EPAPER

US – ISIS: ప్రపంచాన్ని వణికిస్తున్న ISISకు ప్రాణం పోసింది అమెరికానా? చరిత్ర చెబుతోన్న వాస్తవాలేంటీ?

US – ISIS: ప్రపంచాన్ని వణికిస్తున్న ISISకు ప్రాణం పోసింది అమెరికానా? చరిత్ర చెబుతోన్న వాస్తవాలేంటీ?

USA and ISIS Relationship: “ప్రపంచాన్ని వణికిస్తున్న సమస్య ఉగ్రవాదం. టెర్రరిజంపై రాజీలేని పోరాటం చేస్తున్నాం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పని చేసే దేశాలకు సాయం చేస్తాం” నిత్యం అమెరికా చెప్పే కబుర్లు ఇవి. కానీ, అగ్రరాజ్యం పైకి చెప్పేది ఒకటి. లోపల చేసేది మరొకటి. చారిత్రక వాస్తవాలను పరిశీలిస్తే ఈ రోజు ప్రపంచం ఎదుర్కొంటున్న ఉగ్రకల్లోలానికి అసలు ముద్దాయి అమెరికా అని చెప్పక తప్పదు. ఉగ్రవాదానికి పెంచి పోషించేది ఆ దేశమే. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేది ఆదేశమే. అమెరికా తన స్వార్థం కోసం ఆడిన వికృత క్రీడలో నుంచి పుట్టిన విష వృక్షమే ఐసిస్. ఇంతకీ ఐసిస్ ఎలా పుట్టింది? దాని బలోపేతం వెనక అమెరికా పాత్ర ఎంత ఉంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..


ISIS ఉగ్రసంస్థ ఎలా పురుడు పోసుకుంది?   

ఇరాక్ లో 1999లో జమాత్ అల్ తాహిద్ వల్ జిహాద్ పేరుతో ఓ ఉగ్రసంస్థ పుట్టింది. ఆ సంస్ధ అల్ ఖైదాతో దోస్తీ కట్టింది.   2003లో ఇరాక్ మీద మీద అమెరికా దాడులు చేస్తున్న నేపథ్యంలో ఈ సంస్థ ఎదురు దాడులకు దిగింది. 2006లో ఇతర సున్నీ తీవ్రవాద సంస్థలతో కలిసి ముజాహిదీన్ షురా కౌన్సిల్ గా రూపాంతరం చెందింది. కొద్దికాలం తర్వాత ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాన్ గా పేరు మార్చుకుంది. అబుబకర్ అల్ బాగ్దాదీ చీఫ్ గా వ్యవహరించారు. ఆయన నేతృత్వంలోని ఈ సంస్థ ఎన్నో కిరాతకాలకు పాల్పడింది. అదే సమయంలో సిరియాలో అంతర్యుద్ధం మొదలయ్యింది.


ఈ సంస్థ అక్కడికి మకాం మార్చింది. సున్నీలు ఎక్కువగా ఉండే ప్రాంతాలపై పట్టు పెంచుకుంది. 2013 ఏప్రిల్ లో సిరియాలోని అల్ ఖైదా అనుబంధ సంస్థ జభాట్ అల్ సుస్రా ఫ్రంట్ ను తనలో కలుపుకుంది. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ISIS)గా మారింది. 2014లో అల్ ఖైదాకు దూరం అయ్యింది. ఆ తర్వాత రక్తపుటేరులు పారించింది.   ప్రస్తుతం ఇరాక్ , సిరియాలోని ఆయిల్ బావులను తమ చేతుల్లో పెట్టుకుని రోజు రోజుకు తన పరిధిని పెంచుకుంటున్నది.

ISIS బలోపేతానికి అమెరికా ఎలా కారణం అయ్యింది?

2003లో అమెరికా ఇరాక్ మీద యుద్ధానికి దిగింది. ఆ దేశంలో అణు ఆయుధాలు ఉన్నాయనే కారణంతో వైమానిక దాడులకు పాల్పడి సద్దాం హుస్సేన్ పాలనను కూల్చివేసింది. ఆ తర్వాత ఇరాక్ లో అధికార శూన్యత ఏర్పడింది. యద్ధం తర్వాత ఇరాక్ ను పునర్నిర్మించడంలో అమెరికా విఫలం అయ్యింది. ఆ సమయంలో ఉగ్రవాద గ్రూపులు పెరిగేందుకు మద్దతు ఇచ్చింది. అమెరికా షియా ఆధిపత్య  ప్రభుత్వాన్ని బలోపేతం చేసేందుకు ప్రయత్నించింది. ఈ నిర్ణయం సున్నీల ఆగ్రహానికి కారణం అయ్యింది. అప్పుడే సిరియాలో అంతర్యుద్ధం మొదలయ్యింది.

