EPAPER

Cheetahs – Big Cats: చిరుత లాగే అడవి పిల్లి ప్రమాదకరమా? రెండింటికి తేడా ఏంటి?

Cheetahs – Big Cats: చిరుత లాగే అడవి పిల్లి ప్రమాదకరమా? రెండింటికి తేడా ఏంటి?

Cheetahs – Big Cats Difference: గత కొద్ది రోజులుగా హైదరాబాద్ లో చిరుత పులి అంశం హాట్ టాపిక్ గా మారింది. మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ సమీపంలో చిరుత సంచరిస్తుందన్న వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతంలో చిరుత తిరుగుతుందని తెలియడంతో చాలా మంది భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులు, అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. చిరుత పులి సంచరించిన ప్రదేశంలో తిరిగి ఆధారాలు సేకరించారు. పాద ముద్రలను కొలిచారు. ఆ తర్వాత కీలక విషయాలు వెల్లడించారు. మియాపూర్ మెట్రో స్టేషన్ పరిధిలో కనిపించింది చిరుత పులి కాదు, అడవి పిల్లి అని అధికారులు తేల్చారు. అడవి పిల్లిని అడవి పులి అని కూడా పిలుస్తారని చెప్పారు. దాని కాలి ముద్రలు కేవలం 3.5 సెంటీ మీటర్లు ఉన్నట్లు తెలిపారు. చిరుత పులి కాలి ముద్ర కనీసం 7 సెంటీ మీటర్లు ఉంటుందని వివరణ ఇచ్చారు. సెల్ ఫోన్ లో వీడియోను జూమ్ చేసి తీయడం వల్ల చిరుత పులిలా కనిపించిందన్నారు. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు.


చిరుత పులి, అడవి పిల్లి మధ్య తేడా ఏంటి?

అచ్చం చిరుత పులిలా ఉన్న అడవి పిల్లిని ఎలా గుర్తించాలనేది ఇప్పుడు చాలా మందిలో మెదులుతున్న ప్రశ్న. రెండింటి మధ్య తేడాల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. అడవి పిల్లి అనేది ఇంట్లో ఉండే పిల్లి లాగే ఉంటుంది. కానీ, సైజ్ లో కాస్త పెద్దదిగా ఉంటుంది. చూడ్డానికి పిల్లిలా కనిపించినా, పులి మాదిరిగానే వ్యవహరిస్తుంది.   అందుకే చాలా మంది సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోను చూసి చిరుత పులిలాగే భావించారు. అడవి పిల్లి, చిరుత పులి ఒంటి మీద ఉన్న మచ్చలను కాస్త పరిశీలించి చూస్తే తేడా అర్థం అవుతుంది. చిరుత పులి మచ్చలు రెండు టోన్లను కలిగి ఉంటాయి. నలుపు, ముదురు గోధుమ వర్ణంలో ఉంటాయి. పొదల మాటున దాక్కున్నా కనిపించకుండా  ఈ మచ్చలు సాయపడుతాయి. గడ్డి మైదానాల్లో దాక్కున్నా ఇతర జంతువులు గుర్తుపట్టలేకపోతాయి. అడవి పిల్లి మచ్చలు కేవలం నలుపు వర్ణంలో ఉంటాయి. చిరుత పులి పగటిపూట మాత్రమే వేటాడుతుంది. కానీ, అడవి పిల్లి రాత్రిపూట కూడా వేటాడుతాయి.


భూమ్మీద అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు చిరుత

చిరుత పులికి మరే జంతువుకు లేని ఓ ప్రత్యేకత ఉంది. భూమ్మీద అత్యంత వేగంగా పరిగెత్తే జంతువుగా దీనికి గుర్తింపు ఉంది. చిరుత పులికి కాళ్లు చాలా ధృఢంగా ఉంటాయి. పాదముద్ర సుమారు 7 సెంటీ మీటర్ల కంటే పెద్దగా ఉంటుంది. తన కాళ్లతో ఏకంగా 7 మీటర్ల ఎత్తుకు ఎగరగల సత్తా చిరుతలకు ఉంటుంది. అడవి పిల్లులకు అంత సామర్థ్యం ఉండదు. చిరుత పంజా పవర్ మాదిరిగానే అడవి పిల్లి పంజా శక్తి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే కాస్త తక్కువ పవర్ ను కలిగి ఉంటుంది. చిరుత పులి తోక చాలా పొడవుగా ధృఢంగా ఉంటుంది. వేగంగా పరిగెత్తే సమయంలో బాడీని కంట్రోల్ చేస్తుంది.  అడవి పిల్లికి తోక అంత బలంగా ఉండదు.

Read Also: వీళ్లేం మగాళ్లండి బాబు, భార్యలు అలా చేస్తే కొట్టేస్తారట.. మీరు ఇంతేనా?

Related News

Global Water Cycle: ఇండియాకు జలగండం.. భూమి పుట్టుక తర్వాత ఇదే తొలిసారి..

BIG Shock To Mudragada: పాలిటిక్స్‌లో బ్యాడ్ టైం.. ముద్రగడకు బ్యాండ్ బాజానే..

Delhi Air Pollution: చలికాలానికి ముందే గజ గజ వణుకుతున్న ఢిల్లీ.. కారణం ఇదేనా?

Ratan Tata: రతన్ టాటా ఆస్తికి వారసుడు ఎవరు?..అసలు, టాటా విల్లులో ఏముంది…?

Threat to Salman Khan: క్లెమోర్ మైన్ పేలినా, బుల్లెట్ల వర్షం కురిసినా.. సల్మాన్ లేటెస్ట్ కారు ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిదే!

Domestic Violence: వీళ్లేం మగాళ్లండి బాబు, భార్యలు అలా చేస్తే కొట్టేస్తారట.. మీరు ఇంతేనా?

Big Stories

×