసినా.. 2025 తర్వాతే కేసీఆర్ బయటికొచ్చేదన్న విషయం క్లారిటీ వచ్చింది. అయితే 2025 తర్వాత అంటే అది ఎప్పుడైనా అవ్వొచ్చంటున్నారు. అయితే అసెంబ్లీ సెషన్ ఉంటుంది. వచ్చే ఏడాది చివర్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉంటాయి. మరి ఆ ప్రచారంలో పాల్గొనరా అన్న డౌట్లు మరింతగా పెరిగాయి తప్ప తగ్గడం లేదు.

కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసీఆర్ టైం ఇస్తున్నారని చెబుతున్న కేటీఆర్.. మరి 10 నెలలు గడవకముందే రోజూ విమర్శలు ఎందుకు చేస్తున్నారన్న ప్రశ్నలకు జవాబు లేదు. పైగా ఓ వైపు హరీష్ రావు, ఇంకోవైపు కేటీఆర్.. ఇద్దరూ పోటా పోటీగా ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో, పోటా పోటీ కార్యక్రమాలు నిర్వహించడంలో బిజీబిజీగా ఉంటున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతే నిజంగా కొత్త ప్రభుత్వానికి టైం ఇస్తున్నారని చెబుతున్నప్పుడు చిన్న నాయకులైన కేటీఆర్, హరీష్ రావు రోజూ ఎందుకు ఊగిపోతున్నారన్న ప్రశ్నలకు జవాబు లేదు. అంతకుమించి వాళ్లలోనే క్లారిటీ లేదా అన్న డౌట్లు పెరుగుతున్నాయి. ఒకవేళ నిజంగానే కేసీఆర్ కాంగ్రెస్ సర్కారుకు టైం ఇవ్వాలనుకుని చెప్పి విమర్శలకు దూరంగా ఉంటే.. మిగితా వాళ్లంతా అదే రూల్ పాటించాలి కదా.. కానీ ఎందుకు లేదు అన్నదే ఇక్కడ కీ పాయింట్. కేసీఆర్ చెప్పిన లైన్ ను కేటీఆర్, హరీష్ రావు సొంత నిర్ణయాలతో దాటేస్తున్నారా అన్నది మరో డౌట్.

Related News

Alleti Maheshwar Reddy: సీఎం మార్పు.. ఏలేటి మాటల వెనుక ఆ మంత్రి స్కెచ్?

US Presidential Elections 2024: సర్వేల్లో తేలిందేంటి? గెలుపు ఎవర్ని వరించబోతుంది?

Caste Census: దేశవ్యాప్తంగా ఎంత మంది బీసీలు ఉన్నారు.. లెక్కలు నష్టమా? లాభమా?

Chandrababu Naidu: చంద్రబాబు సీరియస్.. ఆ మంత్రి పోస్ట్ ఊస్టేనా..?

YS Jagan: ఆ జిల్లాపై జగన్ స్పెషల్ ఫోకస్.. వ్యూహం ఫలిస్తుందా..?

Rushikonda Palace: జగన్‌కు బిగ్ షాక్.. రుషికొండ ప్యాలెస్ వాళ్లకే?

Nominated Posts In Telangana: కాంగ్రెస్‌లో పదవుల కోట్లాట.. రేవంత్ చెక్ పెడతారా?

Big Stories

×