సిరియా అధినేత అసద్ వ్యతిరేక తిరుగుబాటుదారులకు అమెరికా మద్దతు ఇచ్చింది. ఆ సమయంలో ISIS అమెరికా మద్దతుతో అసద్ కు యాంటీగా పని చేసింది. సిరియాలో బలంగా విస్తరించింది. తాను మద్దతు ఇచ్చిన ISIS ఏకు మేకై కూర్చుంటుందని అమెరికా తెలిసేందుకు ఎంతో సమయం పట్టలేదు. కొద్ది నెలల్లోనే అదే ఉగ్రసంస్థ అమెరికాకు ఎదురు తిరిగింది. సిరియాలోని చమురు బావులను అమెరికా ఆధీనంలోకి తీసుకోకుండా ISIS తన కంట్రోల్ లోకి తీసుకుంది. అమెరికా ISIS మీద దాడులకు దిగింది. ఉగ్రసంస్థను ఎదుర్కొనేందుకు స్థానిక దళాలకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఆర్థికసాయం చేసింది. అయినప్పటికీ అమెరికా ISISని కంట్రోల్ చేయలేకపోయింది.

కల్లోలానికి అసలు కారణం అమెరికానే!

స్వప్రయోజనాల కోసం దేశాల అధినేతలే ఉగ్రవాదానికి కొమ్ము కాస్తే అది ఏనాటికైనా మానవజాతి మనుగడకే పెను సవాలుగా మారుతుందన్న విషయం ISIS తిరుగుబాటుతో రుజువైంది. పాముకు పాలు పోసి పెంచిందీ.. పడగ విప్పి బుసలు కొడుతున్న పాముపై పోరాడుతున్నది అమెరికానే. నెత్తుటి క్రీడ ఆడిన అల్‌ ఖైదా, ISIS మూలాలు పరిశీలిస్తే అవి తేలేది అమెరికాలోనే. లాడెన్‌ మృతితో అల్‌ఖైదా ఉగ్రవాదం మటుమాయమైందని ప్రపంచమంతా భావించింది. కానీ, అల్‌ బాగ్దాదీ నేతృత్వంలో ISIS, అల్‌ఖైదా కన్నా తీవ్రంగా, అంతకు మించి క్రూరంగా విజృంభించింది.

అల్‌ బాగ్దాదీని బలం పెరిగేలా చేసింది లాడెన్‌ అయినప్పటికీ, లాడెన్‌ను సృష్టించింది అమెరికానే. ఈ మొత్తం కల్లోలానికి అసలు కారణం అమెరికానే. ఎవడు తీసుకున్న గోతిలో వాడే పడతాడు. ఇది చరిత్ర చెప్పిన నిజం. అమెరికా విషయంలో రుజువైంది. స్వార్థం కోసం ఆడుతున్నవికృత క్రీడలోంచి పుట్టుకొచ్చిన మొక్కే విష వృక్షమై అగ్రరాజ్యాన్నే కబలించే ప్రయత్నం చేసింది. నిజానికి ఉగ్రవాదంపై పోరు విషయంలో అమెరికాను మించిన టెర్రరిస్టు ప్రపంచంలో మరెవరూ లేరు. ఎన్నో ప్రభుత్వాల్ని కూల్చింది. ఎంతోమంది నాయకుల్ని చంపింది. ఎన్నో కుట్రలు చేసింది. ఇప్పటికీ చేస్తూనే ఉంది.

Read Also: మా పిల్లలను చంపి.. మాకే తినిపించారు, అక్కడి భయానక అనుభవాలను బయటపెట్టిన మహిళ

Related News

Lawrence Bishnoi: జైల్లో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ తన గ్యాంగ్‌‌ను ఎలా ఆపరేట్ చేస్తున్నాడు? సినిమా కంటే కిక్ ఎక్కించే స్కెచ్!

Wedding Problems: పెరిగిపోతున్న పెళ్లికాని ప్రసాదులు.. ఆ ‘కండిషన్స్’ అప్లై, అమ్మాయిల డిమాండ్లు ఏంటి సామి ఇలా ఉన్నాయ్?

YS Jagan vs Kottu Satyanarayana: కొట్టు సత్యనారాయణకి.. జగన్ బిగ్ షాక్?

Politics on Musi: మూసీ రాజకీయం.. బీఆర్ఎస్, బీజేపీ ప్లాన్ ఇదేనా?

TDP Leaders: అనంతపురం టీడీపీ నేతల్లో కొత్త టెన్షన్.. కారణం ఏం

BRS Leaders In Congress: కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ..?

Big Stories

×